భారత బల్లెం వీరుడు, ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా బ్రస్సెల్ వేదికగా జరగబోయే డైమండ్ లీగ్ ఆర్హత సాధించాడు. నీరజ్ గాయం కారణంగా జ్యూరిచ్ డైమండ్ లీగ్‌కు దూరంగా ఉన్నప్పటకి.. 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్ లీగ్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.
ఈ జాబితాలో గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 29 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా మోల్డోవాకు చెందిన ఆండ్రియన్ మర్దారే (13 పాయింట్లు), జపాన్‌కు త్రోయర్ రోడెరిక్ జెంకీ డీన్ (12 పాయింట్లు) టాప్-6లో చోటు దక్కించుకున్నారు. కాగా ఈ పోటీలు సెప్టెంబరు 13, 14 తేదీల్లో జరగనున్నాయి.
నదీమ్ ఆనర్హత..
అయితే ఈ పోటీలకు ప్యారిస్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత, పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఆర్హత సాధించలేకపోయాడు. కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సాధించి బ్రస్సెల్ డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment