వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపితే భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని అండర్-19 ఎస్‌జీఎఫ్‌ఐ ప్రెసిడెంట్, డీవీఈఓ (జిల్లా వృత్తి విద్యాధికారి) రాజేంద్రప్రసాద్ అన్నారు. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఆయనబాస్కెట్‌బాల్, నెట్‌బాల్ సెలక్షన్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎదుగుదలకు బీజం పడుతుందని... దాన్ని అందిపుచ్చుకున్న వారే భవిష్యత్‌లో విజయాలు సాధిస్తారన్నారు. ఎంపికైన జట్లు నవంబర్ 8, 9, 10వ తేదీల్లో ఖమ్మం, చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో అండర్-19 ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రామ్మూర్తి, డిప్యూటీ డీవీఈఓ రమణారావు, ఫిజికల్ డెరైక్టర్లు అశోక్‌కుమార్, అనూప్‌కుమార్, రాజిరెడ్డి, రామన్న, రమేష్, ఐలయ్య, శ్రీనివాస్, చార్లీ, జితేందర్‌నాథ్, రోహిణిదేవి, శ్రీదేవి, రవి, కుమార్ పాల్గొన్నారు. కాగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో బాస్కెట్‌బాల్ బాలుర జట్టు కోచ్‌గా పీడీ రామన్న, మేనేజర్‌గా కుమా ర్... బాలికల జట్టుకు కోచ్‌గా శ్రీదేవి, మేనేజర్ గా శారద... నెట్‌బాల్ బాలుర జట్టుకు కోచ్‌గా ఐలయ్య... బాలికల జట్టుకు కోచ్‌గా రమేష్, మేనేజర్‌గా ఐలయ్య వ్యవహరించనున్నారు.
ఎంపికైన జట్ల వివరాలు
బాస్కెట్‌బాల్ (బాలురు) : అశోక్, రాజేష్, సందీప్, శ్రీధర్, నాగేం దర్, సాదీక్, అనిల్‌కుమార్, మనోజ్,అబ్దుల్, నరేష్, కిరణ్‌కుమార్, మునీర్, పవన్, రాజశేఖర్
బాలికలు : పుష్ప, రమ్యశ్రీ, కళ్యాణి, స్రవంతి, దీపిక, సంకీర్తన, మానస, శ్రీకన్య, మానస, కళ్యాణి, నన్యశ్రీ, మమత, మనీషా, రమ్య, ప్రియాంక
నెట్‌బాల్ (బాలురు) : మహేందర్, రంజిత్, ప్రవీణ్, సురేష్, రామక్రిష్ణ, కుమార్, రఘుపతి, హరీష్, నవీన్, పాషా, శివాజి, రాజు, రాకేష్, ప్రేమ్‌సాగర్, రాజు
బాలికలు : అపర్ణ, అనూష, స్వప్న, స్నేహా రాణి, మానస, విజయ, పావని,అనూష, శకుం తల, అనూషజ్యోతి, కృష్ణవేణి, దీపిక, రమ్య
క్రీడా పోటీల్లో ప్రతిభ చూపాలి
Published Thu, Oct 31 2013 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement