భారత స్టార్ జావెలిన్ త్రోయర్,వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా తన జోరును కొనసాగిస్తున్నాడు. జ్యురిచ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో రెండో స్ధానంలో నీరజ్ చోప్రా చోప్రా నిలిచాడు. దీంతో వరుసగా మూడో డైమండ్ లీగ్ టైటిల్‌ను గెలుచుకోవాలన్న గోల్డన్ బాయ్ కల నేరవేరలేదు. నీరజ్ తన తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 80.70 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం రెండు, మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు.
అయితే నాలుగు ప్రయత్నంలో 85.22 మీటర్లు విసిరి రెండో స్థానంలోకి వచ్చాడు. కానీ చివరి ప్రయత్నంలో మరోసారి నిరాజ్ ఫౌల్ కావడంతో రెండో స్ధానానికే పరిమితం కావాల్సి వచ్చింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 88.86 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇక ఇదే లీగ్‌లో లాంగ్‌జంప్‌లో భారత లాంగ్‌జంపర్ శ్రీశంకర్ 7.99 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు. కాగా అంతకుముందు నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చోప్రా గోల్డ్‌మెడల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: Asia Cup 2023: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment