సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీల్లో రాష్ట్ర అండర్–19 జూనియర్ చాంపియన్‌షిప్ జరగనుంది. కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. జనవరి 1, 2005న లేదా ఆ తర్వాత పుట్టిన వారు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు.
బాలబాలికల విభాగాల్లో వేర్వేరుగా గేమ్‌లు నిర్వహిస్తారు. బాలికల విభాగంలో టాప్–4లో నిలిచిన ప్లేయర్లు... బాలుర విభాగంలో టాప్–7లో నిలిచిన ప్లేయర్లు జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నీలో ఆడాలనుకునే వారు తమ పేర్లను 7337578899, 7337399299 నంబర్లలో నమోదు చేసుకోవాలి.
25, 26 తేదీల్లో తెలంగాణ యూత్ బాస్కెట్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం, మహబూబ్‌నగర్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యూత్ అంతర్ జిల్లా చాంపియన్‌షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 25, 26వ తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వహిస్తారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోరీ్నలో మొత్తం 17 జిల్లా జట్లు పాల్గొంటున్నాయి.
ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారులను జాతీయ యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ బాస్కెట్‌బాల్ జట్టులోకి ఎంపిక చేస్తామని తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ నార్మన్ ఐజాక్ తెలిపారు. జాతీయ యూత్ చాంపియన్‌షిప్ పశ్చిమ బెంగాల్‌లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతుంది. గత ఏడాది సూర్యాపేటలో జరిగిన తెలంగాణ యూత్ అంతర్‌జిల్లా చాంపియన్íÙప్‌లో మేడ్చల్ మల్కాజిగిరి జట్లు బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచాయి.
కరాటే కుర్రాళ్ల కిక్ అదిరింది
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఆల్ స్టయిల్స్ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు అదరగొట్టారు. టైగర్ కుంగ్ ఫూ అకాడమీ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. వివిధ విభాగాల పతక విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
స్వర్ణ పతకాలు: ఈథన్ రాజ్ (అండర్–12 కటా), దక్ష్ (అండర్–8 కటా).
రజత పతకాలు: అంకిత (అండర్–10 కటా), సాయాంశ్ (అండర్–12 కటా), కావ్యాంశ్ (అండర్–8 కటా).
కాంస్య పతకాలు: అమైర్ (అండర్–8 కటా), కిరణ్య (అండర్–8 కటా), అహ్మద్ (అండర్–6 కటా), శ్రవణ్ (అండర్–12 కటా), నిగ్నేశ్ (అండర్–6 కటా), మాన్విత (అండర్–6 కటా), సాధ్విత (అండర్–12 కటా), కరణ్‌నాథ్ (అండర్–13 కటా).
చాంపియన్స్ వృత్తి, సుహాస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో అంతర్జాతీయ స్విమ్మర్ వృత్తి అగర్వాల్, పురుషుల విభాగంలో సుహాస్ ప్రీతమ్ చాంపియన్స్‌గా నిలిచారు. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ టోర్నీలో వృత్తి నాలుగు ఈవెంట్లలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన వృత్తి 200, 400, 800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన మైలారి సుహాస్ ప్రీతమ్ 50, 100, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌తోపాటు 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్స్‌లో విజేతగా నిలిచాడు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం సెక్రటరీ జి.ఉమేశ్, జీహెచ్‌ఎంసీ ఏడీఎస్ శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment