andrajhothi
-
పిన్నెల్లిపై పచ్చ కుట్రలు.. విర్రవీగితే నష్టం తప్పదు..
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ శాఖలో ఏమి జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ కొద్దిమంది పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం ఏమిటి? ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ఆ పోలీసులపై పెత్తనం చెలాయించడం ఏమిటి? గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ఎవరిపైన అయినా నిర్దిష్ట ఆరోపణలు వస్తే ఆ పోలీసు అధికారులను బదిలీ చేయడం సహజమే. ఇదేమి కొత్త విషయం కాదు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వేరే అధికారులను నియమిస్తుంది. ఇక్కడే ఈసీ పెద్ద తప్పు చేసింది. ఏపీలో తెలుగుదేశం కూటమికి సాయం చేయడానికి నడుం కట్టినట్లు ఉంది. వెంటనే కూటమి నేతలు కొరుకున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను, కింది స్థాయి పోలీసు అధికారులకు కొత్తగా పోస్టింగులు ఇచ్చేసింది. దాని ఫలితమే మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి మొదలైన చోట్ల హింసాయుత ఘటనలకు అవకాశం ఏర్పడింది. చివరికి ఈసీ తాను నియమించిన కొందరు అధికారులనే సస్పెండ్ చేయవలసి వచ్చింది.దాంతో ఈసీకి అప్రతిష్ట వచ్చింది. అయినా కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు మారినట్లు లేదు. ఇప్పటికీ టీడీపీ ట్రాప్‌లోనే కొనసాగుతూ వైఎస్సార్సీపీని ఇబ్బందిపెట్టాలని ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైకోర్టులో వెల్లడైన అంశాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను కిందపడేశారనో లేక ద్వంసం చేశారన్న కేసులో బెయిల్ పొందగానే, అంతకు ముందు జరిగిన ఘటనలలో పనికట్టుకుని ఈయనపై కేసులు పెట్టారట. అందులో సీఐపై దాడి వంటి కేసులు కూడా ఉన్నాయి. ఘటనలు జరిగి పది రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఏపీలో ఆ పోలీసు అధికారులకు మాత్రం ఆ ప్రశ్న రాలేదు.ఎలాగైనా పిన్నెల్లిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి ఆయనను కౌంటింగ్ వద్దకు రాకుండా చేయాలన్నది వారి కుట్ర అట. లేకుంటే డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పిన్నెల్లిపై ఈ నెల 22 న కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిన్నెల్లి న్యాయవాదులు కింది కోర్టులో ఉన్న సంబంధిత డాక్యుమెంట్లు తీసుకు వచ్చి ఈ నెల 23న అంటే ఈవీఎం కేసులో ముందస్తు బెయిల్ రాగానే కొత్త కేసులు పెట్టారని హైకోర్టుకు చూపించారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి కేసులో బెయిల్ పొందారు. ఇక్కడ అందుకు బిన్నంగా పోలీసులే తప్పుడు సమాచారం ఇచ్చి ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్టు చేయాలని తలపెట్టారు. ఇది సిగ్గు చేటైన విషయం. ఇదంతా పిన్నెల్లిపై కక్షతో ఉద్దేశపూరితంగానే తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.ఒక సీఐ స్థాయి అధికారి ప్రైవేటు లాయర్‌ను పెట్టుకోవడం ఏమిటో తెలియదు. నిజానికి ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడుల కేసులలో ప్రభుత్వమే లాయర్లను పెడుతుంది. లేదా నిర్దిష్ట అనుమతి తీసుకుని వ్యక్తిగత లాయర్లను నియమించుకోవచ్చు. అలాకాకుండా నేరుగా ఇలా చేశారంటే ఆ సీఐని ఏమనుకోవాలి. ఆయన వెనుక మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చిత్రమేమిటంటే ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఈసీ, అధికార వైఎస్సార్సీపీ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. చివరికి ఒక సీఐ స్థాయి అధికారి తప్పుడు కేసులు పెడుతుంటే వైఎస్సార్సీపీ నిస్సహాయంగా మిగిలిపోవడం. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సంఘం రిఫరీ మాదిరిగా కాకుండా, కూటమిలో బాగస్వామిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి.పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో అత్యంత నిష్పక్షపాతంగా ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది. 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎస్.ఎస్.పి యాదవ్ అనే అధికారి డీజీపీగా ఉన్నారు. ఆయనపై విపక్షం ఆరోపణలు చేస్తే ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత ఎ.కె మహంతి అనే సీనియర్ అధికారిని డీజీపీగా నియమించింది. ఆయన నిజాయితీగా తన సేవలు అందించారు. దాంతో ఏ పార్టీ కూడా ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈసీ తీరే అభ్యంతరకరంగా ఉంటే, ఈసీ నియమించిన తాత్కాలిక అధికారులు మరింత చెలరేగిపోతున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి వస్తే తమ పరిస్థితి ఏమిటన్నది ఆలోచించకుండా కొద్ది మంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారి తెంపరితనాన్ని సూచిస్తుంది.డీజీపీగా వచ్చిన హరీష్ గుప్తపై తొలుత ఆరోపణలు రాలేదు. కానీ ఎవరి ఒత్తిడికి లొంగారో కానీ పిన్నెల్లిని అరెస్టు చేయడం కోసం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే ఇలా చేసిన పోలీసులకు ఇక్కట్లు తప్పవు. 2009 లో ఏ అధికారిని మార్చినా వైస్ రాజశేఖరరెడ్డి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మాదిరి వ్యవహరిస్తూ ఏ అధికారిని మార్చి, ఎవరిని పెట్టుకున్నా ప్రత్యేకించి స్పందించకపోవడం విశేషం.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత రచ్చ చేసింది అందరికి తెలుసు. కేవలం టీడీపీ కూటమికి సాయపడడం కోసం ఈ అధికారులు తమ కెరీర్ ను దెబ్బతీసుకుంటున్నారనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంను కింద పడేసిన ఘటనకు సంబంధించి ఈసీ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఎడిట్ అయి టీడీపీ నేత లోకేష్ వద్దకు చేరడం, దానిని ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టడం, కేవలం దానిపై ఆధారపడి ఈసీ పిన్నెల్లిపై కేసు పెట్టాలని నిర్ణయించడం వివాదాస్పదం అయింది. అదే టైమ్ లో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి టీడీపీ వారు బయటకు తోసేసి దౌర్జన్యం చేసిన వీడియోలను వైఎస్సార్‌సీపీవారు ఈసీకి పంపినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది.మరో సంగతి చెప్పాలి. టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డి, ప్రభాకరరెడ్డిలు వేర్వేరు కేసుల్లో చిక్కి పోలీసులకు దొరకకుండా పారిపోతే కనీసం ఒక్క ముక్క రాయని ఎల్లో మీడియా, పిన్నెల్లిపై మాత్రం కక్ష కట్టి పరార్ అంటూ పెద్ద, పెద్ద కథనాలు వండి వార్చింది. అంతేకాదు. తమకు అనుకూలంగా ఉండరని భావించిన అధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఈసీ వారిని బదిలీ చేయడం కూడా తప్పే అని చెప్పాలి. ఈనాడు వంటి పత్రికలు మరీ అథమ స్థాయికి దిగజారి డీజీపీని బదిలీ చేసినా, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదంటూ పెద్ద, పెద్ద స్టోరీలు అల్లింది. అంటే ఈయనను కూడా తొలగిస్తే కౌంటింగ్ సమయంలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్నది టీడీపీ, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి భావన కావచ్చు.రాధాకృష్ణ తీరు మరీ విడ్డూరం. ఆయనేమో రాజకీయ రొచ్చులో, అవినీతి బురదలో నిండా మునిగి ఉంటారు. జవహర్ రెడ్డి వంటి అధికారులపై మరకలు పూస్తున్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారట. జగన్ దగ్గరకు వచ్చాకే పాడయ్యారట. ఇంత చెత్తగా వార్తలు రాసే ఆంద్రజ్యోతిని ఎవరైనా నమ్ముతారా? కౌంటింగ్ సమయంలో జవహర్‌ను తప్పించి తమకు కావల్సిన అధికారిని ఎవరినైనా పెట్టించుకుని అవకతవకలకు పాల్పడాలన్న లక్ష్యంతో ఉన్నారేమో తెలియదు కానీ, చెత్త వార్తలు రాయడానికి పోటీపడుతున్నారు. జవహర్ రెడ్డి బదిలీ ఒక్క విషయాన్ని మాత్రం ఈసీ ఇంకా అంగీకరించలేదు. దాంతో ఈనాడు, ఇతర ఎల్లో మీడియా జవహర్ రెడ్డి పై కక్ష కట్టి చోటా, మోటా నేతలతో ఆయన మీద ఆరోపణలు చేయించి, వాటిని తమ మీడియాలో పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నాయి. బహుశా గతంలో ఇంత నీచమైన రాజకీయం, జర్నలిజం చూడలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే మాదిరి ఉండవు. ఆ సంగతి మరిచి విర్రవీగితే వారికే నష్టం.మరో సంగతి చెప్పాలి. పోస్టల్ బాలెట్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశం అంతటికి ఇచ్చిన గైడ్ లైన్స్ ను కాదని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి మీనా కొత్త ఆదేశం ఇవ్వడం వివాదం అయింది. మీనా తప్పును సరిచేసుకోకపోతే ఆయనపై కూడా సందేహాలు వస్తాయి. గతంలో 2009లో ఎన్నికలు ఫలితాలు వచ్చి మరోసారి ప్రభుత్వం రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి ఎస్.ఎస్.పీ యాదవ్ ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు కూడా తనపై ద్వేషంతో టీడీపీ కూటమి బదిలీ చేయించిన అధికారులందరిని తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే మళ్లీ పదవులలోకి తీసుకుంటారన్నది కూడా నిజం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బాబు 'బాదరాయణ బంధాన్ని' కొల్లగొట్టిన ఆపరేషన్.. 'గరుడ'
రాజకీయాలలో ఒక ధీరి ఉంటుంది. తాము ఏ తప్పు అయినా చేయదలిస్తే, లేదా తప్పు చేస్తే, ముందుగా దానిని ఎదుటివారిపై నెట్టేయడం. ఎదుటివారేదో ఘోరం చేస్తున్నారని ప్రచారం చేసి, చల్లగా తన పనికానీచ్చుకోవడం. తాను దొంగతనం చేసి దొరికిపోతున్నామని అనుకుంటే ‘కావు, కావు’ మని.. వైరి పక్షంపై ఆరోపణలు గుప్పించడం. ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలలో తెలుగుదేశం పార్టీ ఆరితేరింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాత ఈ ధోరణితోనే ఆయన కథ నడిపించారు. దానికి ఈనాడు రామోజీరావు వంటివారు బాకా ఊదుతూ తానా అంటే తందానా అనేలా రెడీగా ఉంటారు. దాంతో ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోయింది. కానీ అన్నిసార్లు ఇది సాద్యపడదు కదా! అందులోను సోషల్ మీడియా విస్తారంగా వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి ట్రిక్కులు ఎన్ని పన్నినా ఇట్టే దొరికిపోతున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా ఇలాగే తయారయ్యారు. విశాఖపట్నంలోని పోర్టుకు బ్రెజిల్ నుంచి మాదకద్రవ్యాలతో కూడిన కంటైనర్ వచ్చిన ఉదంతంలో టీడీపీకి బూమ్ రాంగ్ అయిందని చెప్పాలి. ఇలాంటి డ్రగ్స్ విషయాలలో రాజకీయాలకు అతీతంగా అంతా ప్రవర్తించాలి. కానీ పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబే ఎదుటివారి మీద బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలని చూడడం ద్వారా మొత్తం సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ముందుగానే అసలు వాస్తవం తెలిసి ఉండాలన్న భావన కలుగుతుంది. తమ పార్టీకి చెందినవారే ఈ కేసులో దొరికిపోయేలా ఉన్నారని అర్దం అయి ఉండాలి. తమకు సంబంధించిన వారి బంధువులు పట్టుబడుతున్నారని కనిపెట్టి ఉండాలి. అందుకే విశాఖలో ఒక పక్క సీబీఐ సోదాలు జరిపి పరిశోధన చేస్తుంటే.. లోకేష్ దీనిపై ట్వీట్ చేస్తూ వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు సైతం విశాఖ డ్రగ్స్ కాపిటల్ అయిపోయిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. వైఎస్సార్సీపీ నేతలు అసలు విషయం తెలుసుకుని ఖండన ఇచ్చేలోగానే వీరు తమ భజంత్రీలైన ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి గ్రూపు మీడియా సంస్థల ద్వారా వారి ట్వీట్లలో పేర్కొన్న అంశాలను ప్రచారంలో పెట్టేశారు. పైగా పత్రికలలో ఏమి రాశారు. సీబీఐ డ్రగ్స్‌ను వెలికి తీసి పరిశీలిస్తుంటే, స్థానిక పోలీసులు ఆటంకం సృష్టించే యత్నం చేశారని కూడా వీరు తేల్చేశారు. కానీ వీరు ఎక్కడా అది ఫలానా వారి కంపెనీ ఇది అని, వారి చిరునామా ఇది అని, వారికి ఫలానా వారితో సంబంధాలు ఉన్నాయని రాయకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వైఎస్సార్సీపీ పెద్దలే డ్రగ్స్ తెప్పించారన్నంత నీచంగా కూడా టీడీపీ ప్రచారానికి దిగింది. దాంతో వైఎస్సార్సీపీ మేలుకుని మొత్తం విషయం రాబట్టి ఆశ్చర్యపోవలసి వచ్చింది. 'సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కూనం కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు చెందిందని వెల్లడైంది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబానికి వీరికి సంబంధాలు ఉన్నాయని, పలువురు టీడీపీ నేతలతో వీరికి బాదరాయణ బంధం ఉందని' వైఎస్సార్సీపీ నేతలు చిట్టా విప్పారు. దాంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. డ్రగ్స్ వంటి సమస్యలను రాజకీయ కోణంలో చూడకూడదు. సమాజానికి ఇది పెనుభూతం వంటిది. సీబీఐ వారు ఇంటర్ పోల్ సాయంతో ఇంత పెద్ద డ్రగ్ రాకెట్‌ను ఆపరేషన్ గరుడ పేరుతో కనిపెట్టినందుకు వారిని అభినందించాలి. బ్రెజిల్ నుంచి వచ్చినవి డ్రగ్స్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత సీబీఐ కంపెనీని యజమానులను, ఆ కంపెనీ అధికారులను అదుపులోకి తీసుకోవచ్చు. లేదా అదుపులోకి తీసుకోకుండానే విచారణ జరపవచ్చు. మొత్తం మీద డ్రగ్స్ మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయో, ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరాకు ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం సీబీఐ చేస్తుంది. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో టీడీపీ అధికంగా కంగారు పడుతోంది. 'ఈ కంపెనీ తమ సామాజికవర్గం వారిది కావడం, కంపెనీ యజమానులలో కొందరికి గత చరిత్ర అంత క్లీన్‌గా లేకపోవడం వల్ల ఆ బురద అంతా తమపై వచ్చి పడుతుందేమోనన్న కంగారులో చంద్రబాబు, లోకేష్‌లు తొందరపడి పిచ్చి ట్వీట్లు చేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పించారు'. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకు వేసి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి లింక్ పెట్టి ట్వీట్ చేశారు. అంతిమంగా అదేదో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు సంబంధించిందేమో అన్న చందంగా అనుమానం క్రియేట్ చేయడానికి యత్నించారు. ఇక రామోజీరావు రంగంలో దిగి డ్రగ్స్ తెప్పించారన్న అభియోగాలను ఎదుర్కుంటున్న వారిని రక్షించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా ఉంది. శనివారం నాటి పత్రికలో అంతా అనుమానాస్పదమే అన్న శీర్షికతో ఒక ప్రధాన కథనాన్ని వండి వార్చారు. అందులో ఎంత సేపు సీబీఐ డ్రగ్స్ గురించి దర్యాప్తు చేస్తుంటే, దానిని ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారని దుర్మార్గపు ప్రచారం చేసింది. పోలీసులు అలా చేశారంటే వైఎస్సార్సీపీ పెద్దల పాత్ర లేకుండా ఉంటుందా అని దిక్కుమాలిన రాతలు రాసింది. అసలు రాయవలసింది ఏమిటి..? ఆ కంపెనీ ఎవరిది? గతంలో కూడా ఇలా చెప్పిన సరుకు కాకుండా వేరే డ్రగ్స్ లేదా ఇతర అభ్యంతరకర పదార్దాలు ఏవైనా తీసుకువచ్చేవారా? ఆ కంపెనీ ముఖ్యుల మూలాలు ఏమిటి? వారు ఎలా ఆ స్థాయికి వచ్చి ఆక్వా కంపెనీ పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీపై ఎప్పుడైనా ఏదైనా కేసు పెట్టిందా? మొదలైన అంశాలపై వార్తలు రాయకుండా రామోజీ ఎంతసేపు సీబీఐ అధికారులను ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారన్నదానిని ఫోకస్ చేయడానికి యత్నించింది. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్.. ఎక్కడా ఎవరూ ఆటంకం కలిగించలేదని, సీబీఐ కోరితేనే డాగ్ స్క్వాడ్ పంపించామని, ఈ ప్రక్రియలో కొంత జాప్యం అయిందని.. సీబీఐ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారని, సీబీఐ అధికారులను కూడా మీడియా సమాచారం కోరవచ్చని.. స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈనాడు మీడియా ఈ రకమైన దుర్మార్గపు ప్రచారం చేసిందంటే వారి దుష్ట ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. పోనీ ఏపీ పోలీసులు కావాలని జాప్యం చేశారని అనుకుందాం. దానివల్ల వారికి వచ్చే లాభం ఏమిటి? అయినా సీబీఐ తన పని తాను చేసుకుపోయింది కదా? ఆ విషయం రాయకుండా, ఆ స్కామ్ మూలలు తవ్వకుండా ఈనాడు మీడియా అబద్దపు కథనాలు ఇస్తోందంటే వారు ఎంత నీచంగా మారారో అర్ధం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఎక్కడా ఆ కంపెనీకి సంబంధించిన 'వీరభధ్రరావు, కోటయ్య చౌదరి' తదితరుల గురించి ఒక్క ముక్క రాసినట్లు కనిపించలేదు. పైగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో వీరభద్రరావు సోదరుడు పూర్ణచంద్రరావు దిగిన ఫోటోను ప్రముఖంగా ప్రచురించింది. తీరా చూస్తే ఆయన తన సోదరుడి వ్యాపారాలతో తనకు సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, స్థానిక రాజకీయాలలో వైఎస్సార్సీపీని అభిమానిస్తానని చెప్పారు. విశేషం ఏమిటంటే అసలు ఆ కంపెనీతోకానీ, ఆ డ్రగ్స్‌తో కానీ ఏ మాత్రం సంబందం లేని పూర్ణచంద్రరావు ఫోటో వేసిన టీడీపీ మీడియా అసలు కంపెనీ నడిపే వారి పోటోలు వేయలేదు. వారి వివరాలు ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్‌సీపీవారు ఏకంగా చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధించినవారే ఈ డ్రగ్స్ స్కామ్ లో ఉన్నారని ఆరోపిస్తూ సీఈఓ కి ఫిర్యాదు చేసింది. చిత్రం ఏమిటంటే.. "ప్రతి చిన్న విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో బురద చల్లుడు తప్ప ఫిర్యాదు చేయలేదు." దీనిని బట్టి టీడీపీకి సంబంధించినవారి బండారం బటపడుతుందని ఈ డ్రామా ఆడారని అనుకోవాలి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈనాడు రామోజీరావు ఈ ఘటనపై రాస్తున్న కథనాల వెనుక కులభావన, విశాఖపై ద్వేష భావన వెదచల్లడం, టీడీపీ దొరికిపోకుండా కాపాడడం, ఒకవేళ నిందితులు తనకు తెలిసినవారైతే వారిని రక్షించడం.. లక్ష్యాలతో ఈ వార్తలు ఇచ్చినట్లు అభిప్రాయం కలుగుతుంది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినప్పటి నుంచి ఆ నగరంపై ఈనాడు రామోజీరావు విషం చిమ్ముతూనే ఉన్నారు. అలాగే కమ్మ కులంలో ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెనుకేసుకు వస్తున్నారన్న దరిద్రపు ఆరోపణకు కూడా ఆయన ఆస్కారం ఇవ్వడం దురదీష్టకరం. ఈ మద్యకాలంలో హైదరాబాద్‌లో పట్టుబడినన్ని డ్రగ్స్ మరే నగరంలోను దొరకలేదు. అయినా ఈనాడు మీడియా మాత్రం ఎక్కడా వాటికి ఎక్కువ ప్రచారం ఇవ్వదు. పైగా గతంలో బీఆర్ఎస్కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు వత్తాసు పలకడానికి పోటీ పడుతోంది. గుజరాత్‌లోని ముంద్ర పోర్టు ద్వారా దేశంలోకి వచ్చినన్ని డ్రగ్స్ మరెక్కడ బహిర్గతం కాలేదు. గుజరాత్లో డ్రగ్స్ సమస్యపైకానీ, పంజాబ్‌కు పాకిస్తాన్ నుంచి వచ్చే మత్తు పదార్దాల గురించికానీ ఎన్నడూ బీజేపీ తదితర పార్టీలపై వార్తలు రాయని ఈనాడు మీడియా ఏపీపై మాత్రం నీచంగా రాస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి యత్నిస్తోంది. తంలో చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో చేసిన స్కామ్‌లను సమర్థించే దుస్థితిలో రామోజీరావు ఉన్నారు. సింగపూర్‌కు చెందిన మాజీ మంత్రి ఈశ్వరన్‌ను ఏపీకి తీసుకు వచ్చి వేల కోట్ల భూములను కట్టబెట్టిన చంద్రబాబును ఎన్నడూ తప్పు పట్టలేదు. ఇప్పుడు అదే ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి మంత్రి పదవి కోల్పోయారు. అయినా ఒక్క ముక్క రాయదు. అమరావతిలోనే ఏదో ఆస్పత్రి పెడతారంటూ వంద ఎకరాల భూమి పొందిన బీడీ శెట్టి అనే వ్యాపారిని దుబాయిలో అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరికి, చంద్రబాబుకు ఉన్న సంబంధ బాంధవ్యాలేమిటో ఒక్క అక్షరం కూడా రాయని దౌర్భాగ్య స్థితిలో ఈనాడు మీడియా ఉంది. అంతెందుకు చంద్రబాబుపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడం, దుబాయిలో ఆయన అక్రమంగా డబ్బు పొందారని ఆరోపణలు రావడం వంటివాటిపై పరిశోధన కథనాలు రాయకపోగా, ఆయనను సమర్దిస్తూ వార్తలు ఇస్తుంటారు. ఇదంతా ఈనాడు రామోజీ స్వార్ధ వ్యాపార ప్రయోజనాలకే అన్న సంగతి అందరికి తెలిసిపోయింది. ఇంకో సంగతి కూడా చెప్పాలి. 'ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ అరెస్టు అయ్యారు. అప్పట్లో వీరిద్దరిపైన వెంటాడుతూ వార్తలు రాసిన ఈనాడు, ప్రస్తుతం వారిద్దరూ తెలుగుదేశంలో చేరగానే తేలుకుట్టిన దొంగలాగా నోరు మూసుకుని కూర్చుంది.' అంటే దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. తనకు నచ్చకపోయినా, తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నారనుకున్న వారిపై ఉన్నవి, లేనివి అభూతకల్పనలు రాసి బ్లాక్ మెయిల్ చేయడం, వారిలో ఎవరైనా లొంగిపోతే రామోజీ కామ్ అయిపోవడం జరుగుతుందని అనిపించడం లేదా! చివరికి రామోజీ కులతత్వవాదిగా మిగిలిపోయి అప్రతిష్టపాలవుతరని నేనైతే గతంలో ఎన్నడూ ఊహించలేదు. ఏం చేస్తాం.. రామోజీ లాంటి వారు ఈ వయసులో తమ ప్రతిష్ట పెంచుకోకపోగా, ఇలా దిగజారుతున్నారంటే వారికి ఏదో భయం పట్టుకున్నదన్నమాటే కదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎల్లో మీడియా చెత్త రాతలు.. మరీ ఇంత నీచమా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తుపాను బాధిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ఒక వ్యాఖ్య చేశారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన తర్వాత మీడియా గురించి ప్రస్తావించారు. పనికట్టుకుని తన ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా సంస్థల ద్వారా వచ్చే పత్రికలు చదవవద్దని, టీవీలు చూడవద్దని ప్రజలకు పిలుపు ఇచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విషయాన్ని చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ, నిత్యం విసిగిస్తున్న ఎల్లో మీడియా గురించి చెప్పకపోతే వారు ప్రచారం చేసే అబద్దాలనే నమ్మే అవకాశం ఉందని భావించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తుపాను నేపథ్యంలో సీఎం జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసి సహాయ శిబిరాలకు బాధితులను తరలించారు. వారికి అక్కడ ఆహార వసతులు కల్పించారు. తదుపరి వారు వెళ్లేటప్పుడు రెండువేల రూపాయల చొప్పున చేతిలో పెట్టడమే కాకుండా, అవసరమైన నిత్యావసర సరుకులు కూడా ఇచ్చారు. రైతులకు సంబంధించి పంట నష్టం అంచనాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయచర్యలను పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కోరారు. ఈ సహాయ చర్యలు పూర్తి అయిన తాను స్వయంగా సాయం అందిందా? లేదా అని ప్రజలను అడుగుతానని, అప్పుడు ఎవరూ అందలేదని చెప్పే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థలను కూడా ఇందుకు వినియోగించుకున్నారు. ఇంత చేస్తే అసలు సీఎం జగన్ ఏమీ చేయలేదని పిచ్చిపిచ్చిగా ఈనాడు మీడియా ప్రచారం చేస్తోంది. ఈనాడు వారు ఏదో కల గన్నారట. అలా ముఖ్యమంత్రి చేసేయాలట. ఆయన అనుకున్న విధంగా ప్రజలకు సాయం చేయరాదట. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి తుపానులను ఆపానని చెప్పాలట. ఎవరూ తుపానులను ఆపలేరని తెలిసినా, తాను తుపాను కంట్రోల్ చేశానని ఆయన చెబితే, అవునవునని బ్యాండ్ బాజా వాయించిన ఈనాడు మీడియా ఈ ప్రభుత్వం మీద మాత్రం విషం చిమ్ముతోంది. అంతేకాదు.. అమరావతిలో అధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే ఎండ వేడి తగ్గించాలని అధికారులను చంద్రబాబు ఆదేశిస్తే ఆయన ఎంత మేధావి అని ప్రచారం చేశారే తప్ప, ఇదేమి చిత్రం అని అడగలేదు. అధికారులు మాత్రం విస్తుపోయి, తలలు పట్టుకున్న సంగతి అప్పట్లో అందరికి తెలిసిందే. హుద్ హుద్ తుపాను సమయంలో ఆయన పదేపదే విశాఖలో తిరగడంతో అధికారులు తమ పని తాము చేసుకోలేకపోతున్నామని గగ్గోలు పెట్టారు. అయినా అప్పుడు చంద్రబాబు గొప్పగా పనిచేశారని ఈనాడు సర్టిఫికెట్ ఇచ్చింది. హుద్ హుద్ తుపానుతో అరవై వేల కోట్ల నష్టం వచ్చిందని ఒకసారి, ముప్పైవేల కోట్ల నష్టం అని మరోసారి, ఇలా రకరకాల అంచనాలు ప్రచారం చేసి చివరికి ఇరవై వేల కోట్లకు కేంద్రానికి నివేదికను చంద్రబాబు ప్రభుత్వం పంపించింది. తదుపరి ప్రధాని నరేంద్ర మోదీ వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. ఆ తర్వాత ఆయన స్వయంగా విశాఖపట్నం వచ్చి అన్నింటిని పరిశీలించారు. రాష్ట్రం ఇచ్చిన నివేదిక అభూత కల్పన అని భావించి చివరికి ఆరువందల కోట్లతో సరిపెట్టారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ చిత్తశుద్దిని ఏనాడైనా ఈనాడు మీడియా ప్రశ్నించిందా?. ఇప్పుడు మాత్రం ఎక్కడా తుపాను బాధితులు తమకు సాయం అందలేదని రోడ్డు ఎక్కకపోయినా, ఈనాడు మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో కొండెక్కి ఏదేదో కూస్తోంది. బాధితులను స్వయంగా పరామర్శించి, సీఎం జగన్ వారికి భరోసా ఇచ్చి వస్తే మరింత నీచంగా మరో చెత్త వార్తను వండింది. దానిని బ్యాననర్ కథనంగా ఇచ్చేసింది. అసలు రామోజీరావు కానీ, ఆయన తరపున పనిచేసే సంపాదక బృందం కానీ ఎన్నడైనా ఏపీకి వచ్చి పరిస్థితిని పరిశీలించారా? లేక ఫిల్మ్ సిటీలో కూర్చుని కట్టుకథలు రాస్తున్నారా!. చంద్రబాబు హయాంలో ఆయన చొక్కా, ప్యాంట్ అన్నింటికి బురద రాసుకుని తిరిగారని ఈనాడు చెబుతోందా!. సీఎం జగన్ రైతులతో మాట్లాడకుండా వెళ్లిపోయారని కూడా రాసేసింది. సీఎం జగన్ వెళ్లిన ప్రతీ చోటా ప్రజలతో మాట్లాడారు. రైతులకు జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. సభ పెట్టి అందరిని ఆదుకుంటామని చెప్పారు. దానికి తగినట్లుగానే నష్టాలపై ఎన్యుమరేషన్ జరుపుతున్నారు. సంక్రాంతిలోగా నష్ట పరిహారం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈలోగా సబ్సిడిపై విత్తనాలు అందించే కృషి జరుగుతోంది. ఇంత చేస్తున్నా, ఏవేవో పిచ్చి పోలికలతో ఈనాడు వార్తలు రాయడం, వాటిని చంద్రబాబు మాట్లాడడం ఇదో కార్యక్రమంగా మారింది. చంద్రబాబు వరద బాధితుల పరామర్శ పేరుతో టూర్ చేస్తూ, రాజకీయాలు మాట్లాడితే మాత్రం గొప్ప విషయంగా కనిపిస్తుంది. టీడీపీ-జనసేన పార్టీలను ఆయన గెలిపించాలని కోరుతూ తిరుగుతున్నారు. పార్టీ సమీక్ష సమావేశాలు పెట్టుకుంటున్నారు. వెళ్లిన పని మాని చంద్రబాబు రాజకీయాలు చేయడం ఏమిటని ఈనాడు ప్రశ్నించలేదు. పైగా ఆయన నోటి నుంచి వెలువడ్డ మాటలన్ని ఆణిముత్యాలన్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేసింది. సీఎం జగన్ పొటాటోని ఉర్లగడ్డ అని అంటే అదేదో తప్పు జరిగిపోయిందని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. రాయలసీమలో బంగాళాదుంపను ఉర్లగడ్డ అని, ఉల్లిపాయను ఎర్రగడ్డ అని అంటారు. ఆ సంగతి లోకేష్‌కు తెలియదంటే అర్ధం చేసుకోవచ్చు. ఆయనకున్న మిడిమిడి జ్ఞానంతో పాటు రాయలసీమలో ఆయన పుట్టి, పెరగలేదు కనుక. కానీ, చంద్రబాబు ఆ ప్రాంతం వారే కదా!. ఆయనకు కూడా తెలియదా?. టీడీపీ మీడియా, సోషల్ మీడియా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు హడావుడి చేసింది. ఇలా వ్యవహరించిన టీడీపీపై రాయలసీమ భాషా పరిరక్షణ సమితి మండిపడింది. రాయలసీమ భాషను టీడీపీ అవమానిస్తోందని వ్యాఖ్యానించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదితర మీడియా సంస్థలు ఇంత ఘోరంగా దుష్ప్రచారం చేస్తున్నాయి కనుకే ముఖ్యమంత్రి జగన్ వాటిని చదవవద్దని, చూడవద్దని ప్రజలను కోరారు. ఇందులో చాలా వాస్తవం ఉంది. ప్రభుత్వాలలో జరిగే తప్పు, ఒప్పులను విశ్లేషించి రాస్తే తప్పు కాదు. అలాకాకుండా పూర్తి ద్వేషంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఎంతకాలం ఓపిక పడతారు?.. నేనైతే ఒక మాట చెబుతుంటాను. బీపీ, షుగర్ వంటి వ్యాధులు కావాలంటే ఈనాడు, జ్యోతి పత్రికలు చదవండి, టీవీలు చూడండి అని. ఆ వ్యాధులు వద్దనుకుంటే వాటిని ఫాలో కావద్దన్నదే నా అభిప్రాయం. ఉదయాన్నే ఈనాడు, జ్యోతి ఏపీ ఎడిషన్లు చూడగానే ఒక్కసారిగా బీపీ వస్తుంది. ఏమిటి ఇన్ని అబద్దాలు రాశారని, అయినా తమాయించుకుని చూసి వాటిపై కామెంట్ చేయవలసి వస్తోంది. ఒక ఉదాహరణ చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు మీద వారానికి ఒకసారి స్టోరీలు ఇస్తుంటారు. అందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎక్కువ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు చూపుతూ, దానికేదో బీటలు వచ్చినట్లు కల్పిత ఫోటో వేశారు. అది చూసిన ఏ ఆంధ్రుడికైనా ఈనాడు మీద తీవ్ర ఆగ్రహం కలుగుతుంది. వారికి సీఎం జగన్ ప్రభుత్వంపై ఎంత కక్ష ఉన్నా, ఇలా ప్రజలపై పగపట్టి, జీవనాడిపై తప్పుడు వార్తలు రాస్తారా? అన్న ఆవేశం వస్తుంది. ఈ మీడియా అసలు బాధ ఏపీలో కొంచెం ఆలస్యంగా అయినా వర్షాలు పడ్డాయని. ఈ ఏడాది మే నెలలో వర్షాలు బాగానే పడ్డాయి. ఆ తర్వాత కాలంలో కొంత తక్కువగా కురిశాయి. అయినా పంటలు బాగానే వేసుకున్నారు. కానీ, గత రెండు నెలల్లో వర్షాలు మందగించడంతో ఎల్లో మీడియా చెలరేగిపోయింది. మొత్తం రాష్ట్రం అంతా కరువు తాండవిస్తోందని ప్రచారం చేసింది. మొత్తం 400పైగా మండలాలలో కరువు వచ్చేసిందని, వంద మండలాలలోనే కరువు ప్రకటించారని గొడవ చేసేసింది. కానీ, తుపాను రావడం, వర్షాలు కురవడం, వాగులు పొంగడం, చెరువులు నిండటంతో వారికి ఎక్కడలేని బాధ కలిగింది. దాంతో మళ్లీ ప్లేట్ మార్చి పంటలన్నీ పాడైపోయాయని, ప్రభుత్వం ఏమీ చేయడంలేదని ప్రచారం మొదలు పెట్టారు. ఎల్లో మీడియా గతంలో చెప్పింది నిజమయితే, పంటలన్నీ కరువుకు ఎండిపోయి ఉంటే, ఇప్పుడు ఇంత భారీ నష్టం ఎలా వాటిల్లుతుంది? కరువు వల్ల కొంత నష్టం ఉండవచ్చు. అలాగే తుపాను వల్ల కొంత నష్టం ఉంటుంది. దేనికది వాస్తవిక అంకెలతో రాస్తే జనం నమ్ముతారు. లేదంటే వీరు ఇలాగే అబద్దాలు రాస్తుంటారులే అని జనం సరిపెట్టుకుంటారు. రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలు ఇస్తూ వారికి అవసరమైన సేవలన్నీ గ్రామాలలోనే అందించేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఒక్కనాడు కూడా మంచిగా రాయని ఈనాడు, తదితర ఎల్లో మీడియా ఇప్పుడు రైతుల పట్ల సానుభూతి నటిస్తూ కపట ప్రేమను చూపుతూ వారిలో అనుమాన బీజాలు వేయాలని విశ్వయత్నం చేస్తోంది. ఇలాంటి మీడియాను నమ్మవద్దని, వాటిని చదవవద్దని, చూడవద్దని ముఖ్యమంత్రి జగన్ చెప్పడంలో తప్పేముంటుంది!. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబు ప్లాన్ అట్టర్‌ప్లాప్.. ఆంధ్రజ్యోతి ఎంత పనిచేసింది!
ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక ప్రచారం చేశారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చని. అంతలా తెలంగాణలో రేట్లు పెరిగిపోయాయని, ఏపీలో ధరలు దెబ్బతిన్నాయన్నది ఆయన చెప్పిన మాట. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన ఈ అవకాశాన్ని వాడుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి దిన పత్రిక హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ వేలంపాటలో విపరీతమైన రేట్లను కొందరు పెట్టడంపై ఒక కథనాన్ని ఇస్తూ అదంతా రియల్ ఎస్టేట్ మాఫియా పని అని, నిజానికి రేట్లు పెరిగినట్లు చూపి తమ భూముల విలువ పెంచుకునే కుట్ర అని వెల్లడించింది. అంతేకాక, గజం లక్ష రూపాయలకో, లేక ఎకరా వంద కోట్లకో పాట పాడినవారు చాలా మంది అసలు ఆ తర్వాత డబ్బులే చెల్లించడం లేదని తెలిపింది. కేవలం ఒక లక్ష రూపాయల డిపాజిట్ కట్టి ఈ తంతు సాగిస్తున్నారని తెలియచేసింది. తెలంగాణ ప్రాంతంలో ఈ కథనాన్ని ఇచ్చిన ఆ పత్రిక ఏపీలో మాత్రం ఇవ్వకుండా జాగ్రత్తపడింది. బాబు బూమ్ మాయ.. ఇక్కడ మాత్రం చంద్రబాబు చెప్పిన విషయానికి మాత్రం ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని బట్టి ఒకటి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ మాఫియాలకు అనుకూలంగా ఉంటారని అనుకోవచ్చు కదా!. ఎందుకంటే అమరావతి రాజధాని గ్రామాల్లో అచ్చంగా ఇలాగే రియల్ ఎస్టేట్ కృత్రిమ బూమ్ కోసం చంద్రబాబు కృషి చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో రాజధాని గ్రామాలలో తెల్లవారేసరికి భూముల విలువ ఐదు నుంచి పది రెట్లు పెరిగిపోయాయి. అబ్బో అదంతా చంద్రబాబు ఘనతే అని ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు, టీవీలు ఊదరగొట్టాయి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆంధ్రజ్యోతి రాసిన ఈ కథనం చూస్తే కారణం ఏమైనా కానీ.. కొంత వాస్తవమే ఉన్నట్లు అనిపిస్తుంది. మేడిపల్లి అనే చోట జరిగిన హెచ్ఎండీఏ వేలంపాటలో నారాయణమూర్తి అనే వ్యక్తి గజం యాభై వేలకు ప్లాట్ కొన్నారట. ఆ తర్వాత ఆయన హెచ్ఎండీఏ ఆఫీస్‌కు వెళ్లి తన పక్క ప్లాట్ల వారి గురించి ఆరా తీశారట. అప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారట. తనతో పాటు ఆయా ప్లాట్లను వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసినవారిలో ఎనభై శాతం అసలు డబ్బు చెల్లించలేదట. లక్ష రూపాయల డిపాజిట్ కూడా వదలుకోవడానికి సిద్దపడటంలో రహస్యం వారి ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్తుల విలువను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండటమేనట. రియల్ ఎస్టేట్ ట్రిక్స్.. ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో తమ విల్లాలు, అపార్టుమెంట్లను అమ్ముకోవడానికి అత్యాశతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేలం మాఫియాగా మారారని ఆ పత్రిక రాసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారు లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. దాంతో ఓవరాల్‌గా రియల్ ఎస్టేట్ రంగం సబ్దుగా మారిందని, ఆ నేపథ్యంలోనే ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తున్నారని మీడియా రాసింది. ఇంకో విశేషం ఏమిటంటే తెలంగాణలో 2023 మొదటి నాలుగు నెలల్లో గత ఏడాది కన్నా రిజిస్ట్రేషన్లు తగ్గాయట. ఆదాయం కూడా 150 కోట్లు తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ రియల్ మాఫియాకు ప్రభుత్వ సహకారం కూడా ఉందని ఈ పత్రిక ఆరోపించింది. మార్కెట్ దెబ్బతిందన్న భావన కలగకుండా ఉండడానికి ప్రభుత్వం అలా చేస్తోందని రాశారు. మోకిలా అనేచోట హెచ్ఎండీఏ వేసిన ప్లాట్ల వేలంలో కూడా ఇలాగే స్కామ్ జరిగిందని మీడియా చెబుతోంది. ఒకే సంస్థకు చెందిన పదిహేను మంది అక్కడ గజం 35వేల రూపాయల వరకు వెళ్లవచ్చని అనుకుంటే అరవైఐదు వేల నుంచి లక్ష రూపాయలవరకు పెట్టారట. తీరా చూస్తే ఆ సంస్థకు ఆ పక్కనే 350 ఎకరాల భూమి ఉందట. హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించిందని, అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక సంక్షోభం కొంత కారణమని, ఐటి రంగంలో ఉన్న ఒడిదుడుకులు తోడవుతున్నాయని.. ఇలా రకరకాల రీజన్స్ చెబుతూ కొంతకాలం క్రితం ఒక టీవీ చానల్ కూడా కథనాన్ని ఇచ్చింది. టీడీపీ మాఫియా పని.. ఇదే టైమ్‌లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఏ పరిణామం జరిగినా అదంతా తన ఘనతేనని చెప్పుకుంటారు. నిజానికి ఆయన ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం సీఎంగా ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా వచ్చింది. ఆయన టైమ్‌లో మాదాపూర్ వరకు పూర్తి స్థాయిలో రోడ్డు కూడా లేదు. వైఎస్సార్ వచ్చాక దానిని పెద్ద ఎత్తున విస్తరించారు. ఆ విషయాలు పక్కనబెడితే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని గ్రామాలలో కూడా ఇలాంటి మాఫియా వారినే ప్రోత్సహించారన్న అభిప్రాయం కలగదా?. వెలగపూడి చుట్టుపక్కల రాజధాని అని ప్రకటించేలోపే ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలు భూములు కొన్నారని ఆరోపణ వచ్చింది. తదుపరి ఆ భూములను అధిక ధరలకు అమ్ముకుని కొందరు లాభ పడ్డారు. పది, పదిహేను లక్షల రూపాయల చొప్పున ఎకరా భూమి అమ్ముడు పోయిన పరిస్థితి నుంచి ఏకంగా ఎకరా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలకు అమరావతి గ్రామాలలో వెళ్లింది. ఆనాటి మంత్రి నారాయణ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పలుమార్లు ఎకరం నాలుగు కోట్ల వరకు పలుకుతోందని, అదంతా తమ ఘనత అని చెప్పుకునేవారు. అసలు రాజధానికి సంబంధించిన భవనాలే రాకముందే అంతంత ధర ఎలా వచ్చింది. ఆ చుట్టుపక్కలే, చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీ భూములు కొనడం, నారాయణ తన బినామీల పేరుతో భూములు కొనడం ఏమిటి?. అమరావతితో రియల్ దందా.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అచ్చంగా మాఫియాలా మారారన్న విమర్శలు అప్పట్లో కూడా వచ్చాయి కదా?. చంద్రబాబు ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలకు చాలా తక్కువ ధరకు భూముల ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఎకరా నాలుగు కోట్ల రూపాయల ధర పెట్టడంలోని హేతుబద్దత ఏమిటన్న ప్రశ్నలుకూడా వచ్చాయి. అమరావతి గ్రామాలలో మాత్రమే రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి అప్పట్లో మిగిలిన ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా ప్రకటించడం జరిగిందని చెబుతారు. దానివల్ల చాలా రాజధానియేతర గ్రామాలలో పొలాలు అమ్ముకోవడమే కష్టం అయ్యేది. ధరలు కూడా పడిపోయాయి. అయినా ఇప్పటికీ చంద్రబాబు అమరావతి మోడల్ గురించే ప్రచారం చేస్తుంటారు. లక్షల కోట్లు వ్యయం చేస్తేకానీ.. తయారు కాని అమరావతిని సంపద సృష్టించే నగరంగా ప్రచారం చేసుకుంటారు. ఏది ఏమైనా హైదరాబాద్‌లో అయినా, అమరావతి గ్రామాలలో అయినా కృత్రిమంగా విలువలు పెంచుకోవడంలో ఉన్న మతలబు ఇది అని తెలిసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకోవలసిందే. అలాంటివాటిని తన ఘనతగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకోవాలి?. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
ఆంధ్రజ్యోతి సమర్పించు స్వర్గం నరకం
నరకంలో నాలుగేళ్లు ..అంటూ తెలుగుదేశం అనుకూల దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ఇచ్చింది. అది చదివితే అర్ధం అయిందేమిటంటే.. ఆ మీడియావారి కడుపు మంట, ద్వేషం,కుళ్లు ఆ స్థాయిలో ఉందని!. ఏ ప్రభుత్వానికి అయినా నాలుగేళ్లు పూర్తి చేసుకోవడం ఒక సందర్భం. మీడియాగా ఆ ప్రభుత్వ మంచి చెడులు విశ్లేషించవచ్చు. అలాకాకుండా పూర్తిగా ఏకపక్షంగా, పచ్చి పాపంగా కథనాలను ఇస్తే ప్రజలు విశ్వసిస్తారా?. నిజంగా ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉన్నది?. ఇది పేదల, దిగువ మధ్య తరగతి ప్రజలకు స్వర్గసమానంగా ఉండడం ఆ పార్టీ పత్రికకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు నరకం చూపించేవారు. లంచాలు ఇచ్చి, పదిసార్లు ఆ కమిటీల సభ్యుల చుట్టూ తిరిగినా పని జరుగుతుందో లేదో తెలిసేదికాదు. అది కదా నరకం అంటే!. మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చి ప్రజల అవసరాలను వారి ఇళ్ల వద్దే తీర్చుతోంది. దీనిని కదా స్వర్గం అనాల్సింది. అప్పట్లో వృద్దులు వారికి వచ్చే కొద్దిపాటి పెన్షన్ కోసం MRO ఆఫీస్ ల చుట్టూ తిరిగి వేసారిపోయేవారు. నిజంగానే వారు నరకం చూసేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వలంటీర్లు ప్రతి నెల మొదటి తేదీన తెల్లవారకముందే వృద్దులకు పెన్షన్ లు ఇస్తున్నారు. ఇది కదా స్వర్గం అంటే. అలా పెన్షన్ లు అందుకున్న వృద్దుల కళ్లలో ఆనందం చూస్తే తెలుస్తుంది ఆ పత్రికవారికి అది స్వర్గమన్న సంగతి. ఎక్కడో కళ్లుమూసుకుని కూర్చుని పిచ్చి రాతలు రాస్తే సరిపోతుందా?. ✍️ గతంలో రేషన్ కోసం షాపుల వద్ద క్యూలు కట్టాల్సి వచ్చేది. మరి ప్రస్తుతం రేషన్ బండే ప్రజల ముంగిటకు వస్తోంది. ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లాలంటే నరకమే!. పారిశుద్ద్యం లేక, సరైన అజమాయిషీ లేక స్కూళ్లు కునారిల్లేవి. అలాంటిది జగన్ ప్రభుత్వం రాగానే వాటిని స్వర్గం మాదిరి మార్చే యత్నం చేసింది. ఒక్కసారి ఆ స్కూళ్లకు వెళితే.. ఇంత మార్పా? చక్కని భవనాలు, ఫాన్ లు, చివరికి ఫైవ్ స్టార్ రేంజ్లో టాయిలెట్లు వచ్చాయి. ఆ సంగతిని కప్పిపుచ్చాలని ఆంధ్రజ్యోతి కుట్ర అన్నమాట. ఈ స్కూళ్లలో చదివే విద్యార్ధులకు ఆంగ్ల మీడియం బోధించినా ఈ మీడియాకు నచ్చదు. చంద్రబాబు పాలనలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ అరకొరగా ఉన్నా అది ఆ పత్రికకు స్వర్గం. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నా నరకమే!!. అమ్మ ఒడి కింద ఏటా పదిహేను వేలు ఇవ్వడం, విద్యార్దులకు మంచి ఆహారం, విద్యా దీవెన ఇలా పలు రకాల స్కీముల గురించి ఒక్క మాట రాయడానికి చేతులురాని ఆ మీడియాకు ఇదంతా నరకంగా కనిపించిందట. ఒక ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి.. పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ రాంకర్ అవడాన్ని బట్టి ఇది స్వర్గమో కాదో నిర్ణయించుకోవచ్చు. ✍️ ఆరోగ్యరంగాన్ని తీసుకుంటే ఆస్పత్రులను నాడు-నేడు కింద బాగు చేస్తుంటే అది నరకమట. గతంలో అసలు ఈ రంగాన్ని పట్టించుకోకుండా వదలివేస్తే అది స్వర్గమట!. ఆరోగ్యశ్రీ కింద పేదలు, మధ్యతరగతి , ఆ మాటకు వస్తే ధనిక వర్గాలు సైతం లబ్ది పొందుతుంటే అది నరకమట!. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రం లో అయినా విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలే గొప్పవన్న విషయం ఆ పత్రికవారికి అర్దం కాకపోయినా, ప్రజలకు బాగానే అర్దం అవుతోంది. ✍️ ఒకప్పుడు రైతులు తమ కు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితరాల కోసం రోడ్డెక్కవలసి వచ్చేది. ఈ నాలుగేళ్లలో ఎక్కడైనా అలా జరిగిందా? రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సదుపాయాలు కల్పించడమే కాకుండా, ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధులను ఇస్తుంటే అది స్వరం అవుతుందా? నరకం అవుతుందా? అన్నిటికి మించి చంద్రబాబు పాలనలో ఏటా కరువుతో నరకాన్ని ప్రజలు చవి చూడవలసి వచ్చింది. అదృష్టవశాత్తు జగన్ పాలన ఆరంభమయ్యాక ఈ నాలుగేళ్లలో కరువు అన్న మాటే వినిపించలేదు. ఇదే రైతులకు పెద్ద స్వర్గం . ✍️ 31 లక్షల స్థలాలు పేదలకు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే.. అది నచ్చని వీరు నరకం అంటూ చెడరాస్తున్నారనుకోవాలి. పేదవాడికి ఆ సెంటు భూమి కూడా స్వర్గం కిందే లెక్క. అందుకే జగన్ ప్రభుత్వాన్ని వారు అంతగా సొంతం చేసుకుంటున్నారు. బలహీనవర్గాల మహిళలకు చేయూత కింద రూ.18,500, కాపు నేస్తం ,చేనేత నేస్తం, వాహన మిత్ర ఇలా పలు విధాలుగా ఆర్దిక సాయం చేస్తుంటే వారికి అది స్వర్గం అవుతుందికాని నరకం ఎలా అవుతుంది?. వలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల గడప వద్దకు పాలన చేర్చడం స్వర్గం అవుతుందా?నరకం అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలకు ఇది నరకంగానే ఉంటుంది. ఎందుకంటే వారి పైరవీలకు, రియల్ దందాలకు, అరాచకాలకు అవకాశం ఇవ్వడం లేదు కదా? ప్రభుత్వం తమ చేతిలో ఉంటే తమకు ఏది కావాలనుకుంటే అది చేసుకునే వీలు ఉంటుందని వారి భావన. అది పోయిందన్నది వారి ఆక్రోశం. అందువల్ల వారికి ఇది నరకమే. ✍️ పరిశ్రమలు, అభివృద్ది గురించి చేతికొచ్చినట్లు రాశారు. రిలయన్స్ అంబానీ , అదాని తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు విశాఖ వచ్చి జగన్ కు అండగా నిలబడడాన్ని వీరు చూడలేక కళ్లలో నిప్పులు పోసుకున్నారు. అందువల్ల ఆ మంటతో వారికి నరకంగా కనిపిస్తుంది. కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు, పలాస వద్ద కిడ్నీ పరిశోధన కేంద్రం, నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు ఇలా అనేక రకాలగా నిర్మాణాత్మక పనులు జరుగుతుంటే అదంతా వారికి విధ్వంసగానే కనిపిస్తుంది. జగన్ తీసుకువచ్చిన స్కీములవల్ల రాష్ట్రం నాశనం అయిందని ఈ మీడియా ప్రచారం చేస్తుంటుంది. అదే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంతకన్నా నాలుగైదు రెట్ల సంక్షేమ స్కీములను హామీ ఇస్తే అబ్బో అదిరిందని , వైఎస్సార్సీపీ వాళ్లు బిత్తరపోయారని చెత్త రాతలు రాస్తున్నారు. ✍️ ఇప్పుడు ఒక నరకం అనిరాస్తే.. చంద్రబాబు వస్తే నాలుగైదు నరకాలు చూపిస్తారని రాయాలి కదా! అలా కాదట. అవి బాణాలట. వైసిపి ప్రభుత్వంపై ఎక్కుపెట్టారట. అదిరిపోతుందని ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మరో టిడిపి పత్రిక ఈనాడు ఆర్దిక అరాచతక్వం అంటూ మరోసారి తన ద్వేషాన్ని వెళ్లకక్కింది.ఎపి అప్పుల పాలవుతోందట. చంద్రబాబు టైమ్ లో తీసుకు వచ్చిన అప్పుల గురించి చెప్పరు. జగన్ ఈ స్కీములు అమలు చేయడం అరాచకం అయితే , చంద్రబాబు వస్తే మరిన్ని స్కీములు ఇస్తానంటున్నారు కదా? అప్పుడు ఇంకెంత అరాచకం అవుతుంది?దానిపై ఎందుకు సంపాదకీయం రాయరు. కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఈ మీడియా సంస్థలు జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నాయి. ఈ ఏడాది అంతా వీరి కుట్రలను జగన్ ఎదుర్కోక తప్పదు కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా..
సాక్షి, ప్రకాశం: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం బాలినేని మాట్లాడుతూ.. ‘‘వైఎస్ఆర్ మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవి వదులుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన నిలబడ్డాను. సీఎం జగన్‌కు నేను వీరాభిమానిని. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నా అని సీఎం జగన్ అన్నప్పుడే నా పూర్తి మద్దతును బహిరంగంగా ప్రకటించాను. నాకు పార్టీ ముఖ్యం.. మంత్రి పదవి కాదని నేను ఎప్పుడో చెప్పాను. ఆంధ్రజ్యోతి రాతలు మరింత నీచంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి విషప్రచారం మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తా’’ అని హెచ్చరించారు. మరోవైపు.. విజయవాడలో సీదిరి అప్పలరాజు సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాజీనామాల తర్వాత అసంతృప్తి అనేది అవాస్తవం. మంత్రులందరం సీఎం జగన్ నిర్ణయాన్ని గౌరవించి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేశాం. కొన్ని మీడియాలు ప్రజలని తప్పుదోవ పట్టించేలా అసంతృప్తులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై స్వేచ్చగా నిర్ణయం తీసుకునే అధికారం సీఎం జగన్‌కు ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయాలకి అనుగుణంగానే అందరూ పనిచేయాల్సి ఉంటుంది. సీఎం జగన్ పనితీరుని చూసే ప్రజలు ఓట్లేస్తారు.. మమ్మల్ని చూసి కాదు. మా అందరికీ ముఖ్యమంత్రి జగన్‌పై అపార నమ్మకం, అచంఛల విశ్వాసం ఉంది. బలహీనవర్గాలలో ఇంతమందికి గతంలో ఎవరూ అవకాశం కల్పించలేదు. సామాన్య కుటుంబంలో పుట్టిన నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా సీఎం వైఎస్ జగన్ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ దగ్గర పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా సంతోషంగా పాటిస్తాం’’ అని తెలిపారు. -
ఆంధ్రజ్యోతికి ‘గుడా’ నోటీసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా స్పందించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 208/5ఎలో ప్రింటింగ్ ప్రెస్ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం గతేడాది 1.75 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభం కూడా చేసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచే పత్రికా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే, దీని నిర్మాణం కోసం డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అధికారుల నుంచి గానీ, ‘గుడా’ నుంచిగానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించలేదు. భవన ప్రధాన ముఖ ద్వారం రోడ్డు కాకుండా మరో రోడ్డు (పెరిఫెరల్ రోడ్) కూడా నిర్మించాల్సి ఉండగా.. ఇక్కడ అలాంటిదేమీ చేపట్టలేదు. ‘గుడా’ అధికారులపై ఆంధ్రజ్యోతి ఒత్తిళ్లు అక్రమ నిర్మాణాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అప్రమత్తమైంది. తమ భవనానికి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇవ్వాలని గుడా అధికారులపై ఒత్తిడి తెస్తోంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకోవాలని గుడా వర్గాలు చెప్పినా పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ కింద అయితే సుమారు రూ. 70 లక్షలు చెల్లించాల్సి వస్తోందని ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు గుడా అధికారులు ఈ నెల 25న ప్రొవిజినల్ ఆర్డర్ నోటీసు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతికి గుడా జారీ చేసిన నోటీసు -
‘ఆంధ్రజ్యోతి’పై కచ్చితంగా చర్యలు తీసుకుంటా’
పిడుగురాళ్ల: తాను ప్రెస్‌మీట్, ఇంటర్వ్యూ ఇవ్వకుండానే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో తన పేరుతో తప్పుడు కథనాలు రాయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉగ్గు నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనను అడ్డుపెట్టుకుని ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి వద్ద తనను అప్రదిష్ట పాలు చేసే విధంగా తప్పుడు కథనాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసు కుటుంబం ఆర్యవైశ్యులకు ఎప్పుడూ దూరంగా ఉంటారని, ఆ సామాజికవర్గం వారి పట్ల శ్రద్ధ చూపరంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 11న తప్పుడు రాతలు ప్రచురించారన్నారు. గతంలో కూడా తనను అడ్డుపెట్టుకుని తప్పుడు రాతలు, కథనాలు రాశారని, అప్పుడు కూడా మందలించినట్లు గుర్తు చేశారు. అయినా వారి పంథా మార్చుకోకుండా, తన ప్రమేయం లేకుండా తాను కాసు కుటుంబంపై అసంతృప్తిగా ఉన్నట్లు తప్పుడు కథనాలు రాయడం సరికాదని మండిపడ్డారు. తమ లాంటి ఆర్యవైశ్యుల పరువును బజారున పెట్టడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తప్పుడు రాతలు రాసే ఆంధ్రజ్యోతి పత్రికపై, సంబంధిత వ్యక్తిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాను ఎన్నో పూజలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు -
తోకపత్రిక దొంగ సర్వే
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ ఎల్లో మీడియా ఎన్నికల సర్వే కుతంత్రం బెడిసికొట్టింది. ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు పన్నిన పన్నాగం అభాసుపాలైంది. టీడీపీ ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందని ప్రముఖ సంస్థ లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైనట్లు ఎల్లో మీడియా ప్రచురించిన సర్వే బూటకమని తేటతెల్లమైంది. అసలు తాము ఎలాంటి సర్వే చేయలేదని ఆ సంస్థ స్పష్టం చేయడం.. తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చంద్రబాబు బాగోతం ప్రజలకు తెలిసివచ్చింది. మరోవైపు.. దొంగ సర్వేతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించిన టీడీపీ, దాని తోక పత్రిక ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పలువురు ఫిర్యాదులు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకే దొంగ సర్వే ఎన్నికల్లో ఓటమి ఖాయమని స్పష్టమవుతుండటంతో చంద్రబాబు, టీడీపీ ఎల్లో సిండికేట్ బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో టీడీపీకి రెండు మూడుకు మించి ఎంపీ స్థానాలు వచ్చే అవకాశాల్లేవని, ఎమ్మెల్యే సీట్లు అయితే 40లోపేనని పలు జాతీయ చానళ్ల సర్వేల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దాంతో చంద్రబాబు, టీడీపీ మీడియా చివరి ప్రయత్నంగా ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు ఓ దొంగ సర్వే పేరుతో కుతంత్రానికి పాల్పడింది. టీడీపీ భారీ ఆధిక్యంతో ఎన్నికల్లో గెలవనుందని ఓ బోగస్ సర్వేను ప్రచురించి ప్రచారంలోకి తీసుకువచ్చి ఓటర్లను ప్రభావితం చేయొచ్చని చంద్రబాబు భావించారు. వెంటనే కాకి లెక్కలతో ఓ సర్వేను వండివార్చారు. టీడీపీ ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందని ఆ సర్వేను రూపొందించారు. ఈ సర్వేను ఓ సంస్థ పేరుతో విడుదల చేయాలనుకుని జాతీయస్థాయిలో ప్రముఖమైనదిగా గుర్తింపు పొందిన లోక్‌నీతి–సీఎస్డీఎస్ సంస్థ పేరును ఆ సర్వేకు ముసుగు వేశారు. అనంతరం ఆ సంస్థ పేరుతో సోమవారం ఆంధ్రజ్యోతి పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ వెంటనే టీడీపీ వెబ్సైట్లు ఆ సర్వేకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాయి. అంతా తాము అనుకున్నట్లు అయ్యిందని ఎల్లో బ్యాచ్ సంబరపడింది. కానీ కథ అడ్డం తిరిగింది. మండిపడ్డ లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వేను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కొన్ని గంటల్లోనే లోక్‌నీతి–సీఎస్డీఎస్ సంస్థ తీవ్రంగా స్పందించింది. అసలు తాము ఏపీలో ఎలాంటి సర్వే చేయనేలేదని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇ.వెంకటేశన్ ట్వీట్ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక, టీవీ చానళ్లు, ఇతర వెబ్సైట్లు ప్రచారంలోకి తీసుకువచ్చిన ఆ సర్వేతో తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. ఆ తరువాత కాసేపటికే ఆ సంస్థ తమ అధికారిక వెబ్సైట్లో కూడా అదే విషయాన్ని వెల్లడించింది. కఠిన చర్యలు తీసుకుంటాం :సంజయ్‌కుమార్ మరోవైపు.. ‘మా సంస్థ పేరుతో దొంగ సర్వేను ప్రచురించిన పత్రిక, ఇతర చానళ్లు, వెబ్సైట్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని లోక్‌నీతి–సీఎస్డీఎస్ సంస్థ డైరెక్టర్ సంజయ్‌కుమార్ హెచ్చరించారు. ‘సాక్షి’ప్రతినిధితో ఆయన సోమవారం ఫోన్లో మాట్లాడుతూ.. ఆ సర్వేతో తమకు సంబంధంలేదని అధికారికంగా ప్రకటన విడుదల చేశామని చెప్పారు. తాను ఢాకాలో ఉన్నానని.. ఢిల్లీకి రాగానే వారికి నోటీసులు జారీ చేయడమే కాక.. ఆయా సంస్థల మీద ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు చంద్రబాబు పన్నిన పన్నాగంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చంద్రబాబు తీరుపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, మేథావులతో పాటు సామాన్యులు కూడా తీవ్రంగా స్పందించారు. ఏపీలో చంద్రబాబు కొన్ని మీడియా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని.. అందుకే వైఎస్ జగన్ ఆంధ్రజ్యోతి పత్రికతోపాటు ఏబీఎన్, టీవీ 5 చానళ్లను బహిష్కరించారని కూడా పరిశీలకులు విశ్లేషించారు. ఏపీలో టీడీపీ అనుకూల మీడియా ఆగడాలకు అంతులేకుండాపోతోందని వారు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఎల్లో బ్యాచ్ ఇదే రీతిలో కుతంత్రానికి పాల్పడుతోందన్నారు. ఇందుకు ఉదాహరణగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని గుర్తుచేశారు. అలాగే.. ఇటీవల విశాఖ జిల్లా గాజువాకలో ఓ ఇంటి యజమాని, అద్దెదారుని మధ్య అద్దె బకాయి వివాదాన్ని వక్రీకరించి ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేసిందని వివరించారు. టీడీపీ, ఎల్లో మీడియాపై చర్యలు తీసుకోండి.. కాగా, తప్పుడు సర్వేను ప్రచారంలోకి తేవడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని కుట్రపన్నిన టీడీపీ, ఎల్లో మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కేంద్ర ఎన్నికల సంఘం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సోమవారం ఫిర్యాదులు చేశారు. దీనిపై త్వరలోనే టీడీపీకి, ఎల్లో మీడియా సంస్థలకు నోటీసులు జారీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ పన్నాగం బెడిసికొట్టడంతో చంద్రబాబు, టీడీపీ ఎల్లో సిండికేట్ తేలుకుట్టిన దొంగలా మౌనం వహించారు. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు తప్పుడు సర్వేలు ప్రచురిస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆంధ్రజ్యోతిలో సోమవారం ప్రచురించిన సర్వేను తాము చెయ్యలేదని లోక్‌నీతి–సీఎస్డీఎస్ సంస్థ అధికారికంగా ప్రకటించినందున దానిని ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి వైఎస్ఆర్సీపీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతమ్‌రెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి 150 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలని కోరారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న టీడీపీపై సాక్ష్యాలతో సహా ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ‘లోక్‌నీతి–సీఎస్డీఎస్ ’ సర్వే పేరిట ఆంధ్రజ్యోతి కథనం అనైతికం సాక్షి, హైదరాబాద్: ‘టీడీపీదే అధికారం’ పేరిట లోక్‌నీతి– సీఎస్డీఎస్ సర్వే అంచనా అంటూ సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన కథనం వివాదాస్పదమైంది. ఆంధ్రజ్యోతి కథనాన్ని తప్పుడు కథనంగా పేర్కొంటూ లోక్‌నీతి– సీఎస్డీఎస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఈ.వెంకటేశు ఖండించారు. ఈ తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) మాజీ సభ్యులు అమర్నాథ్ ప్రెస్ కౌన్సిల్‌తో పాటు, కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరాతో పాటు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్‌కు అమర్నాథ్ లేఖ రాశారు. ఓ పార్టీకి అనుకూలంగా ఏపీలోని ఓటర్లను ప్రభావితం చేసేలా ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని అనైతికమైనదిగా పేర్కొంటూ, ప్రజాస్వామికంగా జరిగే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేదిగా ఈ కథనం ఉందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం, ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అమర్నాథ్ రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది. ‘సర్వే సంస్థ లోక్‌నీతి – సీఎస్డీఎస్ సర్వేలో ఏప్రిల్ 11న ఏపీలో జరిగే ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం ‘టీడీపీదే అధికారం’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తా కథనం వెలువడిన గంటల వ్యవధిలోనే లోక్‌నీతి– సీఎస్డీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఈ.వెంకటేశు ట్విటర్లో ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించారు. ఏపీలో తమ సంస్థ ఇటీవల కాలంలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టత ఇవ్వడంతో పాటు ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా అవాస్తవమని, సదరు పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు.’ అని అమర్నాథ్ తన లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 11న జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓ పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ప్రచురించిందన్నారు. ప్రజాస్వామిక ప్రక్రియకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ కథనం ‘పెయిడ్ న్యూస్’ గా అనుమానం కలుగుతోందన్నారు. లేఖతో పాటు ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం, లోక్‌నీతి–సీఎస్డీఎస్ ఈడీ ట్వీట్‌ను జత చేశారు. ‘ఎల్లో మీడియా సర్వేలు నమ్మొద్దు’ సాక్షి, హైదరాబాద్ : ఎన్ని అడ్డదారులు తొౖక్కైనాసరే అధికారంలోకి రావాలనే తలంపుతో సీఎం చంద్రబాబునాయుడు కుతంత్రాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కానుమాను రాజశేఖర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన జేబు సంస్థ అయిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన సర్వే పూర్తిగా బోగస్ అన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న సర్వేలను నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. వెంటిలేటర్‌పై ఉన్న చంద్రబాబు సర్కారును బతికించుకోవాలనే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు. -
ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు: కన్నా
సాక్షి, అమరావతి : ‘అధికారం టీడీపీదే’ అనే జోక్‌ని ప్రచురించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు ధన్యవాదాలంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఏపీలో అధికారం టీడీపీదే అని లోక్‌నీతి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ లక్ష్మీనారాయణ వ్యంగ్యంగా.. ఆంధ్రజ్యోతిని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తెలుగు పత్రికలు ఫూల్స్ డే నాడు హాస్యాస్పద కథనాలు ప్రచురించేవని తెలిపారు. అయితే గత కొంతకాలంగా ఈ సంప్రదాయం కనిపించడం లేదని.. కానీ ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభించిందన్నారు. ‘అధికారం టీడీపీదే’ అనే తప్పుడు కథనంతో ఏప్రిల్ 1న నాడు మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు అంటూ కన్నా ట్వీట్ చేశారు. గతంలో తెలుగు పత్రికలు ఏప్రిల్ 1st ఫూల్స్ డే నాడు హాస్యాస్పదంగా కథనాలు వేసేవారు.. ఎందుకో మిగతా పత్రికలు ఆ సంప్రదాయం ఆపేసాయి.. కానీ నేటి ఆంధ్రజ్యోతి "అధికారం టీడీపీదే" అని ఏప్రిల్ 1st నాడు నవ్వులు పూయించింది.. జోక్ ని ప్రచరించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు. pic.twitter.com/MUe1L88FNP — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) April 1, 2019 ఇదిలా ఉండగా ఏపీలో టీడీపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే దీనిని ఎస్డీఎస్ లోక్‌నీతి సర్వే సంస్థ తీవ్రంగా ఖండించింది. తమ అనుమతి లేకుండా సంస్థ పేరును ప్రచురించినందుకు సంబంధిత పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. (చదవండి: అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి..!) -
వంత పాడిన సొంత మీడియా...
2004-కృష్ణా పుష్కరాల సమయంలో రెయిలింగ్ కూలి ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటనపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఇక చంద్రబాబు.. కాంగ్రెస్ నిర్వాకం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. చేతగాకుంటే దిగిపొమ్మంటూ హూంకరించారు. బాబు ప్రకటనలన్నింటినీ పతాక శీర్షికలకెక్కించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం 29 మంది మరణించిన దుర్ఘటనను మాత్రం లైట్‌గా తీసుకుంటున్నాయి.