Ancient cave
-
Mexico: కూలిన పిరమిడ్.. వినాశానికి సంకేతమా?
మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతన తెగకు చెందిన ఒక పిరమిడ్ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెనువిపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండటాన్ని ఈ ఫొటోలలో చూడవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన పురేపెచా తెగ వారు తమ దేవతకు మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుట్జోలో ఉన్నాయి.ఇప్పడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికుడు తరియాక్విరి అల్వారెజ్ మీడియా ముందు పేర్కొన్నారు. ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదువార్త. ఇది విపత్కర సంఘటనను సూచిస్తోందని ఆయన అన్నారు. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపెచా తెగలు అజ్టెక్లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి.మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐఎన్ఏహెచ్) ఒక ప్రకటనలో.. ఇహుట్జోలో ఒక పిరమిడ్ కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పిరమిడ్ బయటి గోడ, లోపలి భాగం దెబ్బతిన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మతు చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది. -
ఈ విషయం తెలుసా? ఈ సాలీడు కుడితే.. ఇక అంతే!
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజు గూడు అల్లుకునే మామూలు సాలెపురుగే అనుకుంటే పొరపాటే! ఇది కుట్టిందంటే, ఇక అంతే సంగతులు! ‘సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్’ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లల్లోకి కూడా చేరుతుంటాయి.ఈ సాలెపురుగు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదొక అరుదైన విశేషం.ఒళ్లంతా ముళ్లున్న స్టార్ఫిష్..సముద్రంలో స్టార్ఫిష్లు అరుదుగా కనిపిస్తాయి. స్టార్ఫిష్లలో మరీ అరుదైనది ఈ ముళ్ల స్టార్ఫిష్. ఇది సముద్రం లోలోతుల్లో ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల దీనిని ‘క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్ఫిష్’ అని అంటారు.ఈ ముళ్ల స్టార్ఫిష్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు, గోధుమ రంగు, బూడిద రంగుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతుకుతాయి. పర్యావరణ మార్పుల వల్ల పగడపు దిబ్బలు రంగు వెలిసిపోతుండటం, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో ఈ ముళ్ల స్టార్ఫిష్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగడపు దిబ్బలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే, ఈ ముళ్ల స్టార్ఫిష్ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.అత్యంత పురాతన గుహాచిత్రాలు..ప్రపంచంలో పురాతన మానవులు సంచరించిన ప్రదేశాల్లో పలుచోట్ల ఆనాటి మానవులు చిత్రించిన గుహాచిత్రాలు బయటపడ్డాయి. సహస్రాబ్దాల నాటి గుహాచిత్రాలు పురాతన మానవుల ఆదిమ కళా నైపుణ్యానికి అద్దంపడతాయి. ఇటీవల ఇండోనేసియాలోని సూలవేసీ దీవిలో అత్యంత పురాతన గుహాచిత్రాలు బయటపడ్డాయి. ఈ దీవిలోని మారోస్ పాంగ్కెప్ ప్రాంతానికి చెందిన లీంగ్ కరాంపాంగ్ సున్నపురాతి గుహల్లో ఈ పురాతన చిత్రాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వీటిలో ఎర్రరంగుతో చిత్రించిన మూడడుగుల పంది బొమ్మ, చిన్న పరిమాణంలో నిలబడి ఉన్న భంగిమలో మూడు వేటగాళ్ల బొమ్మలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ గుహాచిత్రాలపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. గుహ లోపలి భాగంలో ఒకే రాతిపై వరుసగా చిత్రించిన ఈ బొమ్మలను కార్బన్ డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షించి, ఇవి కనీసం 51,200 ఏళ్ల కిందటివని అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన గుహా చిత్రాలలో ఇవే అత్యంత పురాతనమైన గుహా చిత్రాలని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాక్సిమ్ ఆబర్ట్ వెల్లడించారు. -
మంచిర్యాలలో పురాతన గోడ..
తెలంగాణలో మరో ప్రాచీన గుహల జాడ బయటపడింది. మంచిర్యాల సమీపంలోని బుగ్గగట్టు అటవీ ప్రాంతంలోని తాటిమట్టయ్య అనే గుట్టపైన ఇది వెలుగుచూసింది. వివిధ కాలాల్లో చిత్రించినట్టుగా భావిస్తున్న పలు చిత్రాలు గుహ గోడలపై కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆదిమానవులు తమ చిత్రాలకు ఎరుపు రంగు వాడతారు. ఇక్కడ ఎరుపుతోపాటు తెలుపు, నలుపు, ముదురు ఆకుపచ్చ రంగు చిత్రాలుండటం విశేషం. దుప్పి, ఎద్దు, అడవి పందులు, ఉడుములు, తాబేలు, గుడ్లగూబ, గబ్బిలాలు, తేనెతుట్టె లాంటి చిత్రాలు గోడలపై కనిపిస్తున్నాయి. దాదాపు మూడడుగుల ఎత్తుతో మరో ఆకృతి గీసి ఉంది. రెండు కాళ్లు, రెండు చేతులు, తల భాగంలో కిరణాలతో ఉన్న మరో ఆకృతి ఉంది. దీన్ని స్థానికులు తాటిమట్టయ్య దేవుడిగా పిలుచుకుంటున్నారు. అమెరికాలోని ఉతా వ్యాలీ, టెక్సాస్ రియోగాండ్ లోయ, ఫ్రాన్స్లోని మరో ప్రాంతంలో ఇలాంటి భారీ ఆకృతులు కనిపిస్తాయి. దాదాపు పదేళ్ల కాలంలో వీటిని గీసినట్టు భావిస్తున్నామని ఈ చిత్రాల సమూహాన్ని గుర్తించిన ఔత్సాహిక పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ చిత్రాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. –సాక్షి, హైదరాబాద్ -
కర్నూలులో బయటపడిన గుహ
-
మైలారం గుహల్లో స్పీకర్
గణపురం: వరంగల్ జిల్లా గణపురం మండలంలోని మైలారం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనున్న గుట్టపైన ఉన్న పురాతన గుహలను రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధు సూదనాచారి శనివారం సందర్శించారు. గుహల గుట్ట వద్దకు దారి లేనందున స్పీకర్ వాహనం వెళ్లలేకపోయింది. దీంతో ఆయన పోలీసు వాహనంలో కొంత దూరం వెళ్లి, అనంతరం కాలినడకన గుహలను చేరుకున్నారు. స్పీకర్ గుహల్లో కొంత దూరం నడిచి వెళ్లారు. చీకటిగా ఉండడం మూలంగా లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు. కాకతీయగడ్డ మీద ప్రతి చెట్టుకు, ప్రతిగడ్డకు,ప్రతి బిడ్డకు చరిత్ర ఉంటుందని స్పీకర్ ఈ సందర్భంగా అన్నారు. పురావస్తు శాఖ అధికారులు, ప్రభుత్వాలు ఈ గుహలపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.