One person
-
విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు..
సాక్షి, విజయవాడ: నగరంలో సిమ్‌కార్డుల దందా వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు జారీ కావడం కలకలం రేగుతోంది. డాట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్) ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను సీపీ రానా ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ఒకే ఫొటోతో ఓ నెట్వర్క్ సంస్థకు 658 సిమ్‌లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ సిమ్ కార్డుల్ని రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు. అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్ కార్డులు నకిలీ పత్రాలతో జారీ చేసినట్లు గుర్తించారు. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా సిమ్ కార్డుల దందా బయటపడింది. చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. \ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తించారు. ఈ సిమ్‌లు ఎక్కడికి వెళ్లాయి.. ఎవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆమె కలలో కూడా ఊహించి ఉండదు! ఇలా జరుగుతుందనీ..
she Is The Only Passenger: ఒక్కోసారి మనకు భలే విచిత్రమైన అనుభవాలు చోటు చేసుకుంటాయి. వాటిని మనం కనీసం కలలో కూడా ఊహించి ఉండం. అలాంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. నమ్మశక్యంగా కూడా అనిపించదు. మనం చెప్పిన ఎవరూ నమ్మరు అన్నట్లుగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది నార్వేకి చెందిన మహిళకి. వివరాల్లోకెళ్తే...కోవిడ్ -19 ఆంక్షలతో అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో చాలా దేశాల్లో ఇంకా అంతర్జాతీయ విమానాలు తిరగడం లేదనే చెప్పాలి. ఇప్పుడిప్పడే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పలు దేశాల్లో ఆంక్షలు సడలించడంతో విమానాయాన సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. ఈ మేరకు నార్వే నుంచి రోరోస్ బయలు దేరుతున్న విమానాన్ని ఒకే ఒక్క మహిళా ప్రయాణికురాలు బుక్ చేసుకుంది. ఇంకా ఎవరు బుక్ చేసుకోలేదు. అయితే సదరు మహిళకు కూడా తెలియదు ఆ విమానంలో తాను ఒక్కత్తే ప్రయాణికురాలినని. దీంతో ఆ మహిలో ఆనందానికి అవధులే లేవు. తాను మాత్రమే ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలినని తెలియడంతో ఆమె ఆ విమానంలో ప్రయాణిస్తున్న సంఘటనను గుర్తుంచుకునేలా వీడియో రికార్డు చేసింది. ఆ విమానంలో ఫైలెట్లు, ఆమె తప్ప మరెవ్వరూ లేరు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Aurora Torres (@aurooratorres) (చదవండి: ఆ రాయి అందర్నీ చంపేస్తుంది) -
తృణమూల్‌లో ట్వీట్ చిచ్చు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ ట్వీట్ దుమారం రేపుతోంది. దీనిపై పార్టీలో నాయకులు కొందరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అభిషేక్ బెనర్జీకి అనుకూలురైన నాయకులు ఈ పోస్టును సమర్ధిస్తూ మాట్లాడగా, పార్టీలో పాత కాపులు మాత్రం ఇదంతా క్రమశిక్షణా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీసీలో ఒక వ్యక్తికి ఒక పదవిని తాము సమర్థ్ధిస్తున్నామని అభిషేక్ సన్నిహితులు అదితి, ఆకాశ్ ట్వీట్ చేశారు. చాలా రోజులుగా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలంటూ అభిషేక్ సూచిస్తున్నారు. అయితే పార్టీలో కొందరు సీనియర్లు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌పై కోల్‌కతా మేయర్‌గా, కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న ఫిర్హాద్ హకీమ్ స్పందించారు. నాయకత్వాన్ని సంప్రదించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తన అకౌంట్నుంచి ఎవరో ఇదే ఈ్వట్ చేశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించినప్పటినుంచి పార్టీలో నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అంతర్గత విభేదాలపై నేడు భేటీ పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల పరిష్కారంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శనివారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. మమత నివాసంలో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. భేటీకి కేవలం ఆరుగురు నేతలకు పిలుపు అందించినట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, సెక్రెటరీ జనరల్ పార్థా చటర్జీ, పార్టీ బెంగాల్ విభాగం అధ్యక్షులు సుబ్రతా బక్షీ, మంత్రులు ఫిర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్యకు పిలుపు వెళ్లినట్లు తెలిసింది. పార్టీ నేతల మధ్య విభేదాలు ముదురుతుండడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంపై మమతా బెనర్జీ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న వారికి గట్టి సందేశం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. -
ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు!
ఎల్.ఎన్.పేట: ఓటర్ల జాబితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక గ్రామం ఓటర్లు జా బితాలో ఆ గ్రామంతో ఎలాంటి సంబంధం లేని ఓటర్ల పేర్లు కనిపించగా, మరో గ్రామం జాబి తాలో మాజీ సర్పంచ్.. బీఎల్ఓ (బూత్‌లెవల్)ల పేర్లు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు మరో కోణం వెలుగు చూసింది. ఆ గ్రామంలో ఒకే మహిళ పేరుతో నాలుగు ఓట్లు చోటు చేసుకున్నాయి. వివరా ల్లోకి వెళితే.... పాతపట్నం నియోజక వర్గంలోని 314 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎల్.ఎన్.పేట మండలం పెద్దకొల్లివలస పంచాయతీలో ఓటర్ల జాబితాల్లో అనేక తప్పులు చోటు చేసుకున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో పోలింగ్ స్టేషన్ నంబర్ 153లో పెద్దకొల్లివలస పునరావాస కాలనీ ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన ఓటరు జాబితాలో మొత్తం ఓట్లు 779 ఉన్నాయి. పురుషులు 392 మహిళలు 387 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దకొల్లివలస పోలింగ్ స్టేషన్ 153లో సుంకు అమరావతి పేరున సీరియల్ నంబర్ 760, 762, 763, 764 ప్రకారం ఆమెకు నాలుగు ఓట్లు ఉన్నాయి. మరో ఇద్దరికి రెండేసి ఓట్లు ఉన్నాయి. ఇదే పంచాయతీలోని పోలింగ్ కేంద్రం నంబర్ 156లో జగన్నాథపురం గ్రామం ఉంది. ఈ గ్రా మంలో 473 మొత్తం ఓట్లు ఉండగా వీరిలో 236 పురుషులు, 237 మహిళా ఓటర్లు ఉన్నారు. హిరమండలం మండలం తులగాం గ్రామానికి చెంది న 286 మంది ఓట్లు చేర్పించారు. నిజానికి జగన్నాథపురం గ్రామంలో పాత ఓటర్ల జాబితా ప్ర కారం 187 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఓ టర్ల జాబితాలో ఉన్న అలాంటి వ్యక్తులు గ్రామంలో మాత్రం లేరని స్థానికులు చెబుతున్నారు. వీరంతా ఆమదాలవలస మండలంలోని గాజులకొల్లివలస వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఉన్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ
- యువకుడు దుర్మరణం - ఇద్దరికి గాయాలు శంకరనగర్ (సోమశిల) :మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని శంకరనగర్ వద్ద సోమవారం రాత్రి జరిగింది.స్థానికుల కథనం మేరకు.. మండలంలోని రేవూరు ఈగాపాళెంకు చెందిన దూపాటి గోపాల్, రేణంగి వెంకటేశ్వర్లు, రేణంగి వేణు (20) ఆత్మకూరు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో అనంతసాగరం నుంచి ఆత్మకూరుకు వెళ్తున్న ధాన్యం లారీ శంకర్‌నగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొంది. ఈ దుర్ఘటనలో వేణు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, రేణంగి వెంకటేశ్వర్లు, గోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని అనంతసాగరం ఎస్ఐ రఘునాథ్ పరిశీలించారు. రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునే వాళ్లు.. ప్రమాదం జరిగిన స్థలానికి స్వగ్రామానికి కేవలం 3 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రమాదం జరగకుండా ఉంటే.. రెండు నిమిషాల్లో గమ్యస్థానం చేరేవాళ్లు. అంతలోనే ప్రమాదం జరగడంతో విషయం తెలిసి గ్రామస్తులు పలువురు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు మారుమోగాయి. వేణు చదువు కోసం కువైట్‌కు వెళ్లిన అన్న మృతుడు రేణంగి వేణు తండ్రి నారాయణ ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి వికలాంగురాలు కావడంతో కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో వేణును బాగా చదివించాలనే తపనతో అతని అన్న వెంకటేశ్వర్లు ఏడాది క్రితం అప్పు చేసి కువైట్‌కు వెళ్లాడు. అందరితో అనోన్యంగా ఉండే వేణు మృతితో కుటుంబం శోకసముద్రమైంది. -
ఆటో బోల్తా :వ్యక్తి మృతి
మృతదేహాన్ని అడవిలో పడేసిన ఆటోడ్రైవర్ చిలమనూరు (బాలాయపల్లి) : వెంకటగిరి–నాయుడుపేట రోడ్డులో చిలమనూరు తిప్ప మలుపు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఆటో బోల్తాపడి అదే గ్రామానికి చెందిన బత్తల మహేశ్వరయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆటోడ్రైవర్ ఆతను స్నేహితుడు కలిసి అడవిలోకి వెళ్తున్న కాలి దారిలో పడేసి వెళ్లారు. పోలీసులు కథనం మేరకు శుక్రవారం ఉదయం మహేశ్వరయ్య వెంకటగిరికి వెళ్లాడు రాత్రి 10 గంటలకు వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిలమనూరుకు చెందిన మోడి కృష్ణయ్య ఆటోలో ఎక్కాడు. చిలమనూరు సమీపంలో తిప్ప మలుపు వద్ద ఆటో బోల్తాపడి మహేశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోడ్రైవర్ కృష్ణయ్య, అతని స్నేహితుడు కలిసి మృతదేహాన్ని ఆడవిలో పడేసి వెళ్లిపోయారు. మహేశ్వరయ్య శుక్రవారం రాత్రి ఇంటికి రాకపోవడంతో అనారోగ్యంతో మంచంలో ఉన్న భార్య ఆదెమ్మ బంధువులకు తెలపడంతో బంధువులు ఆటోడ్రైవర్ కృష్ణయ్యను అడిగారు. అతను తన ఆటోలో ఎక్కలేదని చెప్పాడు. దీంతో వెంకటగిరిలో ఉన్న బంధువులను విచారించగా శుక్రవారం రాత్రి 10 గంటలకు కృష్ణయ్య ఆటోలో బయలు దేరి వచ్చాడని చెప్పారు. అప్పటికే పశువుల కాపరులు మహేశ్వరయ్య మృతదేహం అడవిలో ఉందని సమాచారం ఇవ్వడంతో పోలీసులకు తెలిసింది. దీంతో వెంకటగిరి ఎస్ఐ రహీంరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఆటో డ్రైవర్ కృష్ణయ్యను విచారించాడు. ఆటో బోల్తాపడిం మహేశ్వరయ్య ఆటో కింద పడి మృతి చెందాడని చెప్పాడు. మానవత్వం కోల్పోయిన ఆటో డ్రైవర్ ఆటో బోల్తాపడి మృతి చెందితే ఆటోడ్రైవర్ ఎవరికి తెలియదులే అనుకుని మహేశ్వరయ్య మృతదేహాన్ని స్నేహితుడు సాయంతో అడవిలో పడేయడంతో గ్రామస్తులు మండిపడ్డారు. ఇక ఆటోను ఎవరికి తెలియకుండా అడవిలో దాచి ఇంటి వద్ద అందరితో కలిసి ఏమి తెలియనట్టు వ్యవహరించడంతో మానత్వం లేకుండా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. -
బతుకమ్మ పూల కోసం వెళ్లి వ్యక్తి మృతి
తనయుడి కళ్లెదుటే తనువు చాలించిన తండ్రి వెంకటాపురం : బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలోని జవహర్‌నగర్‌లో శనివారం జరిగింది. స్థానికుడైన కుందె మల్లయ్య(42) ఇంట్లో బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకొచ్చేందుకు గండికుంట చెరువు వద్దకు పదకొండేళ్ల కుమారుడు నాగరాజుతో కలిసి శనివారం ఉదయం వెళ్లా డు. చెరువులోకి దిగి పూలను కోస్తున్న క్రమంలో లోతు అంచనా వేయకపోవ డంతో మునిగిపోయాడు. ఆ సమయం లో కుమారుడు నాగరాజు కేకలు వేసినా సాయం చేసేందుకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో రాలేదు. దీంతో మల్లయ్య పూర్తిగా మునిగిపోయాడు. ఆయన కుమారుడు నాగరాజు ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు వెతకగా మల్లయ్య మృతదేహం లభించింది. మృతుడికి భార్య లక్షి్మతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కాజీపేట రూరల్ : రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోని హసన్‌పర్తి- ఉప్పల్ రైల్వే స్టేషన్ల మధ్యగల బావుపేట రైల్వే బ్రిడ్జిపై మంగళవారం జరిగింది. కాజీపేట జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన పశువుల కాపరి గొర్రె ఏలియా(62) పశువులను తోలుకొని ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో పశువులను సమీపంలోని వాగులోకి పంపి అతడు బావుపేట రైల్వే బ్రిడ్జిపైకి వస్తుండగా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీఽకొట్టడడంతో అక్కడికక్కడే మృతిచెందగా మృతదేహం ఎగిరి వాగులో పడిపోయింది. ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారని ఆయన తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
-
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
పలువురు కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టారంటూ సూసైడ్ నోట్ ప్రేమ వ్యవహారం విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే సందేహాలు భూపాలపల్లి : సింగరేణియన్ సన్స్ అసోసియేషన్(ఎస్ఎస్ఏ)లో పనిచేసే ఓ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన భూపాలపల్లి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ సీహెచ్ రఘునందన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో నివాసం ఉంటూ కేటీకే 5వ ఇంక్లైన్లో విధులు నిర్వర్తించే ఏకారి శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సత్యనారాయణ(23) ఉన్నారు. సత్యనారాయణ గతేడాది పీజీ పూర్తి చేశాడు. వారం క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ట్యూటర్‌గా చేరాడు. గత శుక్రవారం రాత్రి 7 గంటలకు కళాశాలకు వెళ్తున్నట్లుగా ఇంట్లో చెప్పి, బ్యాగ్‌తో బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం వరకూ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌కు కాల్ చేశారు. అయినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో గాలించారు. ఈ క్రమంలో మండలంలోని కమలాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో పూర్తిగా కాలిపోయి ఉన్న ఓ మృతదేహం ఉన్నట్లుగా శంకర్ కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అది సత్యనారాయణ మృతదేహంగా గుర్తించారు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘునందన్‌రావు తెలిపారు. బ్యాగ్‌లో సూసైడ్ నోట్.. సత్యనారాయణ మృతదేహం సమీపంలో ఇంటి నుంచి తెచ్చుకున్న బ్యాగు పడి ఉంది. అందులోని ఒక నోట్‌బుక్‌లో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఉంది. తనను పలువురు వాహనాలు మార్చుతూ, ఎక్కడెక్కడో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని అందులో రాశాడు. లేఖలోని వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ అమ్మాయితో పరిచయం.. సింగరేణియన్ సన్స్ అసోసియేషన్ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే పాల్గొనే సత్యనారాయణను ఎవరూ బెదిరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. సత్యనారాయణకు ఓ అమ్మాయితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. గత శుక్రవారం ఉదయం ఇంట్లోని డబ్బులు తీసుకొని ఆమె దగ్గరకు వెళ్లినట్లు తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు సత్యనారాయణను మందలించినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. -
పడవ బోల్తా..ఒకరు మృతి
భోగాపురం: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడటంతో ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు స్వల్పంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరు వద్ద చోటుచేసుకుంది. గురువారం వేకువజామున గ్రామానికి చెందిన ఆరుగురు పడవలో వేటకు బయలుదేరారు. ఉదయం సమయంలో వేట ముగించుకుని తిరిగి వస్తుండగా అలల ఉధృతికి వారి పడవ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న అరజల్ల ఎర్రన్న(50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. మిగిలిన వారిలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. -
భూతగాదాల్లో ఒకరికి తీవ్ర గాయాలు
ఇబ్రహీంపట్న: రెండు కుటుంబాల మధ్య భూమి విషయమై తలెత్తిన గొడవలో ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎంపీపటేల్‌గూడలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాశం హనుమంతు, బిక్షపతి కుటుంబాల మధ్య భూమి విషయమై కొన్ని రోజులుగా వైరం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హనుమంతు కుటుంబీకులు, బిక్షపతి కుటుంబసభ్యులపై కర్రలు, గొడ్డలితో దాడికి దిగారు. ఈ దాడిలో బిక్షపతి మెడపై తీవ్ర గాయమైంది. అతని ఇద్దరు కుమారులు స్వల్పంగా గాయపడ్డారు. దాడి అనంతరం హనుమంతు కుటుంబీకులు పరారయ్యారు. స్థానికులు క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీఐ అశోక్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
200 నాటు బాంబులు స్వాధీనం
తిరునెల్వెలి: తమిళనాడు పోలీసులు భారీ మొత్తంలో బాంబులు స్వాధీనం చేసుకున్నారు. తిరునెల్వెలి జిల్లాలోని కోస్తా తీర ప్రాంతమైన కూతన్ కుజి గ్రామంలో 200 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. సముద్ర తీరంలోని ఇసుకలో వాటిని పాతిపెట్టి ఉంచగా పోలీసులు గుర్తించారు. ఈ బాంబులను చేపల వేటకు వెళ్లే సమయంలో ఉపయోగించడంతోపాటు మత్యకారుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా వాటిని విరివిగా ఉపయోగించి ప్రాణనష్టం కూడా కలిగాస్తారని పోలీసులు తెలిపారు. -
ఓ వ్యక్తి @ 25 వేల సెల్ఫీలు
లండన్: ఓ వ్యక్తి తన జీవితంలో ఎన్ని సెల్ఫీలు తీసుకోవచ్చు..? 1980 తర్వాత జన్మించిన వారు ముసలివాళ్లు అయ్యే వరకు సెల్ఫీలు తీసుకుంటే ఎన్ని సేకరించవచ్చు..? ఓ పరిశోధన ప్రకారం ఒక్కొక్కరు తమ జీవితకాలంలో సగటున 25 వేలకు పైగా సెల్ఫీలను తీసుకోవచ్చు..! 'లస్టర్ ప్రీమియం వైట్' నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సెల్ఫీల సరదా ఉన్నవారు తమ జీవితంలో సరాసరిన 25,676 సెల్ఫీలు తీసుకుంటారని అంచనా వేసింది. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్లో ఎకౌంట్లు ఉన్నవారికి సెల్ఫీల సరదా ఎక్కువ ఉందని వెల్లడించింది. 1000 మంది అమెరికన్లు సర్వే చేయగా.. ఏదైనా వేడుక లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గడిపిన సందర్భంగా సెల్ఫీలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇక 63 శాతం మంది సెల్ఫీలు తీసుకోవడానికి విహార యాత్ర అనువైన ప్రదేశమని అభిప్రాయపడ్డారు. సగంమంది సెల్ఫీలు తీసుకునేముందు జట్టును సవరించుకుంటామని తెలిపారు. మరో 53 శాతం మంది సెల్ఫీ దిగేముందు అద్దంతో తమ ముఖం చూసుకుంటామని చెప్పారు. 47 శాతం సెల్పీలకు ముందు ముఖకవళికలను ప్రాక్టీస్ చేస్తామని వెల్లడించారు. 95 శాతం మంది కనీసం ఒక్క సెల్పీ అయినా తీసుకున్నారని ఆ సర్వేలో తేలింది. -
అసోంను ముంచెత్తుతున్న వరదలు
-
అసోంను ముంచెత్తుతున్న వరదలు
గౌహతి : అసోంలో వరదలు పోటెత్తాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర, జై భారాలి నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బార్పేట, నల్బరీ, గోల్ పారా, లక్ష్మీపూర్ తదితర తొమ్మిది జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 300 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. లక్ష్మీపూర్ జిల్లాలో ఒకరు కొట్టుకుపోయారు. అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 9 జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. దాదాపు 60వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీనిపై అసోం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, వరద ఉధృతి నుంచి గట్టెక్కేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని సీనియర్ అధికారి తెలిపారు. సహాయక క్యాంపుల ద్వారా ఆహారం తదితర వస్తు సామగ్రిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. కాగా రాబోయే రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
డీసీఎం, డీజిల్ ట్యాంకర్ ఢీ : ఒకరు మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండలంలోని కురమేడు గ్రామం వద్ద డీసీఎం వాహనాన్ని డీజిల్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో డీసీఎం వాహనంలోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మా కొడుకు... కాదు... మా అబ్బాయే!
రెండు కుటుంబాల మధ్య తగాదా గొల్లప్రోలులో హైడ్రామా తలలు పట్టుకుంటున్న పోలీసులు డీఎన్ఏ పరీక్ష చేయాలంటున్న ఎస్సై అనుకోకుండా కనిపించిన ఆ యువకుడు తమ బిడ్డ అంటే.. కాదు తమ బిడ్డ అంటూ రెండు కుటుంబాలవారు తగదా పడిన ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పిఠాపురం శివారు ఇల్లింద్రాడ వద్ద ఉన్న వీరభద్రా రైస్ మిల్లుకు తాళ్లరేవు నుంచి మంగళవారం ధాన్యం లోడు లారీ వచ్చింది. ఆ లారీ క్లీనర్ భవానీ మాల ధరించి ఉన్నాడు. అదే మిల్లులో గొల్లప్రోలుకు చెందిన రత్నం అనే మహిళ పని చేస్తోంది. ఆమె క్లీనర్ వివరాలు ఆరా తీసింది. తన పేరు శ్రీను అని ఆ యువకుడు చెప్పాడు. ఇదిలా ఉండగా, గొల్లప్రోలు కమ్మరశాల వీధికి చెందిన దౌడూరి నాగేశ్వర్రావు, రమణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీను మానసిక వైకల్యంతో బాధపడేవాడు. 15 ఏళ్ల వయసులో 2007 అక్టోబర్ 8న భారీ వర్షాల సమయంలో అతడు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు.అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి, పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. నాగేశ్వరరావు దంపతులతో రైస్ మిల్లులో పని చేస్తున్న రత్నానికి గతంలో పరిచయం ఉంది. వారి కుమారుడు శ్రీను తప్పిపోయిన విషయం ఆమెకు తెలుసు. శ్రీనును లారీ క్లీనర్ పోలి ఉండడం.. అతడి పేరు కూడా ‘శ్రీను’ అనే చెప్పడంతో ఆమె ఈ విషయాన్ని నాగేశ్వరరావుకు తెలిపింది. దీంతో అక్కడకు చేరుకున్న నాగేశ్వరరావు దంపతులు లారీ క్లీనర్‌గా ఉన్న యువకుడు తప్పిపోయిన తమ కొడుకు శ్రీనేనని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని వారు గొల్లప్రోలు పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా లారీ డ్రైవర్ ద్వారా విషయం తెలుసుకున్న తాళ్లరేవు మండలం చిన్నవలసలు గ్రామానికి చెందిన పెనుపోతుల ప్రసాద్, భవానీ దంపతులు కూడా గొల్లప్రోలు స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ యువకుడు తమ కుమారుడేనని, తమ ఇంట్లోనే ఉంటున్నాడని వారు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. తమకు ముగ్గురు కుమారులు కాగా, ఇతడు పెద్ద కుమారుడని, పేరు వర్మ అని ప్రసాద్ దంపతులు చెప్పారు. తమ రేషన్ కార్డులో ఉన్న అతడి వివరాలను పోలీసులకు చూపించారు. ఇరు కుటుంబాల వాదనల నేపథ్యంలో పోలీసులు ఆ యువకుడిని కూడా విచారించారు. ఇరువైపుల వారూ తన తల్లిదండ్రులేనని అతడు బదులు చెప్పడంతో వారు తలలు పట్టుకున్నారు. ‘నీ పేరు ఏమిటి?’ అని అడిగితే ఒకసారి శ్రీను అని, మరోసారి వర్మ అని ఆ యువకుడు చెబుతుండడంతో అయోమయానికి గురయ్యారు. ఇరు కుటుంబాల వారినీ పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని ఎస్సై ఎన్ఎస్ నాయుడు తెలిపారు. అవసరమైతే డీఎన్ఏ పరీక్ష చేయిస్తామన్నారు. కాగా ఇరు కుటుంబాల బంధువుల తాకిడితో పోలీస్ స్టేషన్లో హైడ్రామా వాతావరణం నెలకొంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కల్లూరు, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కల్లూరు పంచాయతీ పరిధిలోని హనుమాతండా సమీపంలో రాష్ట్రీక రహదారిపై గురువారం చోటు చేసుకుంది. సత్తుపల్లిలోని హరి ఫొటో స్టూడియో యజమాని ఆలేటి అనిల్ విశ్వాస్(35) తన షాపులో పని చేసే రవితో కలిసి వీడియో క్యాసెట్లు మిక్సింగ్ కోసం ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్లాడు. సాయంత్రం తిరిగి సత్తుపల్లి వెళ్తుండ గా హనుమాతండా సమీపంలోకి రాగానే అనిల్‌కు ఫోన్ వ చ్చింది. దీంతో ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి అనిల్ ఫోన్ మాట్లాడుతుండగా రవి పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో సూరత్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వేగం గా వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ విశ్వాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. లారీని డ్రైవర్ ఆంజనేయులు కాకుండా క్లీనర్ నడుపుతున్నాడని, వారిద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారని, లారీని కొద్ది దూరంలో నిలిపి బ్రేకులు లూజ్ చేసి బ్రేక్ ఫెయిల్ అయినట్లు చెప్పేందుకు ప్రయత్నించారని స్థానికులు అంటున్నారు. -
బస్సు, ద్విచక్ర వాహనం ఢీ
రుద్రంపూర్, న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం కొత్తగూడెం మండలంలోని చుంచుపల్లి పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చుంచుపల్లి పంచాయతీ హౌసింగ్ బోర్డులో నివసిస్తున్న బానోత్ మంగ్యా అలియాస్ మంగీలాల్(36) పశువుల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతను స్నేహితుడు భూక్యా భాస్కర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సుజాతనగర్‌లోని కోమటిపల్లిలో ఉంటున్న సొదరి ఇంటికి వెళ్లేందుకు ఆదివారం ఉదయం రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మంగీలాల్ ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్ తీవ్రంగా గాయపడడంతో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంగీలాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై వెంకట్రాం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఘట్కేసర్, న్యూస్‌లైన్: అన్యోన్యమైన ఆ జంటపై విధికి కన్నుకుట్టినట్టుంది. అప్పటి వరకు స్కూటర్‌పై మాట్లాడుకుంటూ వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భార్య కళ్లెదుటే భర్త మృత్యువాతపడ్డాడు. స్కూటర్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భార్యకు గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని యంనంపేట్ చౌరస్తా వద్ద బైపాస్‌రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మైసమ్మగుట్ట కాలనీలో వెంకటేష్(35), శారద దంపతులు ఉంటున్నారు. వెంకటేష్ రాళ్లు కొడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్నంతలో దంపతులు హాయిగా, అన్యోన్యంగా ఉంటున్నారు. బుధవారం వారు నగరంలో ఉన్న బంధువుల ఇంటికి స్కూటర్‌పై బయలు దేరారు. మార్గంమధ్యలో యనంపేట చౌరస్తా వద్ద బైపాస్ రోడ్డులో ఉన్న మలుపులో వెనుక నుంచి వచ్చిన కారు వీరి స్కూటర్‌ను ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. శారదకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహానికి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కళ్లెదుటే భర్త దుర్మరణం పాలవడంతో శారద షాక్‌కు గురైంది. ఆమె రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తులో ఉంది. -
వ్యవసాయ బావిలో పడ్డ డీసీఎం వ్యాన్ : క్లీనర్ మృతి
మెదక్ జిల్లా చినకోడూరు మండలం గుర్రాలగొండి గ్రామ శివారులో డీసీఎం వ్యాన్ అదుపు తప్పి గత అర్థరాత్రి వ్యవసాయ బావిలో పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను వ్యవసాయ బావి నుంచి బయటకు తీసి హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఏకంగా వ్యానే బోరు బావిలో పడిపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్ అలాగే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని క్లీనర్ మృతదేహన్ని స్థానికుల సాయంతో వెలుపలకు తీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. -
ఐదు లక్షల్లో ఒకరికి..
అరుదైన వ్యాధిని గుర్తించి వెంటనే వైద్యసేవలందించి చిన్నారి ప్రాణాలను కాపాడారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపల్లి మండలం బండలింగంపల్లికి చెందిన లక్ష్మి, మల్లేష్ దంపతుల కుమారుడు హరీష్ (8) కొద్దిరోజులుగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. గొంతునుంచి ఆహారం లోపలకు వెళ్లకపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో సిరిసిల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించారు. అక్కడి వైద్యులు వ్యాధిని గుర్తించలేకపోవడంతో నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. హరీష్‌ను రెండు రోజులు ఐసీయూలో ఉంచి, వ్యాధి నయం కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పారు. కూలిపనులు చేసుకునే మల్లేష్ అంత సొమ్ము చెల్లించలేక హరీష్‌ను పదిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. గాంధీ ఆస్పత్రి పిల్లల విభాగం వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి హరీష్ సిస్టమిక్ మయస్తీనియా వ్యాధికి గురైనట్లు గుర్తించారు. నాలుగు రోజులు వెంటిలేటర్‌పై ఉంచి ఐవీ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు ఇచ్చి అరుదైన వ్యాధిని నయం చేశారు. పూర్తిస్థాయిలో కోలుకున్న హరీష్‌ను సోమవారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా యూనిట్ వైద్యులు ఉషారాణి, నాను సోము, సంతోష్‌కుమార్, రమేష్‌బాబు మాట్లాడుతూ.. సిస్టమిక్ మయస్తీనియా అరుదైన వ్యాధని, ఐదు లక్షమంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యాధిని గుర్తించి శస్త్రచికిత్సలు లేకుంగా నయం చేసిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పిడియాట్రిక్ హెచ్ఓడీ జే.వెంకటేశ్వరరావు అభినందించారు. తమ కుమారుడికి ప్రాణభిక్షపెట్టిన గాంధీ వైద్యులకు హరీష్ తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.