
అనుకోని విచిత్రమైన అనుభవం. ఆ విమానంలో ఆమె మాత్రమే ప్రయాణికురాలు. నిజానికి ఆమెకి కూడా తెలియదు తాను మాత్రమే ఆ విమానంలో ప్రయాణించబోతున్నానని.
she Is The Only Passenger: ఒక్కోసారి మనకు భలే విచిత్రమైన అనుభవాలు చోటు చేసుకుంటాయి. వాటిని మనం కనీసం కలలో కూడా ఊహించి ఉండం. అలాంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. నమ్మశక్యంగా కూడా అనిపించదు. మనం చెప్పిన ఎవరూ నమ్మరు అన్నట్లుగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది నార్వేకి చెందిన మహిళకి.
వివరాల్లోకెళ్తే...కోవిడ్ -19 ఆంక్షలతో అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో చాలా దేశాల్లో ఇంకా అంతర్జాతీయ విమానాలు తిరగడం లేదనే చెప్పాలి. ఇప్పుడిప్పడే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పలు దేశాల్లో ఆంక్షలు సడలించడంతో విమానాయాన సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది.
ఈ మేరకు నార్వే నుంచి రోరోస్ బయలు దేరుతున్న విమానాన్ని ఒకే ఒక్క మహిళా ప్రయాణికురాలు బుక్ చేసుకుంది. ఇంకా ఎవరు బుక్ చేసుకోలేదు. అయితే సదరు మహిళకు కూడా తెలియదు ఆ విమానంలో తాను ఒక్కత్తే ప్రయాణికురాలినని. దీంతో ఆ మహిలో ఆనందానికి అవధులే లేవు. తాను మాత్రమే ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలినని తెలియడంతో ఆమె ఆ విమానంలో ప్రయాణిస్తున్న సంఘటనను గుర్తుంచుకునేలా వీడియో రికార్డు చేసింది. ఆ విమానంలో ఫైలెట్లు, ఆమె తప్ప మరెవ్వరూ లేరు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఆ రాయి అందర్నీ చంపేస్తుంది)