Voters card
-
నేటి నుంచి ఓటర్ వెరిఫికేషన్
న్యూఢిల్లీ: కొత్త ఓటర్లను చేర్చేందుకు, చనిపోయిన వారి ఓట్లను తీసి వేసేందుకు ఎన్నికల కమిషన్ సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ‘మెగా ఎలక్టర్స్ వెరిఫికేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఈసీ అధికారులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రత్యేక యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. వాటితో అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాల్సి ఉంటుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ స్పష్టం చేశారు. ఇలా చేర్చిన వివరాలను బ్లాక్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. దీని వల్ల సమయం ఆదా కావడమేగాక, సాధికారత వైపు ఓటర్లు అడుగులు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతుందని అన్నారు. ఢిల్లీలో దీనిపై సెస్టెంబర్ 1 నుంచి 15 వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. ముసాయిదాను 2020 జనవరి 1న ప్రచురిస్తామని, రెండు మూడు వారాల్లోగా తుది ఫలితాలను తెలుపుతామన్నారు. ఇందులో పత్రాలు సమర్పించేందుకు రూ. 1, ఫొటో అప్లోడ్ చేసేందుకు రూ. 2, ఫామ్ 6 సమర్పించేందుకు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. -
ఓటు దొంగలున్నారు జాగ్రత్త!
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ తెలుగుదేశం పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం వారికి పట్టుకుంది. దీంతో ఎన్నెన్నో ఎత్తుగడలు వేస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్లను కొల్లగొట్టా లని చూస్తున్నారు. ఇందుకోసం ఎక్కడెక్కడ వైఎస్సార్సీపీ అభిమాన ఓటర్లున్నారో తెలుసుకుని ఏవో సాకులతో వారి ఓట్లను తొలగించే కుట్రకు తెర తీశారు. కొన్నాళ్ల క్రితం మొదలైన ఈ కుట్ర ఇప్పుడు పల్లెలు, పట్టణాలు, నగరా లకు విస్తరింపజేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, నిరుద్యోగులను ఎంచుకుని వారికి ట్యాబ్‌లను ఇచ్చి సర్వే పేరిట ఆయా ప్రాంతా లకు పంపుతున్నారు. వీరు ఎంపిక చేసుకున్న ఏరియాలకు వెళ్లి తాము రాబోయే ఎన్నికలపై సర్వే చేయడానికి వచ్చినట్టు పరిచయం చేసుకుంటున్నారు. అలా ఒక్కో అంశం కూపీ లాగు తూ ఓటర్ల నుంచి తమకు కావలసిన సమాచా రాన్నంతా రాబడుతున్నారు. దానిని తమ ట్యా బ్‌ల్లో నిక్షిప్తం చేసుకుని వెళ్తున్నారు. మొద ట్లో చాలామంది వీరు నిజంగా సర్వే కోసం వచ్చి న వారేనని భావించారు. కానీ కొద్దిరోజులుగా వీరి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండడంతో టీడీపీ నేతల అసలు కుట్ర బయటపడుతోంది. దీంతో పలువురు అప్రమత్తమవుతున్నారు. సర్వే పేరుతో హల్చల్.. సర్వే పేరిట కొంతమంది జిల్లాలోకి, విశాఖ నగరంలోకి కొద్దిరోజుల కిందటే ప్రవేశించారు. వీరిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. తాము పబ్లిక్ పాలసీ రీసెర్చి గ్రూపునకు చెందిన వారుగా చెప్పుకుంటున్నారు. ‘మీరు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? గతంలో ఏ పార్టీకి ఓటేశారు? ఏ పత్రిక చదువుతారు? వంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఓటర్ ఐడీ కార్డు వివరాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు నెల రోజుల క్రితం పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్‌పురంలో కొంతమంది యువకులు సర్వే పేరిట ఇంటింటికి వెళ్లారు. వారి సర్వే పేరుతో అడుగుతున్న వివరాలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉండడంతో స్థానికులు పట్టుకుని పాయకరావుపేట పోలీసులకు అప్పగించారు. అలాగే విశాఖలోని బర్మా క్యాంప్ ప్రాంతంలో ఈనెల 12న నలుగురు వ్యక్తులు కొన్ని ఇళ్లకు వెళ్లారు. ఏ పార్టీకి చెందిన వారంటూ ప్రశ్నలు సంధించడం, ట్యాబ్‌లో నిక్షిప్తం చేయడం వంటివి చూసి అనుమానంతో వారిని పోలీసులకు పట్టించారు. ఈనెల 20న ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు క్రాంతినగర్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఇంటింటికి తిరిగి వైఎస్సార్సీపీ సమచారాన్ని సేకరిస్తున్న తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు. వీరే కాదు.. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ సర్వే చేయడానికి వచ్చామని, తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, స్వచ్ఛందంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని ఏవో సంస్థల పేర్లు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ గురించి సమాచారాన్నే ఎక్కువగా సేకరిస్తున్నారు. వారి వద్ద తనిఖీ చేస్తే టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులుంటున్నాయి. ఇవన్నీ టీడీపీ కుట్ర అనేందుకు బలమైన సాక్ష్యాలుగా ఉన్నాయి. 25 ఇళ్లకు రూ.800 25 ఇళ్లలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వివరాలు సేకరించినందుకు ఒక్కో వ్యక్తికి రూ.800 చెల్లిస్తున్నట్టు సర్వేలో పాల్గొని పట్టుబడిన వారు చెబుతున్నారు. టీడీపీ నేతలు తమ కుట్రలో భా గంగా కొంతమంది నిరుద్యోగులకు ఇలా ఎరవే సి వినియోగించుకుంటున్నారు.ఈ టీమ్‌లో కొం దరు వెనక ఉంటూ సర్వే కథ నడిపిస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలి.. అభిప్రాయ సేకరణ పేరిట ప్రజలను మభ్యపెడుతూ టీడీపీకి చెందిన కొంతమంది వైఎస్సార్సీపీ ఓట్లు గల్లంతు చేసే కుట్ర చేస్తున్నారు. నగరంలో ప్రతి నియోజకవర్గం లోనూ ఇతర జిల్లాలకు నుంచి వచ్చిన టీడీపీ వ్యక్తులు లాడ్జిల్లో ఉంటూ సర్వేలంటూ వైఎస్సార్సీపీ సానుభూతిపరుల గురించి ఆరా తీస్తూ వారి వివరాలను టాబ్‌ల్లో నమోదు చేస్తున్నారు. పోలీసు అధికారులు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – ఎం. రాజ్‌కుమార్. బాలయ్యశాస్త్రి లేఅవుట్, సీతమ్మధార టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది.. 2019లో ఓటమి చవి చూస్తామని తెలిసి టీడీపీ నేతలకు భయం పట్టుకుంది. అందుకే ఎక్కడ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి అభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి ఇంటికు వెళ్లి వారికి కావలసిన వివరాలను తీసుకుంటున్నారు. సర్వే పేరుతో ఒక ట్యాబ్ పట్టుకొని ఏ పార్టీకి ఓటు వేస్తావు, ఏ ప్రభుత్వంపై మీకు నమ్మకం ఉంది? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సర్వే పేరుతో వైఎస్సార్సీపీ అభిమానుల వివరాలు సేకరించడం టీడీపీ కుట్రలో భాగమే. – జీవీఎస్ఎల్డి రామరాజు, అక్కయ్యపాలెం ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే... సర్వేల పేరుతో ఓట్లు తొలగించడం ప్రభుత్వం కుట్రలో భాగమే.. రాష్ట్ర వ్యప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ప్రభుతం స్పందించడం లేదంటే ఏమయి ఉంటుంది. దీనిపై ప్రజల్లో చాలా ఆందోళనలున్నాయి. ఈ ట్యాబ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారన్న అంశాలపై ఆరా తీయాలి. ఓట్లు పోయిన వారికి వెంటనే తిరిగి నమోదు చేయాలి. ఓటమి భయంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. – పూరెడ్డి పైడిరెడ్డి, కాంట్రాక్టరు -
13 జిల్లాల్లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్లు
సాక్షి, విజయవాడు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రాంప్రకాశ్ సిసోడియా గురువారం నగరంలోని బారతీనగర్‌లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు 1950 నెంబర్‌కు ఫోన్ కాల్ చేసి తమ ఓటు కార్డు స్టేటస్‌తో పాటు ఈపీఐసీ నెంబర్‌ను 9223166166 లేదా 51969కు ఎస్ఎంఎస్ చేసి తమ ఓటు స్టేటస్ ను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏపీలోని 13 జిల్లాల్లో 13 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామని సిసోడియా చెప్పారు. -
ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు!
ఎల్.ఎన్.పేట: ఓటర్ల జాబితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక గ్రామం ఓటర్లు జా బితాలో ఆ గ్రామంతో ఎలాంటి సంబంధం లేని ఓటర్ల పేర్లు కనిపించగా, మరో గ్రామం జాబి తాలో మాజీ సర్పంచ్.. బీఎల్ఓ (బూత్‌లెవల్)ల పేర్లు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు మరో కోణం వెలుగు చూసింది. ఆ గ్రామంలో ఒకే మహిళ పేరుతో నాలుగు ఓట్లు చోటు చేసుకున్నాయి. వివరా ల్లోకి వెళితే.... పాతపట్నం నియోజక వర్గంలోని 314 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎల్.ఎన్.పేట మండలం పెద్దకొల్లివలస పంచాయతీలో ఓటర్ల జాబితాల్లో అనేక తప్పులు చోటు చేసుకున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో పోలింగ్ స్టేషన్ నంబర్ 153లో పెద్దకొల్లివలస పునరావాస కాలనీ ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన ఓటరు జాబితాలో మొత్తం ఓట్లు 779 ఉన్నాయి. పురుషులు 392 మహిళలు 387 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దకొల్లివలస పోలింగ్ స్టేషన్ 153లో సుంకు అమరావతి పేరున సీరియల్ నంబర్ 760, 762, 763, 764 ప్రకారం ఆమెకు నాలుగు ఓట్లు ఉన్నాయి. మరో ఇద్దరికి రెండేసి ఓట్లు ఉన్నాయి. ఇదే పంచాయతీలోని పోలింగ్ కేంద్రం నంబర్ 156లో జగన్నాథపురం గ్రామం ఉంది. ఈ గ్రా మంలో 473 మొత్తం ఓట్లు ఉండగా వీరిలో 236 పురుషులు, 237 మహిళా ఓటర్లు ఉన్నారు. హిరమండలం మండలం తులగాం గ్రామానికి చెంది న 286 మంది ఓట్లు చేర్పించారు. నిజానికి జగన్నాథపురం గ్రామంలో పాత ఓటర్ల జాబితా ప్ర కారం 187 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఓ టర్ల జాబితాలో ఉన్న అలాంటి వ్యక్తులు గ్రామంలో మాత్రం లేరని స్థానికులు చెబుతున్నారు. వీరంతా ఆమదాలవలస మండలంలోని గాజులకొల్లివలస వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఉన్నారు. -
వేట షురూ..!
- గ్రేటర్లో 7878 ఓట్ల తొలగింపు - ఓటర్ల జాబితాలో అర్హులకే చోటు - పకడ్బందీ చర్యల్లో జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో: రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోగస్ ఓటర్లను అరికట్టడంతో పాటు అసలైన ఓట ర్లందరూ విధిగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలు చేపట్టింది. గ్రేటర్లో జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉండటం గత ఎన్నికల్లో దృష్టికి రావడంతో ఈసారి పకడ్బందీ చర్యలకు సిద్ధమయ్యారు. వచ్చే డిసెంబర్‌లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అర్హులైన ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు.. బోగస్ , డూప్లికేట్లు, మరణించినవారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇళ్లు మారినవారు, ఇళ్లకు తాళా లు వేసినవారికి తగు సూచనలు జారీ చేయడంతోపాటు అవసరమైన నోటీసులందజేసి, నిర్ణీత వ్యవధిలోగా స్థానికంగా ఉంటున్నట్లు తెలియజేయాల్సిందిగా హెచ్చరించినప్పటికీ స్పందించని వారితో సహ మృతులు తదితరులు వెరసి ఇప్పటి వరకు 7878 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. డూప్లికేట్ ఓట్లు 363, అనర్హులు 142, మృతులు 7182, చిరునామా మారినవారు 75, ఇళ్లకు తాళాలున్నవారు 116 (మొత్తం 7878) ఓట్లు తొలగించారు. జాబితాలోంచి తొలగించేందుకు ముందు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత చిరునామా లో వారు లేనట్లు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని, అవసరమైన నోటీసులిచ్చి, ఇరుగుపొరుగును సంప్రదించి తొలగించినట్లు స్పష్టం చేశారు. గ్రేటర్‌లోని 18 సర్కిళ్లకుగాను ఐదు సర్కిళ్లలో ప్రస్తుతం ఈ చర్యలు తీసుకున్నారు. సర్కిళ్ల వారీగా.. రాజేంద్రనగర్ సర్కిల్లో 416 ఓట్లు, .కుత్బుల్లాపూర్ సర్కిల్లో 2654, అల్వాల్‌లో 2179, మల్కాజిగిరిలో 2260, సికింద్రాబాద్‌లో 369(మొత్తం 7878) ఓట్లు తొలగించారు. జాబితాలోంచి పేర్లు తొలగించేముందు మొత్తం 17,42,391 మందికి తుదినోటీసులు జారీ చేసి.. ఎలాంటి స్పందన లేనివారిపై విచారణ జరిపి, మృతులను ధ్రువీకరించుకొని..స్థానికంగా లేనట్లు నిర్ధారించుకొని జాబితానుంచి తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆధార్‌తో అనుసంధానం ఇలా.. - ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోని వారు వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకుంటే మంచిది. అనుసంధానం కోసం.. - సమీపంలోని పోలింగ్‌కేంద్రాలకు వెళ్లి ఆధార్, ఓటరుకార్డు వివరాలు అందజేయాలి. - అదీ కుదరని వారు తమ సమీపంలోని మీసేవ కేంద్రాల్లో ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులను అందజేస్తే అనుసంధానిస్తారు. - జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీనెంబరు 040-21 11 11 11ను లేదా 155304 నెంబరును సంప్రదించవచ్చు. ముఖ్య ఎన్నికల అధికారి టోల్‌ఫ్రీనెంబరు 1950ను కూడా సంప్రదించవచ్చు. - ఎస్ఎంఎస్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఎస్‌ఈఈడీఈపీఐసీ(సీడ్‌ఎపిక్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరుగుర్తింపుకార్డు నెంబరు వేసి స్సేస్ ఇచ్చి ఆధార్‌నెంబరు వేసి 8790499899 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయవచ్చని జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. - ఇంటర్నెట్ ద్వారా (జ్ట్టిఞ:// 164.100. 132.184/్ఛఞజీఛి/్ఛజ్ఛ్ఛఛీజీజ.్జటఞ) కూడా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. - ఓటరు జాబితాలో పేరు లేనప్పటికీ..కొత్తవారు కూడా సంబంధిత సర్కిల్లోని ఎన్నికల కార్యాలయంలో సంప్రదించి నమోదు చేసుకోవచ్చు.