
సాక్షి, అమరావతి : ‘అధికారం టీడీపీదే’ అనే జోక్‌ని ప్రచురించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు ధన్యవాదాలంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఏపీలో అధికారం టీడీపీదే అని లోక్‌నీతి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ లక్ష్మీనారాయణ వ్యంగ్యంగా.. ఆంధ్రజ్యోతిని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తెలుగు పత్రికలు ఫూల్స్ డే నాడు హాస్యాస్పద కథనాలు ప్రచురించేవని తెలిపారు. అయితే గత కొంతకాలంగా ఈ సంప్రదాయం కనిపించడం లేదని.. కానీ ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభించిందన్నారు. ‘అధికారం టీడీపీదే’ అనే తప్పుడు కథనంతో ఏప్రిల్ 1న నాడు మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు అంటూ కన్నా ట్వీట్ చేశారు.
గతంలో తెలుగు పత్రికలు ఏప్రిల్ 1st ఫూల్స్ డే నాడు హాస్యాస్పదంగా కథనాలు వేసేవారు..
— Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) April 1, 2019
ఎందుకో మిగతా పత్రికలు ఆ సంప్రదాయం ఆపేసాయి..
కానీ నేటి ఆంధ్రజ్యోతి
"అధికారం టీడీపీదే" అని ఏప్రిల్ 1st నాడు నవ్వులు పూయించింది..
జోక్ ని ప్రచరించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు. pic.twitter.com/MUe1L88FNP
ఇదిలా ఉండగా ఏపీలో టీడీపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే దీనిని ఎస్‌డీఎస్ లోక్‌నీతి సర్వే సంస్థ తీవ్రంగా ఖండించింది. తమ అనుమతి లేకుండా సంస్థ పేరును ప్రచురించినందుకు సంబంధిత పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. (చదవండి: అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి..!)
Comments
Please login to add a commentAdd a comment