న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదైన ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసింది బీజేపీ. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు కొత్త ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.
‘మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని ఈసీని కోరాం. స్వల్ప వ్యవధిలో 25వేల కొత్త ఓట్లు ఎలా వచ్చాయి? బోగస్ ఓటర్లను చేర్పించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది.’ అని ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పించారు తరుణ్ చుగ్.
ఇదీ చదవండి: రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులా? మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment