సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2024 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఈ కార్య క్రమంలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువతతో పాటు ప్రస్తుత ఓటరుజాబితాలో పేరు లేని వారి నుంచి సైతం దరఖాస్తులను స్వీకరించ నున్నారు.
జనవరి 6 నుంచి సవరణ ప్రారంభం కానుండ గా, అంతకు ముందు పోలింగ్ కేంద్రాల పునర్వ్య వస్థీక రణ, సెక్షన్ల ఏర్పాటు, ఓటర్ల జాబితా/ఫొటో ఓటరు గు ర్తింపు కార్డుల్లో లోపాల దిద్దుబాటు, ఓటర్ల జాబితాలో స రైన ఫొటోలు ముద్రించడం, పోలింగ్ కేంద్రాల సరిహ ద్దుల వారీగా సెక్షన్లు/పార్టుల పునర్విభజన తదితర చర్య లను జనవరి 5 వరకు పూర్తి చేయనున్నారు. జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. నాటి నుంచి జనవరి 22 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు లు, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తా రు.
ముసాయిదా జాబితాలో తప్పులు/లోపాల దిద్దుబా టు, ఓటరు చిరునామా మార్పు కోసం సైతందరఖాస్తు చే సుకోవడానికి వీలు కల్పించనున్నారు. ఫిబ్రవరి 2లోగా ద రఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6న తుది ఓటర్ల జాబితా నాణ్యతను పరిశీలించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదముద్ర తీసుకుంటారు. ఫిబ్రవరి 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
డోర్ టూ డోర్ సర్వే
బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) తమ వద్ద ఉన్న ప్రస్తుత ఓటర్ల జాబితాను తీసుకుని ఇంటింటికీ తిరిగి కుటుంబ పెద్దను కలవడం ద్వారా సంబంధిత ఓటర్లు ఉన్నారా? లేదా? అన్న విషయంపై పరిశీలన జరపను న్నారు. 2024 జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువత సైతం కొత్త ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే వారికి ఓటు హక్కు కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment