కొత్త ఓటర్లకు స్మార్ట్ కార్డులు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి భన్వర్లాల్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షా 58 వేల దొంగ ఓట్లు గుర్తించినట్టు తెలిపారు. ఎల్బీనగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులందాయని భన్వర్లాల్ చెప్పారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఓటరు నమోదు, సవరణకు ఈ 17 వరకు గడువు పొడగించినట్టు భన్వర్లాల్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పిదాలను సరిచేస్తామని చెప్పారు.
కొత్త ఓటర్లకు స్మార్ట్ కార్డులు: భన్వర్లాల్
Published Fri, Dec 6 2013 6:56 PM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement