కొత్త ఓటర్లకు డిజిటల్‌ కార్డులు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తరహాలో ఈ కార్డులు | Digital Cards For New Voters In Telangana Looks Like Driving Licence | Sakshi
Sakshi News home page

కొత్త ఓటర్లకు డిజిటల్‌ కార్డులు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తరహాలో ఈ కార్డులు

Published Thu, Oct 27 2022 1:10 AM | Last Updated on Thu, Oct 27 2022 8:18 AM

Digital Cards For New Voters In Telangana Looks Like Driving Licence - Sakshi

నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్‌ ఓటర్‌ గుర్తింపు కార్డు లను తొలిసారిగా రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలో యువ ఓటర్లు వినియోగించబోతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తరహాలో ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ–ఎపిక్‌ కార్డులుగా పేర్కొనే ఈ కార్డులు ఆరు ప్రధాన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటాయి. క్యూఆర్‌ కోడ్, హోలోగ్రామ్, పది అంకెల ఆల్ఫా న్యూమరిక్‌ (ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కలిగిన) ఓటరు గుర్తింపు సంఖ్య, ఓటరు ఫోటో, చిరునామా, ఇతర వివరాలు ఈ కార్డులో ఉంటాయి.

మునుగోడులో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఈ కార్డులను గురువారం నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పోస్టు ద్వారా మునుగోడుకు పంపించినట్టు సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. పాత ఓటర్లు సైతం మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి ఈ డిజిటల్‌ ఓటరు కార్డులను పొందవచ్చు.  

22,350 మంది అర్హులకు పంపిణీ 
ఈ కార్డులను సెక్యూర్డ్‌ పీడీఎఫ్‌ ఫైల్‌ రూపంలో ఫోన్‌లో లేదా వేరే ఎలక్ట్రానిక్‌ పరికరంలో డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ–ఎపిక్‌ కార్డు అందుబాటులో లేకున్నా పీడీఎఫ్‌ ఫైల్‌ ప్రింట్‌ను పోలింగ్‌ బూత్‌కు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కార్డులను టాంపర్‌ /ఎడిట్‌ చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు పటిష్ట రక్షణ చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది.

నకిలీ ఓటరు కార్డుల తయారీ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను ఎన్నికల సంఘం పరిశీలించి 22,350 మంది అర్హులని తేల్చింది. వారందరికీ చెన్నైలో ముద్రించిన కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement