200 నాటు బాంబులు స్వాధీనం
తిరునెల్వెలి: తమిళనాడు పోలీసులు భారీ మొత్తంలో బాంబులు స్వాధీనం చేసుకున్నారు. తిరునెల్వెలి జిల్లాలోని కోస్తా తీర ప్రాంతమైన కూతన్ కుజి గ్రామంలో 200 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
సముద్ర తీరంలోని ఇసుకలో వాటిని పాతిపెట్టి ఉంచగా పోలీసులు గుర్తించారు. ఈ బాంబులను చేపల వేటకు వెళ్లే సమయంలో ఉపయోగించడంతోపాటు మత్యకారుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా వాటిని విరివిగా ఉపయోగించి ప్రాణనష్టం కూడా కలిగాస్తారని పోలీసులు తెలిపారు.