Diamond league
-
నీరజ్ చోప్రాకు షాక్.. సెంటీమీటర్ తేడాతో టైటిల్ మిస్
డైమండ్ లీగ్-2024లో పారిస్ ఒలింపిక్స్ విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు మళ్లీ నిరాశే ఎదురైంది.బ్రెస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. సెంటీమీటర్ తేడాతో టైటిల్‌ను భారత బల్లెం వీరుడు కోల్పోయాడు. నీరజ్ తన మూడో ప్రయత్నంలో 87.86తో అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ తుది పోరులో పారిస్ బ్రాంజ్ మెడలిస్ట్, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ ఈటెను 87.87 విసిరి అగ్రస్ధానంలో నిలిచాడు. దీంతో పీటర్స్ ప్రతిష్టాత్మక డైమండ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన పీటర్స్ కంటే కేవలం 0.01 మీటర్లు మాత్రమే నీరజ్ వెనుకబడ్డాడు. కాగా గతేడాది కూడా డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ రెండో స్ధానంలో నిలిచి టైటిల్‌ను మిస్స్ అయ్యాడు. ఆ ఈవెంట్లో నీరజ్ చోప్రా తన ఈటెను 83.80 దూరం విసిరి రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లేజ్ 84.24 దూరం విసిరి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది లీగ్‌లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.97 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.చదవండి: ‘బాగానే ఉన్నా.. కానీ ఇప్పట్లో ఆడలేను’ -
బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా అర్హత.. నదీమ్ ఔట్
భారత బల్లెం వీరుడు, ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా బ్రస్సెల్ వేదికగా జరగబోయే డైమండ్ లీగ్ ఆర్హత సాధించాడు. నీరజ్ గాయం కారణంగా జ్యూరిచ్ డైమండ్ లీగ్‌కు దూరంగా ఉన్నప్పటకి.. 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్ లీగ్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.ఈ జాబితాలో గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 29 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా మోల్డోవాకు చెందిన ఆండ్రియన్ మర్దారే (13 పాయింట్లు), జపాన్‌కు త్రోయర్ రోడెరిక్ జెంకీ డీన్ (12 పాయింట్లు) టాప్-6లో చోటు దక్కించుకున్నారు. కాగా ఈ పోటీలు సెప్టెంబరు 13, 14 తేదీల్లో జరగనున్నాయి.నదీమ్ ఆనర్హత..అయితే ఈ పోటీలకు ప్యారిస్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత, పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఆర్హత సాధించలేకపోయాడు. కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సాధించి బ్రస్సెల్ డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయాడు. -
‘ఆరు’లో అదరగొట్టి...
సరిగ్గా రెండు వారాల క్రితం భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో మెరిశాడు. ఆరు ప్రయత్నాల్లో ఐదుసార్లు అతను ఫౌల్ అయినా ఒక్క మంచి త్రో అతనికి ‘పారిస్’లో రెండో స్థానాన్ని అందించింది. ఇప్పుడు వేదిక మారింది. సమరం ఒలింపిక్స్ నుంచి డైమండ్ లీగ్‌కు మారింది... కానీ అగ్రస్థానంలో నిలవాలనే ఒత్తిడి అతనిలో తగ్గినట్లు కనిపించలేదు... ఫలితంగా అదే తడబాటు. తొలి ఐదు ప్రయత్నాల్లో ఆశించిన దూరం జావెలిన్ వెళ్లలేదు... కానీ ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో నీరజ్ తన స్థాయిని ప్రదర్శించాడు. ఒక్క త్రోతో రెండో స్థానానికి దూసుకెళ్లి మీట్‌ను ముగించాడు. లుసాన్ (స్విట్జర్లాండ్): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లుసాన్ మీట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మీట్లో నీరజ్ జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన కాగా... మొత్తం కెరీర్ లో రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. రెండేళ్ల క్రితం స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో జావెలిన్‌ను నీరజ్ 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఈ ఈవెంట్లో 90.61 మీటర్ల దూరంతో ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) మొదటి స్థానంలో నిలవగా... జూలియన్ వెబర్ (జర్మనీ; 87.08 మీటర్లు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ ఈ మీట్లో పాల్గొనలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల దూరంతో నీరజ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న అతను ఒకదశలో డైమండ్ లీగ్ నుంచి తప్పుకోవాలని భావించినా... చివరకు బరిలోకి దిగాడు. ఇప్పుడు పక్షం రోజుల తేడాతో కాస్త మెరుగైన ప్రదర్శన అతడి నుంచి వచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాల్లో అతని త్రో ఒక్కటీ కనీసం 85 మీటర్లు కూడా వెళ్లలేదు. నీరజ్ వరుసగా 82.10 మీటర్లు... 83.21 మీటర్లు... 83.13 మీటర్లు... 82.34 మీటర్లు మాత్రమే జావెలిన్‌ను విసరగలిగాడు. వీటి తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే ఐదో ప్రయత్నం అతడిని మూడో స్థానానికి తీసుకెళ్లింది. ఇందులో జావెలిన్ 85.58 మీటర్లు వెళ్లింది.ఆఖరి ప్రయత్నంలో అండర్సన్ ఏకంగా 90.61 మీటర్లతో కొత్త మీట్ రికార్డు నెలకొల్పి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. అనంతరం నీరజ్ తన శక్తిని మొత్తం ఉపయోగించి విసిరిన ఆరో అస్త్రం ఎట్టకేలకు సానుకూల ఫలితాన్ని అందించింది. 89.49 మీటర్లతో అతనికి రెండో స్థానం దక్కింది. అయితే చాలా కాలంగా నీరజ్ ఆశిస్తున్న 90 మీటర్ల మైలురాయిని మాత్రం అతను మరోసారి అందుకోలేకపోయాడు! ఫైనల్‌కు అర్హత సాధించినట్లేనా! తాజా ఈవెంట్లో రెండో స్థానంలో నిలవడంతో నీరజ్‌కు 7 పాయింట్లు దక్కాయి. దోహా డైమండ్ లీగ్‌లో కూడా రెండో స్థానం సాధించడం ద్వారా వచి్చన 7 పాయింట్లు కలిపి ప్రస్తుతం నీరజ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ప్రస్తుతం వెబర్‌తో సమానంగా అతను మూడో స్థానంలో ఉన్నాడు. అండర్సన్ (21), జాకబ్ వలెచ్ (16) తొలి రెండు స్థానాలతో ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించారు. ఫైనల్‌కు మొత్తం ఆరుగురు అర్హత పొందుతారు. సెపె్టంబర్ 5న జ్యూరిచ్‌లో జరిగే చివరి మీట్లోనూ నీరజ్ పాల్గొనబోతున్నాడు. అక్కడా రాణిస్తే అతను ఫైనల్‌కు అర్హత సాధించడం లాంఛనమే కానుంది. బ్రసెల్స్‌లో సెప్టెంబర్ 14 నుంచి ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఈవెంట్ ఆరంభంలో కొంత నిరాశ కలిగింది. అయితే ఫలితం తర్వాత చూస్తే నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ముఖ్యంగా చివరి ప్రయత్నంలో నా కెరీర్లో రెండో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగాను. సరిగ్గా మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత నేను కోలుకోగలగడం, పోరాటస్ఫూర్తి కనబర్చడం ఆనందాన్నిచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాలు 80–83 మీటర్ల మధ్యే ఉన్నా ఆఖరి రెండు త్రోలలో నా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాను. ఈ స్థాయి పోటీల్లో మానసికంగా కూడా దృఢంగా ఉండి చివరి వరకు పోరాడటం ముఖ్యం. అండర్సన్ 90 మీటర్ల త్రో విసిరాక నాపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా దానిని దాటాలని అనుకున్నా. అయితే నా మిత్రుడైన కెన్యా ప్లేయర్ జూలియస్ యెగో నా వద్దకు వచ్చి తగిన సలహా ఇచ్చాడు. ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎక్కువ దూరం విసరగలవు అని చెబుతూ నా ఆందోళనను తగ్గించాడు. దాంతో ఒత్తిడి లేకుండా జావెలిన్‌ను విసరగలిగాను. –నీరజ్ చోప్రా -
నీరజ్‌పైనే దృష్టి
లుసాన్ (స్విట్జర్లాండ్): పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో ఈవెంట్‌కు సిద్ధమయ్యాడు. డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా నేడు లుసాన్ మీట్లో నీరజ్ బరిలోకి దిగుతున్నాడు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి గం. 12:10 నుంచి నీరజ్ ఈవెంట్ మొదలవుతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జావెలిన్ త్రోయర్లలో పాకిస్తాన్ అథ్లెట్, స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ మినహా మిగిలిన ఐదుగురు లుసాన్ మీట్లో ఉన్నారు. స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో నీరజ్ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. డైమండ్ లీగ్‌లో భాగంగా మొత్తం 14 మీట్లు జరుగుతాయి. అయితే జావెలిన్ త్రో మాత్రం నాలుగు మీట్లలోనే నిర్వహిస్తారు. ఇప్పటికే దోహా, పారిస్ అంచెలు ముగిశాయి. లుసాన్ మీట్ తర్వాత జ్యూరిచ్‌లో (సెపె్టంబర్ 5న) చివరిదైన నాలుగో అంచె జరుగుతుంది. అనంతరం ఈ నాలుగు మీట్లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టాప్–6లో నిలిచిన వారు సెప్టెంబర్ 14న బ్రస్సెల్స్‌లో జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈ సీజన్లో దోహా మీట్లో మాత్రం పాల్గొని రెండో స్థానంలో నిలిచిన నీరజ్ ప్రస్తుతం 7 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. లుసాన్ మీట్లో మొత్తం 10 మంది జావెలిన్ త్రోయర్లు బరిలో ఉన్నారు. మొత్తం ఆరు అవకాశాలు ఇస్తారు. తొలి మూడు ప్రయత్నాలు ముగిశాక చివరి రెండు స్థానాల్లో నిలిచిన వారు నిష్క్రమిస్తారు. మిగిలిన ఎనిమిది మంది ఆరు త్రోలను పూర్తి చేస్తారు. టాప్–8లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 8,7,6 పాయింట్లు లభిస్తాయి. అనంతరం 4,5,6,7,8 స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 5,4,3,2,1 పాయింట్లు కేటాయిస్తారు. డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌లో మాత్రమే పతకాలను అందజేస్తారు. ఈ సీజన్లో నీరజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పోటీపడ్డ ఐదు ఈవెంట్స్‌లోనూ కనీసం టాప్–2లో నిలిచాడు. గతంలో 2022లో డైమండ్ లీగ్ విజేతగా నిలిచిన 26 ఏళ్ల నీరజ్.. గత ఏడాది రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల గాయంతోనే ‘పారిస్’ క్రీడల్లో బరిలోకి దిగిన నీరజ్.. సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో రజతం చేజిక్కించుకున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన నీరజ్.. విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.విశ్వక్రీడలు ముగియగానే స్వదేశానికి కూడా తిరిగిరాని నీరజ్‌చోప్రా.. నేరుగా స్విట్జర్లాండ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ‘ఒలింపిక్స్ ముగియగానే... డైమండ్ లీగ్ సన్నాహాలు ప్రారంభించా. ఇందులో భాగంగానే స్విట్జర్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. గాయం గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. మరో నెల రోజులైతే సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తా’ అని నీరజ్ వెల్లడించాడు. -
డైమండ్ లీగ్ టోర్నీ.. నీరజ్‌కు రెండో స్ధానం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్,వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా తన జోరును కొనసాగిస్తున్నాడు. జ్యురిచ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో రెండో స్ధానంలో నీరజ్ చోప్రా చోప్రా నిలిచాడు. దీంతో వరుసగా మూడో డైమండ్ లీగ్ టైటిల్‌ను గెలుచుకోవాలన్న గోల్డన్ బాయ్ కల నేరవేరలేదు. నీరజ్ తన తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 80.70 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం రెండు, మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. అయితే నాలుగు ప్రయత్నంలో 85.22 మీటర్లు విసిరి రెండో స్థానంలోకి వచ్చాడు. కానీ చివరి ప్రయత్నంలో మరోసారి నిరాజ్ ఫౌల్ కావడంతో రెండో స్ధానానికే పరిమితం కావాల్సి వచ్చింది. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 88.86 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఇదే లీగ్‌లో లాంగ్‌జంప్‌లో భారత లాంగ్‌జంపర్ శ్రీశంకర్ 7.99 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు. కాగా అంతకుముందు నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చోప్రా గోల్డ్‌మెడల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Asia Cup 2023: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం -
మరో విజయంపై నీరజ్ దృష్టి
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): ఈ ఏడాది బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ అగ్రస్థానంలో నిలిచిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో విజయంపై దృష్టి సారించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో భాగంగా నేడు జ్యూరిక్‌లో జరిగే మీట్లో నీరజ్ పోటీపడనున్నాడు. ఈ సీజన్లో నీరజ్ రెండు డైమండ్ లీగ్ మీట్లలో (మే 5 దోహా; జూన్ 30 లుజానె) అగ్రస్థానంలో నిలిచాడు. అనంతరం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. నేడు అర్ధరాత్రి 12 తర్వాత మొదలయ్యే జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్‌తోపాటు జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా), వెబెర్ (జర్మనీ) తదితర స్టార్స్ పోటీపడనున్నారు . ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం బిడ్..! 2027 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని బుధవారం ఇక్కడి మీడియాతో నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభిస్తే భారత అథ్లెటిక్స్ సమాఖ్య చొరవ తీసుకుంటుంది. 2027 ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వహణ కోసం అక్టోబర్ 2లోపు బిడ్ దాఖలు చేయాలి. ఇప్పటికే 2027 ప్రపంచ చాంపియన్‌షిప్ ఆతిథ్యం కోసం బీజింగ్ తమ బిడ్ దాఖలు చేసింది. -
నీరజ్ చోప్రా మెరిసె.. వరుసగా రెండో డైమండ్ లీగ్‌లో అగ్రస్థానం
లుసాన్ (స్విట్జర్లాండ్): ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా తాను బరిలోకి దిగిన రెండో టోర్నీలోనూ అగ్రస్థానాన్ని సంపాదించాడు. లుసాన్‌లో జరిగిన సీజన్‌లోని ఆరో డైమండ్ లీగ్ మీట్లో 25 ఏళ్ల నీరజ్ టైటిల్ గెల్చుకున్నాడు. గాయం కారణంగా నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్న నీరజ్‌కు ఈ మీట్లో ఐదో ప్రయత్నం ప్రదర్శన మొదటి స్థానాన్ని ఖరారు చేసింది. ఐదో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరాడు. ‘ఫౌల్ త్రో’తో మొదలుపెట్టిన భారత స్టార్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.52 మీటర్లు... మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు విసిరాడు. అనంతరం నాలుగో ప్రయత్నం ‘ఫౌల్’కాగా, ఆరో ప్రయత్నంలో జావెలిన్ 84.15 మీటర్ల దూరం వెళ్లింది. జూలియన్ వెబెర్ (జర్మనీ; 87.03 మీటర్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 86.13 మీటర్లు) మూడో స్థానంలో నిలిచారు. డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా మొత్తం ఏడు మీట్లలో జావెలిన్ త్రో ఈవెంట్ ఉంది. ఏడు మీట్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు సెపె్టంబర్ 16, 17 తేదీల్లో అమెరికాలోని యుజీన్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. లుసాన్ మీట్లో టైటిల్ నెగ్గిన నీరజ్ ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈనెల 21న మొనాకోలో జరిగే డైమండ్ లీగ్ మీట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న నీరజ్ ఆగస్టులో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతాడు. లుసాన్ డైమండ్ లీగ్ మీట్లో లాంగ్‌జంప్ ఈవెంట్ లో పాల్గొన్న భారత అథ్లెట్ శ్రీశంకర్ 7.88 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు. -
Doha Diamond League 2023: మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తా: నీరజ్ చోప్రా
డైమండ్ లీగ్ తొలి రౌండ్లో విజేతగా నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌లోని రాబోయే రౌండ్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన నీరజ్ ఇదే తరహా నిలకడ కొనసాగిస్తానని అన్నాడు. ‘శుక్రవారం తొలి రౌండ్లో గెలుపు కోసం ఎంతో శ్రమించాను. అయితే ఫలితం ఆనందాన్నిచ్చింది. దీనిని శుభారంభంగా భావిస్తున్నా. గాలి వేగంలో మార్పు వల్ల పోటీ సవాల్‌గా మారింది. పైగా అత్యుత్తమ ఆటగాళ్లంతా బరిలో నిలిచారు. ఈ సీజన్ మొత్తం ఫిట్నెస్తో ఉండి నిలకడగా రాణించడం ముఖ్యం. తర్వాతి రౌండ్లోనూ అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తా. నాపై నమ్మకముంచి ఎంతో మంది భారత అభిమానులు ఇక్కడకు వచ్చారు. దానిని నిలబెట్టుకోగలిగినందుకు సంతోషం’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. -
Diamond League Final: ‘కోహినూర్’ నీరజ్
జ్యూరిచ్: అంతర్జాతీయ వేదికలపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్స్ స్వర్ణంతోనే తాను ఆగిపోనని చాటుతూ ఆపై ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం అందుకున్న అతను... ఇప్పుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో సత్తా చాటిన అతను 88.44 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రస్థానం అందుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ వాలెచ్ (86.94 మీటర్లు) రెండో స్థానంలో నిలవగా, జూలియన్ వెబర్ (ఇంగ్లండ్)కు మూడో స్థానం దక్కింది. విజేతగా నిలిచిన నీరజ్‌కు డైమండ్ ట్రోఫీతో పాటు 30 వేల డాలర్లు (సుమారు రూ. 24 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కింది. ఎదురు లేని ప్రదర్శన... గాయం కారణంగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు దూరమైన నీరజ్ గత నెల 26న లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ అంచెలో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఫలితంగా ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో పాటు 2023లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు కూడా క్వాలిఫై అయ్యాడు. గురువారం ఈవెంట్లో నీరజ్ తొలి ప్రయత్నం ‘ఫౌల్’ అయింది. అయితే రెండో ప్రయత్నంలో అతని జావెలిన్ 88.44 మీటర్లు దూసుకుపోయింది. తర్వాతి మరో నాలుగు ప్రయత్నాల్లోనూ (88 మీ., 86.11 మీ., 87 మీ., 83.60 మీ.) దీనికంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయినా... విజేతగా నిలిచేందుకు 88.44 మీటర్లు సరిపోయాయి. -
డైమండ్ లీగ్ అథ్లెటిక్స్.. శ్రీశంకర్‌కు ఆరో స్థానం
మొనాకో: భారత లాంగ్‌జంపర్, కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్‌కు ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ కలిసి రాలేదు. బర్మింగ్‌హామ్ మెగా ఈవెంట్ ముగియగానే తన తొలి డైమండ్ లీగ్‌లో పోటీ పడేందుకు మొనాకో వెళ్లిన అతనికి నిరాశే ఎదురైంది. అక్కడి వాతావరణం, గాలి వేగం అతని ప్రదర్శనకు ప్రతికూలంగా మారింది. 23 ఏళ్ల మురళీ తన ఐదు ప్రయత్నాల్లో మెరుగైన ప్రదర్శనగా 7.94 మీటర్ల దూరం దూకాడు. ఈ సీజన్లో 8.36 మీ. ప్రదర్శనతో పోలిస్తే ఇది పేలవమైన జంప్. కామన్వెల్త్ గేమ్స్‌లో అతను 8.08 మీ. జంప్ చేసి రజతం నెగ్గాడు. కానీ డైమండ్ లీగ్‌లో మాత్రం 8 మీటర్ల దూరమైన దూకలేకపోవడంతో ఆరో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ నిబంధనల ప్రకారం ఇక్కడ పోటీలో ఉన్నవారందరికీ ఆరు ప్రయత్నాలు ఉండవు. కేవలం టాప్–3 అథ్లెట్లకు మాత్రమే ఆరో జంప్‌కు అవకాశమిస్తారు. మిగతావారంతా ఐదు జంప్లకే పరిమితం అవుతారు. 23 ఏళ్ల శ్రీశంకర్ ఇప్పుడు రాబోయే మరో ఈవెంట్‌పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ నెల 30 నుంచి స్విట్జర్లాండ్‌లోని లూసానేలో వరల్డ్ అథ్లెటిక్స్ టూర్ పోటీల్లో అతను పోటీ పడతాడు. చదవండి: Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్ -
తొలి డైమండ్ లీగ్ పతకం లక్ష్యంగా...
