బీజింగ్: కరోనా వ్యాప్తి నియంత్రణ నిబంధనల్ని ఉల్లంఘించిన ఆరుగురు జాతీయ అండర్–19 క్రీడాకారులపై చైనీస్ ఫుట్‌బాల్ సంఘం (సీఎఫ్‌ఏ) సస్పెన్షన్ వేటు వేసింది. ఆరు నెలల పాటు ఎలాంటి మ్యాచ్‌ల్లో పాల్గొనకుండా వారిపై నిషేధం విధించింది. నిబంధనల్ని తుంగలో తొక్కుతూ జాతీయ శిక్షణా శిబిరం నుంచి అర్ధరాత్రి చెప్పాపెట్టకుండా మద్యం సేవించేందుకు బయటకు వెళ్లిన ఆరుగురు ప్లేయర్ల చర్యను సీఎఫ్‌ఏ తీవ్రంగా పరిగణించింది. ‘ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన. వారి చర్య కారణంగా మొత్తం జట్టుకు చెడ్డ పేరు వచ్చింది. అందుకే వారిని నవంబర్ 30 వరకు సస్పెండ్ చేస్తున్నాం’ అని సీఎఫ్‌ఏ పేర్కొంది. షాంఘైలో మే 17న ప్రారంభమైన జాతీయ ఫుట్‌బాల్ శిబిరం శనివారంతో ముగిసింది. కరోనా నేపథ్యంలో 35 మంది యువ ఫుట్‌బాలర్లు పాల్గొన్న ఈ శిక్షణా శిబిరంలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా సీఎఫ్‌ఏ పలు నిబంధనలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment