
ఎన్నికల కమిషనర్ రాంప్రకాశ్ సిసోడియా
సాక్షి, విజయవాడు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రాంప్రకాశ్ సిసోడియా గురువారం నగరంలోని బారతీనగర్‌లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు 1950 నెంబర్‌కు ఫోన్ కాల్ చేసి తమ ఓటు కార్డు స్టేటస్‌తో పాటు ఈపీఐసీ నెంబర్‌ను 9223166166 లేదా 51969కు ఎస్ఎంఎస్ చేసి తమ ఓటు స్టేటస్ ను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏపీలోని 13 జిల్లాల్లో 13 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామని సిసోడియా చెప్పారు.