రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Fri, Sep 6 2013 3:54 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
కల్లూరు, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కల్లూరు పంచాయతీ పరిధిలోని హనుమాతండా సమీపంలో రాష్ట్రీక రహదారిపై గురువారం చోటు చేసుకుంది. సత్తుపల్లిలోని హరి ఫొటో స్టూడియో యజమాని ఆలేటి అనిల్ విశ్వాస్(35) తన షాపులో పని చేసే రవితో కలిసి వీడియో క్యాసెట్లు మిక్సింగ్ కోసం ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్లాడు. సాయంత్రం తిరిగి సత్తుపల్లి వెళ్తుండ గా హనుమాతండా సమీపంలోకి రాగానే అనిల్‌కు ఫోన్ వ చ్చింది. దీంతో ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి అనిల్ ఫోన్ మాట్లాడుతుండగా రవి పక్కన నిల్చున్నాడు.
అదే సమయంలో సూరత్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వేగం గా వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ విశ్వాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. లారీని డ్రైవర్ ఆంజనేయులు కాకుండా క్లీనర్ నడుపుతున్నాడని, వారిద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారని, లారీని కొద్ది దూరంలో నిలిపి బ్రేకులు లూజ్ చేసి బ్రేక్ ఫెయిల్ అయినట్లు చెప్పేందుకు ప్రయత్నించారని స్థానికులు అంటున్నారు.
Advertisement
Advertisement