Nobel peace prize nominations
-
నోబెల్ శాంతి బహుమతికి ఉక్రెయిన్ అధ్యక్షుడు!
రష్యా డిమాండ్‌కు తలొగ్గకుండా ఉన్న సైన్యం, సాధారణ పౌరులు, బయటి దేశాల నుంచి అందుతున్న అరకోర సాయంతో పోరాడుతున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఆయన ఉద్దేశం ఏదైనా, విమర్శలు ఉన్నా.. త్వరగా దేశాన్ని రష్యా గప్పిట్లోకి వెళ్లనీయకుండా చేస్తున్న తీరుపై అభినందనలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ అరుదైన ఘనత దక్కాలని కోరుకుంటున్నారు కొందరు. యూరోపియన్ రాజకీయవేత్తలు కొందరు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నారు. ఈ మేరకు నార్వేకు చెందిన నోబెల్ శాంతి కమిటీకి విజ్ఞప్తులు పంపిస్తున్నారు. అధికారంలో ఉన్న నేతలతో పాటు మాజీలు కొందరు ఈ రిక్వెస్ట్ చేసిన వాళ్లలో ఉన్నారు. శాంతి బహుమతి కమిటీకి మేం వినమ్రంగా మా విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోమని కోరుతున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు ఉక్రెయిన్ ప్రజలనూ శాంతి బహుమతికి మేం నామినేట్ చేస్తున్నాం. ఈ కారణం వల్లనే నామినేషన్ల స్వీకరణను తిరిగి తెరవాలని, మార్చి 31వ తేదీ వరకు స్వీకరణ తేదీని పొడిగించాలని కోరుతున్నాం అని ఆ ప్రకటనలో ఉంది. మార్చి 11వ తేదీనే ఈ ప్రకటనను రిలీజ్ చేశారు ఐరోపా దేశాల నేతలు. ఇదిలా ఉండగా.. కమిటీ నుంచి ఈ ప్రకటనపై స్పందన రాలేదు. నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన ప్రకటన.. అక్టోబర్ 3-10 తేదీల మధ్య జరగనుంది. 2022 నోబెల్ శాంతి బహుమతి కోసం 92 సంస్థలు, 251 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారు. చదవండి: జెలెన్ స్కీ ఆవేదనలో అర్థం ఉందా? -
వయసు 16, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్
స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ (16 )ఇపుడు ప్రపంచ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. గ్లోబల్ వార్మింగ్‌పై ఆమె చేస్తున్న కృషికిగాను నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. దీంతో వేలాదిమంది యువతకు ప్రేరణగా, గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు. మార్చి 15వ తేదీన 105 నగరాల్లో 1,659 పట్టణాలు, నగరాల్లో లక్షలాది మంది విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలకు దిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. గ్లోబ్ వార్మింగ్‌ను పట్టించుకోకపోతే ప్రపంచ యుద్ధాలకు దారి తీస్తుంది. వలసలకు, సంక్షోభాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యకపోతే ముప్పు తప్పదన్న ఉద్దేశంతో గ్రెటా తంబర్గ్ చేసిన అలుపెరుగని పోరాటాన్ని మేం గుర్తించాం. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యువకులకు స్పూర్తినిస్తూ థన్‌బర్గ్ చేపట్టిన ప్రపంచ ఉద్యమం తమ్మల్ని ఆకట్టుకుంది.. అందుకే నోబుల్ పీస్ అవార్డుకి నామినేట్ చేశామని స్వీడన్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రికార్డ్ ఉష్ణోగ్రతలతో స్వీడన్ ఉడికిపోతున్న సమయంలో గ్రెటా థంబర్గ్ చేపట్టిన ఉద్యమం దేశం మొత్తాన్నీ కదిలించింది. ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరుతో ఇచ్చిన పిలుపు లక్షలాది మంది తోటి పిల్లలతో పాటు పాలకులను కదిలించింది. మరోవైపు గ్రెటా ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు మార్చి15న ప్రపంచవ్యాప్తంగా నిరసనల ర్యాలీల హోరెత్తింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా, లండన్, న్యూయార్క్, ఇటలీ, స్విట్జర్లాండ్, బెల్జియం, బెర్జిన్ నగరాల్లో భారీ ప్రదర్శను నిర్వహించారు. స్టాక్‌హోం లోభారీ వర్షం నడుమ ర్యాలీ కొనసాగడం గమనార్హం అంతేకాదు ఆమె తొమ్మిది సంవత్సరాల వయస్సులో మూడవ తరగతిలో ఉండగానే వాతావరణ మార్పుపై పరిశోధనలు చేయడం ప్రారంభించింది. గత ఏడు సంవత్సరాలుగా దీన్నే కొనసాగిస్తోంది. ఆమె తల్లి ప్రముఖ ఒపెరా గాయకురాలు మలేనా ఎర్నన్, తండ్రి నటుడు వాంటే థన్‌బర్గ్,. గ్రెటా, చిన్న సోదరి బీటా ఆటిజంలతో బాధపడుతున్నట్లు ఎర్నమెన్ ఒక పుస్తకంలో పేర్కొన్నారు. ఈ దంపతులిద్దరూ తమ కుమార్తె ఉద్యమానికి పూర్తి మద్దతును అందించడం విశేషం. కాగా 2018 సెప్టెంబరులో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల తరువాత, 15 ఏళ్లయినా లేని స్వీడన్ స్కూల్‌గర్ల్ గ్రెటా థన్‌బర్గ్ వాతావరణ మార్పుపై ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేస్తూ మూడు వారాలపాటు పాఠశాల సమయం ముగిసిన తరువాత ప్రతిరోజూ స్వీడిష్ పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేసింది. 2018 లో పార్క్‌లాండ్ షూటింగ్ ప్రతిస్పందనగా అక్కడి గన్ చట్టాలు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో క్లైమేట్ చేంజ్‌పై ఐరాస నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ‘‘ మీరు పిల్లలు లాగా ప్రవర్తిస్తున్నారు, మేమేమీ ప్రపంచనేతల్ని బతిమలాడడానికి రాలేదు. ఇన్నేళ్లూ మమ్మల్నివిస్మరించారు. మీరు నిద్రపోయారు. ఇకపై ప్రజలే పూనుకుంటారంటూ రెండువందల మంది ప్రపంచ నేతలపై ఈ బాలిక నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. 25.000 students flooded the streets of #Berlin today to demand #climatejustice! You‘re unstoppable, @FFF_Berlin! ✊💚 #FridaysForFuture #SchoolsStrike4Climate @FridayForFuture @Luisamneubauer @linus_steinmetz @GretaThunberg pic.twitter.com/UtFhWk3fqa — Lisa Göldner (@lisagoeldner) March 15, 2019 -
ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి..??
వాషింగ్టన్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను వరించనుందా?. ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడంలో ట్రంప్ దౌత్యానికి ఆయన్ను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి బుధవారం నామినేట్ చేశారు. శాంతి బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ కావడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ తెరపైకి లేచింది. గత శనివారం మిచిగాన్‌లో ఓ ర్యాలీకి హాజరైన ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన అభిమానులు నోబెల్..!! నోబెల్..!! అంటూ నినాదాలు చేశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్(నవ్వుతూ) ‘ నా కర్తవ్యం నేను నిర్వహించాను’ అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను మంగళవారం ట్రంప్ సమర్థించారు. ఉత్తరకొరియాతో నేను శాంతినే కోరుకున్నానని అన్నారు. కాగా, అణ్వాయుధాగారాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ శాంతి గ్రామం పాన్ మున్ జోమ్లో దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్తో చరిత్రాత్మక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ అమెరికా అధ్యక్షులుగా పని చేసిన నలుగురికి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి. వీరిలో థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, జిమ్మి కార్టర్, బరాక్ ఒబామాలను శాంతికాముకులుగా గుర్తించి అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. -
నోబెల్ 'శాంతి' రేసులో ట్రంప్
టాల్లిన్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం రికార్డు స్థాయిలో 376 నామినేషన్లు అందాయని నార్వే నోబెల్ కమిటీ వెల్లడించింది. అందులో 228 మంది వ్యక్తులు కాగా, 148 మంది సంస్థలు ఉన్నాయని మంగళవారం తెలిపింది. ఇంతకుముందు 2014లో 278 నామినేషన్లు వచ్చాయి. ఈసారి కొత్త రికార్డు నమోదైంది. విజేతను ఎంపిక చేసే ప్రక్రియను నోబెల్ కమిటీ త్వరలో ప్రారంభించనుంది. వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, గతంలో శాంతి బహుమతి అందుకున్న వాళ్లు, ఇతరులు ఈ నామినేషన్లు పంపిస్తారు. బహుమతి రేసులో ఉండే అభ్యర్థుల వివరాలను నోబెల్ కమిటీ 50 ఏళ్ల వరకూ రహస్యంగా ఉంచుతుంది. అయితే.. కొన్నిసార్లు అభ్యర్థుల తరఫున నామినేషన్లు పంపిన వారు తాము ఎవరిని సూచించామన్న విషయాన్ని ప్రజలకు వెల్లడిస్తుంటారు. ఈ ఏడాది శాంతి బహుమతి రేసులో ఉన్న వారిలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, ఐసిస్ చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కల్, పోప్ ఫ్రాన్సిస్, అమెరికా నటి, హక్కుల కార్యకర్త సుసాన్ సరాండన్, కొలంబియా శాంతి చర్చల సంప్రదింపుల బృందం, అఫ్ఘానిస్తాన్ మహిళా సైక్లింగ్ టీమ్‌ల పేర్లు బహిర్గతమయ్యాయి.