21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలే | Women voters outnumber men in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలే

May 26 2024 3:28 AM | Updated on May 26 2024 6:24 AM

Women voters outnumber men in Andhra Pradesh

ఆ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు 

కాకినాడ, అనంతపురం తప్ప మిగతా స్థానాల్లో భారీ వ్యత్యాసం 

మహిళల ఓట్లు వైఎస్సార్‌సీపీకే అంటున్న రాజకీయ విశ్లేషకులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని స్పష్టమైంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువ మంది ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ గణాంకాలు పేర్కొన్నాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు, హిందూపురం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే మహిళలు కన్నా పురుషులు స్వల్పంగా ఎక్కువగా ఓటేశారు. కాకినాడ, అనంతపురం లోక్‌సభ స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువగా ఓటేసినా.. తేడా మాత్రం స్వల్పంగానే ఉంది.

మిగతా లోక్‌సభ స్థానాల్లో 11 వేల నుంచి 47 వేల వరకు మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయంటే సహజంగానే వైఎస్సార్‌సీపీకే మొగ్గు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే కారణమని వారు విశ్లేíÙస్తున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట పథకాలు మంజూరు చేయడంతో మహిళా ఓటింగ్‌ పెరిగిందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని మహిళలందరూ మళ్లీ వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే గట్టి పట్టుదలతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారని సీనియర్‌ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల ఓట్లు ఎక్కువగా నమోదైన 21 పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లన్నీ వైఎస్సార్‌సీపీకే పడ్డాయని, పోలింగ్‌ రోజు ఇది స్పష్టంగా కనిపించిందని ఆ రాజకీయ నాయకులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ అపార్ట్‌మెంట్లలో ఇస్త్రీ పనికి వెళ్లిన వారితో పాటు వివిధ రకాల చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వెళ్లిన మహిళలందరూ కూడా ఏపీ వెళ్లి వైఎస్సార్‌సీపీకే ఓటు వేశామని  చెబుతున్నారు. ప్రభుత్వం వల్ల మేలు పొందిన వారందరూ ఎక్కడున్నా సరే పోలింగ్‌ రోజున రాష్ట్రానికి వచ్చి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఓటు వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement