డైమండ్ లీగ్-2024లో పారిస్ ఒలింపిక్స్ విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు మళ్లీ నిరాశే ఎదురైంది.బ్రెస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. సెంటీమీటర్ తేడాతో టైటిల్‌ను భారత బల్లెం వీరుడు కోల్పోయాడు. నీరజ్ తన మూడో ప్రయత్నంలో 87.86తో అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు.
శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ తుది పోరులో పారిస్ బ్రాంజ్ మెడలిస్ట్, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ ఈటెను 87.87 విసిరి అగ్రస్ధానంలో నిలిచాడు. దీంతో పీటర్స్ ప్రతిష్టాత్మక డైమండ్ ట్రోఫీని గెలుచుకున్నాడు.
విజేతగా నిలిచిన పీటర్స్ కంటే కేవలం 0.01 మీటర్లు మాత్రమే నీరజ్ వెనుకబడ్డాడు. కాగా గతేడాది కూడా డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ రెండో స్ధానంలో నిలిచి టైటిల్‌ను మిస్స్ అయ్యాడు. ఆ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా తన ఈటెను 83.80 దూరం విసిరి రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాడ్లేజ్ 84.24 దూరం విసిరి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది లీగ్‌లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.97 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.
చదవండి: ‘బాగానే ఉన్నా.. కానీ ఇప్పట్లో ఆడలేను’
Comments
Please login to add a commentAdd a comment