న్యూఢిల్లీ: కొత్త ఓటర్లను చేర్చేందుకు, చనిపోయిన వారి ఓట్లను తీసి వేసేందుకు ఎన్నికల కమిషన్ సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ‘మెగా ఎలక్టర్స్ వెరిఫికేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఈసీ అధికారులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రత్యేక యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఇస్తారు. వాటితో అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాల్సి ఉంటుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ స్పష్టం చేశారు.
ఇలా చేర్చిన వివరాలను బ్లాక్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. దీని వల్ల సమయం ఆదా కావడమేగాక, సాధికారత వైపు ఓటర్లు అడుగులు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతుందని అన్నారు. ఢిల్లీలో దీనిపై సెస్టెంబర్ 1 నుంచి 15 వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. ముసాయిదాను 2020 జనవరి 1న ప్రచురిస్తామని, రెండు మూడు వారాల్లోగా తుది ఫలితాలను తెలుపుతామన్నారు. ఇందులో పత్రాలు సమర్పించేందుకు రూ. 1, ఫొటో అప్‌లోడ్ చేసేందుకు రూ. 2, ఫామ్ 6 సమర్పించేందుకు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment