సాక్షి, హైదరాబాద్ : ఇటీవల ఎన్నికల ప్రచారంలో నోరు జారి పప్పులో కాలేసిన మంత్రి నారా లోకేష్... ఎన్నికల అఫిడవిట్‌లోనూ తప్పు చేసి నవ్వుల పాలయ్యారు. అఫడవిట్‌లో భర్తపేరు దగ్గర తండ్రి పేరు రాసి ఇచ్చారని, తండ్రి చంద్రబాబు నాయుడు అఫిడవిట్‌ను కాపీ చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా విమర్శించారు. ‘బాబు లీకేష్, "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" అనే సామేత నిజంచేశావ్. నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.! తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం.. కానీ ఆఖరికి అఫిడవిట్ లోనూ కాపీనేనా!? ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని కేఏ పాల్ కబుర్ల చెబుతారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ అఫిడవిట్ కాపీలు సోషల్ మీడియాలో తెగహల్‌చల్ చేస్తున్నాయి. ‘ఇది మా కర్మరా.!’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
చదవండి : నోరు జారిన లోకేశ్.. ఆర్కే సెటైర్!
బాబు లీకేష్,
— Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) March 23, 2019
"ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" అనే సామేత నిజంచేశావ్.
నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.!
తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం కానీ ఆఖరికి అఫిడవిట్ లోనూ కాపీనేనా!?
ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని KA పాల్ కబుర్ల చెబుతారు pic.twitter.com/v4vLPCAUkV
Comments
Please login to add a commentAdd a comment