హైదరాబాద్ జట్లకే టైటిల్స్ | Hyderabad teams titles | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ జట్లకే టైటిల్స్

Published Wed, Oct 8 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

హైదరాబాద్ జట్లకే టైటిల్స్

హైదరాబాద్ జట్లకే టైటిల్స్

అంతర్ జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నీ

 ఎల్బీ స్టేడియం: తెలంగాణ అంతర్ జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు టైటిల్స్ నెగ్గాయి. నల్లగొండలో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ బాలికల జట్టు 28-14 పాయింట్ల తేడాతో ఫైనల్లో ఖమ్మంపై నెగ్గింది. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి హైదరాబాద్ 12-8తో ఆధిక్యాన్ని సాధించింది. ధర్తీ దేవి రెడ్డి, భావన చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బాలుర విభాగం ఫైనల్లో హైదరాబాద్ 37-18తో అవలీలగా వరంగల్‌పై ఘనవిజయం సాధించింది. వెంకట్, దినేష్‌లు చక్కటి ప్రతిభను కనబర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement