
ఈ సీజన్‌లో బరిలోకి దిగిన రెండు టోర్నమెంట్‌లలో వరుసగా రజత పతకం, స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్‌లోనూ పతకం గెలవాలనే లక్ష్యంతో ఉన్నాడు.
స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో నేడు జరిగే డైమండ్ లీగ్ మీట్‌లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ పోటీపడనున్నాడు. నాలుగేళ్ల తర్వాత డైమండ్ లీగ్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఓవరాల్‌గా ఏడుసార్లు ఈ ప్రతిష్టాత్మక మీట్‌లో పాల్గొన్న నీరజ్ చోప్రా 2018లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచాడు.
చదవండి: ఖో ఖో లీగ్‌లో ఆరో జట్టుగా ముంబై