
గాంధీ నగర్ : గుజరాత్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందితో వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్‌లోని పంచమహల్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనం నుంచి ముగ్గురిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన పిల్లలంతా ఏడు నుంచి పదహారేళ్ల మధ్య వయసువారే.
Comments
Please login to add a commentAdd a comment