Munugode Bypoll: Voter Numbers, New Voters Details Here - Sakshi
Sakshi News home page

మునుగోడు ఓటర్ల లెక్క తేలింది.. ఎంతంటే!

Published Sat, Oct 15 2022 3:52 PM | Last Updated on Sat, Oct 15 2022 5:05 PM

Munugode Bypoll: Voter Numbers, New Voters Details Here - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల లెక్క తేలింది. ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి మొత్తంగా 2,41,795 మంది ఓటర్లుగా తేల్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎన్నికల అధికారులు ఓటర్ల సంఖ్యను అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,795 మంది కాగా, అందులో పురుషులు 1,21,662 మంది, మహిళలు 1,20,126, ట్రాన్స్‌జెండర్‌లు 7 మంది ఉన్నారు. అందులో కొత్త ఓటర్లు 15,980 మందిగా తేల్చారు. 


ఈ ఏడాది జనవరి 1 తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,26,471 మంది కాగా, తాజా లెక్కల ప్రకారం 15,324 మంది ఓటర్లు నియోజకవర్గంలో పెరిగారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ 4 తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదు కోసం 26,742 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంటింటికి తిరిగి విచారించి 10,762 మంది దరఖాస్తులను తొలగించారు. 15,980 మంది ఓటర్లను అర్హులుగా ప్రకటించారు. (క్లిక్: కేసీఆర్‌ టార్గెట్‌పై టీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement