విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. పెంపుడు జంతువుల్లో బాగా పాపులర్ అయింది కూడా కుక్క. ఇంటి యజమాని, కుటుంబం ఏదైనా అనుకోని ప్రమాదంలో పడినపుడు చాకచక్యంగా వ్యవహరించి కాపాడుతుంది. ఒక్కోసారి ప్రాణాలకు తెగించి మరీ విశ్వాసాన్ని చాటుకుని హ్యాట్సాఫ్ అనిపించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే పగబట్టి, వెంటాడి వేటాడిన ఘటనలు చాలా అరుదు కదా. ఇలాంటి ఘటన ఒకటి అట్లాంటాలో చోటు చేసుకుంది.
వివరాలను పరిశీలిస్తే..తన యజమాని కుటుంబానికి చెందిన గొర్రెలు, మేకల మందకు కాపలాగా ఉంది ఒక కుక్క. దాని పేరు కాస్పర్. ఒకరోజు గొర్రెలమందపై ఒక్కసారిగా 13 తోడేళ్ల గుంపు (కొయెట్, అమెరికన్ జాకల్) దాడి చేసింది దీంతో అక్కడే ఉన్న కుక్క వాటిపై ఎటాక్ చేసింది. ఎనిమిదింటిని అక్కడికక్కడే చంపేసింది.
Atlanta Dog fights 13 coyotes attacking his sheep.
Kills 8 on the spot.
Goes missing 4 days.
Comes home after killing the remaining 5.
Salute 🫡 pic.twitter.com/OYDKhuzscW— trader (@TicTocTick) June 25, 2024
ఇంతటితో దాని కోపం చల్లారలేదు. నాలుగు రోజులు అదృశ్యమై, వాటిని వెదికి పట్టుకొని మరీ వేటాడి, మిగిలిన ఐదు తోడేళ్ల పని కూడా పట్టింది. ఆ తర్వాత మాత్రమే ఇంటికి చేరింది.
తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన దాన్ని చూసి, ఇక బతకదని భావించారట దాని యజమాని వీర్‌విల్లే. ఆ తరువాత కొంతకాలం లైఫ్‌లైన్ యానిమల్ ప్రాజెక్ట్ సంరక్షణలో కోలుకుంది హీరో కాస్పర్. గత ఏడాది చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టా,, ఎక్స్‌లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment