మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతన తెగకు చెందిన ఒక పిరమిడ్ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెనువిపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండటాన్ని ఈ ఫొటోలలో చూడవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన పురేపెచా తెగ వారు తమ దేవతకు మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్‌ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్‌లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుట్జోలో ఉన్నాయి.
ఇప్పడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికుడు తరియాక్విరి అల్వారెజ్ మీడియా ముందు పేర్కొన్నారు. ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదువార్త. ఇది విపత్కర సంఘటనను సూచిస్తోందని ఆయన అన్నారు. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపెచా తెగలు అజ్టెక్‌లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి.
మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐఎన్ఏహెచ్) ఒక ప్రకటనలో.. ఇహుట్జోలో ఒక పిరమిడ్ కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పిరమిడ్ బయటి గోడ, లోపలి భాగం దెబ్బతిన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మతు చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment