ఓటు దొంగలున్నారు జాగ్రత్త! | YSRCP Leaders Voters Deleted TDP Fake Survey Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఓటు దొంగలున్నారు జాగ్రత్త!

Published Sun, Jan 27 2019 11:40 AM | Last Updated on Sun, Jan 27 2019 11:40 AM

YSRCP Leaders Voters Deleted TDP Fake Survey Visakhapatnam - Sakshi

సర్వే చేస్తున్న అనుమానితులను ప్రశ్నిస్తున్న ఐదో పట్టణ పోలీసులు సర్వే పేరుతో వచ్చిన టీడీపీ వారి గురించి ఎస్‌ఐకి వివరిస్తున్న వైఎస్సార్‌సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ తెలుగుదేశం పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం వారికి పట్టుకుంది. దీంతో ఎన్నెన్నో ఎత్తుగడలు వేస్తూ వైఎస్సార్‌సీపీ మద్దతుదార్ల ఓట్లను కొల్లగొట్టా లని చూస్తున్నారు. ఇందుకోసం ఎక్కడెక్కడ వైఎస్సార్‌సీపీ అభిమాన ఓటర్లున్నారో తెలుసుకుని ఏవో సాకులతో వారి ఓట్లను తొలగించే కుట్రకు తెర తీశారు. కొన్నాళ్ల క్రితం మొదలైన ఈ కుట్ర ఇప్పుడు పల్లెలు, పట్టణాలు, నగరా లకు విస్తరింపజేస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, నిరుద్యోగులను ఎంచుకుని వారికి ట్యాబ్‌లను ఇచ్చి సర్వే పేరిట ఆయా ప్రాంతా లకు పంపుతున్నారు. వీరు ఎంపిక చేసుకున్న ఏరియాలకు వెళ్లి తాము రాబోయే ఎన్నికలపై సర్వే చేయడానికి వచ్చినట్టు పరిచయం చేసుకుంటున్నారు. అలా ఒక్కో అంశం కూపీ లాగు తూ ఓటర్ల నుంచి తమకు కావలసిన సమాచా రాన్నంతా రాబడుతున్నారు. దానిని తమ ట్యా బ్‌ల్లో నిక్షిప్తం చేసుకుని వెళ్తున్నారు. మొద ట్లో చాలామంది వీరు నిజంగా సర్వే కోసం వచ్చి న వారేనని భావించారు. కానీ కొద్దిరోజులుగా వీరి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండడంతో టీడీపీ నేతల అసలు కుట్ర బయటపడుతోంది. దీంతో పలువురు అప్రమత్తమవుతున్నారు.

సర్వే పేరుతో హల్‌చల్‌..
సర్వే పేరిట కొంతమంది జిల్లాలోకి,  విశాఖ నగరంలోకి కొద్దిరోజుల కిందటే ప్రవేశించారు. వీరిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. తాము పబ్లిక్‌ పాలసీ రీసెర్చి గ్రూపునకు చెందిన వారుగా చెప్పుకుంటున్నారు. ‘మీరు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? గతంలో ఏ పార్టీకి ఓటేశారు? ఏ పత్రిక చదువుతారు? వంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఓటర్‌ ఐడీ కార్డు వివరాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు నెల రోజుల క్రితం పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్‌పురంలో కొంతమంది యువకులు సర్వే పేరిట ఇంటింటికి వెళ్లారు. వారి సర్వే పేరుతో అడుగుతున్న వివరాలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉండడంతో స్థానికులు పట్టుకుని పాయకరావుపేట పోలీసులకు అప్పగించారు.

అలాగే విశాఖలోని బర్మా క్యాంప్‌ ప్రాంతంలో ఈనెల 12న నలుగురు వ్యక్తులు  కొన్ని ఇళ్లకు వెళ్లారు. ఏ పార్టీకి చెందిన వారంటూ ప్రశ్నలు సంధించడం, ట్యాబ్‌లో నిక్షిప్తం చేయడం వంటివి చూసి అనుమానంతో వారిని పోలీసులకు పట్టించారు.  ఈనెల 20న ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు క్రాంతినగర్‌లోనూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఇంటింటికి తిరిగి వైఎస్సార్‌సీపీ సమచారాన్ని సేకరిస్తున్న తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు. వీరే కాదు.. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ సర్వే చేయడానికి వచ్చామని, తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, స్వచ్ఛందంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని ఏవో సంస్థల పేర్లు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ గురించి సమాచారాన్నే ఎక్కువగా సేకరిస్తున్నారు. వారి వద్ద తనిఖీ చేస్తే టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులుంటున్నాయి. ఇవన్నీ టీడీపీ కుట్ర అనేందుకు బలమైన సాక్ష్యాలుగా ఉన్నాయి.

25 ఇళ్లకు రూ.800
25 ఇళ్లలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల వివరాలు సేకరించినందుకు ఒక్కో వ్యక్తికి రూ.800 చెల్లిస్తున్నట్టు సర్వేలో పాల్గొని పట్టుబడిన వారు చెబుతున్నారు. టీడీపీ నేతలు తమ కుట్రలో భా గంగా కొంతమంది నిరుద్యోగులకు ఇలా ఎరవే సి వినియోగించుకుంటున్నారు.ఈ టీమ్‌లో కొం దరు వెనక ఉంటూ సర్వే కథ నడిపిస్తున్నారు. 

అధికారులు చర్యలు చేపట్టాలి..
అభిప్రాయ సేకరణ పేరిట ప్రజలను మభ్యపెడుతూ టీడీపీకి చెందిన కొంతమంది వైఎస్సార్‌సీపీ ఓట్లు గల్లంతు చేసే కుట్ర చేస్తున్నారు. నగరంలో ప్రతి నియోజకవర్గం లోనూ ఇతర జిల్లాలకు నుంచి వచ్చిన టీడీపీ వ్యక్తులు లాడ్జిల్లో ఉంటూ సర్వేలంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల గురించి ఆరా తీస్తూ వారి వివరాలను టాబ్‌ల్లో నమోదు చేస్తున్నారు. పోలీసు అధికారులు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – ఎం. రాజ్‌కుమార్‌. బాలయ్యశాస్త్రి లేఅవుట్, సీతమ్మధార

టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది..
2019లో ఓటమి చవి చూస్తామని తెలిసి టీడీపీ నేతలకు భయం పట్టుకుంది. అందుకే ఎక్కడ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి అభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి ఇంటికు వెళ్లి వారికి కావలసిన వివరాలను తీసుకుంటున్నారు. సర్వే పేరుతో  ఒక ట్యాబ్‌ పట్టుకొని ఏ పార్టీకి  ఓటు వేస్తావు, ఏ ప్రభుత్వంపై మీకు నమ్మకం ఉంది? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ అభిమానుల వివరాలు సేకరించడం టీడీపీ కుట్రలో భాగమే.  – జీవీఎస్‌ఎల్‌డి రామరాజు, అక్కయ్యపాలెం

ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే...
సర్వేల పేరుతో ఓట్లు తొలగించడం ప్రభుత్వం కుట్రలో భాగమే.. రాష్ట్ర వ్యప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ప్రభుతం స్పందించడం లేదంటే ఏమయి ఉంటుంది. దీనిపై ప్రజల్లో చాలా ఆందోళనలున్నాయి. ఈ ట్యాబ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారన్న అంశాలపై ఆరా తీయాలి. ఓట్లు పోయిన వారికి వెంటనే తిరిగి నమోదు చేయాలి. ఓటమి భయంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. – పూరెడ్డి పైడిరెడ్డి, కాంట్రాక్టరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement