విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. భార్య, కుమారుడితో పాటు అత్తపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం ఉదయం నగరంలోని చిట్టీ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన రాజేంద్రప్రసాద్ కు మూడేళ్ల కిందట చిట్టీనగర్‌కు చెందిన ఆకుల రోజాతో వివాహమైంది. వీరికి 9 నెలల కుమారుడు ఉన్నాడు. అయితే కుటంబ కలహాల కారణంగా రాజేద్రప్రసాద్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో శనివారం ఉదయం భార్య పుట్టింకి వెళ్లి గొడవ పడ్డాడు. ఈ సందర్భంగా దంపతుల మధ్య వాగ్వివాదం మొదలై ఒకరినొకరు దుర్భషలాడుకున్నారు. దీంతో భార్య, కుమారుడు, అడ్డు వచ్చిన అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(చిట్టీ నగర్)