
ఎల్.ఎన్.పేట: ఓటర్ల జాబితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక గ్రామం ఓటర్లు జా బితాలో ఆ గ్రామంతో ఎలాంటి సంబంధం లేని ఓటర్ల పేర్లు కనిపించగా, మరో గ్రామం జాబి తాలో మాజీ సర్పంచ్.. బీఎల్‌ఓ (బూత్‌లెవల్)ల పేర్లు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు మరో కోణం వెలుగు చూసింది. ఆ గ్రామంలో ఒకే మహిళ పేరుతో నాలుగు ఓట్లు చోటు చేసుకున్నాయి. వివరా ల్లోకి వెళితే.... పాతపట్నం నియోజక వర్గంలోని 314 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎల్.ఎన్.పేట మండలం పెద్దకొల్లివలస పంచాయతీలో ఓటర్ల జాబితాల్లో అనేక తప్పులు చోటు చేసుకున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో పోలింగ్ స్టేషన్ నంబర్ 153లో పెద్దకొల్లివలస పునరావాస కాలనీ ఓటర్లు ఉన్నారు.
ఈ గ్రామానికి చెందిన ఓటరు జాబితాలో మొత్తం ఓట్లు 779 ఉన్నాయి. పురుషులు 392 మహిళలు 387 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దకొల్లివలస పోలింగ్ స్టేషన్ 153లో సుంకు అమరావతి పేరున సీరియల్ నంబర్ 760, 762, 763, 764 ప్రకారం ఆమెకు నాలుగు ఓట్లు ఉన్నాయి. మరో ఇద్దరికి రెండేసి ఓట్లు ఉన్నాయి. ఇదే పంచాయతీలోని పోలింగ్ కేంద్రం నంబర్ 156లో జగన్నాథపురం గ్రామం ఉంది. ఈ గ్రా మంలో 473 మొత్తం ఓట్లు ఉండగా వీరిలో 236 పురుషులు, 237 మహిళా ఓటర్లు ఉన్నారు. హిరమండలం మండలం తులగాం గ్రామానికి చెంది న 286 మంది ఓట్లు చేర్పించారు. నిజానికి జగన్నాథపురం గ్రామంలో పాత ఓటర్ల జాబితా ప్ర కారం 187 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఓ టర్ల జాబితాలో ఉన్న అలాంటి వ్యక్తులు గ్రామంలో మాత్రం లేరని స్థానికులు చెబుతున్నారు. వీరంతా ఆమదాలవలస మండలంలోని గాజులకొల్లివలస వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment