rajendraprasad
-
అప్పట్లో సావిత్రి అంటే పిచ్చి ఇష్టం నాకు..!
-
ఒకప్పుడు హీరోలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. మళ్లీ హీరోలుగా!
టాలీవుడ్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎవరంటే సీనియర్లలో రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, రావు రమేశ్, మురళీ శర్మ ఉంటారు. మంచి క్యారెక్టర్లు చేస్తున్న ఈ నటుల్లో రాజేంద్రప్రసాద్, నరేశ్ ఒకప్పుడు హీరోలుగా చేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్న రావు రమేశ్ ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. ‘వీళ్లే చేయాలి’ అనే తరహా లీడ్ రోల్స్‌లో ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, నరేశ్, రావు రమేశ్ నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పాత్రలు చేస్తున్న ఈ ముగ్గురూ ‘క్యారెక్టర్ హీరో’గా చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రాజేంద్రప్రసాద్ షష్టిపూర్తి తెలుగులో హాస్య కథా చిత్రాల హీరో అనగానే రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొస్తారు. హీరోగా ప్రేక్షకులపై వినోదాల జల్లులు కురిపించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో దూసుకెళుతున్నారు. అడపా దడపా లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌కి జోడీగా అర్చన నటిస్తున్నారు. ‘లేడీస్ టైలర్’ (1986) తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. షష్టిపూర్తి కథాంశంతో న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి మరో హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలైలో రిలీజ్ కానుంది. వీకే నరేశ్ మళ్ళీ పెళ్లి హీరోగా వీకే నరేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన హాస్యం, నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉంటున్నారు. కాగా నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘మళ్ళీ పెళ్లి’, కన్నడలో ‘మత్తే మధువే’ టైటిల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మేలో ఈ చిత్రం విడుదల కానుంది. అందులో భాగంగా సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఉరిమే కాలమా..’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. మారుతీనగర్‌లో రావు రమేశ్ విలక్షణమైన డైలాగ్ డెలివరీతో తనదైన శైలిలో విలనిజాన్ని పండించిన గొప్ప నటుడు రావు గోపాలరావు. తండ్రి వారసత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమయ్యారు ఆయన తనయుడు రావు రమేశ్. విలన్, కమెడియన్, తండ్రి.. ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు రావు రమేశ్. ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావు రమేశ్‌కి జోడీగా ఇంద్రజ నటిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి పాత్రలో రావు రమేశ్ కనిపిస్తారు. ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తొలిసారి కథను నడిపే నాయకునిగా చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా చేస్తున్న ఈ మూడు చిత్రాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచాయి. -
' ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు ' మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
బాహుబలి సినిమాలో మాదిరి ఈ స్టేజ్ కదలాలా..బీటలు వారాలా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నినాదం వివాదంగా మారింది. ‘జయహో జగదీశన్న’అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని పొగిడి విద్యార్థులచే నినాదాలు చేయించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంతకుముందు పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్‌రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి. మీ అందరికీ ఆకలవుతుందా.. ఆకలేస్తే కేకలు వేయాలన్నారు శ్రీశ్రీ.. అది అందరికీ గుర్తుందా.. అయితే ఇలా నినాదాలు చేయండి.. జయహో జగదీశన్న’అంటూ నినాదాలు చేయించారు. ‘అందరూ బాహుబలి సినిమా చూశారా.. బాహుబలి వచ్చిననప్పుడు వేదిక కదిలిన విధంగా మీ నినాదాలతో ఈ స్టేజీ కదలాలా.. బీటలు వారాలా..’అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటని, గౌరవప్రతిష్టలు కలిగిన యూనిఫాం సరీ్వసుకే అగౌరవమని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కడం, ఆ తర్వాత వారిని ఎమ్మెల్సీగా చేయడం చూశామని గుర్తుచేశారు. ఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: బాబాసాహెబ్ కలల సాకారంలో... -
కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్
లాక్డౌన్..నగరవాసిని ఇంటికే పరిమితం చేసింది. దీంతో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ దొరకని ఇంత తీరిక ఇప్పుడు లభించడంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. తమకు ఇష్టమైన పనులు చేస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సినీ, టీవీ నటులు అందరూ ఇలా లాక్డౌన్ టైంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఆయన మాటల్లో మీరే వినండి. (న్యూ కట్) నేను ఇంట్లో ఏం చేస్తున్నానో తెలిస్తే మీకు మంచి వినోదం అవుతుంది. ఉదయం టిఫిన్ నా భార్య చేస్తుంది. మధ్యాహ్నం కూరగాయలు అన్నీ కట్ చేసి, నేనే వంట చేస్తున్నా. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్.. అందుకే ఎక్కువగా చేస్తున్నాను. ‘వద్దండి.. నాకు బోర్ కొడుతోంది, నేను చేస్తా’ అని మా ఆవిడ అంటున్నా, వినకుండా నేనే చేస్తున్నా. బీరకాయ పాలకూర, టమోటా రోటి పచ్చడి, (టమోటాలు కొనే పని కూడా లేదు.. ఇంట్లోనే చెట్లు ఉన్నాయి.. కోయడం చేయడమే). (లాక్డౌన్: విరుష్కలు ఏం చేస్తున్నారో చూశారా?) ఈ విధంగా వంటిల్లుని నేను స్వాధీనపరచుకున్నా.. ఇప్పుడు యోధుణ్ణి నేను. ‘అదేంటండి? అంటుంది’ మా ఆవిడ. పనీ పాటా లేదు. ఏదో ఒక పని చేయకపోతే తిన్నది అరగదు అన్నాను. ‘అయితే పనిమనిషి రాలేదు.. బయట ఊడవండి’ అంది. నేను ఊడవను అన్నాను. సరే.. కారు కడగండి అంది. నన్ను డామినేట్ చేసి మా అబ్బాయి బాలాజీ అప్పటికే కారు కడిగేస్తున్నాడు.. సో.. నాకు వంట పని ఒక్కటే కనిపించింది.. చేస్తున్నా. చూడండి మగాళ్లలారా. పని లేదు.. పని లేదు అని ఏడవడం కాదు. నీకు వచ్చిన పనిని సిగ్గు లేకుండా, మొహమాట పడకుండా చేయాలి. నా వ్యక్తిగత అనుభూతి ఏంటంటే వంట చేసేటప్పుడు చాలా రిలాక్స్ అయిపోతున్నాను.. ఆ సమయంలో నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది. – రాజేంద్రప్రసాద్ వంటింట్లో అమ్మకు సాయం చేస్తూ... ఈ ఖాళీ సమయంలో వంటింట్లో అమ్మకు సాయం చేస్తున్నా. శనివారం బెండకాయ వేపుడు చేశా. కనీసం ఈ మూడు వారాలైనా తన తల్లికి సహాయ పడాలని ఆమెపై కొంత పనిభారం తప్పించాలనే ఉద్దేశంతోనే వంటలకు శ్రీకారం చుట్టా. అంతేకాదు ఈ రోజు ఇల్లు కూడా శుభ్రం చేశా. మీరంతా కనీసం ఈ 21 రోజులైనా ఇళ్ళల్లో ఉండి తల్లికి ఇంటి పనుల్లో సాయపడండి. – ప్రదీప్, యాంకర్ (కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్) -
చంద్రబాబు కాంగ్రెస్‌లోనే ఉన్నారా
-
పచ్చ నేతల్ని ఏకిపారేసిన వంశీ
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతలు తనపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు సలహాలు ఇచ్చిన టీడీపీ నేతలకు పుష్పాంజలి అని వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భాష, వేషం, మొరటుగా అనిపించి ఉండొచ్చు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు నా నియోజకవర్గ సమస్యలు మాత్రమే చెప్పా. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరాను. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తప్పేముందు. విద్యార్థి దశలో నాకు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడ్డా. పేద ప్రజలకు ఇంగ్లీష్ నేర్పితే తప్పేంటి. అబద్ధాలు చెప్తూ నాపై బురద జల్లుతున్నారు. నేను ఏమైనా వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చానా. విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశానా. టీటీడీ ఛైర్మన్ పదవి అమ్ముకున్నానా. హైందవ ధర్మాన్ని అన్యాయం చేశానా. చంద్రబాబుకు కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టింది. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌లోనే చంద్రబాబు ఉన్నారా’అని ప్రశ్నల వర్షం కురిపించారు. లోకేశ్ కూడా పదవికి రాజీనామా చేయాలి ‘నేనేమైనా విశాఖపట్నం పీఠం ముందు సీసీ కెమెరాలు పెట్టి.. స్వామీజీని కలవడానికి ఎవరెవరు వస్తున్నారోనని చెక్ చేశానా. వయసురిత్యా చంద్రబాబు కాళ్లకు దండం పెడితే.. దానికి కాళ్లు పట్టుకున్నానంటారా. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ ఎందుకు ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకుని ఉన్నారు. టీడీపీ ఆరోపణలు గురువింద గింజప్పులా కనిపిస్తున్నాయి. మాపై దుష్ప్రచారం చేసే హక్కు మీకెరివచ్చారు. మేము జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకొచ్చామా. పబ్లిక్‌లో అనుకున్నదే చెప్పాం. ప్రజల్లో గెలవలనివారు, పెయిడ్ ఆర్టిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాజేంద్రప్రసాద్ కూతురు పెళ్లికి రూ.25 లక్షలు ఇచ్చాను. మాల వేసుకున్నా. నన్ను ముందు దూషించింది రాజేంద్రప్రసాదే. నాకు పదవి ముఖ్యం కాదు. రాజీనామా చేస్తా. పార్టీ ఓడిపోయింది కాబట్టే లోకేశ్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. నీతులు మాకు చెప్పడమేనా.. మీకు వర్తించవా. నాపై చంద్రబాబులా ఓటుకు కోట్లు కేసు లేదు. నేను జగన్‌ను దొంగచాటుగా కలవలేదు. నా నియోజకవర్గ సమస్యలను చెప్పేందుకు కలిశా. నాకు చంద్రబాబులా తెలివితేటలు లేవు. అమ్మ చెబితే ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానని చంద్రబాబు అనలేదా. ముఖానికి రంగులు వేసుకునేవాళ్లు రాజకీయాలకు పనికిరారని బాబు అనలేదా’అని ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు. -
ఆ టైటిల్ ఎందుకంటే?
తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘బేవర్స్’. రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో, సంజోష్, హర్షిత హీరోహీరోయిన్లుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో కాసం సమర్పణలో పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్. అరవింద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి ‘బేవర్స్’ టైటిల్ ఏంటి? అని మొదట్లో అనిపించింది. ఇదే అనుమానం ప్రేక్షకులకి కూడా వస్తుంది. కానీ, ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాననే తృప్తి ఉంది’’ అన్నారు. ‘‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా ఎంత తృప్తి చెందానో ‘బేవర్స్’ చిత్రం తెరకెక్కిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి పొందాను. రాజేంద్రప్రసాద్‌గారు ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయకపోవడం నా అదృష్టం’’ అన్నారు రమేష్ చెప్పాల. ‘‘ఎక్కడా రాజీ పడకుండా ‘బేవర్స్’ నిర్మించాం. సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటకి చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. హీరో సంజోష్ పాల్గొన్నారు. -
మహానటి చిత్ర బృందానికి సత్కారం
-
తెలుగుదేశం పార్టీకి చేవ చచ్చిందా?
-
టీడీపీకి చేవ చచ్చిందా?
సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి తెలుగుదేశం పార్టీకి చేవ చచ్చిందా? 15 రోజుల క్రితం నుంచే వారికి హోదా ఉద్యమం గుర్తుకు వచ్చిందా? అని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలపై భరద్వాజ బుధవారం స్పందించారు. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటే తనను, సంపూర్ణేషు బాబు, మహేష్ కత్తి, శివాజీలను అరెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అక్కర్లేదు అని చెప్పి, ఇప్పుడు హోదా ఉద్యమం క్రెడిట్ మొత్తం ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి వెళ్లిపోతోందన్న భయంతోనే మాట మార్చారని దుయ్యబట్టారు. మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు ఇప్పటికే సినిమా రంగానికి చెందిన పవన్ కళ్యాణ్, మోహన్‌బాబు, కొరటాల శివ వంటి వారు ప్రత్యేక ఉద్యమానికి మద్దతు తెలిపారని, కానీ టీడీపీలో ఉన్నవారు, పుష్కరాలు వంటి వేడుకలు నిర్వహించిన వారు, ప్రభుత్వంతో కలిసి నంది అవార్డులు పంచుకున్న సినీ నటులు, జ్యూరీ సభ్యులే హోదా గురించి మాట్లాడటం లేదని తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. మీ రాజకీయాల్లోకి సినిమా వాళ్లని లాగొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. బానిసలుగా బతుకుతున్నారని తమను అంటున్నారని, కానీ వాస్తవంగా పదవుల కోసం నాలుగేళ్లుగా బీజేపీకి బానిసలుగా, తొత్తులుగా జీవిస్తున్నది తెలుగుదేశం నేతలు కాదా? అని ప్రశ్నించారు. తమను విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ఈ నాలుగేళ్లు ప్రత్యేక హోదాను పక్కన పెట్టి లంచాల మత్తులో మునిగితేలారా? అంటూ ఘాటుగా విమర్శించారు. సీఎం చంద్రబాబులో ప్రత్యేక హోదా సాధించాలన్న తపన కంటే వైఎస్ జగన్ బీజేపీ, పవన్ కళ్యాణ్‌లతో కలుస్తాడన్న భయమే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపడితే సినీ పరిశ్రమ కూడా తప్పకుండా పాల్గొని మద్దతు ఇస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. -
మంచి కథ.. హిట్ గ్యారంటీ – రాజేంద్రప్రసాద్
‘‘తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్సే అనే కథాంశంతో దర్శకుడు రమేశ్ ‘బేవర్స్’ సినిమాని చక్కగా తెరకెక్కించాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రమిది. నా కెరీర్లో ఎక్కువ పారలల్ సినిమాలు చేశా. మళ్లీ ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా వస్తోంది. ఈ సినిమా నా కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలుస్తుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. సంజోష్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో రమేష్ చెప్పాల దర్శకత్వంలో పొన్నాల చందు, ఎమ్.అరవింద్ నిర్మించిన ‘బేవర్స్’ టీజర్ రిలీజ్ చేశారు. రమేష్ చెప్పాల మాట్లాడుతూ– ‘‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా ఎంత తృప్తి చెందానో ‘బేవర్స్’ సినిమా రూపొందిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందా. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ గారు చేసిన పాత్ర ఇప్పటివరకూ ఆయన వేరే సినిమాల్లో చేయకపోవడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
చోరీ చేశారా? లేదా?
గళ్ల లుంగీ... మెడలో టవల్... చేతిలో ఇనుప గరిటె... కాళ్లకి సాదాసీదా చెప్పులు... రాజేంద్రప్రసాద్ అసలు సిసలైన వంటోడిలా ఉన్నారు. ఉండడం కాదు... నిజమే! ఈ ఫొటో తీసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ సెట్లో జనాలకి వంట చేస్తున్నారు. ‘‘రాజేంద్రప్రసాద్ గారు సెట్లో ఉంటే నవ్వులకు మాత్రమే కాదు, ఫుడ్‌కీ లోటుండదు. ఆయన వండుతుంటే... చోరీ ఎలా చేయాలా? అని రాజ్‌తరుణ్ ఎదురు చూస్తున్నాడు’’ అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. రాజ్ తరుణ్ హీరోగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రధారిగా అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘రాజుగాడు’ సెట్లో చోటు చేసుకుందీ సీన్! ‘ఈడో రకం ఆడో రకం, అంధగాడు’ సిన్మాల తర్వాత వీళ్ల ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ఎన్ని ప్లానులు వేసినా... చివరికి, చోరీ చేయలేకపోయారు. ఎందుకంటే... చోరీ చేయాలని ప్రయత్నించేలోపే వడ్డించేశారు. ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం వెరీ హ్యాపీ. ఆయన వండిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంది’’ అన్నారు రాజ్ తరుణ్. -
‘గ్రేటర్’ సీపీగా రాజేంద్రప్రసాద్
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్(సీపీ)గా ఎం.రాజేంద్రప్రసాద్ నాయక్ నియమితులయ్యారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేసిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ విభాగంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. గత ఆరేళ్లుగా వరంగల్ బల్దియాలో ఇన్చార్జి సీపీలే కొనసాగుతుండగా.. ప్రస్తుతం పూర్తిస్థాయి సీపీ నియమితులయ్యారు. రాజేంద్రప్రసాద్ విదు ల్లో చేరాక ప్రస్తుతం ఇన్చార్జి సీపీగా ఉన్న ఏ.కోదండరాంరెడ్డి డిప్యూటీ సిటీ ప్లానర్‌గా కొనసాగుతారు. -
భార్య, కొడుకుపై పెట్రోలు పోసి నిప్పంటించాడు
విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. భార్య, కుమారుడితో పాటు అత్తపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం ఉదయం నగరంలోని చిట్టీ నగర్లో చోటు చేసుకుంది. వివరాలు గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన రాజేంద్రప్రసాద్ కు మూడేళ్ల కిందట చిట్టీనగర్‌కు చెందిన ఆకుల రోజాతో వివాహమైంది. వీరికి 9 నెలల కుమారుడు ఉన్నాడు. అయితే కుటంబ కలహాల కారణంగా రాజేద్రప్రసాద్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం భార్య పుట్టింకి వెళ్లి గొడవ పడ్డాడు. ఈ సందర్భంగా దంపతుల మధ్య వాగ్వివాదం మొదలై ఒకరినొకరు దుర్భషలాడుకున్నారు. దీంతో భార్య, కుమారుడు, అడ్డు వచ్చిన అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చిట్టీ నగర్) -
భార్య, కొడుకుపై పెట్రోలు పోసి నిప్పంటించాడు
-
సమసిపోని 'మా' ఎన్నికల వివాదం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదం ఇంకా సమసిపోలేదు. 'మా' ఎన్నికలపై నటుడు ఓ.కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగా ఎన్నికైన మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 'మా' ఎన్నికలకు ముందు కోర్టులో పిటిషన్ - ఆ తరువాత వాడీవేడీ విమర్శలతో ఎన్నికలు జరగడం తెలిసిందే. మార్చి 29న ఎన్నికలు జరిగినా కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. ఆ తరువాత కోర్టు అనుమతితో ఏప్రిల్ 17న ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేశారు. సమీప ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్ 19న ప్రమాణస్వీకారం కూడా చేశారు. మళ్లీ ఇప్పుడు నటుడు ఓ.కళ్యాణ్ 'మా' ఎన్నికలపై పిటిషన్ దాఖలు చేయడంతో రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, శివాజీ రాజాలకు నోటీసులు జారీ అయ్యాయి. -
జయసుధ వెనక ఓ శక్తి: రాజేంద్రప్రసాద్
-
జెడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తి
పాతగుంటూరు: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన జెడ్పీ స్థాయి సంఘాలను శనివారం ఎన్నుకున్నారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ మొదటి సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, సీఈవో సుబ్బారావు, కలెక్టర్ కాంతిలాల్ దండే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్న ఈ సమావేశంలో స్థాయీ సంఘాల చైర్మన్లు, సభ్యులను ఎంపిక చేశారు. మొత్తం ఏడు సంఘాల చైర్మన్ పదవులు అధికార టీడీపీకే దక్కాయి. మొదటిది ప్రణాళిక, ఆర్థికం.. ప్రణాళిక, ఆర్థిక అంశాలకు చెందిన ఒకటో స్థాయి సంఘం చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకొన్నారు. ఆమె పేరును ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యుడు డొక్కమళ్ల భాగ్యారావు ప్రతిపాదించగా, తుళ్లూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు బలపరిచారు. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్(తెనాలి), జీవీఎస్ ఆంజనేయులు(వినుకొండ), కొమ్మాలపాటి శ్రీధర్(పెదకూరపాడు), జెడ్పీటీసీ సభ్యులు శివరామకృష్ణ(నగరం), బండారు కుమారి(భట్టిప్రోలు), కోటా శ్రీనివాసరావు(పొన్నూరు), వెంకాయమ్మ(సత్తెనపల్లి), వలపా బాలస్వామి( కారంపూడి), కామినేని సాయిబాబు(యడ్లపాడు), గింజుపల్లి ఎలిజబెత్‌రాణి(గురజాల), దండమూడి శైలజారాణి(తాడేపల్లి), దేవళ్ల రేవతి(బెల్లంకొండ) ఉన్నారు. రెండు..గ్రామీణాభివృద్ధి.. రెండోస్థాయి సంఘం చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకొన్నారు. ఆమె పేరును తాడికొండ జెడ్పీటీసీ సభ్యుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు (వైస్‌చైర్మన్) ప్రతిపాదించగా, అచ్చంపేట జెడ్పీటీసీ సభ్యుడు నల్లమేకల వెంకటేశ్వర్లు బలపరిచారు. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(మంగళగిరి), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల), ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు బందెల కన్నయ్య(ఈపూరు), షేక్. మస్తాన్ షరీఫ్(పెదకూరపాడు), బెజవాడ నరేంద్రబాబు(తుళ్ళూరు), కాగితీల సుబ్బారావు(రేపల్లె), వెంకటరామిరెడ్డి(రాజుపాలెం), నారపురెడ్డి(పిట్టలవానిపాలెం), ప్రసాదం వాసుదేవ( నిజాంపట్నం), వీరభద్రుని రామిరెడ్డి( పిడుగురాళ్ళ) ఉన్నారు. మూడో సంఘం.. వ్యవసాయం... ఈ స్థాయి సంఘానికి చైర్మన్‌గా వడ్డమూడి పూర్ణచంద్రరావును ఎన్నుకున్నారు. సభ్యులుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, జెడ్పీటీసీ సభ్యులు లాలీబాయి( మాచవరం), గోపిరెడ్డి శౌరిరెడ్డి(మాచర్ల), నవులూరు భాస్కరరెడ్డి(రెంటచింతల), ములగండ్ల ప్రకాష్‌రెడ్డి(దాచేపల్లి), కోఆప్షన్ సభ్యుడు నక్కా సవర్ణరాజు ఉన్నారు. నాలుగు విద్య, వైద్యం.. ఈ సంఘానికి చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ కె.యస్.లక్షణరావు, రాజ్యసభ సభ్యుడు జె.డి. శీలం, జెడ్పీటీసీ సభ్యులు చందోలు పృధ్వీలత( అమృతలూరు), సాంబశివరావు(మేడికోండూరు), బత్తుల సుశీల(వినుకొండ), వి. వెంకటేశ్వర్లు(వేమూరు), యేళ్ళ జయలక్ష్మి(దుగ్గిరాల), గుంపుల కన్నయ్య(కర్లపాలెం), కళ్ళం కృష్ణవేణి(వెల్దుర్తి) ఉన్నారు. ఐదు.. మహిళా శిశు సంక్షేమం.. వట్టిచెరుకూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పటూరి సీతామహాలక్ష్మిని ఈ సంఘానికి చైర్మన్‌గా ఎన్నుకున్నారు. సభ్యులుగా ఎమ్మెల్సీలు మహమ్మద్ జానీ, నన్నపనేని రాజకుమారి, జెడ్పీటీసీ సభ్యులు ఆదెమ్మ(నూజెండ్ల), టి. శివపార్వతి(పెదకాకాని), హాజర్బీ(అమరావతి), యన్. సునీత(ఫిరంగిపురం), సంతోషమ్మ(బొల్లాపల్లి), జిల్లి శిరీషారెడ్డి(రొంపిచర్ల), అత్తోట సుధారాణి(చేబ్రోలు), కొండా శివపార్వతమ్మ(చుండూరు) ఉన్నారు. ఆరో సంఘం..సాంఘిక సంక్షేమం.. ఈ సంఘానికి చైర్మన్‌గా క్రోసూరు జెడ్పీటీసీ సభ్యులు చిలకా విల్సన్ గ్లోరిని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(నరసరావుపేట), నక్కా ఆనందబాబు(వేమూరు), బాపట్ల ఎంపీ మాల్యాద్రి, జెడ్పీటీసీ సభ్యులు రాయపూడి సుజనమ్మ(చిలకలూరిపేట), భాగ్యారావు(ప్రత్తిపాడు), రత్నమణి(బాపట్ల), ఆర్.సాంబ్రాజ్యంబాయి(నకరికల్లు), బీ.వెంకటలక్ష్మి( కొల్లిపర), యనమల మమత(ముప్పాళ్ళ), కొలకలూరు కోటేశ్వరరావు(గుంటూరు) ఉన్నారు. ఏడో సంఘం.. అభివృద్ధి పనులు, విద్యుత్, రవాణా, గ్రామీణనీటిసరఫరాకు సంబంధించిన ఈ స్థాయిసంఘం చైర్మన్‌గా షేక్ జానీమూన్ ఎన్నికయ్యారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్(పొన్నూరు), అనగాని సత్యప్రసాద్(రేపల్లె), తెనాలి శ్రావణ్‌కుమార్(తాడికొండ), జెడ్పీటీసీ సభ్యులు మల్లవరపు రవికుమార్(శ్యావల్యాపురం), క్రోసూరు అయ్యప్ప(కొల్లూరు), ఆకుల జయసత్య(మంగళగిరి), అన్నాబత్తుని జయలక్ష్మి(తెనాలి), చింతలపూడి నాగలక్ష్మి(నాదెండ్ల), కొనకంచి హైమావతి(దుర్గి), బత్తిని శారద(పెదనందిపాడు), నల్లమేకల వెంకటేశ్వర్లు(అచ్చంపేట), షేక్ నూరుల్ ఆక్తాబ్(నరసరావుపేట) ఎన్నికయ్యారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రాజేంద్రప్రసాద్
-
విద్యుదాఘాతంతో రైతు మృతి
గంగాధర, న్యూస్‌లైన్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మరుకు ఫ్యూజు వైరు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందగా, మరొకరు ప్రాణాపయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన గురువారం మండలంలోని హిమ్మత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. హిమ్మత్‌నగర్‌కు చెందిన సర్వు రాజమల్లు(45) మూడెకరాల వ్యవసాయభూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ భూమి సమీపంలోనే ఎస్ఎస్ 11 ట్రాన్స్ ఫార్మర్ ఉంది. గురువారం పొలం పనిచేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజు వైరు కొట్టేసింది. గమనించిన రాజమల్లు ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి వైరు వేశాడు. అక్కడే ఉన్న మరో రైతు ఏగుర్ల బీరయ్యను డీపీ స్విచ్ఆన్ చేస్తుండగా ప్యూజ్‌లో మంటలు వచ్చి రాజమల్లు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో రైతు బీరయ్య సైతం విద్యుదాఘాతంతో గాయపడ్డాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి ఎస్సై రాజేంద్రప్రసాద్, ఏఎస్సై రాజేశ్వర్ పరిశీలించారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ సిరిమల్ల చంద్రమోహన్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. -
క్రీడా పోటీల్లో ప్రతిభ చూపాలి
వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపితే భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని అండర్-19 ఎస్జీఎఫ్ఐ ప్రెసిడెంట్, డీవీఈఓ (జిల్లా వృత్తి విద్యాధికారి) రాజేంద్రప్రసాద్ అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఆయనబాస్కెట్బాల్, నెట్‌బాల్ సెలక్షన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎదుగుదలకు బీజం పడుతుందని... దాన్ని అందిపుచ్చుకున్న వారే భవిష్యత్‌లో విజయాలు సాధిస్తారన్నారు. ఎంపికైన జట్లు నవంబర్ 8, 9, 10వ తేదీల్లో ఖమ్మం, చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో అండర్-19 ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామ్మూర్తి, డిప్యూటీ డీవీఈఓ రమణారావు, ఫిజికల్ డెరైక్టర్లు అశోక్‌కుమార్, అనూప్‌కుమార్, రాజిరెడ్డి, రామన్న, రమేష్, ఐలయ్య, శ్రీనివాస్, చార్లీ, జితేందర్‌నాథ్, రోహిణిదేవి, శ్రీదేవి, రవి, కుమార్ పాల్గొన్నారు. కాగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో బాస్కెట్‌బాల్ బాలుర జట్టు కోచ్‌గా పీడీ రామన్న, మేనేజర్‌గా కుమా ర్... బాలికల జట్టుకు కోచ్‌గా శ్రీదేవి, మేనేజర్ గా శారద... నెట్‌బాల్ బాలుర జట్టుకు కోచ్‌గా ఐలయ్య... బాలికల జట్టుకు కోచ్‌గా రమేష్, మేనేజర్‌గా ఐలయ్య వ్యవహరించనున్నారు. ఎంపికైన జట్ల వివరాలు బాస్కెట్‌బాల్ (బాలురు) : అశోక్, రాజేష్, సందీప్, శ్రీధర్, నాగేం దర్, సాదీక్, అనిల్‌కుమార్, మనోజ్,అబ్దుల్, నరేష్, కిరణ్‌కుమార్, మునీర్, పవన్, రాజశేఖర్ బాలికలు : పుష్ప, రమ్యశ్రీ, కళ్యాణి, స్రవంతి, దీపిక, సంకీర్తన, మానస, శ్రీకన్య, మానస, కళ్యాణి, నన్యశ్రీ, మమత, మనీషా, రమ్య, ప్రియాంక నెట్‌బాల్ (బాలురు) : మహేందర్, రంజిత్, ప్రవీణ్, సురేష్, రామక్రిష్ణ, కుమార్, రఘుపతి, హరీష్, నవీన్, పాషా, శివాజి, రాజు, రాకేష్, ప్రేమ్‌సాగర్, రాజు బాలికలు : అపర్ణ, అనూష, స్వప్న, స్నేహా రాణి, మానస, విజయ, పావని,అనూష, శకుం తల, అనూషజ్యోతి, కృష్ణవేణి, దీపిక, రమ్య