fake survey
-
సందట్లో సైబర్ వల
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పేరుతో ఫోన్లకు లింక్ పంపిస్తున్నారు. ఎవరైనా ఆతృతతో ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ఎన్నికల ఫలితాల చర్చల ఆధారంగా ఆయా సోషల్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ సర్వేలతో కూడిన లింకులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఏ పారీ్టకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు వెంటనే వాటిని తెరుస్తున్నారు. ఇంకేముంది వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతోంది. ఆపై పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలను హ్యాక్ చేసి.. ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ముల్ని కాజేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగులకు పాల్పడుతున్న వారు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. తాము బెట్టింగ్ వేసిన పార్టీ, అభ్యర్థి గెలుపోటముల గురించి పదేపదే తెలుసుకోవడంలో భాగంగా వారు తమకు కనిపించే ప్రతి ఎగ్జిట్ పోల్ లింకును తెరిచి చూస్తున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. అయితే.. మోసపోయిన వారు ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోవడం కూడా సైబర్ నేరగాళ్లకు కలిసివస్తోంది. తాము మోసపోయామని చెబితే బెట్టింగ్ వేసిన విషయం కూడా బయటకు వస్తుందనే భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. అఅప్రమత్తం చేస్తున్న బాధితులుఇలా మోసపోయిన వారిలో కొందరు మరొకరికి ఇలా జరగకూడదని భావించి.. సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అలాంటి లింకులను చూసి మోసపోవద్దని, వాటిని ఎవరూ తెరవద్దని పోస్టులు పెడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియాలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రచారం జరిగింది. కాగా.. మంగళవారం ఫలితాలు వెలువడే వరకూ ఇలాంటి ఫేక్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
KSR Live Show: ఏపీలో 177 సీట్లా ?..బయటపడ్డ టీడీపీ ఫేక్ సర్వే
-
వచ్చాడు జాదూగాడు
సాక్షి, అమరావతి: నక్క జిత్తులు, నకిలీ వేషాలకు ప్రతిరూపం తానేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! జనసేనతో జత కట్టి ఎన్ని మారీచ వేషాలు వేసినా గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని తాడేపల్లిగూడెం సభ సాక్షిగా గ్రహించిన చంద్రబాబు కనీసం అవినీతి కేసుల నుంచైనా బయటపడాలనే వ్యూహంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తు కుదుర్చుకున్నారు. జాతీయ పార్టీతో పొత్తు కుదిరిన వెంటనే వ్యవస్థలను జయప్రదంగా మేనేజ్ చేయడంలో తనకున్న అద్వితీయమైన ప్రతిభను జాతీయ మీడియాలో కొన్ని సంస్థల ముందు ప్రదర్శించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయంటూ మొన్న సీ–ఓటర్ సంస్థ ఓ నకిలీ సర్వేను వెల్లడించగా న్యూస్–18 నిన్న మరో ఫేక్ సర్వేను వదిలింది. రానున్న రోజుల్లో మరిన్ని నకిలీ సర్వేలు ఇదే రీతిలో వెల్లడి కానున్నాయి. నకిలీ సర్వేల ద్వారా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పుంజుకున్నట్లు కృత్రిమ బలాన్ని చూపించి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. అయితే వైఎస్సార్సీపీ 50 శాతానికిపైగా ఓట్లతో 24–25 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 0–1 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని టౌమ్స్ నౌ, చాణక్య లాంటి ప్రముఖ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని తేలింది. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరిన రెండు మూడు రోజుల్లోనే ఆ కూటమి గెలుస్తుందంటూ సీ–ఓటర్, న్యూస్–18 ఒపీనియన్ సర్వేలు ఆదరాబాదరాగా ప్రకటించడంపై రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ప్రజాభిప్రాయం ఎలా తారుమారు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి అవి నకిలీ సర్వేలన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నారు. 2019లోనే అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ–ఓటర్, న్యూస్–18 అంచనాలు ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. సర్వేల పేరుతో చంద్రబాబు ఎన్ని మాయ వేషాలు వేసినా సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి చరిత్రాత్మక విజయం సాధించడం ఖాయమని, వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని పేర్కొంటున్నారు. సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం చెప్పారు. గత 58 నెలల్లో 99 శాతం హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.65 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.44 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా కొనసాగించారు. ప్రభుత్వ ఆర్థిక చేయూతను వినియోగించుకున్న పేదలు పేదరికాన్ని అధిగమించడమే ఇందుకు నిదర్శనం. 2015–16లో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు తార్కాణం. గ్రామ వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో గత 58 నెలల్లో 2.13 లక్షల నియామకాలు చేపట్టడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న వైఎస్సార్సీపీ గ్రాఫ్.. సంక్షేమ పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని చాటి చెప్పాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 24–25 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధించడం తథ్యమని, టీడీపీ 0–1 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఉనికి చాటుకునే అవకాశం ఉందని, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌లు ఉనికి కూడా చాటుకోలేవని మూడు నెలల క్రితం టౌమ్స్‌నౌ సర్వే వెల్లడించింది. జీన్యూస్ మారిటైజ్, జీవనాధర్ ఇండియా, జన్మత్ పోల్స్, పీపుల్స్ పల్స్, చాణక్య లాంటి డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడైంది. కేసుల భయంతో కాళ్ల బేరం.. ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్సీపీని, సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని గ్రహించిన చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో జత కలిశారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేశారు. జెండా సభ అట్టర్ ప్లాప్ కావడంతో మళ్లీ ఘెర పరాజయం తప్పదని ఆందోళన చెందిన చంద్రబాబు స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి భూకుంభకోణం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పాల్పడిన ఐఎంజీ భారత్ కుంభకోణం వరకూ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీ పొత్తు కోసం పాకులాడారు. ఢిల్లీ వెళ్లి మూడు రోజులు పడిగాపులు కాసి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తుకు ఒప్పించుకున్నారు. బీజేపీతో జతకట్టినా డజను సర్వేలది ఒకే మాట ♦ బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ౖటౌమ్స్ నౌ–ఈటీజీ సంస్థ భారీ సర్వే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించింది. 49 శాతం ఓట్లతో 21–22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, 45 శాతం ఓట్లతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 3–4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని తేల్చింది. ♦ 48 శాతం ఓట్లతో 19 లోక్‌సభ, 133 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 44 శాతం ఓట్లతో 6 లోక్‌సభ, 42 శాసనసభ స్థానాలకు పరిమితం అవుతుందని జీన్యూస్–మారిటైజ్ సర్వే వెల్లడించింది. ♦ 49.5 శాతం ఓట్లతో 121 శాసనసభ (ఐదు అటూఇటుగా) స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 43 శాతం ఓట్లతో 54 (ఐదు అటూఇటుగా) శాసనసభ స్థానాలతో సరి పెట్టుకుంటుందని పొలిటికల్ క్రిటిక్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ♦ రాష్ట్రంలో 49 శాతం ఓట్లతో 17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుకుంటుందని, 44 శాతం ఓట్లతో 8 లోక్‌సభ స్థానాలకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పరిమితం అవుతుందని చాణక్య సర్వే తేల్చింది. జనాధార్ ఇండియా, జన్మత్ పోల్స్, పీపుల్స్ పల్స్ తదితర డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థల సర్వేలదీ అదే మాట. -
రామోజీది గోబెల్స్ అంశ
-
ఎలాంటి సర్వేలు చేయలేదు.. ఆ వార్తల్ని నమ్మొద్దు: ఐ-ప్యాక్
సాక్షి, తాడేపల్లి: తాము చేసిన సర్వేలంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ ఐ-ప్యాక్ ట్వీట్ చేసింది. ఏపీలో ఐ-ప్యాక్ సర్వే ఫలితాలు అంటూ ఓ ఛానల్లో వచ్చిన వార్తలను ఐ-ప్యాక్ సంస్థ ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము ఎలాంటి సర్వేలు చేయలేదని వెల్లడించింది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఐ-ప్యాక్ పేర్కొంది. చదవండి: ప్చ్.. అవినీతిని గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు A media channel in Andhra Pradesh has shared a fake survey linking it to I-PAC. Let's set the record straight: I-PAC does NOT conduct any surveys. Any survey attributed to us on media/social media platforms is entirely untrue. These are baseless and desperate attempts by… — I-PAC (@IndianPAC) August 31, 2023 -
నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ పాక్ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐపాక్ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్ డెస్క్ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేసింది. Facing imminent defeat, @BJP4Bengal has now gone down to the level of using FAKE surveys in the name of I-PAC to keep the morale of their workers up!! P.S: In I-PAC, no one uses desktops so at-least be smart in your effort to create fake survey / reports! 😉🤣 pic.twitter.com/lFaOo0DshU — I-PAC (@IndianPAC) March 31, 2021 చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..
సాక్షి, యనమదల (ప్రత్తిపాడు): సర్వే అంటూ ఇంటి తలుపుతట్టాడు.. బీమా అంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు.. ముఖంపై పౌడర్ చల్లి బంగారు నగలతో ఉడాయించాడు.. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోనికి వెళితే.. యనమదల గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్వరికి ముగ్గురు సంతా నం. అందరికీ వివాహాలు చేసింది, నాలుగేళ్ల కిందట భర్త చనిపోవడంతో యనమదలలో ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం ఉదయం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పిలిచాడు. మీకు పింఛన్ వస్తుందా? రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయా? పొలం ఎంత ఉంది? ఆదాయమెంత? అంటూ మాటలు కలిపాడు. మీకు భర్త లేడు కదా..మీకు ఇన్సూరెన్స్ డబ్బులు రూ.16 లక్షలు వస్తాయి, ముందస్తుగా డిపాజిట్‌గా రూ.లక్షా ఇరవై ఐదు వేలు చెల్లించాలని చెప్పాడు. ఇప్పటికప్పుడు డబ్బులు కట్టలేని పక్షంలో మీ దగ్గర బంగారం ఉంటే ష్యూరిటీ కింద ఇవ్వండి, ఫొటో తీసుకుని మీ బంగారం మీకు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. దీంతో మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లి బీరువాలో నాలుగు సవర్ల చంద్రహారం, గొలుసు తెచ్చి ఆగంతకుడికి ఇచ్చింది. ఫొటోలకని మరో రూ.వెయ్యి కూడా ఇచ్చింది. అంతే ఆగంతకుడు మల్లేశ్వరి ముఖంపై పౌడర్ చల్లాడు. దీంతో ఆమె మగతకు గురైంది. తేరుకుని చూసేలోపలే ఆగంతకుడు బైక్‌పై పారిపోయాడు. ఆ వ్యక్తి ఆనవాళ్లను బాధితురాలు పోలీసులకు తెలిపింది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లగడపాటిది పనికిమాలిన సర్వే: టీడీపీ మంత్రి
నర్సీపట్నం: ‘ప్రజల నాడి లగడపాటికి ఏమి తెలుసు.. ఆయన సర్వే వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని’ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌లో లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వేపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ వలన అనేకమంది కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కట్టి వీధిన పడ్డారన్నారు. ప్రజల నాడి తెలియని ఇలాంటి పనికిమాలిన సర్వేల వల్ల కోట్లలో బెట్టింగ్‌లు కాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోకుండా ఢిల్లీ వంటి నగరాల్లో కూర్చుని చేసే సర్వేల్లో వాస్తవికత ఉండదన్నారు. ప్రజలనాడి తెలిసిన వారే ఎగ్జిట్‌పోల్స్ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం నవ్వులాటగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. కౌటింగ్ కేంద్రంలో అభ్యర్థి వద్ద సెల్‌ఫోన్ ఉండేందుకు అంగీకరించని ఎన్నికల కమిషన్.. కేంద్ర అబ్జర్వర్‌కు సెల్‌ఫోన్ అనుమతించడంపై అయ్యన్న అనుమానం వ్యక్తం చేశారు. -
ఫేక్ సర్వే, శాకమూరి తేజోభాను అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఎఫ్సీ సంస్థ డైరెక్టర్ శాకమూరి తేజోభానూని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే పేరుతో ఫేక్ సర్వే విడుదల చేసిన టీఎఫ్సీ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న తేజోభానును పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే చేసిందంటూ టీఎఫ్సీ మీడియా ఓ తప్పుడు కథనాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసింది. అయితే తాము ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సర్వే చేయలేదని అది పూర్తిగా ఫేక్ అంటూ ఈ నెల 2వ తేదీన తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శాకమూరి తేజోభానుతో పాటు ఫేక్ సర్వే స్క్రిప్ట్ రైటర్ ముప్పాళ్ళ ప్రసన్నకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ నెల 7న ప్రసన్నకుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న తేజోభానుకు తాజాగా నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు. మరో డైరెక్టర్‌గా ఉన్న సంయుక్త...ఆమె వీడియో మార్ఫింగ్ చేసే సమయంలో ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారా లేక రాజీనామా చేసి వెళ్ళారా అనే విషయంలో స్పష్టత కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా టీఎఫ్సీ మీడియా కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ఎన్బీకే కాంప్లెక్స్లోను, బంజారాహిల్స్లోను, సాగర్ సొసైటీ కార్యాలయంలోను పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఈ ఫేక్ సర్వేను అప్డేట్ చేసేకంటే ముందే కార్యాలయాలు ఖాళీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
బీజేపీకి 323 నుంచి 380 సీట్లట!
