మైలారం గుహల్లో స్పీకర్ | Milaram cave visited telengana speaker | Sakshi
Sakshi News home page

మైలారం గుహల్లో స్పీకర్

Published Sun, Mar 29 2015 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

మైలారం గుహల్లో స్పీకర్

మైలారం గుహల్లో స్పీకర్

గణపురం:  వరంగల్ జిల్లా గణపురం మండలంలోని మైలారం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనున్న గుట్టపైన ఉన్న పురాతన గుహలను రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధు సూదనాచారి శనివారం సందర్శించారు. గుహల గుట్ట వద్దకు దారి లేనందున స్పీకర్ వాహనం వెళ్లలేకపోయింది. దీంతో ఆయన పోలీసు వాహనంలో కొంత దూరం వెళ్లి, అనంతరం కాలినడకన గుహలను చేరుకున్నారు. స్పీకర్  గుహల్లో కొంత దూరం నడిచి వెళ్లారు.

చీకటిగా ఉండడం మూలంగా లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు. కాకతీయగడ్డ మీద ప్రతి చెట్టుకు, ప్రతిగడ్డకు,ప్రతి బిడ్డకు చరిత్ర ఉంటుందని స్పీకర్ ఈ సందర్భంగా అన్నారు. పురావస్తు శాఖ అధికారులు, ప్రభుత్వాలు ఈ గుహలపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement