భూతగాదాల్లో ఒకరికి తీవ్ర గాయాలు | one person injured in land disputes | Sakshi
Sakshi News home page

భూతగాదాల్లో ఒకరికి తీవ్ర గాయాలు

Published Sat, May 21 2016 1:32 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

one person injured in land disputes

ఇబ్రహీంపట్న: రెండు కుటుంబాల మధ్య భూమి విషయమై తలెత్తిన గొడవలో ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎంపీపటేల్‌గూడలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాశం హనుమంతు, బిక్షపతి కుటుంబాల మధ్య భూమి విషయమై కొన్ని రోజులుగా వైరం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హనుమంతు కుటుంబీకులు, బిక్షపతి కుటుంబసభ్యులపై కర్రలు, గొడ్డలితో దాడికి దిగారు. ఈ దాడిలో బిక్షపతి మెడపై తీవ్ర గాయమైంది. అతని ఇద్దరు కుమారులు స్వల్పంగా గాయపడ్డారు.

దాడి అనంతరం హనుమంతు కుటుంబీకులు పరారయ్యారు. స్థానికులు క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీఐ అశోక్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement