
ముగిసిన బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు
► విజేతగా గోపీ గురు బుల్లెట్స్
► రన్నరప్‌గా రఘురాం టైగర్స్
► బాలికల విజేతగా శ్రీకాకుళం బాస్కెట్‌బాల్ జట్టు
శ్రీకాకుళం న్యూకాలనీ: రెజిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ఎంహెచ్ స్కూల్‌లో జరుగుతున్న శ్రీకాకుళం మాజీ కౌన్సిలర్ మైలపల్లి రాములు(ఇక్కయ్య), పైడమ్మ దంపతుల స్మారక జిల్లాస్థారుు బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ -2016 పోటీలు శుక్రవారంతో ముగిశారుు. ముగింపు కార్యక్రమానికి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ ఎండి కాసీంఖాన్‌లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీఎంఎస్ ప్రకాష్, కార్యనిర్వహణ కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, ప్రిన్సిపాల్ పి.నాగభూషణరావు, మైలపల్లి రాంబాబు, బాలమురళీకృష్ణ, బి.శ్యామ్‌సుందర్, విజయ్‌భాస్కర్, పాఠశాల హెచ్‌ఎం దేవదత్తానంద్, భాగ్యచంద్ర, సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎం.రామారావు, పి.రమణమూర్తి, అర్జున్‌రెడ్డి, పిట్టా ప్రసాద్, పి.మురళిలు రిఫరీలుగా వ్యవహరించారు. అంతకుముందు డీఎస్పీ భార్గవనాయుడు ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు.
టోర్నీ విజేతగా గోపీ గురు బుల్లెట్స్..
రెండు రోజుల పాటు జరిగిన జిల్లాస్థారుు బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీని శ్రీకాకుళం గోపీ గురు బెల్లెట్స్ జట్టు దక్కించుకుంది. రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో శ్రీకాకుళం రఘురాం టైగర్స్ జట్టుపై 56-46 తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది.
సీనియర్స్ విభాగంలో బెస్ట్ స్కోరర్‌గా సీనియర్ కోచ్ జి.అర్జున్‌రావురెడ్డి, బెస్ట్ ప్లేయర్‌గా ఎస్.కోటేశ్వరరావు, అప్‌కమింగ్ ప్లేయర్‌గా అశోక్‌లు ప్రత్యేక టైటిళ్లను సాధించారు. ఇక జిల్లాలో మొట్టమొదటి సారిగా బాలికల జట్లు ప్రాతినిధ్యం వహించిన ఈ పోటీల్లో శ్రీకాకుళం బాస్కెట్‌బాల్ జట్టు విజేతగా నిలవగా, కె.ఆర్.స్టేడియం అథ్లెటిక్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్-14 బాలురు విభాగంలో శ్రీకాకుళం బ్లాక్స్ జూనియర్స్ విజేతగా నిలివగా, శ్రీకాకుళం బ్లూస్ జూనియర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.