ఈ సీజన్లో బరిలోకి దిగిన రెండు టోర్నమెంట్లలో వరుసగా రజత పతకం, స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్లోనూ పతకం గెలవాలనే లక్ష్యంతో ఉన్నాడు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో నేడు జరిగే డైమండ్ లీగ్ మీట్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ పోటీపడనున్నాడు. నాలుగేళ్ల తర్వాత డైమండ్ లీగ్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఓవరాల్‌గా ఏడుసార్లు ఈ ప్రతిష్టాత్మక మీట్లో పాల్గొన్న నీరజ్ చోప్రా 2018లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచాడు. చదవండి: ఖో ఖో లీగ్‌లో ఆరో జట్టుగా ముంబై -
29 ఏళ్ల రికార్డు బద్దలైంది
ఓస్లో (నార్వే): ప్రపంచ చాంపియన్... ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 29 ఏళ్ల ఘనమైన రికార్డుకు పాతరేశాడు. ఇక్కడ జరుగుతున్న డైమండ్ లీగ్ మీట్లో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన కార్స్టెన్ వార్హోమ్ (నార్వే) పోటీని అందరికంటే ముందు గా 46.70 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతని వేగానికి దాదాపు మూడు దశాబ్దాల పాటు చెక్కుచెదరని రికార్డు చెదిరిపోయింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ కెవిన్ యంగ్ (46.79 సె.) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. నార్వే అథ్లెట్ ఈ సారి తప్పకుండా ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలుస్తానని చెప్పాడు. వేగం పెరిగిన తన ప్రదర్శనతోఒలింపిక్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పాడు. గత రియో ఒలింపిక్స్ (2016)లో అతనికి నిరాశ ఎదురైంది. కెరీర్లో తొలిసారి పాల్గొన్న మెగా ఈవెంట్లో అతను పదో స్థానంలో నిలిచాడు. 25 ఏళ్ల కార్స్టెన్ 2017 నుంచి ట్రాక్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆ ఏడా ది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచాడు. పోలండ్ ఆతిథ్యమిచ్చిన యూరోపియన్ అండర్– 23 చాంపియన్‌షిప్‌లో 400 మీ.హర్డిల్స్‌తో పాటు 400 మీ. పరుగులో సత్తాచాటుకున్నాడు. హర్డిల్స్ లో స్వర్ణం సాధించిన కార్స్టెన్, పరుగులో రజతం నెగ్గాడు. మళ్లీ దోహా (2019) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హర్డిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. -
‘డైమండ్’ బోల్ట్
జ్యూరిచ్: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఇటీవల మాస్కోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన బోల్ట్ అదే జోరును డైమండ్ లీగ్ మీట్లోనూ కొనసాగించాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 100 మీటర్ల రేసులో బోల్ట్ విజేతగా నిలిచాడు. అతను ఈ రేసును 9.90 సెకన్లలో పూర్తి చేశాడు. నికెల్ (జమైకా,9.94 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (అమెరికా, 9.96 సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. వచ్చే నెల 6న బ్రస్సెల్స్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో బోల్ట్ పోటీపడే అవకాశముంది. ‘పూర్తి ఫిట్‌గా లేకపోయినా పరిగెత్తాను. సీజన్ కొనసాగుతున్నకొద్దీ నేను అలసిపోతాను. ఎలాంటి గాయాలు లేకుండా సీజన్‌ను ముగించాలని భావిస్తున్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు.