
సాక్షి, అమరావతి : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యావంతా దుస్తులు మార్చడంపైనే ఉంది కానీ దేశంపై లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. నరేంద్ర మోదీ గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తారని ఎద్దేవా చేశారు. నిమిషానికో మాట మారస్తూ నిజాయితీగా ఉన్న అధికారుల సీటు మారుస్తారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొని వాళ్ల పార్టీ మార్చారని, అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు సీటుని మారుస్తున్నారని ట్విట్ చేశారు.
మోదీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ..
— Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) May 2, 2019
నువ్వు మాత్రం
ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్.
నిమిషానికి ఒక మాట మారుస్తావ్.
నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్.
ఎమ్మెల్యేలను కొని వాళ్ళ పార్టీ మారుస్తావ్.
అందుకే ప్రజలు ఈ ఎన్నికలలో నీ సీట్ మారుస్తున్నారు. @ncbn pic.twitter.com/sVV0SWrC6E