స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ (16 )ఇపుడు ప్రపంచ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. గ్లోబల్ వార్మింగ్‌పై ఆమె చేస్తున్న కృషికిగాను నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. దీంతో వేలాదిమంది యువతకు ప్రేరణగా, గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు. మార్చి 15వ తేదీన 105 నగరాల్లో 1,659 పట్టణాలు, నగరాల్లో లక్షలాది మంది విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలకు దిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
గ్లోబ్ వార్మింగ్‌ను పట్టించుకోకపోతే ప్రపంచ యుద్ధాలకు దారి తీస్తుంది. వలసలకు, సంక్షోభాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యకపోతే ముప్పు తప్పదన్న ఉద్దేశంతో గ్రెటా తంబర్గ్ చేసిన అలుపెరుగని పోరాటాన్ని మేం గుర్తించాం. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యువకులకు స్పూర్తినిస్తూ థన్‌బర్గ్ చేపట్టిన ప్రపంచ ఉద్యమం తమ్మల్ని ఆకట్టుకుంది.. అందుకే నోబుల్ పీస్ అవార్డుకి నామినేట్ చేశామని స్వీడన్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రికార్డ్ ఉష్ణోగ్రతలతో స్వీడన్ ఉడికిపోతున్న సమయంలో గ్రెటా థంబర్గ్ చేపట్టిన ఉద్యమం దేశం మొత్తాన్నీ కదిలించింది. ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరుతో ఇచ్చిన పిలుపు లక్షలాది మంది తోటి పిల్లలతో పాటు పాలకులను కదిలించింది. మరోవైపు గ్రెటా ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు మార్చి15న ప్రపంచవ్యాప్తంగా నిరసనల ర్యాలీల హోరెత్తింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా, లండన్, న్యూయార్క్, ఇటలీ, స్విట్జర్లాండ్, బెల్జియం, బెర్జిన్ నగరాల్లో భారీ ప్రదర్శను నిర్వహించారు. స్టాక్‌హోం లోభారీ వర్షం నడుమ ర్యాలీ కొనసాగడం గమనార్హం
అంతేకాదు ఆమె తొమ్మిది సంవత్సరాల వయస్సులో మూడవ తరగతిలో ఉండగానే వాతావరణ మార్పుపై పరిశోధనలు చేయడం ప్రారంభించింది. గత ఏడు సంవత్సరాలుగా దీన్నే కొనసాగిస్తోంది. ఆమె తల్లి ప్రముఖ ఒపెరా గాయకురాలు మలేనా ఎర్నన్, తండ్రి నటుడు వాంటే థన్‌బర్గ్,. గ్రెటా, చిన్న సోదరి బీటా ఆటిజంలతో బాధపడుతున్నట్లు ఎర్నమెన్ ఒక పుస్తకంలో పేర్కొన్నారు. ఈ దంపతులిద్దరూ తమ కుమార్తె ఉద్యమానికి పూర్తి మద్దతును అందించడం విశేషం.
కాగా 2018 సెప్టెంబరులో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల తరువాత, 15 ఏళ్లయినా లేని స్వీడన్ స్కూల్‌గర్ల్ గ్రెటా థన్‌బర్గ్ వాతావరణ మార్పుపై ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేస్తూ మూడు వారాలపాటు పాఠశాల సమయం ముగిసిన తరువాత ప్రతిరోజూ స్వీడిష్ పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేసింది. 2018 లో పార్క్‌లాండ్ షూటింగ్ ప్రతిస్పందనగా అక్కడి గన్ చట్టాలు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో క్లైమేట్ చేంజ్‌పై ఐరాస నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ‘‘ మీరు పిల్లలు లాగా ప్రవర్తిస్తున్నారు, మేమేమీ ప్రపంచనేతల్ని బతిమలాడడానికి రాలేదు. ఇన్నేళ్లూ మమ్మల్నివిస్మరించారు. మీరు నిద్రపోయారు. ఇకపై ప్రజలే పూనుకుంటారంటూ రెండువందల మంది ప్రపంచ నేతలపై ఈ బాలిక నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
25.000 students flooded the streets of #Berlin today to demand #climatejustice! You‘re unstoppable, @FFF_Berlin! ✊💚 #FridaysForFuture #SchoolsStrike4Climate @FridayForFuture @Luisamneubauer @linus_steinmetz @GretaThunberg pic.twitter.com/UtFhWk3fqa
— Lisa Göldner (@lisagoeldner) March 15, 2019
Comments
Please login to add a commentAdd a comment