సాక్షి, న్యూఢిల్లీ : 2014 ఎన్నికల్లో బీజేపీ సష్టించిన ప్రభంజనం 2019 ఎన్నికల్లో పునరావతం అవడమే కాకుండా, అంతకంటే ఎక్కువ ప్రభంజనాన్ని సష్టిస్తుందట. లోక్‌సభలోని 543 సీట్లకుగాను హీన పక్షంలో బీజేపీకి 323 సీట్లు, గరిష్టంగా 380 సీట్లు వస్తాయని అమెరికాలోని గూఢచారి సంస్థ సీఐఏ, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో తేలినట్లు ‘బీబీసీ న్యూస్’ హోం పేజీ ట్యాగ్‌ను తగిలించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలోనే కాకుండా ట్విట్టర్లో కూడా షేర్ చేసుకున్నారు. కొన్నింటిలో సీఐఏ, ఐఎస్ఐ నిర్వహించిన సర్వే తేలిందని ఉండగా, బీబీసీ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో తేలిందని మరికొన్నిట్లో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని సీట్లు బీజేపీకి వస్తాయని, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయో కూడా వైరల్ అయిన వార్తలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 25 సీట్లకుగాను మూడు నుంచి నాలుగు, అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు సీట్లకు రెండు, అస్సాంలో 14 సీట్లకుగాను 8–10 సీట్లు, బీహార్‌లో 40 సీట్లకుగాను 30–35 సీట్లు, చత్తీస్‌గఢ్‌లో 11 సీట్లకుగాను ఆరు నుంచి ఎనిమిది, గోవాలో రెండుకు రెండు, గుజరాత్లో 26కు 24–25, హర్యానాలో 10కిగాను ఆరు నుంచి ఎనిమిది, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగింటికి నాలుగు, జమ్మూ కశ్మీర్లో ఆరింటికి మూడు, జార్ఖండ్‌లో 14కు ఎనిమిది నుంచి పది, కర్ణాటకలో 28కి 24–25, కేరళలో 20 సీట్లకు రెండు నుంచి మూడు, మధ్యప్రదేశ్‌లో 29కి 24–25, మహారాష్ట్రలో 48కి 36–38, ఒడిశాలో 21కి 8–10, పంజాబ్‌లో 13కు, ఐదు నుంచి ఆరు, రాజస్థాన్‌లో 25కు 20–24, తమిళనాడులో 39కి 28–30, తెలంగాణలో 17లో ఒకటి నుంచి రెండు, త్రిపురలో రెండుకు రెండు సీట్లు వస్తాయని పేర్కొన్నారు. వాట్సప్‌లో వైరల్ అవుతోన్న మెసేజ్ అలాగే, ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లకుగాను 45 నుంచి 70 సీట్లు, ఉత్తరాఖండ్‌లో ఐదుకు ఐదు, పశ్చిమ బెంగాల్లో 42కు పది నుంచి 12, మేఘాలయలో రెండుకు ఒకటి, మిజోరమ్‌లో ఒకటికి ఒకటి, మణిపూర్‌లో రెండుకు ఒకటి, నాగాలండ్‌లో ఒకటికి ఒకటి, ఢిల్లీలో ఏడుకు ఆరు నుంచి ఏడు, అండమాన్, చండీగఢ్, దాద్రి నగర్ హవేలి, డామన్, డయ్యూ, లక్ష్యదీప్, పుదుచ్ఛేరిలలో ఒక సీటుకు ఒక సీటు బీజేపీకి వస్తాయని పేర్కొన్నారు. ఇక దేశంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణగల నాయకుడని కూడా తేలినట్లు ఆ వార్తల్లో ఉంది. వాస్తవానికి ఈ వార్తతోని తమకు ఎలాంటి సంబంధం లేదని, అసలు భారత్‌లో తాము ప్రీపోల్ సర్వేలు ఎన్నడూ నిర్వహించమని బీబీసీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇది పూర్తిగా నకిలీ వార్తంటూ నకిలీ వార్తలను వెతికి పట్టుకునే పోర్టల్ ‘ఆల్ట్ న్యూస్’ స్పష్టం చేసింది. -
ఆంధ్రజ్యోతి ఫేక్ సర్వే.. మండిపడ్డ మిషన్ చాణక్య
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చే అవకాశముందని కార్పొరేట్ చాణక్య పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం ఓ దొంగ సర్వేను ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు ఈ సారి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని తెలిసిపోయిన చంద్రబాబు ఈ తోకపత్రిక సాయంతో సర్వే డ్రామాలకు తెరతీశాడు. దాంతో ప్రముఖ సర్వే సంస్థ మిషన్ చాణక్య పేరును పోలి ఉండేవిధంగా ‘కార్పొరేట్ చాణక్య’ అనే ఫేక్ సర్వే సంస్థ పుట్టుకొచ్చింది. ఏకంగా టీడీపీకీ 101 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పుకొచ్చింది. ఇక తమ పేరును బద్నాం చేసిన ఆంధ్రజ్యోతి పత్రికపై మిషన్ చాణక్య మండిపడింది. దొంగ సర్వేలను ప్రచురించమే కాకుండా.. తమ ట్రాక్ రికార్డును సైతం కాపీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రజ్యోతి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని వెల్లడించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. మా అంచనా తప్పలేదు.. టీడీపీకి 101 సీట్లు అంటూ సర్వే పేరుతో సోమవారం నాటి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కథనంలో.. మా సంస్థ ‘మిషన్ చాణక్య’ పేరును దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా సంస్థకున్న ప్రతిష్టను దిగజార్చేలా .. కార్పొరేట్ చాణక్య అనే మారుపేరును సృష్టించడం అభ్యంతరకరం. మిషన్ చాణక్యకున్న ట్రాక్‌రికార్డును.. కొర్పొరేట్ చాణక్య అనే లేని సంస్థకు ఆపాదించడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎవరీ చాణక్య అంటూ ప్రచురించిన ట్రాక్ రికార్డు వాస్తవానికి మిషన్ చాణక్యదని స్పష్టం చేస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మా సంస్థకు దక్షిణాది రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది. కర్ణాటకలో బీజేపీ సీట్లను ఖచ్చింతంగా అంచనా వేసిందీ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చే సీట్లను ఖచ్చితంగా అంచనా వేసింది కూడా మిషన్ చాణక్య మాత్రమే... కార్పొరేట్ చాణక్య కాదు అని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఏపీలో ఎవరు గెలిచేది కూడా చెప్తాం.. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలకుసంబంధించి కూడా మేము సర్వే నిర్వహిస్తున్నాం. కానీ మిషన్ చాణక్య తన ప్రస్థానంలో ఎప్పుడూ ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించలేదు. కర్ణాటకలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎన్నికల నియమావళికి అనుకూలంగానే ఒపీనియన్ పోల్స్‌ను, ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది మిషన్ చాణక్య. ఈ ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చివరి ఫేజ్ ఎన్నికల తర్వాత విడుదల చేసేందుకు మేం సిద్ధమవుతున్నాం. ఆంధ్రజ్యోతి పత్రికలో అచ్చయిన సమాచారం మాది కాదని ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఈ మేరకు తప్పడు పేరుతో వార్తను ప్రచురించడం చట్ట వ్యతిరేకం అని స్పష్టం చేస్తున్నాం. (చదవండి : మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్) -
మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ మీడియా సర్వేలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని స్పష్టం చేయడంతో.. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన ఎల్లో మీడియా ఫేక్ సర్వే కుట్రకు తెరలేపారు. లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వే పేరిట ఇటీవల ఆంధ్రజ్యోతి పన్నిన ఎన్నికల సర్వే కుతంత్రం బెడిసికొట్టిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు పన్నిన పన్నాగం అభాసుపాలైంది. టీడీపీ ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందని ప్రముఖ సంస్థ లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైనట్లు ప్రచురించింది. అయితే సదరు సంస్థ తాము ఏ సర్వే చేయలేదని, తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చంద్రబాబు ఆయన ఎల్లోమీడియా బాగోతం బట్టబయలైంది. అంతటితో ఆగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డి వాయిస్ అంటూ ఓ ఫేక్ ఆడియో కాల్‌ను తీసుకొచ్చి మరోసారి అబాసు పాలైంది. ఆ ఆడియో విన్న ఎవరైనా అది విజయసాయిరెడ్డి వాయిస్ కాదని ఇట్టే పట్టేస్తారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఖబర్దార్ రాధాకృష్ణ అంటూ మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి హెచ్చరించడంతో ఆ ఆడియోను మాయం చేసింది. పత్రికలో మాత్రం అది విజయసాయిరెడ్డిదేనని బుకాయించే ప్రయత్నం చేసింది. తాజాగా కార్పొరేట్ చాణక్య అనే పేరుతో మరో ఫేక్ సర్వేను జనాలపై రుద్దే ప్రయత్నం చేసింది. ఈ సర్వేలో టీడీపీకే ప్రజలు పట్టం కట్టారని.. చంద్రబాబు చేసిన అభివృద్ధికి ప్రజలు బాగున్నాయంటున్నారని అహో..ఓహో అని ఊదరగొట్టింది. టీడీపీ ఏకంగా 101 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని, ప్రతిపక్షపార్టీ అయిన వైఎస్సార్సీపీ 71 సీట్లు.. జనసేన మూడు సీట్లు గెలుస్తుందని పేర్కొంది. అయితే వారు పేర్కొన్న కార్పొరేట్ చాణక్య సంస్థ గురించి ఇంటర్నెట్లో ఆరా తీయగా.. ఎక్కడా ఎలాంటి వివరాలు లభించలేదు. అసలు సంస్థ ఉన్నట్టు ఎక్కడా కనబడలేదు. 13 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాల్లో సర్వే నిర్వహించిన సంస్థకు ఒక వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టుడే చాణక్య అనే ప్రముఖ సర్వే సంస్థ పేరుకు దగ్గరగా ఉండేలా ‘కార్పొరేట్ చాణక్య’ అనే సర్వే కంపెనీని సృష్టించి.. ప్రజల్లో గందరగోళం లేపే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ కుట్రను ముందుగానే గుర్తించి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రజలను, ప్రార్టీశ్రేణులను అప్రమత్తం చేశారు. ‘తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని లగడపాటితో చెప్పించాలా? ఇంకో రూపంలో వెల్లడించాలా? అని మల్లగుల్లాలు పడుతున్నారట చంద్రబాబు. లగడపాటి+ ఏదైనా చానల్ చేసిన సర్వే అని చెప్పిస్తే జనాలను నమ్మించవచ్చని పచ్చమీడియా సలహా ఇచ్చిందిట. స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. సరిగ్గా 4 గంటల అనంతరం ఆంధ్రజ్యోతి ఈ ఫేక్ సర్వే వివరాలను టీవీ, వెబ్సైట్లో వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటితో పన్నిన వ్యూహం బెడిసి కొట్టడంతో ఇప్పుడు ఆయనను కాకుండా కార్పొరేట్ చాణక్య పేరుతో ఈ ఫేక్ సర్వే కథనాన్ని వండి వార్చింది. We have not released any Opinion poll on LS 2019 & AE 2019 elections. Any numbers in our name doesn’t belong to us. Thank you. — Today's Chanakya (@TodaysChanakya) April 6, 2019 @VSReddy_MP , ABN telecasted corporate chanakya survey pre poll on AP and declared tdp will get 101 seats. I just wondered and checked in Google and I didn't find corporate chanakya on Google. https://t.co/V1PnXfZXOz — Krishna Chaitanya Reddy (@Krishna07527807) April 7, 2019 -
ఎన్నికల వేళ టీడీపీ మరో ఎత్తుగడ
-
మరో నకిలీ సర్వే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం ఖాయమంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు సర్వే కథనాన్ని ప్రచురించిన సంగతి మరువకముందే అదే తరహాలో ఏపీ ప్రజలను బురిడీ కొట్టించేందుకు మరో ప్రయత్నం జరిగింది. ఏపీలో ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం సర్వే నిర్వహించారని, అందులో టీడీపీ భారీ ఆధిక్యంతో గెలుస్తున్నట్టుగా తేలిందంటూ యూట్యూబ్‌లో హైదరాబాద్‌కు చెందిన టీఎఫ్సీ మీడియా అనే ప్రైవేటు కంపెనీ ఓ దొంగ సర్వేను ప్రసారం చేసింది. దీన్ని గుర్తించిన తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై తాము ఎలాంటి సర్వే నిర్వహించలేదని, కానీ వారి ప్రచారానికి తమ శాఖ పేరును వాడుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఈ కంపెనీ డైరెక్టర్ శాఖమూరి తేజోభాను, ఇతర డైరెక్టర్లపై ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో టీడీపీ అనుకూలవాదుల మరో ఎత్తుగడ బట్టబయలైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బట్టబయలైందిలా.. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కె.హరిప్రసాద్ హైదరాబాద్ కమిషనరేట్‌లోని వెస్ట్‌జోన్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన తన సెల్ఫోన్లో యూట్యూబ్‌ను బ్రౌస్ చేస్తున్నారు. అందులో టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ టిమిటెడ్ అనే సంస్థ అప్లోడ్ చేసిన ఓ వార్త ఆయన కంటపడింది. ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సర్వే చేసిందని, టీడీపీ భారీ ఆధిక్యంతో గెలవనుందన్న విషయం సర్వేలో వెల్లడైందని ఈ కథనంలో ఉంది. దీనిపై హరిప్రసాద్ తమ డిపార్ట్మెంట్లో ఆరా తీయగా ఏపీ ఎన్నికపై తెలంగాణ నిఘా విభాగం ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని తేలింది. దీంతో ఈ బోగస్ వార్త విషయాన్ని హరిప్రసాద్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. శాఖమూరి తేజోభాను తదితరులు టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ముసుగులో తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పేరుతో తప్పుడు సర్వేలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఏపీ ఓటర్లను మభ్యపెట్టి టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా చేయాలని కుట్ర పన్నారని, ఇందుకోసం తెలంగాణ ఇంటెలిజెన్స్ పేరును వాడుతూ ఆ విభాగం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని తెలిపారు. టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రామకృష్ణ వీరపనేని నేతృత్వంలోని మ్యాంగో అండ్ వాక్డ్ అవుట్, అదుగాని మల్లేష్ నేతృత్వంలోని చాలెంజ్ మిత్ర, చీపురుపల్లి రాంబాబు నేతృత్వంలోని టాలీవుడ్నగర్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు, వారితో కలిసే ఈ కుట్ర చేసినట్లు ఆరోపించారు. హరిప్రసాద్ తన ఫిర్యాదుతోపాటు యూట్యూబ్ లింకులు, అందులో పొందుపర్చిన అంశాలకు సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీలోని 171 (సీ), రెడ్‌విత్, 171 (ఎఫ్), 171 (జీ), 417, 420, 465, 468, 471, 505(1), (సీ), 505(2), రెడ్‌విత్ 120(బీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 66(డీ) కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి కేసు దర్యాఫ్తు చేస్తున్నారు. టీడీపీ కీలక నేతలతో సంబంధాలు ప్రాథమిక ఆధారాలను బట్టి టీఎఫ్సీ సంస్థ 2016 నవంబర్ 15 నుంచి పనిచేస్తున్నట్లు, శాఖమూరి తేజోభాను తదితరులు డైరెక్టర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఎన్బీకే బిల్డింగ్, సాగర్ సొసైటీ చిరునామాలతో ఈ సంస్థ పనిచేస్తున్నట్లు తేలింది. ఈ సంస్థల నిర్వాహకులు టీడీపీతో, దాని కీలక నేతలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో టీడీపీ నేతలకు అనుకూలంగా, వైఎస్సార్సీపీ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి కూడా వీరే బాధ్యులని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు: కన్నా
సాక్షి, అమరావతి : ‘అధికారం టీడీపీదే’ అనే జోక్‌ని ప్రచురించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు ధన్యవాదాలంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఏపీలో అధికారం టీడీపీదే అని లోక్‌నీతి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ లక్ష్మీనారాయణ వ్యంగ్యంగా.. ఆంధ్రజ్యోతిని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తెలుగు పత్రికలు ఫూల్స్ డే నాడు హాస్యాస్పద కథనాలు ప్రచురించేవని తెలిపారు. అయితే గత కొంతకాలంగా ఈ సంప్రదాయం కనిపించడం లేదని.. కానీ ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభించిందన్నారు. ‘అధికారం టీడీపీదే’ అనే తప్పుడు కథనంతో ఏప్రిల్ 1న నాడు మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు అంటూ కన్నా ట్వీట్ చేశారు. గతంలో తెలుగు పత్రికలు ఏప్రిల్ 1st ఫూల్స్ డే నాడు హాస్యాస్పదంగా కథనాలు వేసేవారు.. ఎందుకో మిగతా పత్రికలు ఆ సంప్రదాయం ఆపేసాయి.. కానీ నేటి ఆంధ్రజ్యోతి "అధికారం టీడీపీదే" అని ఏప్రిల్ 1st నాడు నవ్వులు పూయించింది.. జోక్ ని ప్రచరించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు. pic.twitter.com/MUe1L88FNP — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) April 1, 2019 ఇదిలా ఉండగా ఏపీలో టీడీపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే దీనిని ఎస్డీఎస్ లోక్‌నీతి సర్వే సంస్థ తీవ్రంగా ఖండించింది. తమ అనుమతి లేకుండా సంస్థ పేరును ప్రచురించినందుకు సంబంధిత పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. (చదవండి: అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి..!) -
ఫేక్ సర్వేలతో అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి
-
అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి..!
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి అధికార టీడీపీ ఎలా దొడ్డిదారిన వెళ్తుందో మరోసారి స్పష్టమైంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఫేక్ సర్వేలను తన అనుకూల మీడియాతో ప్రచారం చేసుకుంటోంది. ఏపీలో అధికారం టీడీపీదే అని లోక్‌నీతి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎస్డీఎస్ లోక్‌నీతి సర్వే సంస్థ తీవ్రంగా స్పందించింది. తాము ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన సర్వే ఫేక్ అని తేల్చిచెప్పింది. తమ అనుమతి లేకుండా సంస్థ పేరును అక్రమంగా ప్రచురించింనందుకు సంబంధిత పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ ప్రకటించింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన సర్వేను తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ కథనానికి తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు, తన ఎల్లో మీడియా అసత్య ప్రచారం మరోసారి బట్టబయలైంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లే విధంగా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలు కథనాలను ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఏపీలో టీడీపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటూ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఓ వైపు ఓటర్లను బెదిరిస్తూ.. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తూ.. మరోవైపు ఇలా పచ్చమీడియాతో ఫేక్ సర్వేలను ప్రచురిస్తూ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచుకునేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతూ.. ఫేక్ సర్వేలను సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో భారీ ఓటమి తప్పదనే ఇలా పచ్చ పత్రికలతో అసత్య వార్తలను ప్రచురిస్తున్నారు. -
నెల్లూరులో మరోసారి సర్వేల కలకలం
-
సర్వే కలకలం
ధర్మవరం: రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు అలజడి సృష్టిస్తున్నాయి. ఓట్లు తొలగిస్తున్నారని, తమకు తెలియకుండా తమ పేరిటే ఫారం–7 దరఖాస్తులు నమోదవుతున్నాయని ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క గోప్యంగా ఉండాల్సిన పౌరుల ఆధార్, అకౌంటు తదితర వివరాలు ఐటీ కంపెనీల వద్దకు చేరుతున్న ఉదంతం ఆధారాలతో సహా బయటపడ్డా.. సర్వేలు మాత్రం అగడం లేదు. ఓటమి భయంతో ఉన్న అధికారపార్టీ పోలీసుల ద్వారా సర్వేరాయుళ్లకు సహకరిస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో ట్యాబ్‌లతో సర్వే టీంలు గ్రామ గ్రామానా పర్యటించి వివరాలు సేకరిస్తున్నాయి. ధర్మవరం పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ లాడ్జిని కేంద్రంగా చేసుకున్న ఓ సర్వే టీం నాలుగు బృందాలుగా విడిపోయి, బుధవారం ధర్మవరం మండల పరిధిలోని సీసీకొత్తకోట, నిమ్మలకుంట, పోతులనాగేపల్లి, బిల్వంపల్లి, బుడ్డారెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ఓటర్ల వివరాలను సేకరించారు. బత్తలపల్లి మండల పరిధిలోని జ్వాలాపురం, తంబాపురం గ్రామాల్లో మరో టీం సభ్యులు వివరాలను సేకరించారు. అయితే సీసీ కొత్తకోట, జ్వాలాపురం గ్రామాలకు వెళ్లిన సర్వే టీం సభ్యులకు గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. మీకు వివరాలు చెబితే.. మా ఓట్లు తీసేస్తారంటూ గ్రామస్తులు తిరగబడ్డారు. సర్వే బృందం సభ్యులను ధర్మవరం రూరల్ పోలీసులకు అప్పగించారు. రక్షణగా పోలీసులు అయితే ప్రజల వివరాలను సేకరిస్తున్న వ్యక్తులను పోలీసులకు అప్పగిస్తే.. ‘మీదేం పోయింది.. మీకు ఇష్టం ఉంటే వివరాలు చెప్పండి.. లేకపోతే లేదు.. సర్వేలు అడ్డుకోకూడదంటూ మాకు ఆదేశాలు అందాయి.. మేమేమీ చేయలేం’ అంటూ పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. మరో సర్వే బృందం సభ్యుడు ఏకంగా పోలీస్ అధికారికే ఫోన్ చేసి, తాము సర్వే చేస్తుంటే అడ్డుకుంటున్నారు.. వీళ్లకు కాస్త గట్టిగా చెప్పండని పోలీస్ ఉన్నతాధికారికి చెబితే ఆయన గ్రామస్తులపై బూతుపురాణం మొదలుపెట్టి భయబ్రాంతులకు గురిచేశారు. ప్రజల వివరాలను భద్రంగా ఉంచాల్సిన అధికారులే సర్వే రాయుళ్లకు వంతపాడుతుంటంతో గ్రామస్తులు చేసేదిలేక నిమ్మకుండిపోయారు. ఎవరూ వివరాలు చెప్పొద్దు సర్వే పేరిట సమాచారం సేకరించే వారెవరికీ మీ వివరాలు చెప్పొద్దు. మనం చెప్పే వివరాలు కంపెనీల చేతికి చేరుతున్నాయి. ప్రభుత్వమే సర్వే చేస్తుంటే గుర్తింపు కార్డు ఇవ్వాలి కదా?.. ఊరూపేరు లేని కంపెనీలు ప్రజల వివరాలు ఎలా సేకరిస్తాయి?.. అయినా పోలీసులు.. ప్రజల వివరాలను సేకరిస్తున్న వారిని అడ్డుకోకుండా ప్రజలను బెదిరించడం ఏమిటి?..– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త -
ఇదిగో నిజం..!
ఈ చిత్రం రామభద్రపురం మండలంలోని టీడీపీ కార్యాలయం. అక్కడున్నది ఒకరు సర్వేరాయుడు మరొకరు టీడీపీ నాయకుడు. రామభద్రపురంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఇటీవల సర్వే చేసేందుకు వెళ్లగా అక్కడి వారు తిరగబడడంతో స్థానిక నాయకుడు వచ్చి సర్వే రాయుడ్ని సమర్ధించి ఇదిగో ఇలా పార్టీ కార్యాలయంలో తన పక్కనే కూర్చోబెట్టారు. దీంతో సర్వే చేసిన వ్యక్తి తనను ఎదిరిస్తున్న విషయాలను అవసరమైన వారికి ఫోను చేస్తున్నాడు. సాక్షాత్తూ మంత్రి సుజయకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనిది ఈ సన్నివేశం. టీడీపీ నాయకులే ఓట్ల తొలగింపుకు సిద్ధపడ్డారన్న దానికి ఇంతకన్నా ఇంకేం ఉదాహరణ కావాలి. విజయనగరం, బొబ్బిలి: ప్రత్యేక హోదా పోరాటం, యువభేరీ సదస్సులు, ప్రజా సంకల్పయాత్రతో జనం గుండెల్లో నిలిచిపోయిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేని అధికార పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయిలో సర్వేరాయుళ్లను దింపిన సంగతి తెల్సిందే. వారికి గ్రామస్థాయిలో సహకారం అందించింది కూడా స్థానిక టీడీపీ నాయకులే. వారి సహకారంతోనే గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ మీరు ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నారా? సమర్ధిస్తున్నారా అంటూ సర్వేలు చేసి మీ స్థానిక నాయకులెవరు అన్న వివరాలతో సంక్షిప్తం చేసిన సర్వే రాయుళ్లు ఇప్పుడు రోజుకు కొంత మంది చొప్పున వైఎస్సార్ సీపీ నాయకుల పేర్లతోనే ఓటర్లను తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇంకొకరిపైన తొలగింపు దరఖాస్తులు ఇస్తే గొడవలవుతాయని ఈ సర్వే రాయుళ్లు కేవలం వైఎస్సార్ సీపీ నాయకుల పేర్లనే తీసుకుని వారి పేరున తొలగింపు దరఖాస్తులు ఇస్తున్నారు. రోజూ రాత్రి వేళల్లో ఎక్కువగా ఈ దరఖాస్తులు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో అత్యధికంగా శనివారం సాయంత్రానికి 8,743 ఫారం 7 దరఖాస్తులు వచ్చాయి. బొబ్బిలిలోని తెర్లాం, బాడంగి, రామభద్రపురం, బొబ్బిలి మున్సిపాలిటీ మండలాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన ఓటర్ల పేరునే అధికంగా దరఖాస్తులున్నాయి. ఇందులో ఆ పార్టీకి చెందిన బూత్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, ఉత్సాహంగా పనిచేసేవారి పేరున తొలగించాలంటూ సర్వే రాయుళ్లు ఆన్లైన్ దరఖాస్తులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఇంకా రావచ్చంటున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఈ ఆన్లైన్ దరఖాస్తులు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నాలుగు మండలాల్లో ఉన్న వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లు తొలగించమన్నట్టుగా వారి పేరున దరఖాస్తులు వస్తున్నాయి. ఈ విషయమై తహసీల్దార్లు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. టీడీపీ నాయకుల కుట్రలపై గవర్నర్,ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు.. వైఎస్సార్సీపీకి చెందిన ఓటర్లను కావాలనే తొలగించే టీడీపీ నాయకుల కుట్ర ఇది. గతంలో సర్వేరాయుళ్లను వివిధ పోలీసు స్టేషన్లకు అప్పగించినా వారిని చుట్టాల్లా వదిలేశారు. వైఎస్సార్ సీపీ జోరును చూసి తట్టుకోలేక అధికార పార్టీ చేస్తున్న ఈ దురాగతాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, బొబ్బిలి. -
ఇది ప్రజల హక్కులను కాలారాయడమే
-
ఓటు గల్లంతుపై వైఎస్ వివేకా సీరియస్
సాక్షి, పులివెందుల: తన ఓటు తొలగించాలని దాఖలైన నకిలీ దరఖాస్తుపై దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి సీరియస్ అయ్యారు. ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు తెలియకుండా.. తన పేరు మీదే ఓటు తొలగించాలని దరఖాస్తు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచే ఓట్ల తొలగింపునకు వ్యుహరచన జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఓట్లు తొలగించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ అంశంలో ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. తన ఓటు గల్లంతుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కాగా, వైఎస్ వివేకానందరెడ్డికి ఓటు తొలగించాలని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తహశీల్దార్ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు పంపారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను దొంగ సర్వేల ద్వారా గుర్తించి వాటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డితోపాటు పులివెందుల నియోజకవర్గంలోని చాలా మంది వైఎస్సార్ సీపీ సానుభనూతిపరుల ఓట్ల తొలగింపుకు ఆన్లైన్లో భారీగా దరఖాస్తులు రావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. -
సర్వే చేస్తున్న యువకులు పట్టివేత
పశ్చిమగోదావరి, ఏలూరు(సెంట్రల్): సర్వేల పేరుతో నగరంలో సంచరిస్తున్న ఇద్దరు యువకులను వైఎస్సార్సీపీ నాయకులు టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఏలూరు 38వ డివిజన్లో ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ట్యాబ్‌లను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సర్వే చేస్తున్నరంటూ స్థానికులు వైఎస్సార్ సీపీ నాయకులకు సమాచారం అందించారు. నాయకులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. వారి వద్ద ఉన్న ట్యాబ్‌లు పరిశీలించారు. ఏలూరులోని ఓ హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్న ఓ వ్యక్తి ఏలూరు నియోజకవర్గం మొత్తం సర్వే చేసేందుకు 40 మంది యువకులను నియమించాడని, వారికి ట్యాబ్‌లు ఇచ్చి సర్వే చేసేందుకు పంపించాడని ఆ యువకులు చెప్పారు. ప్రభుత్వాన్నికి అనుకూలంగా సర్వే చేస్తున్నారని నిర్ధారించుకున్న పార్టీ నాయకులు వెంటనే టూటౌన్ పోలీసులకు వారిని అప్పగించారు. ఈ సర్వే వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నవారిని గుర్తించేందుకనే, తరువాత వారి ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని, సర్వే చేయిస్తున్న వారిన వెంటనే అరెస్ట్ చేయాలని పార్టీ నాయకులు టూటౌన్ సీఐ బి.జగన్నాథరావుకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ బండారు కిరణ్‌కుమార్, పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి టి.శశిధర్‌రెడ్డి, నాయకులు నవహార్ష తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. దొండపాడులో ఒక వ్యక్తి పోలీసులకు అప్పగింత ఏలూరు (టూటౌన్): బోగస్ సర్వే చేస్తున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జనసేన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అర్జా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు నియోజకవర్గం దొండపాడులో ఆదివారం ఉదయం సర్వే పేరుతో వచ్చిన వ్యక్తిని స్థానికులు నిలదీశారు. దీంతో అది బోగస్ సర్వే అని తేలింది. అతడిని ప్రశ్నించగా పేరు సుంకర ఉపేంద్ర, ఖమ్మం నుంచి వచ్చానని చెప్పాడు. మొత్తం 50 మంది ఉండగా, బృందాలుగా విడిపోయి 15 మంది దెందులూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నామని తెలిపాడు. ఏలూరులోని ఓ లాడ్జిలో ఉంటూ ఈ సర్వే చేస్తున్నట్టు చెప్పాడు. ఉపేంద్రను ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బోగస్ సర్వేపై సమగ్ర విచారణ చేయాలని ఫిర్యాదు చేసినట్టు ప్రసాద్ తెలి పారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారికి కూడా వినతి పత్రం అందజేశామన్నారు. -
ఓట్ల కోతకు స్కెచ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తాజాగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం మండలాల్లోని 263 పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఐదు వేల ఓట్లు తొలగించేందుకు కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆన్లైన్లో ఆది, సోమవారాల్లో దరఖాస్తు చేశారు. విచిత్రమేమిటంటే వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరిట ఆన్లైన్ దరఖాస్తు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ఒట్ల తొలగింపు చేపట్టాలని ఆన్లైన్లోనే జాబితాలు పంపించారు. సదరు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లకు ఈ విషయమే తెలియదు. వారెటువంటి దరఖాస్తు చేయకుండానే ఈ కుట్రకు తెరదీశారు. మొన్నటికి మొన్న కాకినాడలోని దుమ్ములపేట, రేచర్లపేట, ఏటిమొగ, పర్లోవపేట, కొత్త కాకినాడ, ముత్తానగర్, చర్చి స్క్వేర్ సెంటర్ ప్రాంతాల నుంచి ఒకే రోజున 1500 నుంచి 2వేల వరకు కొత్త ఓట్లు అప్లోడ్ చేశారు. ఒకే ప్రాంతం నుంచి 150 నుంచి 200 వరకు బల్క్ లో ఎంట్రీలు చేశారు. మీ సేవ చిరునామాలతో ఓటర్ల నమోదు చేయడంతో అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించే సరికి ఇక్కడేదో జరుగుతుందని నిర్ణయానికొచ్చారు. మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులను పిలిచి అధికారులు గట్టిగా మందలించారు.ఈ ఘటన మరువక ముందే బుధవారం అమలాపురంలో బట్టబయలు. ∙ఆ మధ్య టీడీపీ కిరాయి మనుషులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల వివరాలను తెలుసుకుని, వాటిని తొలగించేందుకు పావులు కదిపారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలోని మాచవరం, వాకలగరువు గ్రామాల్లో రెండు బృందాలుగా 11 మంది యువకులు ‘స్పా’ అనే సంస్థ పేరుతో తిరుగుతూ వైఎస్సార్సీపీ నేతలకు పట్టుబడ్డారు. టీడీపీ గుర్తింపు కార్డులు, మంత్రి నారా లోకేష్ ఫొటో ఉన్న ఐడెంటిటి కార్డులతో సంచరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. వీరిని పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఆ ముఠా బస చేసిన తాటిపాక లోని లాడ్జి వద్దకు వెళ్లేసరికి మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వారిని తర్వాత వదిలేశారు.ఇదంతా చూస్తుంటే ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లు చేర్పించే విషయంలో ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందో అర్థమవుతుంది. జిల్లాలో వైఎస్సార్ సీపీ అనుకూల ఓట్లు తొలగించేందుకు, అధికార పార్టీ నాయకులకు తమకు అనుకూలంగా బోగస్ ఓట్లు చేర్పించేందుకు పథకం ప్రకారం వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఓటర్లు అప్రమత్తం కాకపోతే రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు. ఓటమి భయంతోనే... టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఓట్ల కుట్రతో గెలవాలని చూస్తోంది. అందుకు కిరాయి మనుషులను రంగంలోకి దించింది. వీరు గ్రామాల్లో సంచరించి వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్ల వివరాలను సేకరించారు. టీడీపీకి వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు వ్యూహాత్మకంగా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆ జాబితాకు అనుగుణంగా ఓట్లను తొలగించే పనిలో పడ్డాయి. దానికి ఉదాహరణ అమలాపురం నియోజకవర్గంలో తాజాగా వెలుగు చూసిన వ్యవహారాన్నే తీసుకోవచ్చు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు ఐదు వేల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశారు. ఓటరు జాబితా నుంచి గ్రామంతరం, డెత్ ఓట్లు తొలగించేందుకు ఉపయోగించే ఫారమ్–7 ద్వారా ఓట్లు తొలగించేందుకు కిరాయి బృందాలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. నియోజకవర్గ పరిధిలోని 263 పోలింగ్ బూత్‌ల్లోని ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు పేరుతో అజ్ఞాత వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేయించారు. ఈక్రమంలో సోమ, మంగళవారాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 15 నుంచి 40 ఓట్లు తొలగించాలని ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఫారమ్–7 ద్వారా వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరిట అజ్ఞాత వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. అల్ల వరం మండలంలో 1300 ఓట్లు, ఉప్పలగుప్తం మండలంలో 996 ఓట్లు, అమలాపురం మండలంలో 2,800 ఓట్లు తొలగించాలని ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. ఇదే విషయమై ఎవరి పేరునైతే ఆన్లైన్లో తొలగింపు దరఖాస్తులు ఇచ్చారో వారిని అడిగితే తమకు తెలియదని, తమ పేరును ఎవరో ఇలా చేశారని, బూత్ కమిటీ కన్వీనర్లుగా ఉన్న తమ పేర్లను అజ్ఞాత వ్యక్తులు వాడుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అప్రమత్తమై ఆర్డీవోతో మాట్లాడారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి ఆర్లైన్ల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ జరపాలని, తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వెనుకున్న కుట్రను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ధర్నా ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపును నిరసిస్తూ స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి అలమండ చలమయ్య, పట్టణ అధ్యక్షుడు శిగడం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం నగర పంచాయితీ కమిషనర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్‌లోని 20–50 ఓట్లు తొలగించాలని తమ పార్టీ బూత్ కన్వీనర్లు అర్జీలు పెట్టుకున్నట్లు బీఎల్ఓల ద్వారా తమకు తెలిసిందన్నారు.అలా తమ పార్టీ నుంచి ఎవరూ అర్జీలు పెట్టలేదన్నారు. అధికార పార్టీకి చెందినవారే తమ పేర్లతో 2 వేల ఓట్లు తొలగించేందుకు కుట్రపూరితంగా అర్జీలు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దర్యప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామంతుల సూర్యకుమార్, తొండారపు రాంబాబు,మూది నారాయణస్వామి ,బదిరెడ్డి గోవిందు, దాకమర్రి సూరిబాబు, కర్రోతు గాంధీ, వసంత యోహాన్, వాగు బలరాం తదిరులు పాల్గొన్నారు. ఓట్ల తొలగింపు, పెద్ద సంఖ్యలో నమోదుకు పాల్పడితే జైలే: కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ: రాష్ట్రంలో ఆన్లైన్విధానం ద్వారా ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపునకు, ఓటర్ల నమోదుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయమిశ్రా బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది ఓటర్లకు తెలియకుండా ఫారమ్–7లో ఓటర్ల తొలగింపునకు,అదే విధంగా ఫారం–6లో ఓటర్ల నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి చర్యలు చట్ట వ్యతిరేకమని, ఇటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీసులకు ఆదేశాలిచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదులు వస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లకు తెలియకుండా తొలగింపులకు, నమోదులకు పాల్పడే వారి సమాచారాన్ని తెలియజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఓటర్ల జాబితాలో ఓటర్ల తొలగింపునకు సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి వాటిపై దర్యాప్తు చేసి అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా తొలగింపు కుదరదని, ఈ మేరకు ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని మిశ్రా వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పార్టీ మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ చర్యలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి యిళ్ల శేషారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి మెరికల శ్రీను, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి గుత్తుల రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు యల్లమిల్లి బోసు, రైతు విభాగ అధ్యక్షుడు బొక్కా శ్రీను, ఈతకోట సతీష్, గ్రామకమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓట్ల తొలగింపునకు ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు నేను అమలాపురం పట్టణంలో 49వ బూత్ కమిటీకి వైఎస్సార్ సీపీ కన్వీనర్‌గా ఉన్నాను. కన్వీనర్‌గా నా ప్రమేయం లేకుండా... నా సంతకం లేకుండా నా బూత్ పరిధిలో కొన్ని ఓట్ల తొలగింపులు జరుగుతున్నాయి. ఇదంతా తెర వెనుక ప్రభుత్వం చేస్తున్న కుట్రగా కనిపిస్తోంది. ఇలా ప్రతి బూత్ నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన సగటున 50 ఓట్లు తొలగిస్తే నియోజకవర్గం మొత్తం మీద పది వేల ఓట్లకు గండి పడుతుందన్నది వాస్తవం. తమ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందన్న అనుమానం కలుగుతోంది. –మట్టపర్తి నాగేంద్ర, 49వ బూత్ వైఎస్సార్ సీపీ కన్వీనర్, అమలాపురం ఇది ముమ్మాటికీ ప్రభుత్వం పనే... వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లే ఆన్లైన్లో ఓట్ల తొలగింపునకు అభ్యర్ధించినట్లుగా సృష్టించి ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వమే ఈ పనిచేసింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రే. సకాలంతో మేము గుర్తించాం కాబట్టి కుట్ర బయటపడింది. తమ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక ఇలా దొడ్డిదారిలో తమ పార్టీకి చెందిన ఓట్లు తొలగించే పని చేయడం సిగ్గుచేటు. అమలాపురం పట్టణంలోని 46వ బూత్ కమిటీ పార్టీ కన్వీనర్‌గా ఉన్న నాకు తెలియకుండానే నేనే ఓట్ల తొలగింపునకు అభ్యర్ధించినట్లు ఆన్లైన్లో కోరడం పచ్చి అబద్దం. దీనిపై చివరి దాకా పోరాడుతాం. – సంసాని నాని, అమలాపురం నియోజకవర్గ బూత్ కమిటీల వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, అమలాపురంకుట్ర పూరితంగా ఇరికిస్తున్నారు ఫారమ్–7 ద్వారా బూత్ పరిధిలో ఓట్లు తొలగించాలని నా పేరున ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. బూత్ పరిధిలో ఓట్లు తొలగించాల్సిన అవసరం మాకేంటి...? బూత్ లెవల్ అధికారులు వచ్చి ఫారమ్–7లో ఇచ్చిన ఓటర్ల జాబితా వివరాలను విచారణ చేసి మా వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. – దాసరి అప్పలస్వామి, మాజీ సర్పంచి, తాడికోన, అల్లవరం మండలం వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లను టార్గెట్ చేశారు వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లను టార్గెట్ చేసుకుని వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని అధికార పార్టీ ఈ పనికి పాల్పడింది. దేవగుప్తంలోని 174 పీఎస్‌లో 16 ఓట్లు, 175 పీఎస్‌లో 56 తొలగించాలని ఆన్లైన్లో మా పేరున, ముత్తాబత్తుల ఏడుకొండలు పేరున దరఖాస్తు చేశారు. అధికార పార్టీ ఈ ఆగడాలకు పాల్పడుతోంది. దీనిపై బూత్ లెవల్ అధికారులు విచారణ చేపట్టారు. – పోతుల చినబాబు, వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్, దేవగుప్తం, అల్లవరం మండలం -
ఓట్..అవుట్!
విచ్చలవిడి అవినీతి, అక్రమాలతో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో అడ్డదారులు తొక్కైనా మళ్లీ గెలవాలనే లక్ష్యంతో పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. గత ఎన్నికల్లో వెంట్రుక వాసిలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ ఈ దఫా ఓటమి తప్పదని భావించి కుట్రలు చేస్తోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెవెన్యూ అధికారులు (ఎన్నికల అధికారులు) వద్ద ఉండాల్సిన ‘కీ’ తమ పార్టీ కార్యకర్తల చేతికిచ్చి క్షేత్రంలోకి సర్వేల పేరుతో పంపించి రెప్పపాటులో ఓట్లను తొలగించేస్తున్నారు. ఓటర్లకు తెలియకుండా వారి ఓట్లు తొలగించమని ఆన్లైన్ ద్వారా అధికంగా ఫారం–7 దరఖాస్తులు చేస్తున్నారు. నెల్లూరు(పొగతోట): అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత, వైఎస్సార్సీపీపై ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుండడంతో టీడీపీ నేతలు భారీ సంఖ్యలో ఓట్లు తొలగించే కుట్రకు క్షేత్రస్థాయిలో కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులైన పేదలతో పాటు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తల ఓట్లను అడ్డదారిలో తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఓట్ల చేర్పులు, మార్పుల కోసం ఇచ్చిన అవకాశాన్ని అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఓట్లు తొలగించమని 10 వేల ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. సుమారు 3 వేల ఫారం–7 దరఖాస్తులు బీఎల్ఓలకు అందజేశారు. కావలి నియోజకవర్గంలో 3,800, ఆత్మకూరులో 2,900 ఫారం–7 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా అధికంగా వచ్చాయి. అధికార పార్టీ బోగస్ ఏజెంట్లను నియమించి వారి ద్వారా ఓట్లు తొలగించేలా ఆన్లైన్లో దరఖాస్తులు చేయిస్తున్నారు. చదువుకున్న వారు ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవకాశం ఉంది. చదువు రాని పేద ప్రజలు గుర్తింపు కార్డు ఉందని, ఓటు ఉంటుందనే ఆలోచనతో ఉంటారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పేద వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఆ పార్టీ ప్రణాళికలు ప్రకటించడంతో నిరక్షరాస్యులు, పేదలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారనే భయంతో ఆయా వర్గాల ఓట్లు తొలగించేలా అధికార పార్టీ కుటిలయత్నాలు చేస్తోంది. అధికార పార్టీకి తొత్తుల్లా అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రయత్నాలకు అధికారులకు సహకారం అందించడంతో ఓట్ల తొలగింపు ప్రక్రియ చాపకింద నీరులా జరిగిపోతుంది. జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉన్నారు. సుమారు 8.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి మూడు ఓట్ల చొప్పున వేసుకున్న జిల్లాలో 25.50 లక్షల ఓట్లు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల సంఖ్య 22,06,652 మాత్రమే ఉన్నాయి. 2015లో 22,78,313 మంది ఓటర్లు ఉంటే.. ప్రస్తుతం అధికారులు ప్రకటించిన జాబితాలను పరిశీలిస్తే 71,661 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఆ ప్రకారం పరిశీలిస్తే ఓటర్ల శాతం తక్కువగా ఉంది. ఒక పక్క ఓట్ల సంఖ్య పెంచేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. అర్హులైన వయోజనులు, 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకోమని ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉండి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియను అవకాశంగా తీసుకుని టీడీపీ జిల్లాలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరు నిత్యం ప్రజలతో ఉంటూ వారి వివరాలు సేకరిçస్తూ ఓట్లు తొలగించేలా ఫారం–7ను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారు. ఓట్లు కొల్లగొడుతున్న టీడీపీ సైబర్ దొంగలు క్షేత్రస్థాయిలో కొన్ని బృందాలు ఇలా తిరిగి ఓట్లు గల్లంతు చేస్తుంటే.. ఇంకొన్ని టీడీపీ సైబర్ దొంగలు బృందాలుగా ఐవీఆర్ఎస్ (ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ప్రక్రియ ద్వారా ఓట్లు కొల్లగొట్టుతున్నారు. రాజధాని అమరావతి నుంచి ప్రజలకు ఐవీఆర్ఎస్ ఫోన్లు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన బాగుంటే 1 నొక్కండి.. లేదంటే 2 నొక్కండని వాయిస్ వినిపిస్తున్నారు. రెండు నంబర్ నొక్కిన వారి చిరునామా, డోర్ నంబర్లు సేకరించి ఓట్లు గల్లంతు చేస్తున్నారు. ఓట్లు తొలగిస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో ఓటు పోతుందనే భయంతో కొందరు 1 నొక్కుతున్నామని చెబుతుండడం విశేషం. ఇలా జరగాలి.. కానీ ఇలా చేస్తున్నారు.. ఓట్ల చెర్పులు, తొలగింపుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపుతారు. వాటిని డేటా ఎంట్రీ చేయాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వీఆర్ఓలు, ఆర్ఐలు పరిశీలించి అర్హులు అయితే ఓటు హక్కు కల్పిస్తారు. తొలగింపు దరఖాస్తులు వస్తే.. వాటిని కొన్ని స్థాయిల్లో పరిశీలించి ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తారు. ఇటువంటి ప్రక్రియ చేయకుండానే ఓట్లు తొలగిస్తున్నారు. విషయం తెలియని వారు ఓటు ఉందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు అడిగితే అధికారులు లేదని సమాధానం ఇస్తారు. ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంత వరకు ఓటు ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాలేదు. -
సర్వే పోటు
ఇదివరకెన్నడూ లేనంతగా సూటు బూటు వేసుకున్న అధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు చేతబట్టి పల్లెబాట పట్టారు. కొందరికి ఇష్టం లేకున్నా ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు తలొంచక తప్పడం లేదు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వారి స్పందన తెలుసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో అడుగుతారు. పల్లె జనం అమాయకంగా వారడిగిన వివరాలు తెలియజేస్తారు. ఈ సర్వేలో అసంతృప్తి వ్యక్తం చేసిన వారి వివరాలన్నీ ప్రత్యేకంగా అధికార పార్టీ కార్యాలయానికి చేరుతున్నాయని తెలిసింది. సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను గుర్తించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రొఫెసర్లు, ట్రాన్స్‌కో అధికారులు, విద్యార్థులను రంగంలోకి దింపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో కొన్ని పథకాలను సీఎం చంద్రబాబు తాత్కాలిక ఉపశమనం కోసం ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. వాటిపై జనం ఏమనుకుంటున్నారని తెలుసుకునేందుకు ప్రొఫెసర్లు, ట్రాన్స్‌కో అధికారులు, విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో 10 యూనివర్సిటీల్లో సుమారు 600 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. వారిలో 279 మందిని ఇతర జిల్లాలకు కొందరిని, మరికొందరిని ఈ గ్రామాల్లో పర్యటించి జన స్పందనపై నివేదిక ఇవ్వమని హుకుం జారీచేశారు. కొందరికి ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు, మూడు పథకాల అమలు తీరుపై ప్రజల స్పందన అడిగి తెలుసుకుంటున్నారు. ట్రాన్స్‌కోలో పనిచేసే ఏఈఓ, ఈఆర్ఓలు కొందరిని 100 యూనిట్ల ఉచిత విద్యుత్ గురించి అభిప్రాయాలను తెలుసుకునేందుకు వినియోగించుకుంటున్నారు. ఇతర జిల్లాల నుంచి యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు కొందరు చిత్తూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిసింది. వీరంతా పథకాల అమలు తీరుపై వివరాలు తెలుసుకుని నివేదికను తయారుచేసి తమ ఉన్నతాధికారుల ద్వారా హైదరాబాద్, విజయవాడలోని టీడీపీ కార్యాలయానికి చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓట్ల తొలగింపునకు విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కొందరిని సర్వేల పేరుతో ట్యాబ్‌లు ఇచ్చి గ్రామాల్లోకి పంపారు. వీరికి రోజుకి రూ.200, రూ.300 చొప్పున ఇచ్చి పల్లెలో తిప్పుతున్నారు. వారు గ్రామాల్లో తిరుగుతున్నారు. ప్రతి నివాసానికి వెళ్లి కుటుంబంలోని వారి పేర్లు, వివరాలు, ప్రభుత్వ పథకాలపై స్పందన తెలుసుకుంటారు. ఆ తరువాత ఎన్నికల్లో ఎవరికి ఓటెయ్యాలని భావిస్తున్నారు? అని ప్రశ్న వేస్తారు. వారు టీడీపీకి అనుకూలంగా సమాధానం ఇవ్వని వారి వివరాలను మాత్రమే ప్రత్యేకంగా నమోదు చేసుకుంటారు. -
బోగస్ బృందాలకు అధికారం అండ!
సాక్షి, అమరావతి బ్యూరో: విపక్షం ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు నియోజకవర్గాల వారీగా టీడీపీ సర్వే బృందాలను మోహరించిన ప్రభుత్వ పెద్దలు తమ కనుసన్నల్లో మెలిగే పోలీస్ ఉన్నతాధికారుల అండదండలతో ఆగమేఘాలపై పని చక్కబెట్టే కుతంత్రంలో నిమగ్నమయ్యారు! ఎన్నికల ముందు ‘ముఖ్య’నేత వ్యూహ రచన చేసిన ఈ ఓట్ల తొలగింపు ఆపరేషన్‌ను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులే స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ఇంటెలిజెన్స్ విభాగం క్షేత్రస్థాయిలో పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో ఒక్కో నియోజక వర్గానికి 15,000 చొప్పున వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా చాపకింద నీరులా రాష్ట్రమంతటా సాగిస్తున్న ఈ అక్రమాల తీరు ఇదిగో..! విపక్షం ఓట్ల తొలగింపే లక్ష్యంగా ముగ్గురు అధికారులు.. తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ సర్కారు ఎన్నికల అక్రమాలకు బరి తెగిస్తోంది. భారీగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే పన్నాగానికి తెర తీసిన ముఖ్యనేత ఈ కుట్ర అమలు బాధ్యతను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు అప్పగించారు. వారిలో ఒకరు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక ఉన్నతాధికారి. ఆయన 2014 నుంచి టీడీపీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారనే గుర్తింపు పొందారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అధికార టీడీపీ కొనుగోలు చేయడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. ఇక మరో ఉన్నతాధికారి రాష్ట్ర శాంతి భద్రతల విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల అక్రమాల కోసమే శాంతి భద్రతల విభాగంలో ప్రత్యేకంగా ఓ పోస్టును సృష్టించి మరీ ఆయన్ను నియమించారు. ఇందులో పాలు పంచుకుంటున్న మరొకరు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో ‘ప్రత్యేక కారణాల’తో ఓ పోస్టును సృష్టించి మరీ కొనసాగిస్తుండటం గమనార్హం. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఇలా ఈ ముగ్గురు అధికారులు రంగంలోకి దిగారు. నకిలీ సర్వే బృందాల కోసం రూ.150 కోట్లు.. ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో టీడీపీ నకిలీ సర్వే బృందాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచరిస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా పని చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి 15 మందితో ప్రత్యేక బృందాలను నియమించి ట్యాబ్‌లు, సెల్ఫోన్లు, ఇతర మౌలిక వసతులు సమకూర్చారు. బృందంలోని ఒక్కో సభ్యుడికి నెలకు రూ.50 వేలు జీతంతోపాటు ఇతర భత్యాలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం రూ.150 కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతుండటం గమనార్హం. విపక్షం ఓట్ల తొలగింపు కుట్ర అమలులో భాగంగా సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి ఓటర్లు, కుటుంబాల సమాచారాన్ని టీడీపీ బృందాలకు చేరవేశారు. ఈ బృందాలకు క్షేత్రస్థాయిలో పూర్తిగా సహకరించేందుకు జిల్లా స్థాయిలో ఇంటెలిజెన్స్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. అడ్డుకుంటే రంగంలోకి దిగుతున్న నిఘా అధికారి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నకిలీ బృందాలు పర్యటిస్తూ సర్వేలు నిర్వహిస్తున్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా, వైఎస్సార్ సీపీకి అనుకూలంగా మాట్లాడే ఓటర్ల వివరాలతో డేటాబేస్ తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 వేల మంది వైఎస్సార్ సీపీ అభిమానులు, సానుభూతిపరుల జాబితాతో డేటా బేస్ తయారు చేయాలని వారికి లక్ష్యంగా నిర్దేశించారు. వీరంతా ఈ జాబితాను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు చేరవేస్తారు. అనంతరం ఆ అధికారులు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సర్వే చేస్తున్న సమయంలో ఈ బృందాలను ఎవరైనా అడ్డుకున్నా, అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినా వెంటనే జిల్లా స్థాయి ఇంటెలిజెన్స్ అధికారి రంగంలోకి దిగుతున్నారు. టీడీపీ టీమ్‌లకు సహకరించాలని, సర్వే బృందాలను ‘బాస్’లే పంపించారంటూ స్థానిక పోలీసులకు చెప్పి వారిని విడిపిస్తున్నారు. వారిపై ఎలాంటి కేసులూ నమోదు చేయడం లేదు. అంతేకాదు.. సర్వేలు చేయడం తప్పేమీ కాదంటూ జిల్లా ఎస్పీలతో ముందుగానే ప్రకటనలు కూడా ఇప్పించారు. మరోవైపు టీడీపీ సర్వే బృందాలను అడ్డుకున్నవారిపై తిరిగి ‘రింగ్ఫుల్ రిస్ట్రెయింట్’ కేసులు నమోదు చేయాలంటూ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారి స్థానిక పోలీసులను ఒత్తిడి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మీద అదేవిధంగా అక్రమ కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. నకిలీ బృందాలపై కేసులు లేవు.. రాష్ట్రమంతటా జోరుగా తిరుగుతున్న నకిలీ సర్వే బృందాలు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ బృందాలు సర్వేల పేరుతో విపక్షం ఓట్లను తొలగిస్తున్న విషయం బహిర్గతమైంది. అయితే ఇంతవరకు ఎవరిపైనా సరైన కేసు పెట్టకపోవడం గమనార్హం. ఎన్నికల అక్రమాల కోసం టీడీపీ ప్రభుత్వం బరితెగించడం, అందుకు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులతోపాటు అధికార యంత్రాంగం సహకరిస్తుండటం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ సునీల్ ఆరోరాను కలసిన వైఎస్సార్ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఓట్లను తొలగిస్తున్న తీరును ఆయన దృష్టికి కూడా తెచ్చారు. ఈసీ వెంటనే స్పందించి ఈ నకిలీ సర్వేలు, ఎన్నికల అక్రమాలకు తెరదించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అడ్డుకున్న విపక్ష నేతలపై అక్రమ కేసులు.. విపక్షం ఓట్లను తొలగించేందుకు ప్రైవేట్ సంస్థల ముసుగులో అధికార పార్టీ చేస్తున్న కుట్రలు విజయనగరం జిల్లాలో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. ట్యాబ్‌లతో తిరుగుతూ ఓటర్ల జాబితాలతో సర్వే చేస్తున్న బృందాన్ని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో గత నెల 24న అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వీరిని పట్టుకున్నందుకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే అక్రమంగా కేసులు బనాయించడం గమనార్హం. జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును అరెస్టు చేయడంతోపాటు మరో 14 మందిని పోలీస్స్టేషన్లకు తరలించినప్పుడు కూడా నకిలీ సర్వే బృందాలు ప్రజల వద్దకు వెళ్లగలిగాయంటే వారికి ప్రభుత్వం, పోలీసుల అండ ఉందని స్పష్టమవుతోంది. ఓట్ల దొంగలొచ్చారు జాగ్రత్త! విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్ పురంలో నెల రోజుల క్రితం సర్వే పేరుతో ఇంటింటికీ తిరుగుతున్న కొందరు యువకులు టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు క్రాంతినగర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో వైఎస్సార్సీపీ మద్దతుదారుల వివరాలను నమోదు చేస్తున్న తెనాలికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పట్టుకుని టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 25 ఇళ్లలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వివరాలు సేకరించినందుకు రూ.800 చొప్పున తమకు చెల్లిస్తున్నట్టు సర్వేలో పాల్గొంటున్న వారు వెల్లడిస్తున్నారు. ఫారం 7 లేకుండానే ఓట్ల తొలగింపు ఏదైనా ఓటు తొలగించాలంటే ఫారం 7ను ప్రామాణికంగా తీసుకోవాలి. ఓటరు నుంచి వివరణ తీసుకున్న తర్వాతే తొలగింపు ప్రక్రియ చేపట్టాలి. ఇవేమీ లేకుండా జాబితా నుంచి ఓటర్ల వివరాలు మాయం కావడంపై నిలదీస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను అధికారం అండతో ప్రభుత్వం అరెస్టు చేయిస్తోంది. పోలీసుల అండతోనే నకిలీ సర్వే బృందాలు గ్రామాల్లో ధైర్యంగా తిరుగుతున్నాయి. అభిప్రాయం కోసం ఓటరుకార్డుతో ఏం పని? - అనంతపురం జిల్లా గుంతకల్లులో గత డిసెంబర్ 18వతేదీన ఓటర్ల వద్దకు వెళ్లి రహస్యంగా సర్వే నిర్వహిస్తూ పేర్లు, అభిప్రాయాలు అడిగి ట్యాబ్‌లో వేలిముద్ర వేయాలని సూచిస్తున్న 40 మంది సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారి వివరాలు, ఓటరు కార్డు నంబర్‌తో ఏం పని? అని నిలదీయటంతో బోగస్ సర్వే బృందాల గుట్టు బయట పడింది. గతంలో కూడా జిల్లాలో పలు చోట్ల రకరకాల పేర్లతో నకిలీ బృందాలు తిరుగుతుండగా స్థానికులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. - గతేడాది నవంబర్ 1వ తేదీన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మడమనూరులో ఎన్డీటీవీ తరపున వివరాలు సేకరిస్తున్నట్లు చెబుతూ వ్యక్తిగత వివరాలను ఆరా తీస్తూ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు నమోదు చేసుకుంటున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సూచనల మేరకు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
టీడీపీ నాయకుల దొంగ ఓటర్లాట..!
ఈసారి ఎన్నికల్లో గెలవలేమని టీడీపీ నాయకులు అడ్డదారులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ పార్టీ అనుకూలురనుకున్న వారి పేర్లు రెండు మూడు చోట్ల ఉంచేసి, వైఎస్సార్సీపీ నాయకులు పేర్లు ఎత్తివేస్తున్నారు. ఇలా తొట్టంబేడులో భారీగా డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చిత్తూరు, తొట్టంబేడు : మండలంలో 29,345 మంది ఓటర్లు ఉన్నారు. అయితే గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానుల ఓట్లు తొలగిస్తున్నట్లు సమాచారం. అదే వారి పార్టీకి చెందిన కార్యకర్తల ఓట్లు డబుల్ ఎంట్రీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వేర్వేరు చోట్ల ఓట్లు.. టీడీపీ రైతు సంఘం జిల్లా నాయకుడు ప్రభాకర్నాయుడుకి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నాలుగు ఓట్లు ఉన్నాయి. గుర్తు పట్టకుండా ఉండేందుకు యవ్వన దశలో ఉన్న ఫొటోలను ఓటరు జాబితాకు జతపర్చారు. ఆయన బంధువులు, అనుచరులకు సైతం శ్రీకాళహస్తి పట్టణం, పలు గ్రామాల్లో రెండు, మూడు ఓట్లు ఉన్నట్లు సమాచారం. ఇతను ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు. ఈయన స్వగ్రామం మండలంలోని బోనుపల్లి. ప్రస్తుతం ఈదులగుంటలో నివాసం ఉంటున్నారు. ఓటరు జాబితాను పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు కైలాసగిరి కాలనీలో రెండు, ఈదులగుంటలో ఒకటి, బోనుపల్లిలో ఒక ఓటు ఉండటం గమనించారు. ♦ అదేవిధంగా బోనుపల్లికి చెందిన టీడీపీ నాయకులు రాజేంద్రనాయుడు, దినేష్‌కుమార్, శ్రీనివాసులు నాయుడు, రామానాయుడు, చంద్రశేఖర్ నాయుడు, ప్రమీల, కోలి రామానాయుడు, లలితమ్మ, రామ్మూర్తి, దీపిక, ఆదెమ్మ, విజయ తదితర 30 కుటుంబాలకు చెందిన వ్యక్తులకు బోనుపల్లి, ఈదులగుంట, కైలాసగిరి కాలనీల్లో ఓట్లు ఉన్నాయి. ♦ మండల వ్యాప్తంగా పూడి, పొయ్య, కారాకొల్లు తదితర గ్రామాల్లో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయి. పట్టించుకోని అధికారులు.. అధికారులు దొంగ ఓట్లను పరిశీలించకుండా అధికార పార్టీ నాయకుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతి ఎలక్షన్స్‌లో దొంగఓట్లను చేర్చి టీడీపీ ఎక్కువ మెజారిటీని పొందుతోంది. దొంగ ఓట్లను తొలగించకుండానే ఎలక్షన్స్‌కు ఎలా వెళతారని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు ఆధార్ లింక్ జత చేస్తే దొంగ ఓట్లను ఏరి వేయవచ్చని మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, బోనుపల్లి రవి, సీపీఎం మండల కార్యదర్శి గురవయ్య సోమవారం తహసీల్దారుకు యుగంధర్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో జాబితాను ఇస్తే వాటన్నింటిని తక్షణమే తొలగించే చర్యలు తీసుకుంటామని తహసీల్దారు హామీ ఇచ్చారు. -
బాబుతో ‘ఓటు’కు చేటు!
జనస్వామ్యాన్ని, పరిణత జన మనోగతాన్ని భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నట్టు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారశైలిని వైఎస్సార్ కాంగ్రెస్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చింది. అటు ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడటం... ఇటు అధికార యంత్రాం గాన్ని దుర్వినియోగం చేస్తూ విపక్షాలను బెదిరించడానికి వినియోగించుకోవడంవంటి పనులకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆ ప్రతినిధి బృందం ఈసీకి వివరించింది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కుకు తూట్లు పొడవడానికి చంద్రబాబు, ఆయన పరివారం బరి తెగిస్తున్నారు. అందుకు వారనుసరిస్తున్న విధానాలు విస్మయం కలిగిస్తాయి. ఎంతో నిశితంగా పరి శీలిస్తే తప్ప వీటినెవరూ పోల్చుకోలేరు. తెలుగుదేశం వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఓటర్ల జాబితా మరింత ఆశ్చర్యకరమైనది. ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేవిధంగా వారి ఫొటోలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. నిజానికి ఎన్నికల సంఘం పార్టీలకిచ్చే జాబితాల్లో ఓటర్ల ఫొటోలుండవు. మరి ఈ ఫొటోల జాబితా టీడీపీకి ఎలా వెళ్లిందో ఎన్నికల సంఘమే చెప్పాలి. ఓటర్ల జాబితాలను ఏమారుస్తున్న తీరును వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఒక సవాలుగా తీసుకుని పలు అక్రమాలను వెలికితీయగలిగాయి. ప్రతిపక్షానికి ఓట్లు వేస్తారని అనుమానం వచ్చిన వారి పేర్లను రకరకాల సాకులతో అధికారుల ద్వారా తొలగింప జేయటం, అది వల్లకాకపోతే సర్వేల పేరిట ఇంటింటికీ యువకులను పంపి విపక్ష మద్దతుదార్లని నిర్ధారించుకున్నవారి ఓట్లను గల్లంతు చేయడం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు సెప్టెంబర్ నాటికి ఉన్న 52.67 లక్షల నకిలీ ఓట్ల సంఖ్య ప్రస్తుతం దాదాపు 60 లక్షలకు చేరుకుంది. ఈ ఓట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నమోదైన ఓట్లు 20 లక్షలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనే రెండు వేర్వేరు చోట్ల స్వల్ప మార్పులతో నమోదైన ఓట్లు మరో 20 లక్షలున్నాయి. అదే సమయంలో 4 లక్షలమంది నిజమైన ఓటర్ల పేర్లు మాత్రం జాబితానుంచి గల్లంతయ్యాయి. ఇంటింటికీ తిరిగి ఒక యాప్ ద్వారా ఓట్లను తొలగిస్తున్నవారిని పట్టుకుని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా దిక్కూ మొక్కూ లేని దుస్థితి ఏర్పడింది. సహేతుకమైన నిరసనలను పలు సాకులతో అణచేస్తున్న పోలీసులకు ఈ అక్రమాలేవీ తప్పనిపించడం లేదు. సర్వే చేయడానికి ఎవరి కైనా హక్కుంటుందని, దాన్ని అడ్డగించకూడదని సుద్దులు వల్లిస్తున్నారు. యాప్ ద్వారా ఓట్లు తొల గించే ఈ సర్వేలకు అక్రమార్కులు పెడుతున్న పేర్లు కూడా చిత్రమైనవి. ప్రజాసాధికార సర్వే, పరిష్కార వేదిక, రియల్ టైమ్ గవర్నెన్స్, పీరియాడిక్ సర్వే వంటి పేర్లతో ఈ మారీచకాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. విపక్షాలు ఓర్పుతో వ్యవహరించేంతవరకూ ఈ దొంగ సర్వేలపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్తాయి. కానీ వాటిని బుట్టదాఖలా చేస్తున్నారని గ్రహించుకుని, తామే తేల్చుకోవాలనుకుంటే... అవి ఘర్షణలకు దారితీస్తే అందుకు బాధ్యులెవరు? కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఎం తదితర 23 పార్టీల నాయకులతో పాటు చంద్రబాబు కూడా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈవీఎంల పనితీరుపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టడం వీలు కాదు గనుక 50 శాతం ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్ల లోని రశీదులను లెక్కించి పోలైన ఓట్లతో వాటిని సరిపోల్చాలని వీరంతా కోరుతున్నారు. సలహా మంచిదే. కానీ తమ ప్రతినిధి బృందంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న టక్కుటమార విద్యల గురించి వీరంతా తెలియనట్టు నటించడం ఆశ్చర్యం కలిగి స్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిరుడు ఆగస్టు నుంచి వీటి గురించి అన్ని వేదికల నుంచీ గళం విని పిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్న తీరును శాస్త్రీయంగా నిరూపిస్తోంది. ఈ 23 పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆప్, బీఎస్పీలకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభాగాలు న్నాయి. కనుక జాతీయ నేతలకు అక్కడేం జరుగుతున్నదీ తెలియదనుకోవడానికి లేదు. అయినా ఒక్క పార్టీ నాయకులైనా చంద్రబాబును ‘మరి మీరు చేస్తున్నదేమిట’ని ప్రశ్నించినట్టు లేరు. తన విశ్వసనీయత గురించి చంద్రబాబుకు ఏనాడూ పెద్దగా పట్టింపు లేదు. కానీ ఇతర పార్టీల నేతల కేమైంది? సొంత రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను భ్రష్టుపట్టిస్తున్న నాయకుడు తమతో ఉన్నందువల్ల ఎన్నికల సంఘం వద్ద నగుబాటు పాలవుతామని, తమ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమవుతుం దని వీరెవ్వరికీ తోచలేదా? పీడగా మారిన పాలకుల్ని విరగడ చేసుకోవడానికి ప్రజాస్వామ్యంలో పౌరులకుండే ఏకైక ఆయుధం ఓటు. దాన్ని కరెన్సీ నోట్లు విరజిమ్మి, అందుకు లొంగరనుకున్నవారి పేర్లు ఓటర్ల జాబి తాల్లో గల్లంతు చేయించి, రకరకాల మార్గాల్లో ఆ జాబితాలను నకిలీ ఓట్లతో నింపి చంద్రబాబు అండ్ కో చేస్తున్న పనులు అత్యంత గర్హనీయమైనవి. ఒకపక్క నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు ఉదాహరణనని చంద్రబాబు తరచూ గొప్పలు చెప్పుకుంటారు. ఈమధ్యకాలంలో బీజేపీపై అలుపె రగని పోరాటం చేస్తున్నానని స్వోత్కర్షకు పోతూ ఆయన అన్ని రాష్ట్రాలూ తిరుగుతున్నారు. కానీ జరుగుతున్న అక్రమాలను, అధికార యంత్రాంగాన్ని బాహాటంగా దుర్వినియోగం చేస్తున్న తీరును ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎన్నికలను ప్రహసనప్రాయం చేయడానికి ప్రయ త్నించినవారిపై, వారు ఏ స్థాయివారైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండవు. -
రామభద్రపురంలో మళ్లీ ప్రత్యక్షం..
విజయనగరం, రామభద్రపురం: మండల కేంద్రంలోని కనిమెరకవీధిలో ట్యాబ్ సహాయంతో సర్వే చేపడుతున్న యువకుడు ఆదివారం మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. దీంతో స్థానికులు పట్టుకుని అతడ్ని పోలీసులకు అప్పగించారు. మండలంలో వారం రోజుల కిందట సర్వే పేరుతో ఇంటింటికీ యువకులు తిరుగుతూ సర్వే చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అనంతపురం జిల్లా కదిరి మండలానికి చెందిన దుంగవాత రవి ఆదివారం సర్వే చేపడుతూ కనిపించాడు. దీంతో స్థానికులు కలుగజేసుకుని సర్వే ఎవరు చేయమన్నారు.. ఎందుకు చేస్తున్నారు... ఓటర్ల వివరాలు ట్యాబ్‌లలో ఎం దుకు పొందుపరుస్తున్నావు..అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో యువకుడు జవాబు చెప్పలేకపోయాడు. దీంతో అతడ్ని స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల సహకారంతో పోలీసులకు అప్పగించారు. రెండు వారాల కిందట రామభద్రపురం వాసి కర్రి శ్రీనివాసరావు కూడా సర్వేకు వెళ్లి అవి దొంగ సర్వేలని తెలుసుకుని మిన్నకుండిపోయాడు. ఓట్ల తొలగింపే లక్ష్యం.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగించడమే లక్ష్యంగా సర్వేలు చేస్తున్నా రు. నాకు ఈ మర్మం తెలి యక రోజుకు రూ. 800 ఇస్తామంటే స్నేహితుల ప్రోద్భలంతో సర్వేకు వెళ్లాను. బొండపల్లి మండలం ఒంపిల్లి, దత్తి రాజేరు మండలం కోరపుకొత్తవలస గ్రామాల్లో సర్వే చేశాం. అయితే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించలేకపోవడంతో నాకు డబ్బులు ఇవ్వకుండానే పంపించేశారు. – కర్రి శ్రీనివాసరావు, రామభద్రపురం -
హరిపురంలో సర్వే కలకలం
శ్రీకాకుళం, మందస: గ్రామాల్లో కొంతమంది యువకులు ఎన్నికల సర్వే పేరిట సర్వే చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చాయి. సర్వే చేస్తున్నామని, తా ము అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వాలని తెలివి గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ తరుణంలో మందస మండలంలోని హరిపురంలో శుక్రవారం కొంతమంది యువకులు ఐడీ కార్డులు మెడలో వేసుకుని వీధుల్లో తిరిగారు. అయితే, వీరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆన ల వెంకటరమణ, పసుపురెడ్డి రామారావు(రా ము), మావుడెల్లి జనార్దన తదితరులు గుర్తించి, సర్వే చేస్తున్న యువకులను నిలదీశారు. పబ్లిక్ పాలసీ రిసెర్చ్ గ్రూప్ పేరిట తాము సర్వే చేస్తున్నామని, అవసరమైతే తమను నియమించిన వారితో మాట్లాడుకోమని చెబుతూనే తమ సర్వే ను అడ్డుకుంటున్నారని ఫోన్లో అవతల ఎవరికో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, సర్వే పేరిట ఓటర్లను తొలగిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న వారి పేర్లు తీసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని అటువైపు నుంచి సర్వేయర్లకు చెప్పగా, దీంతో పార్టీ నాయకులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సర్వే చేస్తే సహించేదిలేదని తేల్చి చెప్పడంతో సర్వేకు వచ్చిన వారు అక్కడ నుంచి వెనుదిరిగారు. రహస్య సర్వేకు అడ్డు కాశీబుగ్గ: పలాస మండలం లొద్దబద్ర గ్రామంలో రహస్యం గా సర్వే చేస్తున్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నా రు. వీరు ట్యాబ్‌ను పట్టుకుని ఎమ్మెల్యే పనితీరు, అధికారపక్షం, ప్రతిపక్షం పనితీరు, ఏ టీవీ చూస్తున్నారు, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ప్రజల నుంచి వివరాలు సేకరిస్తూ వారి ఓటర్ ఐడీతో ట్యాబ్‌లో మార్కు చేస్తున్నారు. పలాస మండలంలో ని రాజగోపాలపురం, హిమగిరి, దానగోర, ఖైజోలా, సిరిపురం, లొద్దబద్ర, జగన్నాథపురం గ్రామాలలో పర్యటించి ఓటు వివరాలు రాసుకుంటున్నారు. అయితే ఎవరు సర్వే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని అనుమానంతో ప్రతి ఒక్కరూ ప్రశ్నించడంతో ఎక్కడి నుంచి వచ్చామో వారు వివరాలు చెప్పకపోవడంతో లొద్దబద్రలో వారిని నిలువరించారు. పలాస ఎంపీపీ కొయ్యి శ్రీనివాసరెడ్డితో పాటు, పైల చిట్టి, గొర్లె వేణుగోపాలరా వు, ఉంగ సాయికృష్ణ, తలగాపు నరసింహమూర్తి తదితరులు వారిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ ఎస్ఐ ఎంఎస్కే ప్రసాదరావు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
జక్కువలో సర్వే రాయుళ్లు..
విజయనగరం, మెంటాడ: మండలంలోని బడేవలస, పెదచామలాపల్లి గ్రామాల్లో సర్వే చేపడుతున్న యువకులను గురువారం పట్టుకుని ఆండ్ర పోలీసులకు అప్పగించిన విషయం మరువక ముందే శుక్రవారం జక్కువలో మరో బృందం సర్వే చేపట్టింది. దీంతో బృంద సభ్యులు ఎస్. దుర్గాప్రసాద్, ఎన్. భానుప్రకాష్‌లను పలువురు మహిళలు పట్టుకొని జక్కువ పీఏసీఎస్ అధ్యక్షుడు రెడ్డి అప్పారావు, లచ్చిరెడ్డి అప్పలనాయుడుకు అప్పగించారు. సర్వే బృందం పొంతన లేని సమాదానాలు చెప్పడంతో వారిని పోలీసులకు అప్పగించారు. జక్కువలో వైఎస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నందునే సర్వే పేరిట ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని పలువురు ఆరోపించారు. ఇటువంటి వారు సర్వేలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరుతున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు సాలూరు నియోజకవర్గంలోని కందులపథం.. మెంటాడ మండలంలోని బడేవలస, పెదచామలాపల్లి , జక్కువ గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో గుర్తింపు కార్డులుకూడా లేని వ్యక్తులు సర్వేలు చేపట్టారు. ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితాలు సరిచూసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా.– పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే -
మంత్రి ఇలాకాలో సర్వేరాయుళ్లు..
బొబ్బిలి: నాలుగు రోజులుగా జిల్లాలో హల్చల్ చేస్తున్న సర్వేరాయుళ్లు బొబ్బిలిలో బుధవారం సంచరించారు. మంత్రి రంగారావు ఇలాకాలో సుమారు పది మందిదాకా సర్వేల కోసం ట్యాబ్‌లు పట్టుకుని తిరుగుతుండడంతో వారిలో కొంత మందిని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. మీరు ఓట్లు తొలగించడానికే వచ్చారని నిలదీశారు. వారి వద్ద స్మార్ట్ మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీ పేరుతో ఐడెంటిటీ కార్డులను గుర్తించారు. హెచ్ ఎల్లప్ప, తదితరులను అసలు ఎందుకువచ్చారు? ఏం చేస్తున్నారని పదేపదే నిలదీసినా పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 27, 28, 29 వార్డుల్లో కొంతమంది యువకులు ట్యాబ్‌లు పట్టుకుని ఇంటింటికీ తిరగడంతో అనుమానం వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకుడు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సూచన మేరకు ప్రముఖ న్యాయవాది మజ్జి జగన్నాథంనాయుడు, మాజీ కౌన్సిలర్ పాలవలస ఉమాశంకర్, సతీష్, రియాజ్‌ఖాన్, తదితరులు వారిని పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఎస్సై ప్రసాద్ వారిని మీరు ఎంతమంది సర్వేకు వచ్చారు.. అందరూ కలిసి కలవాలని సూచించి పంపించేశారు. కొండవెలగాడలో... నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో సర్వే చేపడుతున్న ఓ యువకుడిని జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయు డు ఆధ్వర్యంలో స్థానికులు పట్టుకుని నెల్లిమర్ల పోలీసులకు అప్పగించారు. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ పేరుతో పేరూ, ఊరూ లేని గుర్తింపుకార్డు తగిలించుకున్న ఓ యువకుడు ఆ గ్రామంలో బుధవారం ఉదయం సర్వే చేపట్టేందుకు వచ్చాడు. గ్రామస్తులు సదరు యువకుడిని ఏ సంస్థ తరఫున సర్వే చేపడుతున్నావని వివరాలు అడుగగా.. సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడుకు విషయం తెలియజేయగా... ఆయన వచ్చి సదరు యువకుడిని ఎస్సై అశోక్‌కుమార్‌కు అప్పగించారు. అలాగే విషయాన్ని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని.. ఓటర్ల జాబితా సరిచూసుకుని పేర్లు లేకపోతే చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి కొండపేటలో కూడా ఇద్దరు యువకులు సర్వే చేపట్టేందుకు రాగా స్థానికులు వారిని ప్రశ్నించగా ఎటువంటి వివరాలు చెప్పలేదు. మరింత గట్టిగా నిలదీసేసరికి యువకులు పరారయ్యారు. సర్వేకు వచ్చిన ఆ ముగ్గురు యువకుల వద్దనున్న ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితా ఉండడం విశేషం. -
సోషల్ మీడియా బృందం హల్చల్
గుంటూరు, పిడుగురాళ్ల: గ్రామాల్లో సర్వే పేరుతో సోషల్ మీడియా బృందం హల్‌చేస్తూ స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ కోవలోనే పిడుగురాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సోషల్ మీడియా పేరుతో సర్వే చేస్తున్న కొంతమంది వ్యక్తులను స్థానికులు అడ్డుకుని పోలీసులకు పట్టించారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, వరంగల్ వంటి పట్టణాల నుంచి సుమారు 60 మంది బృందం గురజాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆ వ్యక్తులు తెలుపుతున్నారు. సోషల్ పోస్టు ప్రొఫెషనల్ సర్వీసు పేరుతో వారి వద్ద గుర్తింపు కార్డులు ఉన్నాయి. అయితే గుర్తింపు కార్డులు 30.11.2018 గడువు వరకే ఉన్నాయి. కాలం చెల్లిన గుర్తింపు కార్డులతో గ్రామాల్లో సర్వే నిర్వహిస్తుండటంతో కొంతమంది యువకులు అడ్డుకున్నారు. లీడర్షిప్ సర్వే అన్న ఒక ప్రొఫార్మాలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, న్యాయవాదులు, కుల సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు, గ్రామాల్లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు, జనసేన నాయకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీటీసీ ఫ్లోర్ లీడర్ తాటికొండ చిన ఆంజనేయులురెడ్డి, పట్టణ, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు చింతా వెంకట రామారావు, చల్లా పిచ్చిరెడ్డితో పాటు పలువురు నాయకులు సీఐను కలసి ఇటువంటి తప్పుడు సర్వే బృందాలు వచ్చి వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను గల్లంతు చేస్తున్నారని, ఇటీవల విడుదలైన ఓటర్ల జాబితాలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లే గల్లంతయ్యాయని తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. -
ఓటు దొంగలున్నారు జాగ్రత్త!
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ తెలుగుదేశం పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం వారికి పట్టుకుంది. దీంతో ఎన్నెన్నో ఎత్తుగడలు వేస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్లను కొల్లగొట్టా లని చూస్తున్నారు. ఇందుకోసం ఎక్కడెక్కడ వైఎస్సార్సీపీ అభిమాన ఓటర్లున్నారో తెలుసుకుని ఏవో సాకులతో వారి ఓట్లను తొలగించే కుట్రకు తెర తీశారు. కొన్నాళ్ల క్రితం మొదలైన ఈ కుట్ర ఇప్పుడు పల్లెలు, పట్టణాలు, నగరా లకు విస్తరింపజేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, నిరుద్యోగులను ఎంచుకుని వారికి ట్యాబ్‌లను ఇచ్చి సర్వే పేరిట ఆయా ప్రాంతా లకు పంపుతున్నారు. వీరు ఎంపిక చేసుకున్న ఏరియాలకు వెళ్లి తాము రాబోయే ఎన్నికలపై సర్వే చేయడానికి వచ్చినట్టు పరిచయం చేసుకుంటున్నారు. అలా ఒక్కో అంశం కూపీ లాగు తూ ఓటర్ల నుంచి తమకు కావలసిన సమాచా రాన్నంతా రాబడుతున్నారు. దానిని తమ ట్యా బ్‌ల్లో నిక్షిప్తం చేసుకుని వెళ్తున్నారు. మొద ట్లో చాలామంది వీరు నిజంగా సర్వే కోసం వచ్చి న వారేనని భావించారు. కానీ కొద్దిరోజులుగా వీరి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండడంతో టీడీపీ నేతల అసలు కుట్ర బయటపడుతోంది. దీంతో పలువురు అప్రమత్తమవుతున్నారు. సర్వే పేరుతో హల్చల్.. సర్వే పేరిట కొంతమంది జిల్లాలోకి, విశాఖ నగరంలోకి కొద్దిరోజుల కిందటే ప్రవేశించారు. వీరిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. తాము పబ్లిక్ పాలసీ రీసెర్చి గ్రూపునకు చెందిన వారుగా చెప్పుకుంటున్నారు. ‘మీరు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? గతంలో ఏ పార్టీకి ఓటేశారు? ఏ పత్రిక చదువుతారు? వంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఓటర్ ఐడీ కార్డు వివరాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు నెల రోజుల క్రితం పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్‌పురంలో కొంతమంది యువకులు సర్వే పేరిట ఇంటింటికి వెళ్లారు. వారి సర్వే పేరుతో అడుగుతున్న వివరాలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉండడంతో స్థానికులు పట్టుకుని పాయకరావుపేట పోలీసులకు అప్పగించారు. అలాగే విశాఖలోని బర్మా క్యాంప్ ప్రాంతంలో ఈనెల 12న నలుగురు వ్యక్తులు కొన్ని ఇళ్లకు వెళ్లారు. ఏ పార్టీకి చెందిన వారంటూ ప్రశ్నలు సంధించడం, ట్యాబ్‌లో నిక్షిప్తం చేయడం వంటివి చూసి అనుమానంతో వారిని పోలీసులకు పట్టించారు. ఈనెల 20న ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు క్రాంతినగర్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఇంటింటికి తిరిగి వైఎస్సార్సీపీ సమచారాన్ని సేకరిస్తున్న తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు. వీరే కాదు.. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ సర్వే చేయడానికి వచ్చామని, తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, స్వచ్ఛందంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని ఏవో సంస్థల పేర్లు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ గురించి సమాచారాన్నే ఎక్కువగా సేకరిస్తున్నారు. వారి వద్ద తనిఖీ చేస్తే టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులుంటున్నాయి. ఇవన్నీ టీడీపీ కుట్ర అనేందుకు బలమైన సాక్ష్యాలుగా ఉన్నాయి. 25 ఇళ్లకు రూ.800 25 ఇళ్లలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వివరాలు సేకరించినందుకు ఒక్కో వ్యక్తికి రూ.800 చెల్లిస్తున్నట్టు సర్వేలో పాల్గొని పట్టుబడిన వారు చెబుతున్నారు. టీడీపీ నేతలు తమ కుట్రలో భా గంగా కొంతమంది నిరుద్యోగులకు ఇలా ఎరవే సి వినియోగించుకుంటున్నారు.ఈ టీమ్‌లో కొం దరు వెనక ఉంటూ సర్వే కథ నడిపిస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలి.. అభిప్రాయ సేకరణ పేరిట ప్రజలను మభ్యపెడుతూ టీడీపీకి చెందిన కొంతమంది వైఎస్సార్సీపీ ఓట్లు గల్లంతు చేసే కుట్ర చేస్తున్నారు. నగరంలో ప్రతి నియోజకవర్గం లోనూ ఇతర జిల్లాలకు నుంచి వచ్చిన టీడీపీ వ్యక్తులు లాడ్జిల్లో ఉంటూ సర్వేలంటూ వైఎస్సార్సీపీ సానుభూతిపరుల గురించి ఆరా తీస్తూ వారి వివరాలను టాబ్‌ల్లో నమోదు చేస్తున్నారు. పోలీసు అధికారులు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – ఎం. రాజ్‌కుమార్. బాలయ్యశాస్త్రి లేఅవుట్, సీతమ్మధార టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది.. 2019లో ఓటమి చవి చూస్తామని తెలిసి టీడీపీ నేతలకు భయం పట్టుకుంది. అందుకే ఎక్కడ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి అభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి ఇంటికు వెళ్లి వారికి కావలసిన వివరాలను తీసుకుంటున్నారు. సర్వే పేరుతో ఒక ట్యాబ్ పట్టుకొని ఏ పార్టీకి ఓటు వేస్తావు, ఏ ప్రభుత్వంపై మీకు నమ్మకం ఉంది? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సర్వే పేరుతో వైఎస్సార్సీపీ అభిమానుల వివరాలు సేకరించడం టీడీపీ కుట్రలో భాగమే. – జీవీఎస్ఎల్డి రామరాజు, అక్కయ్యపాలెం ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే... సర్వేల పేరుతో ఓట్లు తొలగించడం ప్రభుత్వం కుట్రలో భాగమే.. రాష్ట్ర వ్యప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ప్రభుతం స్పందించడం లేదంటే ఏమయి ఉంటుంది. దీనిపై ప్రజల్లో చాలా ఆందోళనలున్నాయి. ఈ ట్యాబ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారన్న అంశాలపై ఆరా తీయాలి. ఓట్లు పోయిన వారికి వెంటనే తిరిగి నమోదు చేయాలి. ఓటమి భయంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. – పూరెడ్డి పైడిరెడ్డి, కాంట్రాక్టరు -
ఉహూ.. అంటే! ఓటు ఊస్టింగే!!
ఓటుహక్కు... ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ దక్కాల్సిన హక్కు! ఈ హక్కును హరించడానికి అధికార టీడీపీ కొత్త గిమ్మిక్కులు మొదలెట్టింది. ఐదేళ్ల పాలనలో ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం జిల్లాలో పలుచోట్ల బోగస్ సర్వేలకు తెరలేచింది. పొరుగు జిల్లాల నుంచి యువతను ఇందుకోసం రంగంలోకి దించారు. సాధారణ సర్వే మాదిరిగా ప్రశ్నలు వేస్తూనే అవతలివారు ఏ పార్టీ సానుభూతిపరులో ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఏమాత్రం వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపించినా, చంద్రబాబు పాలన బాగోలేదన్నా వారి పేరు వెంటనే ట్యాబ్‌ల్లోకి చేరిపోతుంది. ఓటర్ల జాబితాలో వారి పేరు ఎక్కడ ఉందో చూసి, తొలగించేయడానికి ప్రాథమికంగా రంగం సిద్ధమైపోయినట్లే మరి! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అధికార పార్టీకి ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఓట్లను ఎలాగైనా గల్లంతు చేసేందుకు కుట్ర పన్నుతోంది. తాజాగా నరసన్నపేటలో కొన్ని బృందాలు సర్వే పేరుతో సంచరించి హడావుడి చేశాయి. వీరిని వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగిం చారు. వివిధ రకాల ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళితో కూడిన ట్యాబ్‌లతో ఎవరైనా సర్వేలకు ఇంటింటా వస్తే జాగ్రత్త వహించాలని ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలకు చెబుతూనే ఉన్నారు. కానీ టీడీపీకి మద్దతుదారులైన కొంతమంది తెరచాటుగా పావులు కదుపుతున్నారు. కాస్త కంప్యూటరు సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన యువతను సర్వే కోసం భారీ ఎత్తున నియమించారు. జలుమూరు, నరసన్నపేట, కొత్తూరు, పలాస తదితర మండలాల్లో శనివారం ఈ బృందాలు సర్వే చేశాయి. జలుమూరు మండలం పెద్దదూగాం, టి.లింగాలుపాడు, నరసన్నపేట మండలం పారిశిల్లి, బసివలస, సుందరాపురం, బాలసీమ తదితర గ్రామాల్లో సర్వే చేస్తుండగా వైఎస్సార్ సీపీ నేతలు ధర్మాన కృష్ణచైతన్య, మూకళ్ల సత్యం, వాన నాగేశ్వరరావుతోపాటు జెడ్పీటీసీ ప్రతినిధి రాంబాబు, పి.రాజప్పలనాయుడు, తంగి మురళీకృష్ణ, వాన గోపి, కోన దామోదరావు, పి.విజయ్ తదితరులు ఈ బృందాలను అడ్డుకున్నారు. అటు నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులకు అప్పగించారు. ఎంతో ధీమాగా సమాధానాలు... తప్పుడు సర్వేలతో తమ ఓట్లకే ఎగనామం పెట్టడానికి వచ్చిన బృందాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా బృందాల్లో మాత్రం ఎలాంటి సంకోచం కనిపించట్లేదు. జలుమూరులో సర్వేకు నేతృత్వం వహించినా భాస్కర్ అయితే తమకు ఎలాంటి సమస్య వచ్చినా తమ బాస్ చూసుకుంటారని చెప్పడం గమనార్హం. ఎన్నికల కమిషన్ చర్యలు అవసరం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలపై నమ్మకం అవసరం. ప్రస్తుతం సర్వేల పేరుతో ఓటర్లను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలి. ప్రజలకు ఎన్నికలపై నమ్మకం పోతే ఆ ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థపై పడుతుంది. గెలుపు ఓటములు అశాశ్వతం. కాని ఎన్ని కలపై నమ్మకం ఉండాలి. ఆ దిశగా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలి. –ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తే తప్పే సర్వే చేస్తున్నట్లు చూపించి నిజంగా ఓట్లను జాబితా నుంచి తొలగిస్తే అది క్షమించరాని తప్పు. ఇది నిజమైతే ఓటరుకు ఉన్న హక్కును హరిస్తున్నట్లే. ఓటరు తనకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్చ, ఎదుటి వ్యక్తిపై వున్న అభిప్రాయం నిర్భయంగా వెల్లడించే హక్కు ఉంది. సర్వే పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిన వారి పేర్లను తొలగిస్తే మాత్రం అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. –నటుకుల మోహన్, జెసిస్ ప్రతినిధి ప్రజాస్వామ్యంలో ఓటర్ జాబితా కీలకం ప్రజాస్వామ్యంలో ఓటర్ జాబితా కీలకం. అధికార పార్టీకి అనుకూ లండా ఓటర్ జాబితా ఉండటం, ప్రతిపక్షం పార్టీకి అనుకూలంగా, సానుభూతి పరులు ఓట్లు తోలగింపు వంటివి అప్రజాస్వామికం. ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దష్టి పెట్టారు. – ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, బీఆర్‌ఏయూ పూర్వపు ఇన్చార్జి వీసీ బూత్‌కు 50 ఓట్లయినా తొలగించాలని... అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించాలనేదీ మాపని. మా బృందంలో 16 మందిమి ఉన్నాం. బూత్‌కు 25 నుంచి 50 ఓట్లు చొప్పున తొలగించేలా సర్వే చేస్తే మాకు ఒక్కొక్కరికి రూ.900 చెల్లిస్తారు. మాకు ఇచ్చిన ట్యాబ్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఈ సర్వేలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు గుర్తిస్తాం. –బి.భాస్కర్, సర్వే బృంద నాయకుడు మోసకారి చంద్రబాబు చివరి ప్రయత్నం... ప్రజాసంకల్ప పాదయాత్రతో జగన్‌కు, మా పార్టీకి ప్రజల్లో పెరిగిన ఆదరణ చూసి ఓర్వలేకే మోసకారి చంద్రబాబు చేస్తున్న చివరి ప్రయత్నమే ఇది. సర్వే పేరుతో వైఎస్సార్ సీపీ ఓట్లును గుర్తించి తొలగించడం ఈ సర్వేల లక్ష్యం. చంద్రబాబు, అధికార పార్టీ నాయకులు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఫలితం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఓట్లు తొలగింపు ఎంతో దుర్మార్గమైన ఆలోచన. ప్రజాక్షేత్రంలో ఇక గెలవలేమనే భయంతో చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతాడు అన్నదానికి ఇదే నిదర్శనం. –ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలి ఓట్ల తొలగింపు విషయంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలి. రాష్ట్రంలో 55వేల ఓట్లు తొలగించినట్లు ప్రచా రం జరుగుతోంది. ఇప్పటికీ పలువురు యువకులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నట్లు వారి ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితా వుంటున్నట్లు పలువురు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఓటర్లుగా చేరేందుకు అవకాశం కల్పించాలి. –పైడి వేణుగోపాలం, పోర్టు ట్రస్ట్ సభ్యుడు -
శ్రీకాకుళం జిల్లాలో సర్వే కలకలం
-
ఓట్ల తొలగింపుపై కోర్టుకెళ్తాం : సజ్జల
సాక్షి, వైఎస్సార్ జిల్లా : చంద్రబాబు నాయుడు దోషిగా బోనులో నిలబడాల్సిన సమయం వచ్చింది.. అందుకే ఓట్ల తొలగింపు వంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టా రెడ్డి ధ్వజమెత్తారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అక్రమాల వల్ల త్వరలోనే ఆయన బోనులో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. దీన్నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు ఏడాది నుంచి ఓట్ల తొలగింపు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో చంద్రబాబు బూత్ స్థాయిలో కొన్ని ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నాడని ఆరోపించారు. ఈ సర్వేల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రివర్స్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తల మీదనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 55 లక్షల ఓట్లను తొలగించారని.. దీని గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కత్తిరింపు సర్వేల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఓటమి భయంతోనే చంద్రబాబు అత్యంత హీన స్థితిలోకి వెళ్లిపోయరంటూ విమర్శించారు. సర్వేల పేరుతో ఎవరు వచ్చినా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు సజ్జల. -
ఓటుపై పచ్చ కత్తి
-
విజయనగరంలో మళ్లీ కత్తిరింపు సర్వే
-
విజయనగరం జిల్లాలో మరోసారి సర్వేల కలకలం
సాక్షి, విజయనగరం: జిల్లాలో మరోసారి సర్వేల కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం గజపతినగరంలో సర్వే చేస్తున్న 15 మంది సభ్యులను వైఎస్సార్ సీసీ నేతలు పట్టుకున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఇళ్లకు మాత్రమే వెళ్లి సర్వే చేయడంతో అనుమానం వచ్చి.. ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారివద్ద నుంచి మూడు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రామభద్రపురం మండలంలోని నర్సాపురంలో సర్వే చేస్తున్న కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని వైఎస్సార్ సీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కిరణ్‌కుమార్ వద్ద నుంచి పోలీసులు ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓట్లు తొలగింపుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల సర్వే చేస్తున్న వ్యక్తులు తాము ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్పడం, ప్రభుత్వ పథకాల పనితీరుపై ప్రశ్నలు సంధించడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. దొంగ సర్వే పేరిట ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ పోలీసులను ఆశ్రయిస్తే.. సర్వేలను అడ్డుకుంటున్నారనే నెపంతో ఆ పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం సర్వే వెనుక కుట్ర ఉందనే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమి భయంతోనే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి దొంగచాటు చర్యలు చేపట్టారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఈ ఓటర్ల ఓటర్ల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీ అధికారులను, డీజీపీని కలిశారు. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికే సర్వే
-
వైఎస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాస్ విడుదల
-
సర్వేను అడ్డుకున్నారనే నెపంతో కేసులు..
సాక్షి, విజయనగరం: దొంగ సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని సమాచారం ఇచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సర్వే సభ్యులను అడ్డుకున్నారనే నెపంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను దాదాపు 8 గంటల పాటు నిర్భంధించి విచారణ చేపట్టారు. మజ్జి శ్రీనివాస్ అక్రమ అరెస్ట్‌పై వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఆయనను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనే దానికి పోలీసులు సరైన కారణం చెప్పలేకపోతున్నారని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ ఘటనపై డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సర్వే చేసుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా పీపుల్స్ రీసెర్చ్ అనే సంస్థ సర్వే చేస్తున్నట్టు తెలిపారు. సర్వేను అడ్డుకున్నవారిపై రెండు కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. జామి పీఎస్‌లో శ్రీనివాసరావును విచారించి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్టు తెలిపారు.(టీడీపీ వారి కత్తిరింపు సర్వే!) ఒక సర్వే సంస్థపై అనుమానం తలెత్తినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, దానిపై విచారణ చేపట్టకుండా.. సర్వేకు అడ్డుతగిలారనే నెపంతో వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర దాగివుందనే ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూర్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
టీడీపీ కత్తిరింపు సర్వే.. ఈసీ, డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ : ఏపీలో కలకలం రేపిన ఓటర్ల సర్వే వ్యవహారం.. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీ, డీజీపీని కలిశారు. సర్వే చేయడానికి వచ్చిన వ్యక్తుల నుంచి సేకరించిన ట్యాబ్‌లను డీజీపీకి అందజేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, మల్లాది విష్ణు ఉన్నారు. ఓటమి భయంతోనే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి దొంగచాటు చర్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కోసం జరుగుతున్న కుట్ర సర్వే గురించి ఈసీకి, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. సర్వేల పేరుతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాను ట్యాబుల్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. నెల్లిమర్లలో సర్వే చేయడానికి వచ్చిన వ్యక్తులు తాము ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్పుకున్నారన్నారు. అనుమానం వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు వీరిని పట్టుకుని ట్యాబులను స్థానిక పోలీసులకు అప్పజెప్పారని తెలిపారు. అయితే, పోలీసులు ఆ మనుషులను వదిలేసి.. ట్యాబులు తీసుకెళ్లి ఫిర్యాదు చేసుకొమ్మని తమ పార్టీ కార్యకర్తలకు చెప్పారని పేర్కొన్నారు. రెండు ట్యాబులను ఎన్నికల సంఘానికి ఇచ్చామన్నారు. సర్వే చేయడానికి వచ్చిన వారు ఏ పార్టీ అనే విషయాన్ని ఆరా తీయరని స్పష్టం చేశారు. వీటికి తోడు అక్రమ అరెస్టులతో తమ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఇలాంటి సర్వేలు చేయించదు : గోపాల కృష్ణ ద్వివేది సర్వే గురించి వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ట్యాబ్‌లు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులను పంపి సర్వే చేయించడం వంటి పనులు ఈసీ చేయదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయని.. వీటన్నింటిని పరిష్కరించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. నామినేష్ల చివరి రోజు వరకూ కూడా ఓటర్ల నమోదు, మార్పులు చేసుకోవచ్చిని తెలిపారు. -
టీడీపీ వారి కత్తిరింపు సర్వే!
సాక్షి, అమరావతి : సర్వే పేరుతో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపునకు కట్ర జరుగుతోంది. సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ అనాలసిస్(ఎస్పీఏ) అనే బెంగళూరుకు చెందిన సంస్థ పేరుతో సీఎం చంద్రబాబు నాయడు ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే చేస్తున్న సభ్యుల ఎంపిక మొదలు.. వారికి ఇచ్చే ట్యాబ్‌లు సైతం ప్రభుత్వ పెద్దల నుంచే సరఫరా చేసినట్లు సమాచారం. గత పుష్కరాల్లో ఉపయోగించిన ట్యాబ్‌లతోనే సర్వేలు చేస్తుండటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 10 మంది సర్వే సభ్యులను ఓ టీడీపీ యూత్ లీడర్ పర్యవేక్షిస్తున్నారు. సర్వే చేస్తున్నవారికి రోజుకు రూ.వెయ్యితో పాటు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక ఈ ట్యాబ్‌లన్నింటినీ అమరావతి మానిటరింగ్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ ట్యాబ్‌ల ద్వారా సమాచారం అందిన వెంటనే వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్వే చేస్తున్న టీమ్‌ను స్వయంగా నారా లోకేష్ పర్యవేక్తిస్తున్నట్లు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. విజయనగరం జిల్లాలో కొంతమంది యువకులు సర్వే పేరిట ప్రభుత్వ వ్యతిరేకుల వివరాలు నమోదు చేసుకోవడం కలకలం రేపింది. దీనిని గుర్తించిన వైఎస్సార్సీపీ నాయకులు సదరు యువకులను పోలీసులకు అప్పగించారు. ట్యాబ్స్‌లో ఓటర్ల లిస్ట్ పెట్టుకుని సర్వేలు చేయటం విరుద్దమని, ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పనితీరు, పథకాల మీద అభిప్రాయం కోరుతూ వస్తున్న ఫోన్ల ఆధారంగా ఈ సర్వేలు సాగుతున్నట్లు విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన ట్యాబ్స్‌లో నమోదు చేసుకోవడంతో స్థానిక వైఎస్సార్సీపీ నేతలకు అనుమానం వచ్చింది. దాంతో వారిపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు సిద్దమవుతుండటంతో పోలీసులు ముందస్తు అరెస్టులుకు దిగారు. జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని జామి పోలీసు స్టేషన్ కు తరలించారు. నాయకుల అరెస్ట్‌తో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
ఫేక్ సర్వేతో కాంగ్రెస్, బీజేపీ గుద్దులాట!
ప్రపంచంలోని అవినీతి రాజకీయపార్టీల్లో కాంగ్రెస్‌కు నాలుగో స్ధానం. ఇది బీబీసీ పేరుతో విడుదలైన ప్రపంచంలోని టాప్ 10 అవినీతి రాజకీయ పార్టీల జాబితా. అంతే ఒక్కసారిగా ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చిన సర్వే వివరాలు నిజమో.. కాదో తెలుసుకోకుండానే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో ట్విట్ల వర్షాన్ని కురిపించారు ఇరు పక్షాల నాయకులు. దీంతో ఈ వార్త ఆ సోషల్ మీడియాలో వేగంగా పాకింది. ఈ వివరాలను పెద్ద బ్యానర్‌లా సృష్టించి పోస్టును తెగ షేర్ చేసేశాడు సగటు నెటిజన్. ఆఖరికి బీబీసీ కలుగజేసుకుని అసలు ఆ సర్వేతో తమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పడంతో అందరూ నాలుక కరుచుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఫేక్ వెబ్సైటు ఈ సర్వేను సృష్టించినట్లు గుర్తించారు. This is so fake @BBCNews @bbcindia @bbcnewsasia never does such surveys https://t.co/fNmzTpWPb9 via @postcard_news — GeetaPandeyBBC (@geetapandeyBBC) March 20, 2017