
ఆసియా కప్ సీనియర్ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా తెలంగాణకు చెందిన పి.ఎస్.సంతోష్ ఎంపికయ్యాడు. ఈ టోర్నీ కజకిస్తాన్‌లో ఈనెల 23 నుంచి 26 వరకు జరుగుతుంది. గ్రూప్ ‘ఇ’లో భారత్‌తోపాటు ఖతర్, కజకిస్తాన్, ఇరాన్ జట్లున్నాయి. భారత జట్టులో విశేష్, అరవింద్, ముయిన్ బెక్, ప్రణవ్ ప్రిన్స్, అమృత్‌పాల్, గుర్బాజ్, పల్‌ప్రీత్, అమరేంద్ర, వైశాఖ్, ప్రిన్స్‌పాల్ సింగ్, సహజ్‌ప్రతాప్ సింగ్, బాలదానేశ్వర్ సభ్యులుగా ఉన్నారు.