![Doha Diamond League 2023: Neeraj Chopra expresses happiness over win at Doha Diamond League - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/7/NEERAJ.jpg.webp?itok=C5aCQCv3)
డైమండ్ లీగ్ తొలి రౌండ్‌లో విజేతగా నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌లోని రాబోయే రౌండ్‌లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన నీరజ్ ఇదే తరహా నిలకడ కొనసాగిస్తానని అన్నాడు. ‘శుక్రవారం తొలి రౌండ్‌లో గెలుపు కోసం ఎంతో శ్రమించాను.
అయితే ఫలితం ఆనందాన్నిచ్చింది. దీనిని శుభారంభంగా భావిస్తున్నా. గాలి వేగంలో మార్పు వల్ల పోటీ సవాల్‌గా మారింది. పైగా అత్యుత్తమ ఆటగాళ్లంతా బరిలో నిలిచారు. ఈ సీజన్ మొత్తం ఫిట్‌నెస్‌తో ఉండి నిలకడగా రాణించడం ముఖ్యం. తర్వాతి రౌండ్‌లోనూ అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తా. నాపై నమ్మకముంచి ఎంతో మంది భారత అభిమానులు ఇక్కడకు వచ్చారు. దానిని నిలబెట్టుకోగలిగినందుకు సంతోషం’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment