new voters
-
ఆ ఓటర్లే కీలకం..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, అందులో పార్టీల వారీగా పోలైనవి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యాన అతివలే కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నా యి. అలాగే, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తు న్నారు. ఇక పోస్టల్, హోం ఓటింగ్ వేసే వారిపైనా దృష్టి సారించి.. సాధారణ పోలింగ్ కన్నా ముందుగానే ఎక్కువగా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేశాయి.పోస్టల్, హోం ఓటింగ్ కీలకం..రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఈనెల 3న ప్రారంభమై బుధవారం ముగు స్తుందని తొలుత ప్రకటించినా 10వతేదీ వరకు పొడి గించారు. ఇప్పటికే తమ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేయించాలనే లక్ష్యంతో నేతలు పనిచేయగా మిగిలిన సమయంలోనూ ఎక్కువ ఓట్లు రాబట్టేలా ఉద్యోగు లను కోరేందుకు సిద్ధమవుతున్నారు.కాగా, బుధవా రం నాటికి ఉద్యోగులు 7,203మంది, వయోవృద్ధులు 2,713 మంది ఓటు వేశారు. ఇక ప్రచారానికి మరో మూడు రోజుల సమయమే ఉండడం.. అగ్రనేతల ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా కలి సేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు.పోలింగ్ శాతం పెరగాల్సిందే..ప్రచారం చేస్తూనే పోలింగ్ శాతం పెంపుపైనా పార్టీ లు దృష్టి సారించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 75.30 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అది పెరిగేలా.. తద్వారా ఎక్కువ మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పెంపునకు ప్రచా రం చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరి స్తూనే షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటుచేశారు.యువ ఓటర్లకు గాలం!ఈసారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనుండడంతో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాక యువతకు చేస్తున్న మేలును కూడా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను కలుసుకునేందుకు సమ్మేళనాలు సైతం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశాలను వివరిస్తూ ఓట్లు రాబట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని మొత్తం 16,31,039 మంది ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు 50,747 మంది ఉన్నారు. వీరిలో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులు ఉండగా.. మొదటిసారిగా ఓటు వేసే వీరిని ప్రసన్నం చేసుకోవడంలో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు.ఆమే.. అధికం!ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లోనూ వీరే ఎక్కువ మంది ఓటు వేసినా పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ బూత్‌లకు రప్పించేలా పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. చాలా తక్కువ మంది ఓటు వేశారు.ఈసారి మొత్తం ఓటర్లు 16,31,039 మందికి పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 56,589 మంది ఎక్కువగా ఉన్న నేపథ్యాన గత ఎన్నికల మాదిరి కాకుండా అందరినీ పోలింగ్ బూత్‌ల వద్దకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో మహిళలపైనే దృష్టి సారిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో కరెంట్ కోతలు లేవని, నీటి కొరత ఎదురుకాలేదని చెబుతుండగా.. కాంగ్రెస్ నేతలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక బీజేపీ సైతం మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది. -
ఒకే జిల్లాలో 61వేల కొత్త ఓట్లు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటేయడానికి నవతరం ఉత్సాహంగా ముందుకు వస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 61,193 ఓట్లను కొత్తగా చేర్చారు. వీటిలో యువతవే 80 శాతం ఉన్నట్లు సమాచారం. మరోపక్క ఇబ్బడిముబ్బడిగా ఉన్న దొంగ ఓట్లను అధికారులు తొలగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాదిగా వచ్చిన ఫారం–6, ఫారం–7, 8లను ఎన్నికల అధికారులు వడపోసి, దొంగ ఓట్లను తొలగించి కొత్త ఓట్ల నమోదును చాలా వరకు పూర్తి చేశారు. ఇప్పటికే 46,116 అక్రమ ఓట్లను తొలగించారు. అన్నీ కలిపి మరో 600 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. వీటిలో కొత్త ఓట్లకు సంబంధించి 400 దరఖాస్తులు ఉన్నాయి. జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. జనవరి 22 నాటికి తుది జాబితా విడుదల చేస్తారు. ఇప్పటివరకు నమోదైన కొత్త ఓట్లలో అత్యధికంగా అద్దంకిలో 12,883 నమోదయ్యాయి. బాపట్లలో 9,967, రేపల్లెలో 9,961, చీరాలలో 9,958, పర్చూరులో 9,385, వేమూరులో 9,039 ఉన్నాయి. ప్రలోభాలకు లొంగకుండా దొంగ ఓట్ల తొలగింపు జిల్లాలో 65 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని పర్చూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్, పలువురు అధికార పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగించాలని 65 వేలకు పైగా ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వచ్చిన ఫారం–7 దరఖాస్తులను అధికారులు సమగ్రంగా పరిశీలించి దొంగ ఓట్లను తొలగిస్తున్నారు. దీంతో తమ దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతుందని భావించిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికార పార్టీ దొంగ ఓట్లు చేర్పిస్తోందంటూ ఆరోపణలకు దిగారు. అధికారులకు పదేపదే ఫిర్యాదు చేశారు. కోర్టును ఆశ్రయించారు. జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. అయినా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం వేలాది ఫారం–7 దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఇప్పటివరకూ 46,116 దొంగ ఓట్లను గుర్తించి, తొలగించింది. వీటిలో అత్యధికంగా పర్చూరు నుంచి 10,468 ఓట్లను తొలగించారు. రేపల్లె పరిధిలో 8,880, చీరాల నుంచి 7,420, అద్దంకిలో 7,207, వేమూరులో 6,295, బాపట్ల నుంచి 5,846 ఓట్లను తొలగించారు. తొలగించిన ఓటర్లలో ఇతరప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అక్కడే స్థిరపడిన వారు, చనిపోయిన వారు, రెండు చోట్లా ఓట్లు ఉన్నవారు ఉన్నారు. ఓటు హక్కుతో ఆనందం రాబోయే ఎన్నికల్లో తొలిసారి ఓటేసే ఆవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేస్తాను. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగను. మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు నా వంతు తోడ్పాటు అందిస్తాను. మంచి పాలన అందించేవారికి మద్దతుగా నిలవాలన్నది కోరిక. – పూరేటి సంధ్య, కొప్పెరపాడు, బల్లికురవ మండలం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నా నాకు ఓటు హక్కు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఫీజు రీయింబర్స్ మెంట్‌తో చదువుకున్నాను. పేద, మధ్యతరగతి వారికి అండగా నిలిచే ప్రభుత్వాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాను. –ఎం.సాయి పూజిత, బీటెక్ విద్యార్థి, బాపట్ల ప్రజల కోసం పనిచేసే వారికే ఓటు తొలిసారి ఓటుహక్కు రావడం ఆనందంగా ఉంది. పేదలకు అండగా నిలిచి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికే రాబోయే ఎన్నికల్లో నా ఓటు. ఎవరి ప్రలోభాలకూ లొంగకుండా ఓటు వేస్తాను. అందరికీ మంచి జరగాలన్నదే నా కోరిక. – పి. వెంకట నాగ మణికంఠ రెడ్డి, దుండివారిపాలెం, కర్లపాలెం మండలం -
లోక్‌సభ ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2024 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఈ కార్య క్రమంలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువతతో పాటు ప్రస్తుత ఓటరుజాబితాలో పేరు లేని వారి నుంచి సైతం దరఖాస్తులను స్వీకరించ నున్నారు. జనవరి 6 నుంచి సవరణ ప్రారంభం కానుండ గా, అంతకు ముందు పోలింగ్ కేంద్రాల పునర్వ్య వస్థీక రణ, సెక్షన్ల ఏర్పాటు, ఓటర్ల జాబితా/ఫొటో ఓటరు గు ర్తింపు కార్డుల్లో లోపాల దిద్దుబాటు, ఓటర్ల జాబితాలో స రైన ఫొటోలు ముద్రించడం, పోలింగ్ కేంద్రాల సరిహ ద్దుల వారీగా సెక్షన్లు/పార్టుల పునర్విభజన తదితర చర్య లను జనవరి 5 వరకు పూర్తి చేయనున్నారు. జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. నాటి నుంచి జనవరి 22 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు లు, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తా రు. ముసాయిదా జాబితాలో తప్పులు/లోపాల దిద్దుబా టు, ఓటరు చిరునామా మార్పు కోసం సైతందరఖాస్తు చే సుకోవడానికి వీలు కల్పించనున్నారు. ఫిబ్రవరి 2లోగా ద రఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6న తుది ఓటర్ల జాబితా నాణ్యతను పరిశీలించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదముద్ర తీసుకుంటారు. ఫిబ్రవరి 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. డోర్ టూ డోర్ సర్వే బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తమ వద్ద ఉన్న ప్రస్తుత ఓటర్ల జాబితాను తీసుకుని ఇంటింటికీ తిరిగి కుటుంబ పెద్దను కలవడం ద్వారా సంబంధిత ఓటర్లు ఉన్నారా? లేదా? అన్న విషయంపై పరిశీలన జరపను న్నారు. 2024 జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువత సైతం కొత్త ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే వారికి ఓటు హక్కు కల్పిస్తారు. -
కొత్తా ఓటరండీ! ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.. మాట వినే ప్రసక్తే లేదు
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను. మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్‌లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు. కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ? గత ఎన్నికల్లో... మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్డీఎస్–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు. కొత్త ఓటరు ఎటుంటే.. కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. పార్టీల కొత్త పంథా..! మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్‌లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది. 2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది. 2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్‌కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది. 2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్డీఎస్–లోక్‌నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్త ఓటర్లకు డిజిటల్ కార్డులు.. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు
నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్డు లను తొలిసారిగా రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలో యువ ఓటర్లు వినియోగించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ–ఎపిక్ కార్డులుగా పేర్కొనే ఈ కార్డులు ఆరు ప్రధాన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కలిగిన) ఓటరు గుర్తింపు సంఖ్య, ఓటరు ఫోటో, చిరునామా, ఇతర వివరాలు ఈ కార్డులో ఉంటాయి. మునుగోడులో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఈ కార్డులను గురువారం నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పోస్టు ద్వారా మునుగోడుకు పంపించినట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. పాత ఓటర్లు సైతం మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి ఈ డిజిటల్ ఓటరు కార్డులను పొందవచ్చు. 22,350 మంది అర్హులకు పంపిణీ ఈ కార్డులను సెక్యూర్డ్ పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఫోన్లో లేదా వేరే ఎలక్ట్రానిక్ పరికరంలో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ–ఎపిక్ కార్డు అందుబాటులో లేకున్నా పీడీఎఫ్ ఫైల్ ప్రింట్‌ను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కార్డులను టాంపర్ /ఎడిట్ చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు పటిష్ట రక్షణ చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. నకిలీ ఓటరు కార్డుల తయారీ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను ఎన్నికల సంఘం పరిశీలించి 22,350 మంది అర్హులని తేల్చింది. వారందరికీ చెన్నైలో ముద్రించిన కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. -
మునుగోడు ఓటర్ల లెక్క తేలింది.. ఎంతంటే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల లెక్క తేలింది. ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి మొత్తంగా 2,41,795 మంది ఓటర్లుగా తేల్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎన్నికల అధికారులు ఓటర్ల సంఖ్యను అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,795 మంది కాగా, అందులో పురుషులు 1,21,662 మంది, మహిళలు 1,20,126, ట్రాన్స్జెండర్లు 7 మంది ఉన్నారు. అందులో కొత్త ఓటర్లు 15,980 మందిగా తేల్చారు. ఈ ఏడాది జనవరి 1 తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,26,471 మంది కాగా, తాజా లెక్కల ప్రకారం 15,324 మంది ఓటర్లు నియోజకవర్గంలో పెరిగారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదు కోసం 26,742 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంటింటికి తిరిగి విచారించి 10,762 మంది దరఖాస్తులను తొలగించారు. 15,980 మంది ఓటర్లను అర్హులుగా ప్రకటించారు. (క్లిక్: కేసీఆర్ టార్గెట్‌పై టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్) -
బోగస్ ఓటర్లను చేర్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: తరుణ్ చుగ్
న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదైన ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసింది బీజేపీ. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు కొత్త ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ‘మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని ఈసీని కోరాం. స్వల్ప వ్యవధిలో 25వేల కొత్త ఓట్లు ఎలా వచ్చాయి? బోగస్ ఓటర్లను చేర్పించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.’ అని ప్రభుత్వం, టీఆర్ఎస్పై ఆరోపణలు గుప్పించారు తరుణ్ చుగ్. ఇదీ చదవండి: రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులా? మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం -
Munugode Bypoll: 10 వేలకు పైగా ఓటరు దరఖాస్తుల తిరస్కరణ
సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓటర్ల వివాదం నెలకొంది. మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయన్న ప్రచారం మొదలైననాటినుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారూ ఇక్కడ ఓటు కోసం నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘం కొత్త ఓటరు నమోదుకు ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తోంది. దాన్ని అవకాశంగా చేసుకొని మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు పెద్ద ఎత్తున కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. వాటన్నింటిని పరిశీలిస్తున్న అధికారులు అనర్హులకు ఓటు తిరస్కరిస్తున్నారు. ఇప్పటివరకు 10వేలకుపైగా ఓట్లు తొలగించినట్లు సమాచారం. రెండు మాసాల్లోనే 24,881 మంది.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 4 వరకు 24,881 మంది కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్నారు. వీరితోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లినవారూ నమోదు చేసుకోవడంతో దరఖాస్తులు భారీగా వచ్చాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఇళ్లు లేకపోయినా, నివాసం ఉండకపోయినా, అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అర్హులైనవారి దరఖాస్తులనే ఓకే చేస్తున్నారు. వేరే ప్రాంతంలో ఓటు ఉండి, తిరిగి ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నవారి దరఖాస్తులను పరిశీలించి రిజెక్టు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 12వేల దరఖాస్తులు మాత్రమే ఓకే అయ్యాయి. ఈ నెల 14 వరకు దరఖాస్తులు పరిశీలించి తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. కాగా, మునుగోడులో అనర్హులు ఓటు నమోదు చేసుకున్నారని బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇంకా దీనిపై తీర్పు రావాల్సి ఉంది. -
సంచలనం.. జమ్ము కశ్మీర్ ఓటర్లుగా నాన్-లోకల్స్ కూడా!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. స్థానికేతరులను సైతం ఓటర్లుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు.. ఓటు హక్కు కల్పిస్తున్నట్లు తెలిపింది. సీఈవో హిర్దేశ్ కుమార్ స్వయంగా చేసిన ఈ ప్రకటన.. ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది అక్కడ. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్-లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన తర్వాత.. తిరిగి రాజకీయ స్థిరత్వం నెలకొల్పేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. ఎన్నికల నిర్వహణ వీలైనంత త్వరలోనే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. ఇప్పుడు ఈసీ ఓటర్లుగా స్థానికేతరులనూ గుర్తిస్తామని ప్రకటించడం విశేషం. ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు.. ఇలా బయటి నుంచి వచ్చి జమ్ము కశ్మీర్లో ఉంటున్న వాళ్లకు ఓటు హక్కు దక్కనుంది. అంతేకాదు వాళ్లు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ‘నివాసం’ అనే ఆప్షన్ తప్పనిసరేం కాదని, మినహాయింపు ఇస్తున్నామని జమ్ము కశ్మీర్ ఈసీ వెల్లడించింది. ఇక జమ్ము కశ్మీర్లో భద్రత కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది సైతం ఓటు హక్కుకు అర్హులేనని, వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సీఈవో హిర్దేశ్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ 1, 2022 వరకు పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు వచ్చే జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని, నవంబర్ 25వ తేదీ లోపు ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హిర్దేశ్ కుమార్ వెల్లడించారు. జమ్ము కశ్మీర్లో పద్దెనిమిదేళ్లు పైబడిన జనాభా 98 లక్షలకు పైనే. అందునా.. ప్రస్తుతంఉన్న ఓటర్లు లిస్ట్‌లో 76 లక్షల మందే ఉన్నారు. ఈసీ తీసుకున్న స్థానికేతరులకు ఓటు హక్కు నిర్ణయంతో మరో పాతిక-ముప్ఫై లక్షలకు పైగా కొత్త ఓటర్లు.. జమ్ము కశ్మీర్ ఓటర్ల కింద జమ కానున్నట్లు అంచనా. ఇక ఈసీ తాజా ప్రకటనను ఆధారంగా చేసుకుని జమ్ము కశ్మీర్ స్థానిక పార్టీలు.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఓటు రాజకీయమంటూ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. GOIs decision to defer polls in J&K preceded by egregious gerrymandering tilting the balance in BJPs favour & now allowing non locals to vote is obviously to influence election results. Real aim is to continue ruling J&K with an iron fist to disempower locals. https://t.co/zHzqaMseG6 — Mehbooba Mufti (@MehboobaMufti) August 17, 2022 Is the BJP so insecure about support from genuine voters of J&K that it needs to import temporary voters to win seats? None of these things will help the BJP when the people of J&K are given a chance to exercise their franchise. https://t.co/ZayxjHiaQy — Omar Abdullah (@OmarAbdullah) August 17, 2022 ఇదీ చదవండి: అదానీకి జెడ్ కేటగిరి భద్రత -
సమర్థులకు పట్టం కడదాం..
సాక్షి, పెద్దారవీడు: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. యువత ప్రలోభాలకు లొంగి ఓటేస్తే వచ్చే ఐదేళ్లు ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్థ నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. స్వార్థపరులు, అబద్ధాలు చెప్పే వ్యక్తులకు ఓటు వేయకూడదు. ప్రజల కోసం పాటుపడే వ్యక్తికే ఓటు వేయాలి. ఇదీ యువత మనోగతం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా సమర్థవంతమైన పాలన అందించాలి. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడికే పట్టం కడతామని యువ ఓటర్లు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. నిరంతరం ప్రజల కోసం ప్రజల మధ్య ఉండే యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకు మేము సైతం అంటూ ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. యువత ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తామని పేర్కొనడం విశేషం. హోదా కోసం పోరాడిన నాయకుడికే నా ఓటు మొదటి సారి ఓటు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఓటు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన నాయకుడికే వేస్తాను. మా భవిష్యత్ ప్రత్యేక హోదాపైనే ఆధారపడి ఉంది. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వినియోగించుకుంటాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధ్వాన్నంగా ఉంది. రాష్ట్రానికి మేలు చేసే వారికే పట్టం కడతాం. ఈ కష్టాలు పోవాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న పార్టీకే నా ఓటు. మాటపై నిలబడే నాయకుడికే యువత పట్టం కడతాం. – ఒద్దుల మాలతి, సానికవరం గ్రామం భవిష్యత్తు కోసం ఓటు రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రచార ఆర్భాటమే తప్ప పురోగతి కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌కి సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఉంది. యువత మేల్కొనే సమయం వచ్చింది. నా ఓటు బంగారు భవిష్యత్ కోసం వేస్తాను. రాష్టాన్ని సుభిక్షంగా, అభివృద్ధి దిశలో నడిపించే సత్తా కలిగిన నాయకకుడికే నా మొదటి ఓటు. కొత్త ఓటర్లు బాగా ఆలోచించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. – మూల హర్షవర్ధన్‌రెడ్డి, బద్వీడుచెర్లోపల్లె గ్రామం ప్రలోభాలకు గురికావొద్దు సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను ఓటు వేయాలి. ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఓటు దుర్వినియోగంతో రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నష్టం కలుగుతోంది. మంచి నాయకున్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. – దుగ్గెంపూడి జగన్మోహన్రెడ్డి, మల్లవరం గ్రామం ఓటే మార్పుకు నాంది ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకునే నాయకునికి ఓటు వేస్తాం. ముఖ్యంగా కొత్త ఓటర్లు బాగా ఆలోచించి ఓటు వేయాలి. సంక్షేమం, సమాజాభివృద్ధి గురించి పాటు పడే నాయకున్ని ఎన్నుకోవాలి. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలను చేపట్టే వారికే పట్టం కట్టాలి. ఓటు వజ్రాయుధం. ఓటే మార్పుకు నాంది. ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును నిజాయతీగా వినియోగించుకోవాలి. – అల్లు పద్మ, పెద్దారవీడు గ్రామం భవిష్యత్ భరోసాకే నా ఓటు భవిష్యత్‌కు భరోసా కల్పించే నాయకుడికే నా ఓటు వేస్తా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పంచే నాయకుడికే నా ప్రాధాన్యత. విద్యావంతులతో పాటు ప్రతి ఒక్కరూ అలోచించి ఓటు వేయాలి. ఇప్పటి వరకు చాలా మంది చాలా వాగ్ధానాలు చేశారు. అవి మాటలకే పరిమితం అయ్యాయి. జగనన్న అధికారంలోకి వస్తే ప్రతి కుంటుంబం సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు చూసిన పాలకతో పోల్చుకుంటే భవిష్యత్తు జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వెలుగులు విరజిమ్ముతుందని భావిస్తున్నా. – ఏర్వ వెంకటేశ్వరరెడ్డి, మద్దలకట్ట గ్రామం ఓటు వేసేందుకు ఆత్రుతగా ఉంది నా ఓటు నిజాయతీగా వేస్తాను. మొదటి సారి ఓటు వేయడానికి చాలా ఆత్రుతగా, సంతోషంగా ఉంది. భారత పౌరురాలిగా ఎన్నికల్లో నా హక్కును ఓటు రూపంలో వినియోగించుకుంటాను. నేటి ప్రభుత్వాలు అవినీతిమయంగా మారిపోయాయి. పాలకులు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. గెలుపు కోసం మోసపూరిత హామీలు ఇస్తున్నారు. గతంతో ఇచ్చిన హామీలు నేరవేర్చని వారు ఓటు అడిగే హక్కును కోల్పోయారు. అన్ని రంగాల్లో మార్పు రావాలి. అది యువతతోనే సాధ్యమవుతుంది. – సొంటి సౌజన్య, తోకపల్లె గ్రామం ఓటు అమ్ముకోను రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి నిలిచింది. ప్రభుత్వాలు అవినీతి ప్రోత్సహించడం చూస్తుంటే భయం వేస్తోంది. రాష్ట్రం పురోగతి సాధించాలంటే యువ నాయకత్వానికి ఓటు వేయాలి. నా ఓటు నోటుకు అమ్ముకోను. అందుకే అవినీతిని రూపుమాపే నాయకుడికే నా తొలి ఓటు వేస్తాను. ప్రలోభాలు, మభ్యపెట్టే మాటలు, నోట్లతో యువతను మోసగించలేరు. – అల్లు బలరామిరెడ్డి, పెద్దారవీడు గ్రామం -
తెలంగాణలో 5.9 లక్షల కొత్త ఓటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18–19 ఏళ్ల వయసు గల 1.5 కోట్ల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణలో 2019 ఓటరు నమోదు ప్రక్రియలో ఇప్పటివరకున్న గణాంకాల ప్రకారం 18–19 ఏళ్ల వయసు వారి సంఖ్య 5,99,933 ఉందని తెలిపింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 2,95,18,964 ఉంది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 1.46 కోట్లు కాగా.. పురుష ఓటర్ల సంఖ్య 1.48 కోట్లుగా ఉంది. థర్డ్ జండర్ ఓటర్ల సంఖ్య 1,368గా ఉంది. ప్రతి 1,000 మంది జనాభాకు 762 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఓటరు నమోదు ప్రక్రియలో ఇప్పటివరకున్న గణాంకాల ప్రకారం 18–19 ఏళ్ల వయసు ఉన్న కొత్త ఓటర్ల సంఖ్య 5,39,804గా ఉందని ఈసీ వెల్లడించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091గా ఉంది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 1.86 కోట్లు కాగా.. పురుష ఓటర్ల సంఖ్య 1.83 కోట్లుగా ఉంది. థర్డ్ జండర్ ఓటర్ల సంఖ్య 3,761గా ఉంది. ప్రతి 1,000 మంది జనాభాకు 697 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. -
నేడు ఒక్కరోజే..!
నల్లగొండ : ఓటరు నమోదుకు సోమవారం ఒక్కరోజే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో పేరు లేనివారు ఇప్పుడు నమోదు చేసుకుంటేనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఓటుహక్కు కోల్పోవాల్సిందే. అర్హులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,628 పోలింగ్స్టేషన్లలో ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే లక్ష్యం.. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటహక్కు నమోదు చేసుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టి ఓటుహక్కు నమోదు చేసుకునే విధంగా జిల్లాలో అనేక ప్రచార, చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఓటుహక్కు నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఒకచోట నుంచి మరోచోటుకు ఓటును మార్పుకోవడంతోపాటు పేర్లలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు కూడా అవకాశం ఇవ్వడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కానీ ఎన్నికల సమయానికి అక్కడక్కడా ఓట్లు గల్లంతయ్యాయి. చాలా మంది ఓటర్లు ఓటు వేసే అవకాశం లేక నిరాశకు గురయ్యారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన, 1 జనవరి 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 25వ తేదీ ఓటరు నమోదుకు చివరి తేదీగా నిర్ణయించి అవకాశం కల్పిం చింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటరు నమోదు ఫిబ్రవరి 4 వరకు పొడిగించింది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు సోమవారం ఓటు నమోదుకు చివరి గడువు కావడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,629 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. సెలవు దినం ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ఆది వారం ఈ క్యాంపులు ఏర్పాటు చేశా రు. ప్రతీ పోలింగ్స్టేషన్లో బీఎల్ఓలను ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచారు. వారి వద్ద కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఫారం–6తో పాటు మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తులను సిద్ధంగా ఉంచారు. ప్రజల నుంచి మంచి స్పందన.. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు లేనివారు ఓటుహక్కు నమోదు చేసుకోవడంతోపాటు కొందరు పేర్లలో దొర్లిన తప్పిదాలను సరి చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. క్యాంపులను పరిశీలించిన జేసీ, ఆర్డీఓ.. పోలింగ్ స్టేషన్లలో నిర్వహించిన ప్రత్యేక క్యాంపులను జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. నల్లగొండ పట్టణంలోని పశు వైద్యశాల వద్ద ఉన్న పోలింగ్ స్టేషన్‌తోపాటు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉన్న పోలింగ్‌స్టేషన్‌ను రామగిరి, ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి ఓటు నమోదు, తదితర విషయాలపై బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. నేడు ఆఖరి గడువు.. ఓటు నమోదుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. వచ్చే పార్లమెంట్, తదితర ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటు లేని వారు ఓటుహక్కు నమోదు చేసుకోవాల్సిందే. ఓట్లు గల్లంతైనా.. 18 సంవత్సరాలు నిండి ఓటు లేనివారు దరఖాస్తు చేసుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. -
భూపాలపల్లిలో నలుగురి మధ్యే పోరు..!
సాక్షి, భూపాలపల్లి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాలతో పోలిస్తే భూపాలపల్లిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు ఉంటే ఇక్కడ మాత్రం ప్రధానంగా నలుగురు అభ్యర్థులు రంగంలో ఉండబోతున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు పార్వర్డ్‌బ్లాక్ పార్టీ నుంచి అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయా నాయకులకు ఇప్పటికే ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో కొత్త ఓటర్లు, తటస్థ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వారే గెలుపొందే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ నలుగురు కలిసినా ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. పోలింగ్ జరగక ముందే మెజారిటీపై అంచనాలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, ఏఐఎఫ్‌పీ నుంచి గండ్ర సత్యనారాయణరావు ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరెవరికి ఏ మండలంలో పట్టుంది.. అక్కడ ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. కొంతవారు ఎందరున్నారు.. తటస్థులు ఎవరు అని లెక్కలు కడుతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీదారుల సంఖ్య పెరిగింది. గత రెండు ఎన్నికల్లో ప్రధానంగా త్రిముఖ పోటీ ఉంది. ప్రస్తుతం నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల సమయం ఉంది. ఈ లోగా> అభ్యర్థుల సంఖ్య పెరిగినా నలుగురి మధ్యలోనే పోటీ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. తటస్థులు, కొత్త ఓటర్లవైపు చూపు ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన అభ్యర్థులకు పార్టీ తరపున, వ్యక్తిగతంగా కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. వీరి ఓట్లు తప్పకుం డా ఆయా పార్టీలకే పడతాయి. అయితే ప్రస్తుతం అందరి చూపు తటస్థంగా ఉంటే ఓటర్లు, కొత్త ఓటు హక్కు పొందినవారిపై పడింది. వారే గెలుపోటములను నిశ్చయించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10వేల మంది వరకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు 12వేలు, 7వేల మెజారిటీ లభించింది. ఆయా ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రస్తుతం పోటీదారుల సంఖ్య పెరుగుతోం ది. నియోజకవర్గంలో కొత్తగా నమోదైన ఓట్లతో కలిపి 2 లక్షల 46 వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా మెజారిటీ మాత్రం గతంలో కంటే తక్కువగానే వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఓటర్ల నమోదుకు దరఖాస్తుల వెల్లువ
-
18 లక్షల కొత్త ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటరు నమోదు కోసం ఇప్పటివరకు సుమారు 17 లక్షల నుంచి 18 లక్షల మంది ఫారం–6 దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని, పెద్ద ఎత్తున యువత దరఖాస్తు చేసుకుంటోందన్నారు. ఎన్నికల ప్రకటన విడుదలై అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడానికి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లున్నాయని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలతో బూత్ స్థాయి అధికారుల(బీఎల్వో)కు అభ్యంతరాలు అందించాలని సూచించారు. వారు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి బోగస్ ఓట్లను తొలగిస్తారన్నారు. ఈఆర్వో నెట్ సాయంతో.. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘ఈఆర్వో నెట్’సాఫ్ట్వేర్ సాయంతో ఓటర్ల జాబితాను విశ్లేషించి రాష్ట్రంలో 4.92 లక్షల డూప్లికేట్ ఓటర్లున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని రజత్ తెలిపారు. దేశం లోని ఓటర్లందరి వివరాలు ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయని, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఒకే విధమైన పేర్లు, వయసు, చిరునామా ఉన్న ఓటర్లను సాఫ్ట్వేర్ గుర్తిస్తుందన్నారు. 4.92 లక్షల అనుమానాస్పద ఓటర్లందరికీ 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటిసులు జారీ చేస్తున్నామని, వివరణలు అందాక పరిశీలించి తొలగింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఓట్లలో దాదాపు 50 నుంచి 60 శాతం వరకు డూప్లికేట్ ఓటర్లుండే అవకాశముందన్నారు. సుమారు 1.20 లక్షల చనిపోయిన ఓటర్లను గుర్తించామని, వీటి తొలగింపు కోసం సంబంధికులకు నోటిసులు జారీ చేశామని చెప్పారు. ప్రతి బూత్లోనూ ఈవీఎంల పరీక్షలు రాష్ట్రంలో 19,044 పోలింగ్ కేంద్రాలున్నాయని.. 32,574 మంది బీఎల్వోలను నియమించామని, ఎక్కడా ఖాళీలు లేవని రజత్ కుమార్ తెలిపారు. 23 జిల్లాలకు ఇప్పటికే ఈవీఎంలు పూర్తి స్థాయిలో చేరాయని, మిగిలిన జిల్లాలకు మరో రెండ్రోజుల్లో చేరుతాయని తెలిపారు. 52,100కు గాను 30,470 బ్యాలెటింగ్ యూనిట్లు.. 44,000లకు గాను 18630 వీవీపాట్లు, 40,700 కంట్రోల్ యూనిట్లకు గాను 30,840 ఇప్పటికే చేరాయన్నారు. బూత్ స్థాయిలో ఈవీఎంలను పరీక్షించేందుకు 170 మంది ఇంజనీర్లను నియమించామని చెప్పారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల పనితీరుపై ప్రథమ స్థాయి పరీక్షలు నిర్వహించనున్నామని.. ప్రతి బూత్‌లో పార్టీలు, ప్రజల సమక్షంలో ఈవీఎంలకు పరీక్షలు జరుపుతామని, ఎవరైనా మాక్ పోలింగ్‌లో పాల్గొని అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల నిర్వహణపై శిక్షణ కోసం 120 మంది మాస్టర్ ట్రైనర్లను ఢిల్లీ పంపామని, వారు తిరిగొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఒకేరకమైన ఎన్నికల చిహ్నం కేటాయించాలని కొన్ని పార్టీలు ఇప్పటికే కార్యాలయాన్ని సంప్రదించాయని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఇంతవరకు ఇలాంటి అభ్యర్థన చేయలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
సాంకేతికతలో మనమే ముందుండాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఏటా 7 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదవుతున్నారు. వారంతా యువకులు కావడంతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఎక్కువ ఉంటుంది. అదే పరిజ్ఞానంతో కొత్త ఓటర్లను ఆకర్షించడంలో సఫలం కావాలి. ఈ విషయంలో రాజ కీయ ప్రత్యర్థి కన్నా మనం ముందుండాలి. వారి వేగాన్ని అందుకునేలా శక్తి యాప్ లో సభ్యులను చేర్పించాలి’అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకపాత్ర పోషిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన శక్తి యాప్ సమీక్ష సమావేశానికి చిదంబరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 2.2 కోట్ల ఓటర్లు ఉన్నారని, వారిలో కనీసం 10% (22 లక్షలు) మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 119 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న లక్ష సభ్యత్వాలు చాలా తక్కువని, ›ప్రతి పోలింగ్ బూత్ లో 25 మందిని సభ్యులుగా చేర్పించాలని కోరారు. ‘కాంగ్రెస్ నేతల కాళ్లు ఆఫీసుల్లో, సొంత పనుల్లో కాకుండా క్షేత్రంలో ఉండాలి. యాప్ ద్వారా నాయకత్వ స్థాయి నుంచి కింది స్థాయి వరకు సమాచారం వస్తుంది, దీన్ని పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆలోగా ప్రతి నెలా 2 లక్షల మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించేలా నేతలు పనిచేయాలి’అని సూచించారు. అత్యధికంగా అంబర్‌పేటలో.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు శక్తి యాప్ చాలా ఉపయోగపడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శక్తి యాప్ ప్రాజెక్టును రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దీన్ని విజయవంతం చేసేందుకు శ్రద్ధతో పనిచేయాలని కోరారు. పార్టీ ప్రచార కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. యాప్ రాష్ట్ర ఇన్చార్జి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో తెలంగాణలో లక్ష మందిని యాప్ సభ్యులుగా చేర్పించగలిగామన్నారు. అత్యధికంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 13,240 మంది.. కోదాడలో 6,467, హుజూర్‌నగర్‌లో 6,120 మంది యాప్‌లో సభ్యులుగా చేరారని చెప్పా రు. యాప్ నమోదు విషయంలో నేతలు అడిగిన సాంకేతిక సమస్యలకు చిదంబరంతో పాటు ఏఐసీసీ విశ్లేషణ డేటా విభాగం ఇన్చార్జి ప్రవీణ్ చక్రవర్తి సమాధానాలు చెప్పారు. సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిస్థితులపై రాహుల్‌తో చర్చించా: ఉత్తమ్ సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు శక్తినివ్వాలనే ఆలోచనతో శక్తి యాప్‌కు రాహుల్ శ్రీకారం చుట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకే చిదంబరం వచ్చారని వెల్లడించారు. శనివారం తన ఢిల్లీ పర్యటనపై మీడియా ప్రశ్నించగా, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. పలువురు నేతల గైర్హాజరు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులంతా సమావేశానికి హాజరవాలని పీసీసీ నుంచి ఆహ్వానం వెళ్లింది. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలే హాజరయ్యారు. సమావేశంలో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి మాట్లాడాలని గ్రేటర్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌ను కోరగా వీహెచ్ అడ్డుచెప్పినట్లు తెలిసింది. అనంతరం చిదంబరం మాట్లాడుతూ.. యువ నాయకులను తక్కువ అంచనా వేయొద్దని, నేతలందరూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని హితవు పలికినట్లు సమాచారం. -
నంద్యాలలో కొత్త ఓటర్ల నమోదుపై పరిశీలిస్తాం
-
బాబోయ్... నకిలీ ఓటర్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రస్తుత చట్టసభ పదవీకాలం ఈ ఏడాది మే 22వ తేదీతో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీని ఓటు హక్కు కలిగే రోజుగా పరిగణించి 18 ఏళ్లు నిండిన వారిద్వారా దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్లుగా ఓటర్ల జాబితాలో చేర్చారు. కొత్త ఓటర్ల జాబితాను గత నెల 20వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాలో 40 లక్షల వరకు నకిలీ ఓటర్లు ఉన్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ఆనాడే విమర్శించారు. అలాగే నకిలీ ఓటర్లను తొలగించాల్సిందిగా డీఎంకే నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించగా, కొందరు కోర్టులో పిటిషన్లు వేసారు. ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులకై గత నెల 31, ఈనెల 6వ తేదీన ప్రత్యేక శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో సుమారు 8 లక్షల మంది ఓటర్లు పలు అంశాల్లో మార్పులు, చేర్పులపై దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 75వేల మంది అనేక చోట్ల తమకు ఓటు ఉన్నదని, వాటిని తొలగించాలని దరఖాస్తు చేసుకున్నారు. 2009 నుండి తమిళనాడులో నివసించే వారి జాబితాను పోల్చిచూస్తూ నకలీ ఓటర్ల ఏరివేతకు పూనుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ సోమవారం చెప్పారు. గత జాబితాతో పోల్చుకుంటే చనిపోయిన లక్షమంది ఓటర్ల పేర్లు చెన్నై జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. నకిలీ ఓటర్ల తొలగింపుకు అనేక చర్యలను చేపట్టామని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు చనిపోయిన ఓటర్ల జాబితాను అందజేశామని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పార్టీ నేతలకు సైతం ఈ పేర్ల జాబితాను అందజేస్తామని అన్నారు. నేతలు ఆ జాబితాను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం మీద సుమారు 6 లక్షల మంది నకిలీ (చనిపోయిన వారు) ఓటర్లు ఉన్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశాలు: ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ నేతృత్వంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశాలను నిర్వహించారు. చెన్నైలోని రిప్పన్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన సమావేశంలో అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్, పీఎంకే, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. -
గ్రేటర్లో మూడు లక్షలకుపైగా కొత్త ఓటర్లు
హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో 82,834 బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు తొలగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో జనార్దన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... గ్రేటర్లో 3,87,530 మంది కొత్తగా ఓటర్లు నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో మొత్తం 74,36,247 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అందులో 39,73,374 మంది మహిళ ఓటర్లు ఉండగా.... 34,61,919 మంది పురుష ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. -
ఓటరు దరఖాస్తులు 75 వేలు
కలెక్టర్ వెల్లడి 19 లోపు పరిశీలన పూర్తి 23న అభ్యర్థులకు జాబితాల పంపిణీ తిరువూరు, న్యూస్‌లైన్ : కొత్తగా ఓటుహక్కు కోరుతూ జిల్లాలో 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. గురువారం తిరువూరు వచ్చిన ఆయన స్థానిక తహశీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత జనవరి 31 నాటికి ప్రకటించిన ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్ల పేర్లు చేరుస్తామని చెప్పారు. ఈ నెల 19 లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందన్నారు. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ తాజా ఓటర్ల జాబితాలు అందజేస్తామన్నారు. ఓటర్ల జాబి తాలో ఫొటోలు తారుమారైనా, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటుహక్కున్నా నిర్దిష్ట నమూనాలో ఫిర్యాదు చేస్తేనే చర్య తీసుకోవడం సాధ్యపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రం... జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ఈ మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వరుసలో నిలబడే అవసరం లేకుండా సీటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. త్వరగా ఓటు వేసేందుకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఎంపిక చేస్తారన్నారు. తిరువూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకటసుబ్బయ్య, సహాయ రిటర్నింగ్ అధికారి రియాజ్హుస్సేన్లతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన తిరువూరు టౌన్ : అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాటుచేసిన తిరువూరులోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి సరఫరా చేసేందుకు అవసరమైన రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సులు పాఠశాల ఆవరణలోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రధాన గేటు వెడల్పు చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని కలెక్టరు వెల్లడించారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకటసుబ్బయ్య, సహాయ రిటర్నింగ్ అధికారి రియాజ్‌హుస్సేన్ పాల్గొన్నారు. -
ఎన్నుకో.. ఏలుకో
* బాబు హయాంలో చదువు‘కొనా’ల్సిందే.. * ఫీ‘జులుం’ నుంచి విముక్తి కల్పించిన వైఎస్ * వైఎస్ అనంతరం పరిమితులు * జగన్ ‘అమ్మ ఒడి’ పై చిగురిస్తున్న ఆశలు దాదాపు 1.25 కోట్లు...! మన రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకోబోయే విద్యార్థుల సంఖ్య ఇది. ఇందులో కొత్త ఓటర్లు అంటే..18-19 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య 15లక్షల పైచిలుకు ఉన్నారు. రానున్న ఎన్నికలలో వీరి ఓట్లదే కీలకం. ‘విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు...విద్యార్థుల త్యాగమూ రాయని చరితే లేదు’....సమాజోద్ధరణలో విద్యార్థి దశ ఎంత కీలకమైనదో ఓ కవి ఎప్పుడో చెప్పాడు. అటువంటి యువత దేశ భవితవ్యాన్ని నిర్దేశించే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది...ఈ నేపథ్యంలో విద్యార్థి సంక్షేమానికి ఏ ప్రభుత్వం చిత్తశుద్ధి కనబర్చిందనే విషయమై...ఈ విశ్లేషణ. మేకల కళ్యాణ్ చక్రవర్తి, ఖమ్మం: తమ అభివృద్ధి కోసం పాటుపడిందెవరు? తమకు విద్యార్థి దశలో మంచి చదువులు చెప్పించే పరిస్థితులను కల్పించి, ఆ దశ దాటిన తర్వాత ఉపాధి కల్పన మార్గం చూపిన వారెవరు? అనే అంశాలే విద్యార్థి వేయబోయే ఓటును నిర్దేశిస్తాయి. ఈ నేపథ్యంలో ఓటేసే వయసున్న యువ విద్యార్థి లోకం గత పాలన తీరు తెరుతెన్నులను నేటి పాలనతో పోల్చి చూస్తోంది. విద్యార్థికి అండగా ఉన్నదెవరు?...వారి భవితవ్యాన్ని శూన్యం చేసిందెవరు?.. భవిష్యత్‌లో తమకు బంగారుబాట వేసేదెవరు? ఇప్పుడు తామేం చేయాలి... ఎవరిని ఎంచుకోవాలి... అనే అంశాలు చర్చిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వా లు ఫీజుల పథకాన్ని దూరం చేసేందుకు చేయ ని ప్రయత్నాలు లేవు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు వైఎస్ హయాంలో పూర్తి ఫీజురీయింబర్స్ అవగా, ప్రస్తుతం కోర్సు ఫీజు ఎంతైనా గరిష్టంగా రూ.20వేలే రీయింబర్స్ చేస్తున్నారు. డబుల్ పీజీలకు కూడా గతంలో రీయింబర్స్మెంట్ ఇవ్వగా, ఇప్పుడు ఒక్క పీజీకి మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించారు. వయోపరిమితి నిబంధన విధిస్తామంటూ కోర్సుల వారీగా వయసును వర్గీకరించారు. పారామెడికల్ విభాగంలో 26 కోర్సులను 17కు కుదించారు. ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్ (వృత్తివిద్య), కలినరీ ఆర్ట్ వంటి సర్టిఫికెట్ కోర్సులనూ ఎత్తివేశారు. ‘గేట్’ ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరిన వారిని మినహాయించారు. గతంలో లబ్ధి పొందిన వీరి నుంచి సొమ్మును రికవరీ చేస్తున్నారు. పీహెచ్డీ చేస్తున్న కొందరు విద్యార్థులకు ఫెలోషిప్ వస్తుందన్న సాకుతో పరిశోధన చేస్తున్న విద్యార్థులనూ మినహాయించడం గమనార్హం. కేంద్రం గుర్తించిన 183 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ చేయాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ ఫీజులనూ ఇష్టారాజ్యంగా పెంచేసి ప్రభుత్వం రూ.35వేలే చెల్లిస్తుందని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనల్లో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను సందర్శించి అక్కడే రాత్రి బస చేసినా వారి మెస్‌చార్జీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. రాజీవ్ యువకిరణాల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన కిరణ్ విజయవంతం కాలేకపోయారు. ప్రచారార్భాటం కోసం పెట్టిన ఈ పథకం ద్వారా మండలానికో నలుగురికి కంప్యూటర్ శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అరకొరా హైదరాబాద్‌లోని సమీపంలో పరిశ్రమల్లో ఉద్యోగాలిప్పించినా వారు సరిగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో యువత అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితులను కూడా కల్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వై‘ఎస్’ ‘పేదరికం కారణంగా అర్హుడైన ఏ విద్యార్థీ ఉన్నత విద్య కు దూరం కాకూడదు.’ అన్న సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పూర్తిగా ఫీజు, స్కాలర్షిప్ వస్తుండగా (అవి కూడా రాష్ట్రం ఇచ్చేది కాదు... కేంద్రం నిధులనే పంచేవారు.) వైఎస్ వచ్చిన తర్వాత దానిని బీసీలకు, ఈబీసీలకు వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం యేటా 26లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. - ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల వ్యవస్థను సమూలంగా మార్చి బీసీ, ఈబీసీలకూ రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేశారు. - వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు స్కాలర్షిప్లను 60శాతం మేర పెంచారు. - సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఆరేళ్లలో రెండు సార్లు 60శాతం మేర డైట్‌చార్జీలు పెంచారు. ఏడో తరగతిలోపు విద్యార్థులకు నెలకు రూ.338 ఉండ గా రూ. 475కు, ఏడు నుంచి ‘పది’విద్యార్థులకు రూ. 412 నుంచి రూ.535కు పెంచారు. అప్పటి వరకూ హాస్టల్ విద్యార్థులకు ఏడాదికి రెండు జతల యూనిఫారంలు ఇస్తుండగా, దానిని నాలుగు జతలకు పెంచారు వైఎస్. అలాగే బాలురకు రూ. 20గా ఉన్న కాస్మొటిక్ చార్జీలను రూ. 50కి, బాలికలకు రూ. 50 నుంచి రూ.75కుపెంచారు. - కులవివక్షను రూపుమాపేందుకు 120 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను మంజూరు చేశారు. ఇందుకోసం ఒక్కో హాస్టల్‌కు రూ. 2.5 కోట్లు కేటాయించారు. - వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని శాచ్యురేషన్ పద్ధతిలోకి తీసుకెళ్లారు. 2011-12 విద్యాసంవత్సరంలో మైనార్టీలకు ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం కేటాయించిన మొత్తం రూ.250.40 కోట్లు. 2006-07లో రూ.14 కోట్లుకాగా ప్రస్తుతం రూ.165 కోట్లకు చేరింది. - వైఎస్ అధికారంలోకి రాక ముందు మైనార్టీ విద్యార్థులకు కేవలం స్కాలర్షిప్ మాత్రమే భరించేవారు. ట్యూషన్ఫీజును విద్యార్థుల తల్లిదండ్రులే భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ లాంటి కోర్సుల్లో సైతం మైనార్టీ విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా చేరగలుగుతున్నారని, ఈ ప్రభావం కొన్నేళ్ల తర్వాత ముస్లింలలో గణనీయ ప్రగతి సాధిస్తుందని ముస్లిం పెద్దలే వ్యాఖ్యానిస్తున్నారు. 2006 నుంచి ఇప్పటిదాకా 14 లక్షల మందికి లబ్ధి పొందారు. ఏటా 50శాతం మందికి ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు వస్తున్నాయి. ఈ కోర్సులో మైనార్టీ బాలికల కోటా 38 శాతానికి చేరడం గమనార్హం. ప్రముఖ ఆర్థికవేత్త అబూసలేషరీఫ్ నివేదికలోనూ ముస్లిం విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న వైఎస్సార్ కలల పథకం గురించి ప్రస్తావించడం గమనార్హం. ‘ఉపకారం’ లేని బాబు... - తానే హైటెక్‌సిటీ నిర్మించానని చెప్పుకునే చంద్రబాబుకు అప్పుడు పల్లెల్లోని పేదలు గుర్తురాలేదు. కనీసం బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లిచ్చేందుకు కూడా మనసు వచ్చేది కాదు. ఒక్కో కాలేజీలో 100 మంది పిల్లలుంటే 10 మందికో, 20 మందికో స్కాలర్షిప్ మాత్రమే ఇచ్చేవారు. అది కూడా మరుసటి ఏడాది వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఏటా కేవలం పదుల కోట్లలో స్కాలర్షిప్లను పదిశాతంమంది విద్యార్థులకిచ్చి చేతులు దులుపుకునేవారు. - ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే విద్యార్థి సంఘాలు ఉద్యమించినప్పుడు... వాటిని రద్దు చేస్తానని బెదిరించడమే కాక తన పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాన్ని కూడా రద్దు చేశారు. స్కాలర్‌షిప్‌ల పెంపు కోసం బీసీ విద్యార్థులు ఉద్యమిస్తే వారిపై లాఠీచార్జి చేయించారు. - స్కాలర్షిప్ ఇవ్వడానికి సిద్ధపడని బాబు ప్రభుత్వం ఇంటర్ స్థాయి నుంచే విద్యను కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం చేసింది. - చదువుకే కాదు..ఉపాధికల్పనలోనూ బాబు హయాం చీకటి యుగమే. బీసీ యువతకు స్వయం ఉపాధి కోసం ఇస్త్రీపెట్టెలు, మోకులు, సైకిళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. -
నూతనోత్సాహం
15.70 లక్షల మంది కొత్త ఓటర్లు త్వరలో గుర్తింపు కార్డులు ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కొత్తగా 15.70 లక్షల మంది ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే వీరికి గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు సోమవారం ఒక్క రోజే 73 మంది 114 నామినేషన్లను దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 28 నియోజక వర్గాల్లో 190 మంది అభ్యర్థులు 280 నామినేషన్లను దాఖలు చేశారని తెలిపారు. ప్రముఖుల నామినేషన్లు రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థులుగా ధార్వాడలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, హావేరిలో శివకుమార్ ఉదాసి, బెల్గాంలో సురేశ్ అంగడి, హాసనలో విజయ్ శంకర్, గుల్బర్గలో రేవూ నాయక్ బెళమగి, చిక్కోడిలో రమేశ్ కత్తి, తుమకూరులో జీఎస్. బసవరాజులు నామినేషన్లు వేశారు. బెల్గాంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ హెబ్బాల్కర్ నామినేషన్ వేశారు. జేడీఎస్ అభ్యర్థులుగా శివమొగ్గలో గీతా శివ రాజ్‌కుమార్, చామరాజ నగరలో ఎం. శివన్న, ఉత్తర కన్నడలో శివానంద నాయక్, బెంగళూరు గ్రామీణలో ప్రభాకర రెడ్డి, గుల్బర్గలో డీసీ. సాగర్, మండ్యలో సీఎస్. పుట్టరాజులు నామినేషన్లు దాఖలు చేశారు. -
లాస్ట్ చాన్స్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికలు, ఓటు విలువపైనా ప్రజల్లో చైతన్యం పెల్లుబుకడంతో ఈ సారి భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు జాబితాలో చేరిపోయారు. చరిత్రలో తొలిసారిగా ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత సైతం కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించడం విశేషం. సాధారణ నమోదు కార్యక్రమం గత ఏడాది అక్టోబరులోనే ప్రారంభం కాగా 23.49 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 5.37 కోట్లకు చేరింది. ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతో మరో 9.5 లక్షల మంది ఓటర్లుగా మారిపోయారు. ఈనెల 25వ తేదీ (మంగళవారం) నాటికి తుది అవకాశం ఇచ్చారు. ఇంకా అనేక దరఖాస్తులు పరిశీలించాల్సి ఉండగా వాటిని కలుపుకుంటే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.50 కోట్లకు చేరువలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ చెబుతోంది. వచ్చేనెల 24వ తేదీన జరిగే పోలింగ్‌లోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయలేకుంటే ఫొటోతో కూడిన స్లిప్పును ఈసీ అధికారులు ఇంటి వద్దనే అందజేస్తారు. సదరు స్లిప్పును చూపి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు. పట్టుబడుతున్న నగదు ఈనెల 5వ తేదీన ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే కోడ్ అమల్లోకి వచ్చింది. ఒక మెజిస్టీరియల్ హోదా కలిగిన అధికారి, నలుగురు సాయుధ పోలీసులు, ఒక వీడియో కెమెరామన్‌తో కూడిన 705 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 705 నిఘా బృందాలు 6వ తేదీనే ఎన్నికల విధుల్లో చేరిపోయాయి. ఈ బృందాలు చేపట్టిన వాహనాల తనిఖీల్లో సోమవారం వరకు రూ.13 కోట్ల నగదు పట్టుబడింది. వాహనాల సోదాలు, భారీగా నగదు పట్టుకోవడం, పట్టుకున్న నగదుపై సరైన డాక్యుమెంట్లు చూపినా తిరిగి అప్పగించక పోవడం వంటి విమర్శలు ఎన్నికల కమిషన్ చెవిన పడ్డాయి. అంతేగాక అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే అధికారులపై ఈసీ దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రి సంపత్ బహిరంగంగా డబ్బులు పంచినట్లు డీఎంకే ఫిర్యాదు చేసేవరకు స్థానిక అధికారులు ఈసీకి చెప్పలేదు. దీంతో ఈ రాష్ర్ట పోలీసులు, అధికారులు పక్షపాత ధోరణికి పాల్పడతున్నారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్న తరుణంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ పొరుగు రాష్ట్రాల అధికారులపై దృష్టి సారించారు. తమిళనాడు ఎన్నికలు పారదర్శకంగా సాగాలంటే అధికారులను మార్చక తప్పదన్న నిర్ణయంతో 32 బెటాలియన్ల పోలీసులను రప్పించారు. వారంతా సోమవారం నుంచే విధుల్లో చేరిపోయారు. జిల్లాకో బెటాలియన్ చొప్పున పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రంలోనే ఉంటారు. ఇదిలా ఉండగా ఎన్నికల పరిశీలకులుగా వివిధ రాష్టాల నుంచి 39 మంది ఐఏఎస్ అధికారులు తమిళనాడుకు చేరుకోనున్నారు. వీరు సైతం 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ అభ్యర్థుల కదలికలు, ఓటర్లను మభ్యపెట్టే చర్చలను అరికడతారు. -
యువహో.. యంగ్ ఏపీ
బి.గణేశ్‌బాబు: ఇప్పటిదాకా మత రాజకీయాలు విన్నాం. ధన రాజకీయాలు చూశాం. కుల, వర్గ, ప్రాంతీయ రాజకీయాలనూ పరికించాం. కానీ ఇకపై యువ రాజకీయాలు చూడబోతున్నాం. ఎందుకంటే దేశంలోని మొత్తం ఓటర్లలో 47 శాతం మంది 18-35 ఏళ్ల లోపు యువ ఓటర్లే. ఈసారి దాదాపు 15 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదైనట్టు ఒక అంచనా. 2014లో వారు ఎవరి వైపు మొగ్గితే వారిదే విజయం. ప్రస్తుతం దేశంలో ప్రతి మూడో ఓటరూ 30 ఏళ్ల లోపు వ్యక్తే. మరో ఏడేళ్లలో దేశంలో జనాభా సగటు వయసు 29 ఏళ్లకు చేరుకోనుంది. 2020 నాటికి ప్రపంచంలోనే ‘అతి పిన్నవయసు’ దేశంగా భారత్ అవతరించనుంది. ఈ లెక్కన రానున్న దశాబ్దాల్లో యువతే దేశ రాజకీయాలను శాసించనుంది. దాంతో యువ ఓటును ఆకర్షించేందుకు పార్టీలన్నీ మేనిఫెస్టోలను సవరించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వెల్లువలా యువ ఓటర్ల నమోదు భారత ఎన్నికల చరిత్రలో తొలిసారి బలమైన ముద్ర కొత్త ఓటర్లు భారీ సంఖ్యలో నమోదవడం వెనక ఎన్నికల సంఘం పాత్ర అంతా ఇంతా కాదు. 18 ఏళ్లునిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈసీ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయడం, నమోదైన వారంతా పోలింగ్‌లో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా ‘సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్’ (స్వీప్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు, వ్యాస రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, మానవహారాలు, దృశ్య శ్రవణ ప్రకటనలు... ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహించింది. ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు కాలేజీలకు వెళ్లి అక్కడే ఓటర్ల నమోదు చేయడం, పోస్టాఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ‘డ్రాప్ బాక్సు’లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించడం, ఆన్లైన్లో నమోదు వంటి వినూత్న చర్యలు చేపట్టింది. నవ భారత్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయసు గల దాదాపు 2.31కోట్ల మంది యువతీ యువకులు తొలిసారిగా ఓటు వేయనున్నారు పెరుగుతున్న రాజకీయాసక్తి దేశవ్యాప్తంగా యువతలో రాజకీయాసక్తి బాగా పెరుగుతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ హత్య సందర్భంగా వెల్లువెత్తిన నిరసనలో, అన్నాహజారే, కేజ్రీవాల్ ఉద్యమాల్లో, సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో యువత క్రియాశీలకంగా పాల్గొంది. దేశ వ్యాప్తంగా పట్టణ యువతలో రాజకీయ ఆసక్తి పెరిగినట్లు అమెరికాకు చెందిన ‘గ్లోబల్ అర్బన్ యూత్ రీసర్చ్ నెట్వర్క్’ నివేదిక తేల్చింది. 1996లో 43 శాతం యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపితే అది ప్రస్తుతం 71 శాతానికి పెరిగిందని వివరించింది. అంకెల్లో యువ భారతం * దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 82 కోట్ల పై చిలుకు (మార్చి 9, 16 తేదీల్లో కూడా నమోదు చేసుకున్న వారిని కలుపుకుంటే) * వారిలో యువ ఓటర్ల సంఖ్య 47 శాతం * యువ ఓటర్లలో 51.4 శాతం పురుషులు, 48.6 శాతం మహిళలు * ఇటీవలి నాలుగు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం బాగా పెరిగింది. ప్రధానంగా కొత్త ఓటర్లే ఇందుకు కారణం. * ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 58 నుంచి 67 శాతానికి పెరిగింది. రాజస్థాన్‌లో 67 శాతంనుంచి 74 శాతానికి, ఛత్తీస్‌గఢ్‌లో 71 శాతం నుంచి 74 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 70 శాతం నుంచి 71 శాతానికి పెరిగింది. * దేశవ్యాప్తంగా కళాశాలల్లో ప్రస్తుతం 3 కోట్ల మంది విద్యార్థులున్నారు * ఏటా 90 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారు * మళ్లీ వారిలో 40 శాతం మంది యవతులున్నారు * భారత్‌లో అత్యంత పిన్న వయస్కులైన ప్రజాప్రతినిధులు 38 మంది ఉన్నారు (అయితే వారిలో 33 మంది తల్లిదండ్రులు కూడా రాజకీయాల్లో ఉన్నారు!) ఇకపై రికార్డు పోలింగే! ఈ సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర గతంలో ఎన్నడూ లేనంతగా పెరగనుందని ఇటీవలి ‘గూగుల్’ సర్వేలో వెల్లడయ్యింది. దేశంలోని 86 నగరాల్లో విస్తరించి ఉన్న 108 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 18-35 ఏళ్ల మధ్య వయసున్న 41,000 మందిని సర్వే చేయగా, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో ఏకంగా 94 శాతం మంది ఈసారి తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. పార్టీకే కాకుండా అభ్యర్థికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని పట్టణ యువ ఓటర్లు తెలిపారు. 35 శాతం మంది పార్టీని బట్టి ఓటేస్తామని తెలిపితే, 36 శాతం మంది అభ్యర్థికే ప్రాధాన్యత ఇస్తామనడం విశేషం. ప్రధాని అభ్యర్థిని బట్టి ఓటేస్తామన్నవారు 11 శాతమే. అభ్యర్థి సమర్థుడు కావాలని, ఆ సమర్థుడు యువకుడు కూడా అయితే తమ ఓటు వారికేనని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు సంబంధించిన వెబ్సైట్లు చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిందని ‘గూగుల్ ఇండియా’ ఎండీ రజన్ ఆనందన్ పేర్కొన్నారు. యంగ్ ఏపీ: 18-19 మధ్య వయసు గలవారు.. -
ఒకేరోజు 1.7 లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వచ్చే నెల 10న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఢిల్లీ ఎన్నికల సంఘం నగరవ్యాప్తంగా ఆదివారం ఏర్పాటు చేసిన 11,763 ప్రత్యేక శిబిరాల్లో 1.7 లక్షల మంది ఓటరు నమోదు దరఖాస్తులు సమర్పించారు. ఇది వరకే ఓటర్లుగా నమోదైన వాళ్ల వివరాలనూ ఈ సందర్భంగా తనిఖీ చేసుకునే అవకాశం కల్పించారు. ఇలాంటి వారికి సహకరించడానికి బూత్‌స్థాయి అధికారులను (బీఎల్ఓ) నియమించామని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్లు తమ వివరాలను తనిఖీ చేసుకునేందుకు వీలుగా జాబితాను అంటించారు. అందులో పేర్లు లేని వాళ్లు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఫారం నంబరు 6 ఇచ్చారు. బుధవారం దాకా ఈ ఫారాలను సమర్పించవచ్చు. శ్రీ వెంకటేశ్వర కాలేజీలో అంటించిన ఓటర్ల జాబితా, ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయ సీనియర్ అధికారులు ఈ శిబిరాలను పర్యవేక్షించారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ సైతం హనుమాన్రోడ్డు, లోధీ ఎస్టేట్, పండారా రోడ్డు, ఆర్కే పురం పోలింగ్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓటర్ల పేర్ల పరిశీలన, ధ్రువీకరణతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు కూడా శిబిరాల్లో అవకాశం కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆషిమా జైన్ అన్నారు. మధ్యజిల్లా ఎన్నికల కార్యాలయం 1,056 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించడానికి పాతఢిల్లీ ప్రాంతంలో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమలనూ నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునేవారి సంఖ్యను మరింతగా పెంచి, గత రికార్డులను తిరగరాస్తామని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్‌దేవ్ ఇటీవల ప్రకటించారు. నగరంలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో 1.20 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించే అన్ని చర్యలను తీసుకుంటున్నామని, తద్వారా గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 65.86 పోలింగ్ శాతాన్ని ఈసారి అధిగమిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. జనవరి 31 నాటికి ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నవారి సంఖ్య 1,20,60,493కు చేరిందన్నారు. ఇందులో పురుషుల సంఖ్య 66,84,476 ఉండగా, మహిళల సంఖ్య 53,76,017 మంది ఉన్నారని, ఇందులో 638 మంది లింగమార్పిడి చేసుకున్నవారు ఉన్నారని చెప్పారు. ఢిల్లీ ఓటర్లలో స్త్రీ, పురుష నిష్పత్తి 804:1000 గా ఉందని, మొత్తం జనాభాలో ఓటర్ల సంఖ్య 68.12 శాతం ఉందని దేవ్ అన్నారు.