Voters enroll
-
మునుగోడు ఓటర్ల లెక్క తేలింది.. ఎంతంటే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల లెక్క తేలింది. ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి మొత్తంగా 2,41,795 మంది ఓటర్లుగా తేల్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎన్నికల అధికారులు ఓటర్ల సంఖ్యను అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,795 మంది కాగా, అందులో పురుషులు 1,21,662 మంది, మహిళలు 1,20,126, ట్రాన్స్జెండర్లు 7 మంది ఉన్నారు. అందులో కొత్త ఓటర్లు 15,980 మందిగా తేల్చారు. ఈ ఏడాది జనవరి 1 తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,26,471 మంది కాగా, తాజా లెక్కల ప్రకారం 15,324 మంది ఓటర్లు నియోజకవర్గంలో పెరిగారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదు కోసం 26,742 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంటింటికి తిరిగి విచారించి 10,762 మంది దరఖాస్తులను తొలగించారు. 15,980 మంది ఓటర్లను అర్హులుగా ప్రకటించారు. (క్లిక్: కేసీఆర్ టార్గెట్‌పై టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్) -
నేటి నుంచి ఓటర్ వెరిఫికేషన్
న్యూఢిల్లీ: కొత్త ఓటర్లను చేర్చేందుకు, చనిపోయిన వారి ఓట్లను తీసి వేసేందుకు ఎన్నికల కమిషన్ సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ‘మెగా ఎలక్టర్స్ వెరిఫికేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఈసీ అధికారులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రత్యేక యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. వాటితో అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాల్సి ఉంటుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ స్పష్టం చేశారు. ఇలా చేర్చిన వివరాలను బ్లాక్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. దీని వల్ల సమయం ఆదా కావడమేగాక, సాధికారత వైపు ఓటర్లు అడుగులు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతుందని అన్నారు. ఢిల్లీలో దీనిపై సెస్టెంబర్ 1 నుంచి 15 వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. ముసాయిదాను 2020 జనవరి 1న ప్రచురిస్తామని, రెండు మూడు వారాల్లోగా తుది ఫలితాలను తెలుపుతామన్నారు. ఇందులో పత్రాలు సమర్పించేందుకు రూ. 1, ఫొటో అప్లోడ్ చేసేందుకు రూ. 2, ఫామ్ 6 సమర్పించేందుకు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. -
ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలు
సాక్షి, పర్చూరు(ప్రకాశం): సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్‌ని ప్రకటించడంతో అధికారుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఒకపక్క ప్రధాన పార్టీలు, అభ్యర్థుల ప్రకటన కోసం సర్వే నివేదికలు, వారి బలాబలాలపై పరిశీలన చేస్తుండగా, నామినేషన్ల పర్వం ఈనెల 18 నుంచి మొదలుకానుండటంతో అందుకు అవరమైన ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. వేగంగా పనులు చేయిస్తున్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గంలోని పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, యద్దనపూడి, మార్టూరు మండలాల్లో ఎన్నికల కోసం 300 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2014లో నియోజకవర్గంలో 272 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే ఈసారి కొత్తగా 28 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 300 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటంతో సులభంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా మార్టూరు మండలంలో 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యల్పంగా యద్దనపూడి మండలంలో 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో.. మార్టూరు మండలం 72 పర్చూరు మండలం 62 యద్దనపూడి మండలం 28 కారంచేడు మండలం 42 చినగంజాం మండలం 42 ఇంకొల్లు మండలం 54 మొత్తం పోలింగ్ కేంద్రాలు 300 మొత్తం ఓటర్లు – 2,19,427 పురుష ఓటర్లు – 1,07,547 స్త్రీ ఓటర్లు – 1,11,870 ఇతరులు – 10 సెక్టార్ ఆఫీసర్ల నియామకం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 300 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఎప్పటికప్పుడు పరిశీలించడానికి సెక్టార్ ఆఫీసర్లను నియమించారు. 38 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మండలంలో సెక్టార్ ఆఫీసర్లు పోలీసులతో పాటు వెళ్లి పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. గతంలో లేని విధంగా ఈసారి ఈసీ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లను చేసింది. వసతులపై దృష్టి పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బంది పడకుండా అధికారులు విద్యుత్, తాగునీటి వసతి వంటి ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు సైతం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఓటర్ల నమోదుకు సైతం ఆకరి అవకాశంగా కేంద్రాల వద్ద బీఎల్వోలు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. చేర్పుల కార్యక్రమం పూర్తయితే ఇంకా ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ఓటర్ల నమోదు గడువు 15 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇరు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటర్లగా పేర్లు నమోదు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. గత నెల 13వ తేదీన రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటర్లగా నమోదు, జాబితాల్లో సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో ప్రత్యేకంగా ఓటర్ల నమోదు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు. దరఖాస్తులను, అభ్యంతరాలను 28వ తేదీలోగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 16న ప్రకటిస్తామన్నారు. ‘సీఈవోఆంధ్రా, సీఈవోతెలంగాణ’ సైట్ల ద్వారా ఓటర్‌గా నమోదుచేసుకోవచ్చన్నారు. -
నవంబర్ 1 నుంచి ఓటర్ల నమోదు
రెండు రాష్ట్రాల్లో 25వ తేదీ వరకు కార్యక్రమం జనవరి 5న తుది జాబితా ప్రకటన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నవంబర్ 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. నవంబర్ 1వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటించిన అనంతరం 25వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడతారు. ఈ మధ్య కాలంలో ఆదివారాలైన నవంబర్ 9, 16, 23వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతారు. ఆ రోజుల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, బూత్ స్థాయి రాజకీయ పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో సమావేశమవుతారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు అక్కడకు వెళ్లి ఓటర్‌గా నమోదుకు దరఖాస్తులను అందజేయవచ్చు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు కూడా దరఖాస్తులను అందజేయవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరిని ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. 25వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ల జాబితాలోకి చేర్చుతారు. తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ప్రకటించనున్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమం సమయంలో జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల బదిలీలపై నిషేధం విధించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆ రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లకు శనివారం ఫైళ్లు పంపించారు. -
యువహో.. యంగ్ ఏపీ
బి.గణేశ్‌బాబు: ఇప్పటిదాకా మత రాజకీయాలు విన్నాం. ధన రాజకీయాలు చూశాం. కుల, వర్గ, ప్రాంతీయ రాజకీయాలనూ పరికించాం. కానీ ఇకపై యువ రాజకీయాలు చూడబోతున్నాం. ఎందుకంటే దేశంలోని మొత్తం ఓటర్లలో 47 శాతం మంది 18-35 ఏళ్ల లోపు యువ ఓటర్లే. ఈసారి దాదాపు 15 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదైనట్టు ఒక అంచనా. 2014లో వారు ఎవరి వైపు మొగ్గితే వారిదే విజయం. ప్రస్తుతం దేశంలో ప్రతి మూడో ఓటరూ 30 ఏళ్ల లోపు వ్యక్తే. మరో ఏడేళ్లలో దేశంలో జనాభా సగటు వయసు 29 ఏళ్లకు చేరుకోనుంది. 2020 నాటికి ప్రపంచంలోనే ‘అతి పిన్నవయసు’ దేశంగా భారత్ అవతరించనుంది. ఈ లెక్కన రానున్న దశాబ్దాల్లో యువతే దేశ రాజకీయాలను శాసించనుంది. దాంతో యువ ఓటును ఆకర్షించేందుకు పార్టీలన్నీ మేనిఫెస్టోలను సవరించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వెల్లువలా యువ ఓటర్ల నమోదు భారత ఎన్నికల చరిత్రలో తొలిసారి బలమైన ముద్ర కొత్త ఓటర్లు భారీ సంఖ్యలో నమోదవడం వెనక ఎన్నికల సంఘం పాత్ర అంతా ఇంతా కాదు. 18 ఏళ్లునిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈసీ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయడం, నమోదైన వారంతా పోలింగ్‌లో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా ‘సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్’ (స్వీప్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు, వ్యాస రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, మానవహారాలు, దృశ్య శ్రవణ ప్రకటనలు... ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహించింది. ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు కాలేజీలకు వెళ్లి అక్కడే ఓటర్ల నమోదు చేయడం, పోస్టాఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ‘డ్రాప్ బాక్సు’లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించడం, ఆన్లైన్లో నమోదు వంటి వినూత్న చర్యలు చేపట్టింది. నవ భారత్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయసు గల దాదాపు 2.31కోట్ల మంది యువతీ యువకులు తొలిసారిగా ఓటు వేయనున్నారు పెరుగుతున్న రాజకీయాసక్తి దేశవ్యాప్తంగా యువతలో రాజకీయాసక్తి బాగా పెరుగుతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ హత్య సందర్భంగా వెల్లువెత్తిన నిరసనలో, అన్నాహజారే, కేజ్రీవాల్ ఉద్యమాల్లో, సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో యువత క్రియాశీలకంగా పాల్గొంది. దేశ వ్యాప్తంగా పట్టణ యువతలో రాజకీయ ఆసక్తి పెరిగినట్లు అమెరికాకు చెందిన ‘గ్లోబల్ అర్బన్ యూత్ రీసర్చ్ నెట్వర్క్’ నివేదిక తేల్చింది. 1996లో 43 శాతం యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపితే అది ప్రస్తుతం 71 శాతానికి పెరిగిందని వివరించింది. అంకెల్లో యువ భారతం * దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 82 కోట్ల పై చిలుకు (మార్చి 9, 16 తేదీల్లో కూడా నమోదు చేసుకున్న వారిని కలుపుకుంటే) * వారిలో యువ ఓటర్ల సంఖ్య 47 శాతం * యువ ఓటర్లలో 51.4 శాతం పురుషులు, 48.6 శాతం మహిళలు * ఇటీవలి నాలుగు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం బాగా పెరిగింది. ప్రధానంగా కొత్త ఓటర్లే ఇందుకు కారణం. * ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 58 నుంచి 67 శాతానికి పెరిగింది. రాజస్థాన్‌లో 67 శాతంనుంచి 74 శాతానికి, ఛత్తీస్‌గఢ్‌లో 71 శాతం నుంచి 74 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 70 శాతం నుంచి 71 శాతానికి పెరిగింది. * దేశవ్యాప్తంగా కళాశాలల్లో ప్రస్తుతం 3 కోట్ల మంది విద్యార్థులున్నారు * ఏటా 90 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారు * మళ్లీ వారిలో 40 శాతం మంది యవతులున్నారు * భారత్‌లో అత్యంత పిన్న వయస్కులైన ప్రజాప్రతినిధులు 38 మంది ఉన్నారు (అయితే వారిలో 33 మంది తల్లిదండ్రులు కూడా రాజకీయాల్లో ఉన్నారు!) ఇకపై రికార్డు పోలింగే! ఈ సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర గతంలో ఎన్నడూ లేనంతగా పెరగనుందని ఇటీవలి ‘గూగుల్’ సర్వేలో వెల్లడయ్యింది. దేశంలోని 86 నగరాల్లో విస్తరించి ఉన్న 108 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 18-35 ఏళ్ల మధ్య వయసున్న 41,000 మందిని సర్వే చేయగా, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో ఏకంగా 94 శాతం మంది ఈసారి తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. పార్టీకే కాకుండా అభ్యర్థికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని పట్టణ యువ ఓటర్లు తెలిపారు. 35 శాతం మంది పార్టీని బట్టి ఓటేస్తామని తెలిపితే, 36 శాతం మంది అభ్యర్థికే ప్రాధాన్యత ఇస్తామనడం విశేషం. ప్రధాని అభ్యర్థిని బట్టి ఓటేస్తామన్నవారు 11 శాతమే. అభ్యర్థి సమర్థుడు కావాలని, ఆ సమర్థుడు యువకుడు కూడా అయితే తమ ఓటు వారికేనని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు సంబంధించిన వెబ్సైట్లు చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిందని ‘గూగుల్ ఇండియా’ ఎండీ రజన్ ఆనందన్ పేర్కొన్నారు. యంగ్ ఏపీ: 18-19 మధ్య వయసు గలవారు.. -
ఓటరుగా నమోదుకు చివరి అవకాశం: భన్వర్‌లాల్
ఓటర్ల జాబితాలో చేరి ఐదు ఎన్నికల్లో ఓటు వేయండి రాష్ట్ర ప్రజలకు సీఈవో భన్వర్‌లాల్ పిలుపు నేడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో నమోదుకు ఏర్పాట్లు జాబితాలో పేరు లేకుంటే అక్కడే దరఖాస్తు చేయండి ఈ ఎన్నికల్లో 2 లక్షల కొత్త ఈవీఎంల వినియోగం సామూహిక రైల్వే రిజర్వేషన్లపై నిఘా... రైల్వేకు లేఖ సాక్షి, హైదరాబాద్: ‘ఓటరుగా పేరు నమోదుకు ఇదే చివరి అవకాశం... దీన్ని వినియోగించుకొని ఐదు ఎన్నికల్లో ఓటు వేయండి’ ఈ నినాదంతో ఎన్నికల కమిషన్ ఓటర్ల నమోదుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 69,014 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలతో పాటు బూత్ స్థాయి అధికారులను అందుబాటులో ఉంచుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రతి ఒక్కరూ బూత్‌స్థాయి అధికారుల వద్ద గల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. పేరు లేకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోండి. మార్చి 20 కల్లా ఓటర్ల జాబితాల్లో ఆ పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఓటరుగా నమోదైతే ఎన్నికలు పూర్తయ్యే వరకు తొలగించడానికి వీల్లేదు. ఓటుహక్కు పొందితే వరుసగా మున్సిపల్, లోక్‌సభ, అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఐదు ఓట్లు వేయవచ్చు. గుర్తింపు కార్డు ఉంటే జాబితాలో పేరు ఉంటుందనుకోవద్దు. పొరపాటునో లేక ఇతర కారణాల వల్లో పేరు తొలగిస్తే గుర్తింపు కార్డు ఉన్నా ఓటుహక్కు రాదు. అందుకే ప్రతి ఒక్కరు ఆదివారం జాబితాను పరిశీలించండి. ఓటుహక్కు తప్పనిసరిగా పొందండి’’ అని కోరారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నందున ఓటుహక్కు వస్తుందనే నమ్మకం ఉండదన్నారు. ఆయన వెల్లడించిన వివరాలివీ... - నియమావళి అమల్లో భాగంగా నగదు, మద్యం పంపిణీని నిరోధించేందుకు అసెంబ్లీ స్థానానికి మూడేసి చొప్పున 1,800 చెక్‌పోస్టులు, ఫ్లయింగ్‌స్క్వాడ్స్. - కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం (నాన్‌డ్యూటీ పెయిడ్) నిరోధానికి సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేకంగా నిఘా. - ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి నక్సల్స్ రాకుండా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా. - రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నూతన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం. సోమవారం నుంచి తొలి దశ తనిఖీలు పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటి తనిఖీలు జరుగుతాయి. ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను పార్టీల ప్రతినిధుల సమక్షంలో 1,500 ఓట్లు వేసి తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియను చిత్రీకరిస్తారు. ఎవరైనా కావాలని అడిగితే ఆ వీడియో సీడీ ఇస్తారు. రెండో దశ తనిఖీలూ వంద ఓట్లతో చేస్తారు. తనిఖీల తర్వాత సంతృప్తి వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సంతకాలు తీసుకుంటారు. ఇదంతా నెలాఖరుకల్లా పూర్తి. - ఎన్నికల ఏర్పాట్లు, నియమావళి అమలుపై 13నజూబ్లీహాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో కేంద్ర డెప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి భేటీ. - ఈ నెల 19న కమిషన్ డెరైక్టర్ జనరల్ అక్షయ రావత్ పారిశ్రామిక సంస్థలు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా అవగాహన సదస్సు నిర్వహిస్తారు. - ఎన్నికల తేదీకి ముందు ప్రధానంగా హైదరాబాద్ జంటనగరాల్లో ఉంటున్నవారు సొంత ఊర్లకు వచ్చి ఓట్లు వేసేందుకు వీలుగా కొందరు అభ్యర్థులు చేయిస్తున్న సామూహిక రిజర్వేషన్ల నిరోధానికి నిఘా కోసం రైల్వే అధికారులకు లేఖ రాస్తారు. - సభలు, ర్యాలీలు, ప్రచారాల వ్యయం ఆయా పార్టీల ఖాతాల్లోకి వస్తుంది. - నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఖాతాలోకి ప్రచారం వ్యయం వెళ్తుంది. అయితే ఈలోగా అభ్యర్థి ఎవరైనా రాజకీయ పార్టీల సభల్లో వినియోగించిన ప్రచార సామాగ్రినే నామినేషన్ దాఖలు తరువాత కూడా వినియోగిస్తే ఆ వ్యయం అభ్యర్థి ఖాతాలోకి వెళ్తుంది. - ఎన్నికల ప్రచార సరళిని పూర్తిగా వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. -
ఓటరు నమోదుకు ఆఖరి అవకాశం..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో.. ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 9వ తేదీ (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల జాబితాలతో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. జాబితాలో పేరు ఉందో లేదో చూసుకుని.. పేరు లేకపోతే అక్కడికక్కడే ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఓటర్‌గా నమోదుకు అవకాశం ఉంటుంది. ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ‘వీఓటీఈ’ అని టైప్ చేసి గుర్తింపు కార్డు నంబర్‌తో 9246280027 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపితే కొద్ది సేపట్లోనే పేరు ఉందో లేదో జవాబు వస్తుంది. పోలింగ్‌కు వారం రోజుల ముందు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తారు. రెండు దఫాలు ఈ పంపిణీ జరుగుతుంది. అయినా స్లిప్‌లు అందనివారికి పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద ఇస్తారు.