good performance
-
JP Morgan: మోదీ పనితీరు అద్భుతం
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారంటూ జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ప్రశంసించారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్స్ సంస్థ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ సంస్కరణలను డిమోన్ కొనియాడారు.‘‘సమ్మిళిత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారత్‌లో ప్రధాని మోదీ 40 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. అక్కడ పలు రాష్ట్రాల్లోని పన్ను వ్యవస్థల సంక్లిష్టతలను ఛేదించి సంస్కరించారు. సానుకూల మార్పు దిశగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు’’ అంటూ మోదీని పొగిడారు. -
మౌలిక రంగం భేష్
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ ఆగస్టులో మంచి పనితీరును ప్రదర్శించింది. మౌలిక రంగం సమీక్షా నెల్లో 12.1 శాతం వృద్ధిని (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 14 నెలల్లో (2022 జూన్‌లో వృద్ధి రేటు 13.2 శాతం) ఈ స్థాయి భారీ వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. సిమెంట్ (18.9 శాతం), బొగ్గు (17.9 శాతం), విద్యుత్ (14.9 శాతం), స్టీల్ (10.9 శాతం), సహజ వాయువు (10 శాతం) రంగాలు రెండంకెల్లో వృద్ధి సాధించగా, రిఫైనరీ ప్రొడక్టులు 9.5 (శాతం), క్రూడ్ ఆయిల్ (2.1 శాతం), ఎరువుల (1.8 శాతం) రంగాల్లో వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్ నుంచి ఆగస్టు ఎనిమిది రంగాల వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. మ్తొతం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పరిశ్రమల వెయిటేజ్ 40.27 శాతం. -
Doha Diamond League 2023: మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తా: నీరజ్ చోప్రా
డైమండ్ లీగ్ తొలి రౌండ్లో విజేతగా నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌లోని రాబోయే రౌండ్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన నీరజ్ ఇదే తరహా నిలకడ కొనసాగిస్తానని అన్నాడు. ‘శుక్రవారం తొలి రౌండ్లో గెలుపు కోసం ఎంతో శ్రమించాను. అయితే ఫలితం ఆనందాన్నిచ్చింది. దీనిని శుభారంభంగా భావిస్తున్నా. గాలి వేగంలో మార్పు వల్ల పోటీ సవాల్‌గా మారింది. పైగా అత్యుత్తమ ఆటగాళ్లంతా బరిలో నిలిచారు. ఈ సీజన్ మొత్తం ఫిట్నెస్తో ఉండి నిలకడగా రాణించడం ముఖ్యం. తర్వాతి రౌండ్లోనూ అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తా. నాపై నమ్మకముంచి ఎంతో మంది భారత అభిమానులు ఇక్కడకు వచ్చారు. దానిని నిలబెట్టుకోగలిగినందుకు సంతోషం’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. -
సూక్ష్మ రుణాల్లో 19 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించాయి. రుణ వితరణ 19 శాతం వృద్ధితో రూ.77,877 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్ఐ) నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసిన మైక్రోమీటర్ నివేదిక తెలిపింది. సూక్ష్మ రుణ సంస్థల మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 డిసెంబర్ చివరికి రూ.3.21 లక్షల కోట్లకు చేరుకుంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న రూ.2.56 లక్షల కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో 189 లక్షల రుణాలను మంజూరు చేశాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 165 లక్షల రుణాలుగానే ఉంది. 2022 డిసెంబర్ నాటికి మొత్తం 6.4 కోట్ల ఖాతాదారులకు సంబంధించి 12.6 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందించాయి. 83 ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అత్యదికంగా 38.5 శాతం వాటాతో రూ.1,23,386 కోట్ల రుణ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు రూ.15,951 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22.5 శాతం ఎక్కువ. సూక్ష్మ రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు అధిక వాటా ఉండగా, ఆ తర్వాత బ్యాంకులు సూక్ష్మ రుణాల పరంగా ఎక్కువ మార్కెట్‌ను కలిగి ఉన్నట్టు ఎంఎఫిన్ సీఈవో, డైరెక్టర్ అలోక్ మిశ్రా తెలిపారు. నియంత్రణల పరిధిలోని అన్ని సంస్థలు సూక్ష్మ రుణాల పరంగా మంచి వృద్ధిని నమోదు చేయడం ఆశావహమని ఎంఫిన్ నెట్వర్క్ తెలిపింది. బీహార్ అతిపెద్ద సూక్ష్మ రుణ మార్కెట్‌గా అవతరించింది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమబెంగాల్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. -
భారత్ ఆశాకిరణం
వాషింగ్టన్: ప్రపంచంలో అన్ని దేశాలు వృద్ధి అధోగమనాన్ని చూస్తుంటే.. భారత్ మంచి పనితీరు చూపిస్తూ ఆశాకిరణంగా ఉందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతూ, ప్రపంచదేశాలు మందగమనంలోకి వెళుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన మూడింట ఒక వంతు దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళతాయని అంచనా వేస్తున్నాం. ద్రవ్యోల్బణం బలీయంగా ఉంది. ఇదే అంతర్జాతీయంగా నెలకొన్న వాస్తవ పరిస్థితి. దాదాపు ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థ నిదానిస్తోంది. ఈ విధంగా చూస్తే భారత్ మాత్రం మెరుగైన పనితీరు తో వెలిగిపోతోంది’’అని శ్రీనివాసన్ వివరించారు. వృద్ధి రేటు 6.8 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ 2022 సంవత్సరానికి 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. 2021లో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. 2023 సంవత్సరానికి జీడీపీ 6.1 శాతం రేటు నమోదు చేస్తుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక వంతు 2023లో క్షీణతను చూస్తుందని అంచనా వేసింది. అమెరికా, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థల్లో స్తబ్ధత కొనసాగుతుందని పేర్కొంది. 2023లో మాంద్యం వస్తుందని చాలా మంది భావిస్తున్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు విధానాలను కట్టడి చేస్తుండడంతో ద్రవ్య పరిస్థితులు కూడా కఠినవుతున్నాయి. ఇది పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, కమోడిటీల ధరల పెరుగుదలకు దారితీసింది. మూడోది చైనా మందగమనాన్ని చూస్తోంది. ఈ అంశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ఆసియా, భారత్ వృద్ధి అవకాశాలపైనా చూపిస్తోంది. భారత్ వెలుపలి డిమాండ్ మందగమన ప్రభావాన్ని చూస్తోంది. అలాగే, దేశీయంగా ద్రవ్యల్బణ పెరుగుదలను చూస్తోంది’’అని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి అనుసరించే ద్రవ్య విధాన కఠినతరం పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. భారత్ విధానాలు బాగు.. భారత్ ప్రతిష్టాత్మక మూలధన వ్యయాల ప్రణాళికను ఐఎంఎఫ్ మెచ్చుకుంది. దీన్ని కొనసాగించాలని, అది దేశీయంగా డిమాండ్ బలపడేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే, పేదలు, సున్నిత వర్గాలపై ప్రభావం చూపిస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రశంసించింది. ఎౖMð్సజ్ పన్నును తగ్గంచడాన్ని ప్రస్తావించింది. దీనివల్ల ధరలవైపు ఉపశమనం ఉంటుందని పేర్కొంది. డిజిటైజేషన్ దిశగా భారత్ అద్భుతమైన ప్రగతి చూపించిందని, పలు రంగాల్లో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని కూడా ప్రశంసించింది. -
‘గతంలోనూ చాలా మందికి ఇలా జరిగింది’
ఐపీఎల్లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యామని, అయితే ఇలాంటి వైఫల్యాలు ఎవరికైనా సహజమని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఎందరో దిగ్గజాలకు ఇలాంటి స్థితి ఎదురైందని, ఆ దశను అధిగమించి వారు ముందుకు సాగారని రోహిత్ గుర్తు చేశాడు. ఏం జరిగినా ఈ జట్టుపై తన అభిమానం తగ్గదని చెప్పిన రోహిత్... కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐదు సార్లు లీగ్ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. -
బెంగళూరు బోల్తా.. ఎస్ఆర్హెచ్కు వరుసగా ఐదో విజయం
ఐదేళ్ల క్రితం 2017 ఏప్రిల్ 23న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49)ను నమోదు చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు దాదాపు అదే ప్రదర్శనను కనబరుస్తూ తమ రెండో అత్యల్ప స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఆర్సీబీని 68 పరుగులకే కుప్పకూల్చారు. ఒక్క బ్యాటర్ కూడా పట్టుదలగా నిలవలేకపోగా, ముగ్గురు డకౌటయ్యారు. ఆ తర్వాత సునాయాస లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఆడుతూ పాడుతూ ఛేదించి లీగ్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. ముంబై: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన హైదరాబాద్ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటైంది. ] సుయాశ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో జాన్సెన్ (3/25), నటరాజన్ (3/10) ఆర్సీబీని దెబ్బ కొట్టారు. అనంతరం హైదరాబాద్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటం తో మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచిన సన్‌రైజర్స్ భారీగా రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. టపటపా... తొలి ఓవర్లో 5 పరుగులు చేసిన బెంగళూరు పతనం రెండో ఓవర్ నుంచి మొదలైంది. ఈ ఓవర్ వేసిన జాన్సెన్ రెండో బంతికి డుప్లెసిస్ (5) స్టంప్స్ ఎగరగొట్టగా, తర్వాతి బంతికే విరాట్ కోహ్లి (0) వెనుదిరిగాడు. కోహ్లి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘గోల్డెన్ డక్’ నమోదు చేయడం విశేషం. అదే ఓవర్ చివరి బంతికి అనూజ్ రావత్ (0) కూడా అవుటయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి మ్యాక్స్‌వెల్ (12) కూడా పెవిలియన్ చేరగా, స్కోరు 25/4 వద్ద నిలిచింది. సుయాశ్, ఈ సీజన్లో జట్టు తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన కార్తీక్ (0), షహబాజ్ (7) కూడా 7 బంతుల వ్యవధిలో అవుట్ కావడంతో బెంగళూరు కోలుకునే అవకాశం లేకపోయింది. ఒకదశలో ఆర్సీబీ ‘49’ అయినా దాటగలదా అనిపించింది. మరో 23 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం సన్‌రైజర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా మ్యాచ్‌ను ముగించింది. ఛేదనలో అభిషేక్ దూసుకెళ్లాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను, హాజల్‌వుడ్ ఓవర్లో 4 ఫోర్లు బాది సత్తా చాటాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డుప్లెసిస్ (బి) జాన్సెన్ 5; రావత్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0; మ్యాక్స్‌వెల్ (సి) విలియమ్సన్ (బి) నటరాజన్ 12; సుయాశ్ (స్టంప్డ్) పూరన్ (బి) సుచిత్ 15; షహబాజ్ (సి) పూరన్ (బి) ఉమ్రాన్ 7; దినేశ్ కార్తీక్ (సి) పూరన్ (బి) సుచిత్ 0; హర్షల్ (బి) నటరాజన్ 4; హసరంగ (బి) నటరాజన్ 8; హాజల్‌వుడ్ (నాటౌట్) 3; సిరాజ్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 68. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–8, 4–20, 5–47, 6–47, 7–49, 8–55, 9–65, 10–68. బౌలింగ్: భువనేశ్వర్ 2.1–0–8–1, జాన్సెన్ 4–0–25–3, నటరాజన్ 3–0–10–3, సుచిత్ 3–0–12–2, ఉమ్రాన్ 4–0–13–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రావత్ (బి) హర్షల్ 47; విలియమ్సన్ (నాటౌట్) 16; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టానికి) 72. వికెట్ల పతనం: 1–64. బౌలింగ్: సిరాజ్ 2–0–15–0, హాజల్‌వుడ్ 3–0–31–0, హర్షల్ పటేల్ 2–0–18–1, హసరంగ 1–0–7–0. An emphatic win for #SRH as they beat #RCB by 9 wickets 👏🔥 Splendid performance from Kane & Co. This is one happy group right now 😃😃 They move to No.2 on the points table #TATAIPL | #RCBvSRH | #IPL2022 pic.twitter.com/TocgmvruFL — IndianPremierLeague (@IPL) April 23, 2022 -
Ind Vs Sa 2nd Test: శార్దుల్ సప్తమి.. 7 వికెట్లు పడగొట్టిన పేసర్
Ind vs sa 2nd Test: India Lead By 58 Runs End Of Day 2: వాండరర్స్ మైదానంలో శార్దుల్ ఠాకూర్ వండర్ఫుల్ ప్రదర్శనతో మెరిశాడు. సఫారీ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్‌గా నిలుస్తూ ఏడు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కకుండా టీమిండియా నిలువరించగలిగింది. చేతిలో 8 వికెట్లతో మన జట్టు 58 పరుగులు ముందంజలో ఉండగా మూడో రోజు బ్యాటింగ్ కీలకం కానుంది. భారత బ్యాటర్లు ఎంత స్కోరు చేసి దక్షిణాఫ్రికాకు లక్ష్యం నిర్దేశిస్తారనేది ఆసక్తికరం. జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతూ 20 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మయాంక్ (23), రాహుల్ (8) అవుట్ కాగా... పుజారా (35 బ్యాటింగ్; 7 ఫోర్లు), రహానే (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన 27 పరుగులు పోగా, ప్రస్తుతం భారత్‌కు 58 పరుగుల ఆధిక్యం ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 35/1తో ఆట మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పీటర్సన్ (118 బంతుల్లో 62; 9 ఫోర్లు), తెంబా బవుమా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్ (7/61) చిరస్మరణీయ బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఎల్గర్ (120 బంతుల్లో 28; 4 ఫోర్లు), పీటర్సన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. అతి జాగ్రత్తగా ఆడిన ఎల్గర్ రెండో రోజు 32వ బంతికి గానీ మొదటి పరుగు తీయలేకపోగా, పీటర్సన్ కొన్ని చక్కటి షాట్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించగా, 103 బంతుల్లో పీటర్సన్ అర్ధ సెంచరీ పూర్తయింది. మంగళవారం రోజు భారత్ వేసిన తొలి 18 ఓవర్లలో శార్దుల్‌కు ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు. అయితే ఆ తర్వాత బంతిని అందుకున్న అతను అద్భుత స్పెల్‌తో ఆటను మార్చేశాడు. తన రెండో ఓవర్లోనే అతను ఎల్గర్‌ను వెనక్కి పంపాడు. మరో రెండు ఓవర్ల తర్వాత చక్కటి బంతితో పీటర్సన్‌ను అవుట్ చేసిన శార్దుల్... మరుసటి ఓవర్లో డసెన్ (1) పని పట్టాడు. లంచ్ సమయానికి శార్దుల్ స్పెల్ 4.4–3–8–3 కావడం విశేషం. ఆదుకున్న బవుమా... స్కోరు 102/4గా నిలిచిన స్థితిలో సఫారీ జట్టు ఇన్నింగ్స్‌ను బవుమా, కైల్ వెరీన్ (21) నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 60 పరుగులు జత చేశారు. అయితే శార్దుల్ మరోసారి రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. వెరీన్, బవుమా లను శార్దుల్ అవుట్ చేశాడు. టీ విరామం తర్వాత కేశవ్ (21), జాన్సెన్ (21) వేగంగా 38 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాకు ఆధిక్యాన్ని అందించారు. ఈ దశలో శార్దుల్ చెలరేగి ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు తీసి సఫారీల ఇన్నింగ్స్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 202; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పంత్ (బి) శార్దుల్ 28; మార్క్రమ్ (ఎల్బీ) (బి) షమీ 7; పీటర్సన్ (సి) మయాంక్ (బి) శార్దుల్ 62; డసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 1; బవుమా (సి) పంత్ (బి) శార్దుల్ 51; వెరీన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 21; జాన్సెన్ (సి) అశ్విన్ (బి) శార్దుల్ 21; రబడ (సి) సిరాజ్ (బి) షమీ 0; కేశవ్ (బి) బుమ్రా 21; ఒలీవియర్ (నాటౌట్) 1; ఎన్గిడి (సి) పంత్ (బి) శార్దుల్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 229. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–101, 4–102, 5–162, 6–177, 7–179, 8–217, 9–228, 10–229. బౌలింగ్: బుమ్రా 21–5–49–1, షమీ 21–5–52–2, సిరాజ్ 9.5–2–24–0, శార్దుల్ 17.5–3–61–7, అశ్విన్ 10–1–35–0. భారత్ రెండో ఇన్నింగ్స్: 85/2 -
హీ ఈజ్ కింగ్ ఇన్ 'వెంట్రిలాక్విజం'
సాక్షి, సిద్దిపేట : చిన్ననాటి నుంచి తన మిత్రులతో కలిసి సరదాగా చేసిన మిమిక్రీ నేడు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు అయ్యేలా తీర్చిదిద్దింది. ప్రపంచం శాస్త్ర సాంకేతికతలో అభివృద్ధి చెందుతున్నా మాయలు, మంత్రాలు అనే నెపంతో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అయితే సమాజంలో ఇలాంటి మూఢ నమ్మకాలు పోగొట్టే ఉద్దేశంతో సిద్దిపేట పట్టణానికి చెందిన రమేశ్ తన వంతుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. భయంతో వినని చిన్నారులు కేవలం కథలు, పుస్తకాలు, కావ్యాలు, పాటలు, తదితర కళాత్మకమైన అంశాలను కలిపి చెబితే త్వరగా అర్థం చేసుకుంటారు. సిద్దిపేటకు చెందిన ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు రమేశ్ తనదైన శైలిలో రాణిస్తూ పలువురిని ఆకర్షిస్తున్నాడు. వేదిక ఏదైనా ప్రజలకు వెళ్లాల్సిన విషయం మాత్రం సూటిగా చెబుతున్నాడు. దీనిలో ఆరితేరిన రమేశ్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా పేరుగాంచారు. ప్రభుత్వ పథకాలు అయితేనేం, సామాజిక అంశాలు అయితేనేం, చెప్పాల్సిన విషయం మాత్రం చక్కగా అర్థమయ్యేలా తన కళలతో వివరిస్తూ రాణిస్తున్నాడు. అంతా సైన్స్ మాయనే.. మాయలు, మంత్రాలు లేవు, కేవలం ట్రిక్స్, హస్తలాఘవం, ఉపయోగిస్తూ చేసేవే అని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నాడు. కేవలం ఇవే కాకుండా రమేశ్ గొంతు సవరించి మాట్లాడుతే నవ్వులే నవ్వులు, చేతులు కదిలిస్తూ మాయజాలం చేస్తు మైమరిపించే మాయలను చూపిస్తాడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం తదితర కళలను చిన్నతనం నుంచే అలవాటుగా మార్చుకుని మిమిక్రీ , మెజీషియన్‌గా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చి నేటికి అనేక రికార్డులు నెలకొల్పొతున్నాడు. సిద్దిపేట స్వచ్ఛ మున్సిపల్ బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. మాయలు, మంత్రాలు లేవు కేవలం సైన్స్ అనే నినాదంతో రమేష్ తన మిమిక్రీ, వెంట్రిలాక్విజం చేస్తు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. నెత్తి మీద మంట పెట్టి టీ చేయడం, కత్తిని నోట్లోకి పూర్తిగా పెట్టుకోవడం, చెవు, ముక్కు, నోటిలో నుంచి నీరు తీయడం, నోట్లో నుంచి వరుసగా బ్లెడ్లు తీయడం, నిమ్మకాయ నుంచి రక్తం కారించడం చేతిలో ఏమి లేకుండా గాలిలో నుండి 50 రూపాయల నోటును తీయడం లాంటి వాటితో ప్రజల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాల నిర్మూలన పట్ల అవగాహన కల్పిస్తున్నాడు. వెంట్రిలాక్విజంలోనూ.. నోరు కదపకుండా మాట్లాడటమే వెంట్రిలాక్విజం. పెదాలను కదిలించకుండానే శబ్ధం, ధ్వని వస్తున్నట్లు వినిపిస్తు చూపరులను ఆకర్షిస్తారు. ముఖ్యంగా టాకింగ్ డాల్ చేతిలో పట్టుకొని, పెదాలు కదపకుండా కొంతమంది శబ్ధాలు చేస్తు ప్రేక్షకులను ఆకర్షిస్తుంటారు. రమేష్ ఈ ప్రదర్శనలతో నవ్వించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా పక్షులు, జంతువుల శబ్ధాలను అనుకరిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. నేరుగా, సామాజిక మాధ్యమాల ద్వారా.. తన కళలను నేరుగా లేదంటే సామాజిక మాద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు రమేశ్. ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, టిక్‌టాక్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ టీవీ చానల్ల ద్వారా తన మిమిక్రీ కళను ప్రదర్శిస్తున్నాడు. జాతీయ స్థాయి అవార్డుల వరకు.. ఎన్నో రకాల ప్రదర్శనలతో అవార్డులతో పాటుగా, రివార్డులు కూడా పొందాడు. తెలుగు బుక్ అఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులలో చోటు సంపాదించాడు. 2013, 2016 సంవత్సరాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా సన్మానం అందుకున్నాడు. 2015 నుంచి సిద్దిపేట మున్సిపల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. అదే విధంగా అప్పటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ చేతుల మీదుగా సన్మానం పొందాడు. సినీ నటులు ఆర్. నారాయణమూర్తి, సంపూర్ణేష్బాబుల చేతుల మీదుగా సన్మానాలు పొందాడు. 2019లో రాష్ట్ర స్థాయి మిమిక్రీ వర్క్‌షాప్‌లో అంజన్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రత్యేక అవార్డు అందుకున్నారు. జట్లీ బుక్ ఆఫ్ రికార్డ్స్ (తమిళనాడు) అదే విధంగా త్వరలో నేషనల్ కల్చరల్ అకాడమీ ఢిల్లీ వారి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటి వరకు 2 వేల ప్రదర్శనలు.. కార్యక్రమం ఏదైనా అక్కడ తన మిమిక్రీ, వెంట్రిలాక్విజంతో ప్రజలను ఉత్సాహాపర్చడమే రమేశ్ కర్తవ్యంగా మారింది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల వార్షికోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వడం నుంచి మొదలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయే స్టేజీ షోలను ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సాక్షి టీవీ, జీటీవీ, ఎన్టీవీ, దూరదర్శన్ తదితర చానల్లలో దారవాహిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు 2 వేల వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. అనేక మంది ప్రముఖుల చేతుల మీదుగా సత్కారాలు అందుకొని షభాష్ అనిపించుకుంటున్నాడు. సెలవు దినాల్లో మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్ల ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాడు. రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నాడు. -
10% నీటితోనే వరి, చెరకు సాగు!
వరి, చెరకు, అరటి.. అత్యధికంగా సాగు నీరు అవసరమయ్యే పంటలివి. అయితే, సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కేవలం 10% నీరు, 10 శాతం విద్యుత్తు, 5% (దేశీ వరి) విత్తనంతోనే సాగు చేస్తూ కరువు కాలంలోనూ సజావుగా దిగుబడి తీస్తున్న విలక్షణ రైతు విజయరామ్. వికారాబాద్ సమీపంలో రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్న తన వ్యవసాయ క్షేత్రంలో అతి తక్కువ నీరు, విద్యుత్తు, విత్తనంతో అనేక రకాల దేశీ వరి వంగడాలు, చెరకు, అరటితోపాటు కందిని ఆయన సాగు చేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఇటీవల పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు సూచనలిచ్చారు.ఆ ప్రాంతంలో రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అతి తక్కువ నీటితో వరి, చెరకు, అరటి, కంది తదితర పంటలు సాగు చేస్తుండటం విశేషం. మిఠాయిల వ్యాపారి అయిన విజయరామ్ ఎనిమిదేళ్ల క్రితం రాజమండ్రిలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పాఠాలు విని పొందిన స్ఫూర్తితో ఆవులు, పొలం కొని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరులో సౌభాగ్య గోసదన్‌ను ఏర్పాటు చేసి 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. పాలేకర్ చేత 6 వేల మంది రైతులకు శిక్షణ ఇప్పించిన ఆయన 200 రకాల దేశీ వరి వంగడాలను సేకరించి, కొన్ని ఎంపిక చేసిన రకాలను సాగు చేస్తున్నారు. గత ఏడాది వికారాబాద్ మండలం ధారూర్ మండలం బూరుగడ్డ గ్రామంలో 43 ఎకరాల నల్లరేగడి వ్యవసాయ భూమిని గత ఏడాది కొనుగోలు చేశారు. 35 ఏళ్లు రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఈ నేలలో ఘనజీవామృతం, జీవామృతం, ఆచ్ఛాదన తదితర పద్ధతులను పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఇటీవల సుభాష్ పాలేకర్ ఈ క్షేత్రాన్ని సందర్శించి, వాతావరణ మార్పులను తట్టుకొనేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతే శరణ్యమనడానికి 10% నీరు, 10% విద్యుత్తుతోనే వరి, చెరకు, అరటి పంటలను విజయరామ్ సాగు చేస్తుండటమే నిదర్శనమని ప్రశంసించారు. రైతులు తలా ఒక ఎకరంలో ఈ పద్ధతిలో సాగు చేసి ఫలితాలు స్వయంగా సరిచూసుకోవచ్చన్నారు. ఆరు తడి దేశీ వరిలో అంతర పంటలు ప్రత్యేకతలు, పంటకాలం, దిగుబడి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రత్నచోడి, తులసిబాసో, బహురూపి, మాపిలైసాంబ, చెకో, మైసూర్ మల్లిగా, నారాయణ కామిని, నవారా, కర్పుకొని వంటి దేశీ వరి రకాలను కొన్ని మడుల్లో విజయరామ్ ఈ ఖరీఫ్‌లో సాగు చేశారు. కొన్ని వరి రకాల్లో అంతర పంటలు వేశారు. అంతర పంటలు వేయని వరి రకాల్లో సాళ్లకు, మొక్కలకు మధ్య అడుగున్నర దూరం పెట్టారు. అంతర పంటలు వేసిన వరి పొలంలో వరుసల మధ్య 3 అడుగుల దూరం పెట్టారు. బురద పొలంలో ఎకరానికి 100–200 కిలోల ఘన జీవామృతం వేస్తారు. అవకాశం ఉన్న రైతులు ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం వేస్తే మరీ మంచిది. భూమిలో తేమను పట్టి ఉంచడానికి, పంట త్వరగా బెట్టకు రాకుండా ఉండటానికి ఘనజీవామృతం చాలా ఉపయోగపడుతుందని, సకల పోషకాలూ అందుతాయని విజయరామ్ వివరించారు. 14–15 రోజులు పెంచిన నారును కుదురుకు ఒకే మొక్కను నాటుతారు. వరికి 20 రోజులకో తడి రత్నచోడి వరిలో నాటిన పొలంలోనే తోటకూర జాతికి చెందిన అమరంతస్ ధాన్యపు పంటను అంతర పంటగా వేశారు. నెల క్రితమే రత్నచోడి కోతలు పూర్తవగా ఇప్పుడు అమరంతస్ కోతకు సిద్ధమవుతోంది. కర్పుకౌని దేశీ వరిలో సాళ్లు/మొక్కల మధ్య 2 అడుగుల దూరం పెట్టారు. గతంలో వేరు శనగను అంతరపంటగా వేశారు. అయితే, అక్టోబర్‌లో శనగను అంతర పంటగా వేసి ఉంటే నత్రజని బాగా అందేదని పాలేకర్ సూచించారు. మాపిళ్లైసాంబ రకం ఆరు తడి వరిలో దుబ్బుకు 40–60 పిలకలు వచ్చాయి. ఆరు తడి పంటకు 20 రోజులకు ఒకసారి నీటి తడి ఇచ్చామని విజయరామ్ తెలిపారు. పాలేకర్ సూచించిన విధంగా వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అక్టోబర్‌లో శనగను వరిలో అంతర పంటగా వేస్తామన్నారు. ఆరుతడిగా సాగు చేయడం వల్ల వరిలోనూ ఎద్దులతో 2,3 సార్లు గుంటక తోలటం ద్వారా కలుపు ఖర్చును తగ్గించుకోవడం సాధ్యమైందని అన్నారు. గన్నీ బాగ్స్‌ను కూడా ఆచ్ఛాదనగా వాడొచ్చు 6 అడుగుల దూరంలో కర్పూర అరటి, చెక్కర కేళిలను 20 రోజులకోసారి తడి ఇస్తూ సాగు చేస్తున్నారు. గడ్డీ గాదాన్ని సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేశారు. మొక్కల మొదళ్లలో తేమ ఆరినా.. ఆచ్ఛాదన అడుగున తేమ బాగా ఉంటున్నదని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న ఏ సేంద్రియ పదార్థాన్నయినా ఆచ్ఛాదనగా వేయొచ్చునని పాలేకర్ అన్నారు. కందికి ఒకసారే జీవామృతం మచ్చల కంది సహా ఆదిలాబాద్‌కు చెందిన నాటు రకాల కందులను 7 అడుగుల దూరంలో సాళ్లుగా, అర అడుగుకు ఒక విత్తనం పడేలా నాగళ్లతో ఎకరంన్నర నల్లరేగడి భూమిలో విత్తారు. విత్తనానికి ముందు ఎకరానికి 200 కిలోల వరకు ఘనజీవామృతం వేశారు. ద్రవజీవామృతం ఒకేసారి అందించగలిగామని, అయినా కంది విరగ కాసిందని, చెట్టుకు అరకేజీ వరకు దిగుబడి రావచ్చని విజయరామ్ తెలిపారు. 4.5 నెలల్లో చెరకుకు ఒకే తడి ఎకరం భూమిలో విజయరామ్ అతి తక్కువ నీటితో చెరకును సాగు చేస్తున్నారు. నాలుగున్నర నెలల క్రితం సాళ్ల మధ్య 8 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో చెరకు ముచ్చెలు నాటారు. అంతర పంటలుగా కాకర, లంక దోస నాటారు. దీంతో తోటలో ఎక్కడా నేల కనపడకుండా కాకర తీగలు అల్లుకుపోయాయి. ఇప్పటికి కేవలం 2 సార్లు జీవమృతం ఇచ్చారు. గత నెలలో ఒకే సారి నీటి తడి ఇచ్చినప్పటికీ తోట బెట్టకు రాకపోవడం విశేషం. అయితే, చెరకు సాళ్ల మధ్య అలసంద కూడా వేయటం అవసరమని, నత్రజని లోపం రాకుండా ఉంటుందని పాలేకర్ సూచించారు. ఇప్పటికైనా అలసంద గింజలు వేయమని సూచించారు. ఆచ్ఛాదనకు కాదేదీ అనర్హం ప్రకృతి వ్యవసాయంలో జీవామృతంతోపాటు అంతరపంటలు, ఆచ్ఛాదన కూడా రైతులు పాటించాల్సిన చాలా ముఖ్య అంశమని పాలేకర్ అన్నారు. చెరకు పిప్పి, కొబ్బరి బొండం డొక్కలు, కొబ్బరి మట్టలు, గడ్డీ గాదంతోపాటు వ్యాపారుల వద్ద తక్కువ ధరకు లభించే వాడేసిన గన్నీ బ్యాగులు, పాత నూలు వస్త్రాలు సైతం ఆచ్ఛాదనగా వేయొచ్చని అన్నారు. తీవ్ర కరువులోనూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేసిన పంటలు ఎండిపోతుంటే.. ప్రకృతి వ్యవసాయదారుల పంటలు కళకళలాడుతుండటం రైతులంతా గుర్తించాలన్నారు. దేశీ వరి వంగడాలను దిగుబడి దృష్ట్యా కాకుండా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా సాగు చేస్తూ పరిరక్షించుకోవడం అవసరమని అంటున్న విజయరామ్ను 040–27635867, 99491 90769 నంబర్లలో సంప్రదించవచ్చు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ 7 అడుగులు పెరిగిన కంది చేనులో విజయరామ్, చెరకు తోటలో దట్టంగా అల్లుకున్న కాకర తీగలు, అరటి తోటలో పాలేకర్ -
టాప్–6లో నిలుస్తాం
ముంబై: త్వరలో జరిగే చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చే అవకాశం ఉందని వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్, దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. ‘చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఐదు లేదా ఆరో స్థానంలో నిలిచే అవకాశముంది. రేటింగ్ పాయింట్లలో చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. ఒలింపియాడ్‌లో ఉండే ఫార్మాట్ ప్రకారం చూస్తే మనం స్వర్ణం గెలిచే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం. అయితే ఇతర జట్లూ బలంగా ఉన్నాయి. ఒలింపియాడ్‌లో నేను కూడా పాల్గొనాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ఆనంద్ వ్యాఖ్యానించాడు. -
అథ్లెటిక్స్ ఆణిముత్యం
తొర్రూరు, న్యూస్‌లైన్ : అథ్లెటిక్స్‌లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ క్రీడా ఆణిముత్యంగా పలువురి అభినందనలు అందుకుంటున్నాడు ధరావత్ జగదీష్. తొర్రూరు శివారు దుబ్బతండాకు చెందిన ధరావత్ భీమ, సామ్‌కి దంపతుల కుమారుడైన జగదీష్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే జగదీష్ క్రీడలపై ఎంతో ఆసక్తి చూపేవాడు. స్కూల్ దశలోనే పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. ఇంటర్, డిగ్రీకి చేరుకునే సరికి క్రీడల్లో మరింత ప్రావీణ్యం సంపాదించాడు. పాల్గొన్న ప్రతీ పోటీలోనూ పతకాలు సాధిస్తూ జిల్లా నుంచి జాతీయస్థాయికి ఎదిగి అటు పుట్టిపెరిగిన గ్రామానికి ఇటు చదువుకుంటున్న యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాడు. ప్రతిభకు పతకాలు గుంటూరు జిల్లా బాపట్లలో 2011 డిసెంబర్లో జరిగిన రాష్ట్రస్థాయి 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం కైవసం చేసుకున్నాడు. లాంగ్‌జంప్, త్రిబుల్జంప్లోనూ ప్రథమస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాక ఎక్కువ ప్రథమస్థానాలు సాధించిన ందుకు చాంపియన్‌షిప్ దక్కించుకున్నాడు. 2012 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని అఖోలాలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం సాధించి రెండు బంగారు పతకాలు అందుకున్నాడు. అదే ఏడాది అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లోనూ ప్రతిభ చూపి 100, 200 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, త్రిబుల్‌జంప్, డిస్కస్‌త్రోలో ప్రథమస్థానాలు సొంతం చేసుకుని ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలోని బీదర్‌లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో 49 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో వంద మీటర్ల పరుగులో బంగారు పతకం, 200మీటర్ల పరుగు, త్రిబుల్జంప్లో ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. పోటీ ఏదైనా పతకాల వేటలో ముందుంటున్న జగదీష్‌ను పలువురు అభినందిస్తున్నారు. అంతర్జాతీయస్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని ఆకాంక్షిస్తున్నారు. -
క్రీడా పోటీల్లో ప్రతిభ చూపాలి
వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపితే భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని అండర్-19 ఎస్జీఎఫ్ఐ ప్రెసిడెంట్, డీవీఈఓ (జిల్లా వృత్తి విద్యాధికారి) రాజేంద్రప్రసాద్ అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఆయనబాస్కెట్బాల్, నెట్‌బాల్ సెలక్షన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎదుగుదలకు బీజం పడుతుందని... దాన్ని అందిపుచ్చుకున్న వారే భవిష్యత్‌లో విజయాలు సాధిస్తారన్నారు. ఎంపికైన జట్లు నవంబర్ 8, 9, 10వ తేదీల్లో ఖమ్మం, చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో అండర్-19 ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామ్మూర్తి, డిప్యూటీ డీవీఈఓ రమణారావు, ఫిజికల్ డెరైక్టర్లు అశోక్‌కుమార్, అనూప్‌కుమార్, రాజిరెడ్డి, రామన్న, రమేష్, ఐలయ్య, శ్రీనివాస్, చార్లీ, జితేందర్‌నాథ్, రోహిణిదేవి, శ్రీదేవి, రవి, కుమార్ పాల్గొన్నారు. కాగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో బాస్కెట్‌బాల్ బాలుర జట్టు కోచ్‌గా పీడీ రామన్న, మేనేజర్‌గా కుమా ర్... బాలికల జట్టుకు కోచ్‌గా శ్రీదేవి, మేనేజర్ గా శారద... నెట్‌బాల్ బాలుర జట్టుకు కోచ్‌గా ఐలయ్య... బాలికల జట్టుకు కోచ్‌గా రమేష్, మేనేజర్‌గా ఐలయ్య వ్యవహరించనున్నారు. ఎంపికైన జట్ల వివరాలు బాస్కెట్‌బాల్ (బాలురు) : అశోక్, రాజేష్, సందీప్, శ్రీధర్, నాగేం దర్, సాదీక్, అనిల్‌కుమార్, మనోజ్,అబ్దుల్, నరేష్, కిరణ్‌కుమార్, మునీర్, పవన్, రాజశేఖర్ బాలికలు : పుష్ప, రమ్యశ్రీ, కళ్యాణి, స్రవంతి, దీపిక, సంకీర్తన, మానస, శ్రీకన్య, మానస, కళ్యాణి, నన్యశ్రీ, మమత, మనీషా, రమ్య, ప్రియాంక నెట్‌బాల్ (బాలురు) : మహేందర్, రంజిత్, ప్రవీణ్, సురేష్, రామక్రిష్ణ, కుమార్, రఘుపతి, హరీష్, నవీన్, పాషా, శివాజి, రాజు, రాకేష్, ప్రేమ్‌సాగర్, రాజు బాలికలు : అపర్ణ, అనూష, స్వప్న, స్నేహా రాణి, మానస, విజయ, పావని,అనూష, శకుం తల, అనూషజ్యోతి, కృష్ణవేణి, దీపిక, రమ్య