గద్దర్‌తో ప్రొఫెసర్ కోదండరాం తదితరులు
అల్వాల్: నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నికలో కేఏ పాల్ ఆధ్వర్యంలోని ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ పోటీ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆదివారం మహోబోధి విద్యాలయంలో కోదండరాం ఇతర ప్రజా సంఘాల నాయకు లతో కలసి గద్దర్‌తో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే కొందరు దానిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారుల్లో గద్దర్ ఒకరని, ప్రజాశాంతి పార్టీ నుంచి కాకుండా ప్రజాస్వామిక వాదుల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను పోటీ చేయించడానికి చర్చలు జరుపుతు న్నామని కోదండరాం తెలిపారు.
కాగా, ప్రజా సంఘటన ద్వారానే మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించామని, అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని గద్దర్ చెప్పారు. 1978లో కాళోజీ నారాయణరావు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేశారని, ఆయన బాటలోనే ప్రస్తుతం తాను పోటీ చేయాలని ప్రజా సంఘాల నుంచి అభ్యర్థ నలు వస్తున్నాయని, దీనిపై మరింత చర్చించిన తరువాతే ముందుకు వెళతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment