
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు. ఆమె నెట్టింట ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. వైరల్ కావాల్సిందే. తాజాగా ఈ హాట్ బ్యూటీ చీరకట్టులో భర్తతో కలసి బాస్కెట్ బాల్ ఆడింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎరుపు రంగు చీరలో భర్త డేనియల్ వెబర్‌తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతూ సందడి చేసింది.
ఈ వీడియోని ఆమే స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. కుచ్ కుచ్ హోతా హై చిత్రంలోని యే లడ్కీ హై దివానా సాంగ్‌ను జతచేసింది. ఆ మధ్య ‘ఓ మై ఘోస్ట్’ కోసం సన్నీ వేసిన లుంగీ స్టెప్పులు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సన్నీ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’ మూవీతో పాటు.. ‘వీరమాదేవి’, ‘రంగీలా’, ‘షెరో’, ‘కోకకోలా’, ‘హెలెన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.