sweedon
-
తొలి డైమండ్ లీగ్ పతకం లక్ష్యంగా...
ఈ సీజన్లో బరిలోకి దిగిన రెండు టోర్నమెంట్లలో వరుసగా రజత పతకం, స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్లోనూ పతకం గెలవాలనే లక్ష్యంతో ఉన్నాడు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో నేడు జరిగే డైమండ్ లీగ్ మీట్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ పోటీపడనున్నాడు. నాలుగేళ్ల తర్వాత డైమండ్ లీగ్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఓవరాల్‌గా ఏడుసార్లు ఈ ప్రతిష్టాత్మక మీట్లో పాల్గొన్న నీరజ్ చోప్రా 2018లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచాడు. చదవండి: ఖో ఖో లీగ్‌లో ఆరో జట్టుగా ముంబై -
వయసు 16, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్
స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ (16 )ఇపుడు ప్రపంచ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. గ్లోబల్ వార్మింగ్‌పై ఆమె చేస్తున్న కృషికిగాను నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. దీంతో వేలాదిమంది యువతకు ప్రేరణగా, గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు. మార్చి 15వ తేదీన 105 నగరాల్లో 1,659 పట్టణాలు, నగరాల్లో లక్షలాది మంది విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలకు దిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. గ్లోబ్ వార్మింగ్‌ను పట్టించుకోకపోతే ప్రపంచ యుద్ధాలకు దారి తీస్తుంది. వలసలకు, సంక్షోభాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యకపోతే ముప్పు తప్పదన్న ఉద్దేశంతో గ్రెటా తంబర్గ్ చేసిన అలుపెరుగని పోరాటాన్ని మేం గుర్తించాం. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యువకులకు స్పూర్తినిస్తూ థన్‌బర్గ్ చేపట్టిన ప్రపంచ ఉద్యమం తమ్మల్ని ఆకట్టుకుంది.. అందుకే నోబుల్ పీస్ అవార్డుకి నామినేట్ చేశామని స్వీడన్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రికార్డ్ ఉష్ణోగ్రతలతో స్వీడన్ ఉడికిపోతున్న సమయంలో గ్రెటా థంబర్గ్ చేపట్టిన ఉద్యమం దేశం మొత్తాన్నీ కదిలించింది. ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరుతో ఇచ్చిన పిలుపు లక్షలాది మంది తోటి పిల్లలతో పాటు పాలకులను కదిలించింది. మరోవైపు గ్రెటా ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు మార్చి15న ప్రపంచవ్యాప్తంగా నిరసనల ర్యాలీల హోరెత్తింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా, లండన్, న్యూయార్క్, ఇటలీ, స్విట్జర్లాండ్, బెల్జియం, బెర్జిన్ నగరాల్లో భారీ ప్రదర్శను నిర్వహించారు. స్టాక్‌హోం లోభారీ వర్షం నడుమ ర్యాలీ కొనసాగడం గమనార్హం అంతేకాదు ఆమె తొమ్మిది సంవత్సరాల వయస్సులో మూడవ తరగతిలో ఉండగానే వాతావరణ మార్పుపై పరిశోధనలు చేయడం ప్రారంభించింది. గత ఏడు సంవత్సరాలుగా దీన్నే కొనసాగిస్తోంది. ఆమె తల్లి ప్రముఖ ఒపెరా గాయకురాలు మలేనా ఎర్నన్, తండ్రి నటుడు వాంటే థన్‌బర్గ్,. గ్రెటా, చిన్న సోదరి బీటా ఆటిజంలతో బాధపడుతున్నట్లు ఎర్నమెన్ ఒక పుస్తకంలో పేర్కొన్నారు. ఈ దంపతులిద్దరూ తమ కుమార్తె ఉద్యమానికి పూర్తి మద్దతును అందించడం విశేషం. కాగా 2018 సెప్టెంబరులో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల తరువాత, 15 ఏళ్లయినా లేని స్వీడన్ స్కూల్‌గర్ల్ గ్రెటా థన్‌బర్గ్ వాతావరణ మార్పుపై ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేస్తూ మూడు వారాలపాటు పాఠశాల సమయం ముగిసిన తరువాత ప్రతిరోజూ స్వీడిష్ పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేసింది. 2018 లో పార్క్‌లాండ్ షూటింగ్ ప్రతిస్పందనగా అక్కడి గన్ చట్టాలు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో క్లైమేట్ చేంజ్‌పై ఐరాస నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ‘‘ మీరు పిల్లలు లాగా ప్రవర్తిస్తున్నారు, మేమేమీ ప్రపంచనేతల్ని బతిమలాడడానికి రాలేదు. ఇన్నేళ్లూ మమ్మల్నివిస్మరించారు. మీరు నిద్రపోయారు. ఇకపై ప్రజలే పూనుకుంటారంటూ రెండువందల మంది ప్రపంచ నేతలపై ఈ బాలిక నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. 25.000 students flooded the streets of #Berlin today to demand #climatejustice! You‘re unstoppable, @FFF_Berlin! ✊💚 #FridaysForFuture #SchoolsStrike4Climate @FridayForFuture @Luisamneubauer @linus_steinmetz @GretaThunberg pic.twitter.com/UtFhWk3fqa — Lisa Göldner (@lisagoeldner) March 15, 2019 -
ఏపీలో విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వీడన్‌లోని బ్లికింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బీటీహెచ్)తో దశాబ్దకాలం సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించడం శుభ పరిణామమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ సెనేట్ మందిరంలో నిర్వహించిన దశాబ్ది అనుబంధ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఉపకులపతిగా ఉన్న సమయంలో ఈ ఎంఓయూకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యకు దశాబ్ధం క్రితమే ఏయూ నాంది పలికిందన్నారు. త్వరలో విదేశీ విద్యా సంస్థలు రాష్ట్రంలో తమ శాఖలను స్థాపించే అవకాశం ఉందన్నారు. తద్వారా విద్యార్థులు స్థానికంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నాణ్యమైన ఉన్నవిద్యను అందించే క్రమంలో ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేస్తామన్నారు. భవిష్యత్తులో సైతం సంయుక్త పరిశోధనలు, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని సూచించారు. బీటీహెచ్ స్వీడన్, వైస్‌చాన్సలర్ ఏండర్స్ హిడిస్టిర్న మాట్లాడుతూ ఇంజినీరింగ్ నైపుణ్యాలను వద్ధిచేసి, స్వీయ సంపత్తి సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆవిష్కరణల ప్రాతిపదికగా సమాజం అభివద్ధి చెందుతోందన్నారు. రానున్న దశాబ్ధ కాలంలో మరిన్ని నూతన కోర్సులు, కార్యక్రమాల నిర్వహణ దిశగా నడుస్తామన్నారు. ఇంజినీరింగ్ నిపుణులను తీర్చిదిద్ది మానవ వనరుల కొరతను తీర్చనున్నట్లు తెలిపారు. బీటీహెచ ఇండియా ఇనీషియేటివ్స్ డైరెక్టర్ గురుదత్ వేల్పుల మాట్లాడుతూ డబుల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య బి.మోహన వెంకట రామ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆచార్య వేణుగోపాల రెడ్డి, ఆండ్రస్‌లను ఏయూ వీసీ నాగేశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య పి.విజయప్రకాష్, ప్రిన్సిపాల్స్ ఆచార్య సి.వి రామన్, కె.గీయత్రీ దేవి, డి.గౌరీ శంకర్, సి.హెచ్ రత్నం, ఇంజనీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.