ఒలింపిక్స్ మహిళల బాస్కెట్‌బాల్‌లో వరుసగా 60వ విజయం
1992 క్రీడల నుంచి పరాజయం ఎరుగని జట్టుగా రికార్డు
ఎనిమిదో స్వర్ణానికి గెలుపు దూరంలో అగ్రరాజ్యం
ఒలింపిక్స్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రికార్డును అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు సొంతం చేసుకుంది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు పరాజయం అన్నదే ఎరగకుండా దూసుకెళుతోంది. ఈ క్రమంలో వరుసగా 60 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ‘పారిస్’ క్రీడల్లో ఫైనల్ చేరడం ద్వారా అమెరికా ఈ ఘనత సాధించింది.
శనివారం జరిగిన మహిళల సెమీఫైనల్లో అమెరికా 85–64తో ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్‌కు చేరింది. నేడు ఫ్రాన్స్‌తో స్వర్ణం కోసం తలపడనుంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు వరుసగా ఏడు స్వర్ణాలు గెలిచింది. ఈసారి కూడా పసిడి కైవసం చేసుకుంటే.. విశ్వక్రీడల చరిత్రలో వరుసగా 8 బంగారు పతకాలు గెలిచిన తొలి టీమ్‌గా చరిత్ర కెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment