india star
-
Paris Olympics 2024: నీరజ్ వస్తున్నాడు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం క్వాలిఫయింగ్ బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఓలింపిక్స్లో నీరజ్ పసిడి పతకం సాధించి దేశ అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ‘పారిస్’లోనూ టోక్యో ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. టోక్యో విశ్వ క్రీడల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన 26 ఏళ్ల నీరజ్ గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి విశ్వవిజేతగా నిలిచాడు. ‘పారిస్’ నుంచి కూడా పతకంతో తిరిగి వస్తాడని యావత్ భారతావని ఆశలు పెట్టుకోగా... వాటిని అందుకోవడమే లక్ష్యంగా నేడు నీరజ్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఆచితూచి టోరీ్నల్లో పాల్గొన్న 26 ఏళ్ల నీరజ్.. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు టోరీ్నల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు.. కిశోర్ కుమార్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. రెండు గ్రూప్‌ల్లో కలిపి మొత్తం 32 మంది త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. గ్రూప్ ‘బి’లో నీరజ్... కిశోర్ గ్రూప్ ‘ఎ’లో ఉన్నారు. ఫైనల్ చేరడానికి అర్హత ప్రమాణంగా 84 మీటర్లు నిర్ణయించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. ఒకవేళ 12 మంది కంటే ఎక్కువ మంది 84 మీటర్లను దాటి జావెలిన్‌ను విసిరితే ఇందులో నుంచి టాప్–12 మందికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. ఫైనల్ గురువారం జరుగుతుంది. పాకిస్తాన్ త్రోయర్ నదీమ్ అర్షద్, జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వెబర్ (జర్మనీ), ఒలీవర్ (ఫిన్లాండ్) నుంచి నీరజ్‌కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. -
Doha Diamond League 2023: మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తా: నీరజ్ చోప్రా
డైమండ్ లీగ్ తొలి రౌండ్లో విజేతగా నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌లోని రాబోయే రౌండ్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన నీరజ్ ఇదే తరహా నిలకడ కొనసాగిస్తానని అన్నాడు. ‘శుక్రవారం తొలి రౌండ్లో గెలుపు కోసం ఎంతో శ్రమించాను. అయితే ఫలితం ఆనందాన్నిచ్చింది. దీనిని శుభారంభంగా భావిస్తున్నా. గాలి వేగంలో మార్పు వల్ల పోటీ సవాల్‌గా మారింది. పైగా అత్యుత్తమ ఆటగాళ్లంతా బరిలో నిలిచారు. ఈ సీజన్ మొత్తం ఫిట్నెస్తో ఉండి నిలకడగా రాణించడం ముఖ్యం. తర్వాతి రౌండ్లోనూ అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తా. నాపై నమ్మకముంచి ఎంతో మంది భారత అభిమానులు ఇక్కడకు వచ్చారు. దానిని నిలబెట్టుకోగలిగినందుకు సంతోషం’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. -
Diamond League Final: ‘కోహినూర్’ నీరజ్
జ్యూరిచ్: అంతర్జాతీయ వేదికలపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్స్ స్వర్ణంతోనే తాను ఆగిపోనని చాటుతూ ఆపై ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం అందుకున్న అతను... ఇప్పుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో సత్తా చాటిన అతను 88.44 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రస్థానం అందుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ వాలెచ్ (86.94 మీటర్లు) రెండో స్థానంలో నిలవగా, జూలియన్ వెబర్ (ఇంగ్లండ్)కు మూడో స్థానం దక్కింది. విజేతగా నిలిచిన నీరజ్‌కు డైమండ్ ట్రోఫీతో పాటు 30 వేల డాలర్లు (సుమారు రూ. 24 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కింది. ఎదురు లేని ప్రదర్శన... గాయం కారణంగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు దూరమైన నీరజ్ గత నెల 26న లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ అంచెలో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఫలితంగా ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో పాటు 2023లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు కూడా క్వాలిఫై అయ్యాడు. గురువారం ఈవెంట్లో నీరజ్ తొలి ప్రయత్నం ‘ఫౌల్’ అయింది. అయితే రెండో ప్రయత్నంలో అతని జావెలిన్ 88.44 మీటర్లు దూసుకుపోయింది. తర్వాతి మరో నాలుగు ప్రయత్నాల్లోనూ (88 మీ., 86.11 మీ., 87 మీ., 83.60 మీ.) దీనికంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయినా... విజేతగా నిలిచేందుకు 88.44 మీటర్లు సరిపోయాయి. -
సైనాకు తొలి పరీక్ష
గ్వాంగ్జూ (చైనా): తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. రష్యాకు చెందిన ఓల్గా గొలొవనోవాతో జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచ 66వ ర్యాంకర్ ఓల్గా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 21-13, 21-14తో అలీసియా జైత్సావా (బెలారస్)ను ఓడించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా, ఓల్గా ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడనుంది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సింధు రెండో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ కవోరి ఇమబెపు (జపాన్)తో తలపడుతుంది. గత ఏడాది జపాన్ ఓపెన్‌లో ఇమబెపుతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు గెలిచింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పీటర్ కౌకల్ (చెక్ రిపబ్లిక్)తో కశ్యప్; పాబ్లో ఎబియన్ (స్పెయిన్)తో అజయ్ జయరామ్ పోటీపడతారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో కోనా తరుణ్-అరుణ్ విష్ణు జంట ప్రపంచ 15వ ర్యాంక్ జోడి మార్కిస్ కిడో-యూలియాంతో చంద్ర (ఇండోనేసియా)తో ఆడుతుంది.